mubai
-
గిల్ దున్నేస్తున్నాడు .. ఇక ఛాంపియన్ CSK
-
వైరల్ పోస్ట్: జొమాటో రియాక్షన్
సాక్షి,ముంబై: నాణేనికి రెండు వైపులా అన్నట్టు సోషల్ మీడియా పుణ్యమా అని ఇబ్బందుల్లో ఉన్న చిరు వ్యాపారులకు, ఇతర బాధితులకు భారీ ప్రయోజనమే లభిస్తోంది. ఇటీవల మనవరాలి చదువుకోసం ఇల్లునే అమ్ముకున్న ఒక పెద్దాయన పట్ల నెటిజన్లు మానవత్వంతో స్పందించారు. అంతకుముందు ఢిల్లీకి చెందిన ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతులకు సోషల్‌మీడియా ద్వారా మద్దతు లభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్థిక సంక్షోభంలో పడి విలవిల్లాడుతున్న ముంబైకి చెందిన ‘లిట్టీ చోఖా’ అమ్ముకుని జీవించే చిరువ్యాపారి కథనం వైరల్‌గా మారింది. జర్నలిస్టు ప్రియాన్షు ద్వివేది మొదలు పెట్టిన ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌కు భారీ స్పందన లభించింది. ప్రధానంగా ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటోతో పాటు, ఇతర దాతలు స్పందించిన తీరు విశేషంగా నిలిచింది.(జొమాటో వివాదం: ఇదట సంగతి...ఫన్నీ వీడియో వైరల్) ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రియాన్షు ద్వివేది సోషల్ మీడియాలో ఈ కథనాన్ని పోస్ట్ చేశారు. వివరాలను పరిశీలిస్తే అహ్మదాబాద్‌కు చెందిన యోగేశ్ ముంబైలోని వెర్సోవా బీచ్‌లో లిట్టి చోఖా అమ్మకుని జీవనం సాగించేవాడు. స్టాల్లో రెగ్యులర్‌గా లీట్టీలను ఆస్వాదించే ద్వివేది మాటల సందర్బంలో యోగేశ్ కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడినట్టు తెలుసుకున్నారు. పాపులర్ లిట్టి-చోఖాను చట్నీ, బటర్, సలాడ్‌తో కలిపి కేవలం ఇరవై రూపాయలకు అమ్ముతున్నా కొనేవారు కరువైన పరిస్థితి. చివరికి దుకాణం కూడా మూసి వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సోదరుడితోపాటు, తమ జీవనం దుర్భరంగా మారిపోయిందంటూ ఈ సందర్భంగా ద్వివేదితో వాపోయారు ఈ నష్టాలను భరించే శక్తి ఇక తనకు లేదనీ, స్టాల్‌ను మూసివేయడం తప్ప వేరే మార్గం లేదంటూ యోగేశ్ ఆవేదన చెందారు. దీంతో చలించిన ద్వివేది యోగేశ్‌కు సాయం చేయాల్సిందిగా కోరుతూ ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు దీన్ని జోమాటోను ట్యాగ్ చేస్తూ మార్చి 16 న ట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ రెండు వేలకు పైగా లైక్‌లను సంపాదించింది. అలాగే జొమాటోలో అతడి దుకాణాన్ని నమోదు చేయాలని నెటిజన్లు కూడా అభ్యర్థించారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. జొమాటో స్పందన దీనికి జొమాటోతో పాటు కొంతమంది నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు. యోగేశ్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అతని వివరాలను సేకరించేపనిలో పడింది. ప్రతిస్పందన ఆలస్యం అయినందుకు క్షమించండి. వీలైతే, దయచేసి యోగేశ్ కాంటాక్ట్ నంబర్‌తో పాటు, ఇతర వివరాలను తమకు అందించాలని కోరింది. దీనిపై ద్వివేది సంతోషం వ్యక్తం చేశారు. సాయం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లిట్టీ-చోఖా: బిహార్‌కు చెందిన వంటకం ఇది. గోధుమపిండితో చేసిన చపాతిలో పప్పులు, ఇతర మసాలాలను స్టఫ్ చేసి, నిప్పులపై కాలుస్తారు. దీన్ని నేతితోనూ, వంకాయ కూర లేదా ఆలూకూరతో కలిపి తింటారట. Hi Priyanshu, sorry for the delay in response. If possible, please help us with his contact number over a private message and our team will be reaching out to him at the earliest to assist him with the listing procedure.https://t.co/jcTFuHa5Ue — zomato care (@zomatocare) March 17, 2021 @zomatoin please help this gentleman with his endeavour!!🙏 https://t.co/0l9ZKOYI8d — manoj bajpayee (@BajpayeeManoj) March 17, 2021 -
సుశాంత్ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ
పట్నా : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మాజీ ఎంపీ, జన్ అధికార్ పార్టీ (జేఏపీ) చీఫ్ పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సుశాంత్ కుటుంబ సభ్యులతో భేటీ అయిన పప్పు యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు మృతిపై కుటుంబ సభ్యులు కూడా సీబీఐ విచారణకు పట్టుపడుతున్నారని తెలిపారు. ఆయన మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచుసుకుందని, హత్యా..? ఆత్మహత్యా? అనేది తేలాల్సిందని పేర్కొన్నారు. (సుశాంత్‌సింగ్ ఆత్మహత్య) ఇక సుశాంత్ రాజ్‌పూత్ మృతిపై బిహార్‌లోని ఆయన నివాసప్రాంతంలో ఉండే సన్నిహతులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుశాంత్ మృతిలో ఎవరికీ తెలియని కుట్రదాగి ఉందని సందేహించారు. కాగా ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఆదివారం సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై యావత్ సినీ, క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆయన మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం రిపోర్టును బట్టి విచారణలో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. (తొందరగా వెళ్లిపోయావ్ మిత్రమా!) -
మరోసారి భారీ ఎత్తున మాస్క్‌ల పట్టివేత
ముంబై : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రలో పెద్ద ఎత్తున మాస్క్‌లు పట్టుబడ్డాయి. అక్రమంగా దాచి వుంచిన కోటి రూపాయల విలువైన మాస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల నిల్వలను అరికట్టడానికి జరిపిన దాడుల సందర్భంగా అక్రమ నిల్వలు వెలుగు చూశాయి. మంగళవారం రాత్రి అందిన పక్కా సమాచారంతో ముంబై సబర్బన్ షా వేర్‌హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ గోడౌన్ పై దాడి చేసిన పోలీసులు సంఘటన స్థలంలో 200 బాక్సుల ఫేస్ మాస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ యజమాని, ఏజెంట్, సరఫరాదారుతో సహా ఐదుగురిపై కేసు నమోదుచేశారు. ( మహమ్మారి వెంటాడినా.. ) ఈ ఐదుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ మంజునాథ్ సింఘే తెలిపారు. ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు వంటి ముఖ్యమైన వస్తువులను నిల్వ చేయడం నేరమని ఆయన అన్నారు. కాగా సోమవారం సాయంత్రం, ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ రూ. 15 కోట్ల విలువైన 25 లక్షల అధిక-నాణ్యత గల ఫేస్ మాస్క్‌లను పోలీసుల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ( జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ ) -
గీజర్ నుంచి విషవాయువు.. బాలిక మృతి
ముంబై : గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడి బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బొరివలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 5న ఉదయం స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన ధృవి గోహిల్ (15) ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే ధృవి అపస్మారక స్థితిలో పడి ఉంది. వేడినీటి కారణంగా ఆమె శరీరం కుడిపక్కన కాలిన గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. మృత్యువుతో పోరాడిన బాలిక ఈ నెల 10న మృతిచెందింది. కార్బన్ మోనాక్సైడ్‌ను అధికంగా పీల్చడం వల్లే ఈ ఘోరం జరగినట్లు వైద్యులు తెలిపారు. -
ఘాటుగా స్పందించిన హీరోయిన్ నియా శర్మ
