అస్సలు మోడల్‌వి కాలేవన్నారు..కానీ ఇవాళ ఫ్యాషన్‌కే ..! | Mumbai Man Documented His Success Journey In Fashion Industry | Sakshi
Sakshi News home page

నో ఛాన్స్‌ మోడల్‌ కాలేవంటూ తిరస్కారాలు..కానీ అతడే ఇవాళ..

Feb 24 2025 2:12 PM | Updated on Feb 24 2025 4:19 PM

Mumbai Man Documented His Success Journey In Fashion Industry

కొన్ని స్ఫూర్తిమంతమైన కథలు స్థైర్యంతోపాటు విమర్శలను ఛాలెంజ్‌గా ఎలా తీసుకోవాలో తెలియజేస్తాయి. అందరూ పదే పదే మన వల్ల కాదన్నప్పుడూ సహజంగా ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. దీంతో తెలియకుండా ప్రయత్నమే చెయ్యకుండా చేతులెత్తేస్తాం. కానీ కొందరూ వాటిని తలకు ఎక్కించుకోరు..సాధించాలన్నదే బ్రెయిన్‌లో తడుతుంటుంది. ఆ పట్టుదలే వాళ్లను అందనంత ఎత్తున ఉన్న సక్సెస్‌ని అందుకునేలా చేస్తుంది. అలాంటి గాథే ఈ ఫ్యాషన్ మోడల్‌​ దీపక్‌ గుప్తా స్టోరీ. అతడి కథ ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

దీపక్‌ గుప్తా ముంబై వీధులలో మోడల్‌గా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నప్పుడూ అందరూ నువ్వు మోడల్‌వి కాలేవనే చెప్పేవారు. మరికొందరూ ఏకంగా నువ్వు ఫ్యాషన్‌ ఇండస్ట్రీకి సరిపోవని ముఖం మీద చెప్పేశారు కూడా. అయినా తన ప్రయత్నం మాత్రం ఆపలేదు దీపక్‌. 

మోడల్‌గా తాను నేర్చుకోవాల్సిన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. మొదట్లో తనను చూసి నువ్వు ప్రముఖ లూయిస్‌ మిట్టన్‌ బ్రాండ్‌కి మోడల్‌వి కాలేవని అని తేల్చేశారు. ఎన్నో తిరస్కారాలు..అయినా దీపక్ మాత్రం ఏదో ఒక రోజు వీటన్నింటికి మించిన బ్రాండ్‌కి మోడల్‌ని అవుతానన్నదే అతడి గట్టి నమ్మకం. అయితే అతడి ఆశే చివరికి ఫలించిం అనుకున్నట్లుగానే ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ రన్‌వేపై మోడల్‌గా వెళ్లేంత స్థాయికి చేరుకున్నాడు. 

ప్రస్తుతం అతడు ఫ్యాషన్‌ పరిశ్రమలో పేరుగాంచిన మోడల్‌గా నెంబర వన్‌ స్థాయిలో ఒకడిగా ఉన్నాడు. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎన్నో ఆఫర్‌లు అందుకున్నాడు."నాడు అందరూ ఫ్యాషన్‌ ఇండస్ట్రీకి తనస్సలు సూటు కావని అన్నారు. కానీ ఇవాళ ఫ్యాషన్‌కే ఐకానిక్‌గా మారాను అంటూ తన విజయ గాథను ఓ డాక్యుమెంట్‌ రూపంలో పోస్ట్‌ చేశాడు. 

దానికి క్యాప్షన్‌గా " కాబట్టి ఎందుకు కాలేను" జోడించి మరీ పోస్ట్‌ చేశారు. దీంతో అతడి స్ఫూర్తిదాయకమైన కథ బాలీవుడ్‌ నటులు హృతిక్ రోషన్, నర్గీస్ ఫఖ్రీ వంటి ప్రముఖులని కదిలించింది. అతడు షేర్‌ చేసిన వీడియోకి ప్రతిస్పందనగా రెడ్‌హార్ట్‌ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు.

 

(చదవండి: అత్యంత ప్రమాదకరమైన పాయిజన్‌లతో తయారైన ఔషధాలివే..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement