
తప్పదు... రాజకీయాల్లోకి చట్టబద్ధంగా ప్రవేశించాలనుకుంటే ‘యాక్టింగ్‌కి ఎండ్ కార్డ్’ వేయక తప్పదు! అంటున్నారు కమల్‌హాసన్. ఇటీవలే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన కమల్, వచ్చినప్పుడు ఓన్లీ పాలిటిక్స్ మీద కాన్సంట్రేట్ చేస్తానంటున్నారు. ‘‘బాధగానే ఉంటుంది (యాక్టింగ్‌కి ఎండ్ కార్డ్ వేయడం).
బట్, సిన్మాకో నహి చోడేంగే’’ అన్నారాయన. అదేంటి? అంటే... సిన్మాల్లో యాక్టివ్‌గా ఉండకపోవచ్చు. కానీ, ఏదో రకంగా సిన్మా ఫీల్డ్‌కి కనెక్ట్ అయ్యే ఉంటానని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కమిట్‌మెంట్స్ వేరే విధంగా ఉంటాయని కమల్ అన్నారు. వచ్చే 2019 ఎన్నికల్లోపు కమల్‌హాసన్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.