ముంబై: సోషల్ మీడియా విస్తృతి పెరగటంతో చాలా మంది సినీ సెలెబ్రిటీలు ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లను ఎంత పొగుడుతున్నారో.. అంతే స్థాయిలో అభిమానులు, సోషల్ మీడియా యూజర్లు సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు. అయితే చాలా మంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్, కామెంట్లను చూసిచూడనట్టు దూరంగా ఉంటారు. మరికొంత మంది పిచ్చిపిచ్చిగా రాసే రాతలకు ఘాటుకు స్పందిస్తారు. తాజాగా బాలీవుడ్ నటీ నియాశర్మ తనపై అసభ్యంగా వ్యాఖ్యలు చేసినవారిపై మండిపడ్డారు. నియా శర్మపై ‘తన పీఆర్ టీం సాయంతో సంతోషంగా కెరీర్ ముందుకు వెళ్తున్నట్టు ట్విటర్లో రూమర్లు వచ్చాయి. దీనిపై ఓ ఆకతాయి ట్విటర్ యూజర్ నియాపై అసభ్యంగా వ్యాఖ్యలు చేశాడు. ‘నియా చూడటానికి చాలా అసహ్యంగా ఉంటారని.. భూమిమీద సెలబ్రిటీగా అని పిలువబడే వికారంగా ఉన్నవారిలో ‘నియా శర్మ’ ఒకరని కామెంట్ చేశాడు. ఎటువంటి కారణం, అందం లేకుడా.. నియా వార్తల్లో ఉండటానికి కారణం ఆమె పీఆర్ టీం గొప్పతనం అన్నాడు. ఆసియాలోనే చాలా ఆకర్షణీయంగా కనిపించే మహిళలల్లో నియా ఒకరిగా పరిగణించబడుతున్నారన్న విషయం తెలిసిందే. అటువంటి నియా దీనిపై స్పందిస్తూ.. ‘ఆ వ్యక్తికి ఇలా కామెంట్ చేయడానికి అతనికి కనీసం సిగ్గు కూడా లేదని మండిపడ్డారు. అదే విధంగా తనకు ఎటువంటి పీఆర్ టీం లేదని.. తాను చాలా సహజంగా ఉంటాను’ అని తెలిపారు. తన అభిమానులు, స్నేహితులు...నియాకు మద్దతుగా నిలిచారు. సదరు వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ‘బహుశా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని.. నటీగా ఉండటానికి, ఆ స్థాయికి చేరుకోవడానికి తాను ఎంత కష్టపడి ఉంటారో మీరు ఊహించలేరు’ అని బిగ్‌బాస్ ఫేం బండ్గి కల్రా ట్వీట్ చేశారు. ఇలా నియా ఒక్కరే కాదు.. బాలీవుడ్లో చాలా మంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ఎటువంటి కారణం లేకుండానే తీవ్రంగా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. -
35 మార్కులతో పాసై ఫేమస్ అయిపోయాడు
ముంబాయి : పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల రోజు అందరి దృష్టి మొదటి ర్యాంకు ఎవరికి వచ్చింది.. స్టేట్ టాపర్ ఏ స్కూల్ విద్యార్థి.. ఎంతమంది పాస్ అయ్యారు లాంటి విషయాలపై ఉంటుంది. మీడియా కూడా టాపర్ల గురించే చెబుతుంది. కానీ మహారాష్ట్రలో మాత్రం ఇవన్నీ కాదని బార్డర్ మార్కులతో పాసైన ఓ విద్యార్థి గురించి మీడియా తెగ ప్రచారం చేసింది. టాపర్ల కంటే ఎక్కువగా ఈ విద్యార్థి గురించి చర్చ జరిగింది. కేవలం బార్డర్ మార్కులతో పాసైన వ్యక్తి గురించి ఇంత ప్రచారం ఎందుకు అనుకుంటున్నారా.. మరి అక్కడే ఉంది ట్విస్టు. అతడికి అన్ని సబ్జెక్టుల్లోనూ సమానంగా 35 మార్కులు వచ్చాయి. అంటే.. అన్ని సబ్జెక్టుల్లో అతడు బార్డర్ మార్కులతో పాసయ్యాడన్నమాట. దీంతో అతడు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ముంబైకి చెందిన అక్షిత్ జాదవ్ స్థానికంగా ఉన్న అందరిలాగే టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. గత శనివారం మహారాష్ట్ర టెన్త్ బోర్డు ఫలితాలను రిలీజ్ చేసింది. కానీ రిజల్ట్ చూసే సరికి షాకైపోయాడు. ప్రతి సబ్జెక్ట్‌లో 35 మార్కులు వచ్చాయి. ఇలా బార్డర్ మార్కులతో బయటపడటంతో ఊరంతా అతని గురించే చర్చ జరిగింది. లోకల్ మీడియాకు ఈ విషయం తెలియడంతో రోజు మొత్తం అక్షిత్ గురించే ప్రచారం చేసింది. ఈ సందర్భంగా అక్షిత్ తండ్రి గణేశ్ మాట్లాడూతూ..."మా కుమారుడి ఫలితాలు చూసి ఆశ్చర్యపోయాం. అతడు 55శాతం మార్కులతో పాస్ అవుతాడని అనుకున్నాం. కానీ విచిత్రంగా అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులే వచ్చాయి. అయితే అతడు అన్ని సబ్జెక్టుల్లో పాస్ అవడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. అక్షిత్ తొమ్మిదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. తరువాత ఇక స్కూల్‌కు వెళ్లలేదు. టెన్త్ పరీక్షలు ప్రైవేటుగా రాసి పాసయ్యాడు. ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టమనే అక్షిత్...క్రీడలనే కెరీర్‌గా ఎంచుకుంటానని చెప్పాడు. ఇక సోషల్ మీడియాలో ఈ మార్కులపై జోకులు ఓ రేంజ్లో పేలాయి. ఇదో "నేషనల్ రికార్డు" అంటూ కొందరు కామెంట్ చేశారు. -
టైగర్‌తో లంచ్..
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ హాట్ జోడీ దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు డేటింగ్లో ఉన్నారని, వీరి మధ్య సంబంధాలు ఇటీవల బెడిసికొట్టాయని వచ్చిన వార్తలకు ఈ జంట బ్రేక్ వేసింది. వీరిద్దరు కలిసి ఇటీవల ముంబైలోని ఓ రికార్డింగ్ స్టూడియోలోకి చేరుకుంటూ తమపై వచ్చిన వదంతులను కొట్టిపారేశారు. అప్పటినుంచి పలు సందర్భాల్లో వీరు సన్నిహితంగా ఉంటూ కెమెరాల కంట పడ్డారు. తాజాగా దిషా, టైగర్లు బాంద్రాలో సెలబ్రిటీలు తరచూ సందర్శించే ప్రముఖ రెస్టారెంట్ బాస్టిన్‌లో బ్రంచ్ చేశారు. అయితే ఇప్పటివరకూ తమ మధ్య ఉన్న సంబంధం గురించి వీరు నోరుమెదపకపోవడం గమనార్హం. ఇక వృత్తిపరంగా దిశా పటానీ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న భారత్‌లో మెరవనున్నారు. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో రూపొందుతూ కత్రినా కైఫ్, టబు, సునీల్ గ్రోవర్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ 2019 ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు టైగర్ ష్రాఫ్ కరణ్ జోహార్ నిర్మించే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో నటిస్తున్నారు. అనన్య పాండే తెరంగేట్రం చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మేలో విడుదల కానుంది. -
జెన్ అందిస్తున్న స్ఫూర్తి
ముంబైలోని పరేల్‌లో బహుళ అంతస్తుల భవంతికి నిప్పంటుకుని నలుగురు మరణించిన ఉదం తంలో పదేళ్ల బాలిక జెన్ సదావర్తి అప్రమత్తత అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. మొన్న బుధ వారం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఆమె వల్ల 16మంది ప్రాణాలతో బయటపడగలిగారు. ఆప త్సమయాల్లో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలపైనా... అసలు అలాంటి ప్రమాదాలు చోటు చేసు కోకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపైనా పౌరులందరికీ అవగాహన కలిగించాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం తెలియజెబుతోంది. అగ్ని ప్రమాదాల సమయంలో ఏం చేయాలో మూడో తరగతి చదువుతుండగా తన పాఠశాలలో నేర్చిన అంశాలను ఇప్పుడామె గుర్తుంచుకుని అందరి తోనూ ఆచరింపజేసింది. ప్రమాదాలు జరిగినప్పుడు నిబ్బరంగా ఉండటం అవసరమని, ముఖ్యంగా మంటలంటుకుని పొగ ఆవరించినప్పుడు తడి బట్టను ముఖంపై వేసుకుని దానిద్వారా మాత్రమే గాలి పీల్చాలని జెన్ తెలుసుకుంది. ఒకపక్క మంటలు, పొగ వ్యాపించటం... మరోపక్క పేలుళ్ల శబ్దాలు వినబడుతుండటం పర్యవసానంగా తన తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు ఫ్లాట్లలో నివసించేవారూ ఆందోళన పడుతున్న వైనాన్ని గమనించి వారికి ధైర్యం చెప్పింది. అందుబాటులో ఉన్న వస్త్రాన్ని చించి ఆ ముక్కల్ని నీటిలో తడిపి అందరికీ అందజేసింది. తడి బట్ట ద్వారా గాలి పీల్చకపోతే కమ్ముకొస్తున్న పొగలోని కార్బన్ డై ఆక్సైడ్తో కాసేపటికే స్పృహ కోల్పోతామని నచ్చ జెప్పింది. లిఫ్ట్ వాడకూడదని వివరించింది. వీరున్న 12వ అంతస్తు నుంచి వెంటనే మెట్ల ద్వారా దిగిరావాలని ఫోన్లో అగ్నిమాపక సిబ్బంది సూచించినప్పుడు అది సాధ్యం కాదని, గాభరాలో ఉన్న వారికి ