
నాట్యం గొప్ప మాధ్యమం..
ఒకే వేదికపై చరిత్ర, సంస్కృతి, కళలను మేళవించి
గోల్కొండ కోటలో ప్రదర్శనకు సిద్ధం
భరతనాట్య కళాకారిణి రమా వైద్యనాథన్
భారతీయ నాట్యం, సంగీతరీతులను పరిరక్షించడానికి కళారూపాల ప్రదర్శన బాధ్యతను చేపట్టింది పరంపర ఫౌండేషన్. సాంస్కృతిక ప్రదర్శనలను ఆలయాలు, చారిత్రక ప్రదేశాల్లో ‘పరంపర గుడి సంబరాలు’ పేరుతో ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు శశిరెడ్డి, డాక్టర్ శ్రీనగి. చరిత్ర, సంస్కృతి, కళలను మేళవించి ఒక వేదికపై ప్రదర్శిస్తున్నారు. గడచిన పదేళ్ల కార్యక్రమాల్లో భాగంగా నేడు గోల్కొండ కోటలో ప్రదర్శన జరుగుతోంది. భరతనాట్య కళాకారిణి, ఢిల్లీలోని గణేశ నాట్యాలయ డైరెక్టర్ రమా వైద్యనాథన్ ‘నిమగ్న’ రూపకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
‘భరతనాట్యం ఒక సముద్రం. నాట్య గురువులు ఇచి్చన స్ఫూర్తి ఆ లోతులను చూడడానికి ఉపయోగపడింది. సముద్రం వంటి నాట్య సుగంధాన్ని విశ్వవ్యాప్తం చేయాలనుకున్నాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నాట్యముద్రల గొప్పదనాన్ని పరిచయం చేయాలనేదే నా లక్ష్యం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తున్నాను. దేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి భరతనాట్యం మంచి మాధ్యమం. ఆ మాధ్యమమే నన్ను నడిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలివ్వాలని ఉంది. ఫిబ్రవరి 27న వైజాగ్‌లో ప్రదర్శన ఇచ్చాను. ఇప్పుడు హైదరాబాద్ గోల్కొండ కోటలో ప్రదర్శనకు సిద్ధం అవుతున్నాను. మన సంస్కృతి, చరిత్రను రానున్న తరాలకు చేరవేయడానికి మా కళాకారులు ఎంత అవసరమో.. ఈ కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు కూడా అంతే ముఖ్యం. సమాజంలో కళాభిమానులు ఎప్పుడూ ఉంటారు. కళను కళాకారుల నుంచి కళాభిమానులకు ప్రసరింపజేసే బాధ్యతను చేపట్టే వాళ్లు తక్కువ. కళాసాధన, కళాస్వాదన రెండూ మనిíÙని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకెళ్లే ప్రభావవంతమైన మార్గాలు’ అన్నారు రమావైద్యనాథన్.
ఇరవై మంది నాట్యకారులతో..
గోల్కొండ కోటలో ప్రదర్శించే ‘నిమగ్న’ రూపకంలో గురు స్తోత్రమ్, కామాక్షి, కాశీ, రఘువీర, రసలీల అనే ఐదు అంశాలుంటాయి. నేను స్వయంగా రూపొందించిన ఈ 90 రూపకంలో నాతోపాటు మరో ఇరవై మంది నాట్యకారులు పాల్గొంటారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నాట్యప్రదర్శనలిచి్చన రమావైద్యనాథన్.. సంగీత నాటక అకాడమీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, జోనల్ సెంటర్స్, స్టేట్ అకాడమీలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రదర్శనలిస్తారు. పాటా్నలో జరిగే రాజ్‌గిర్ మహోత్సవ్, త్రివేండ్రంలో సూర్య ఫెస్టివల్, కోణార్క్ ఫెస్టివల్, ఖజురహో ఫెస్టివల్ భరతనాట్యపు అడుగులతో పరిపూర్ణతనందించారు.
అవార్డులు
⇒ 2017, కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అవార్డు
⇒ 2015, మధ్య ప్రదేశ్ ప్రభుత్వ కుమార్ గంధవ్ పురస్కారం
⇒ 2013, కేరళ ప్రభుత్వ కళాశ్రీ పురస్కారం
⇒ 2011, తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డు
⇒ 1999, శ్రీలంక డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చరల్ అఫైర్స్ ‘భారత రత్న’
హైదరాబాద్‌కురెండోసారి!
గతంలో ఒకసారి హైదరాబాద్‌లో ప్రదర్శన ఇచ్చాను. చారిత్రక ప్రదేశం గోల్కొండలో ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ అందమైన నగరం. నాకు చాలా నచి్చంది. అందమైన సరస్సులు, పార్కులున్నాయి. ఆధునికతకు సంస్కృతి, కళలను అద్దితే అదే హైదరాబాద్ నగరం.
– రమా వైద్యనాథన్
Comments
Please login to add a commentAdd a comment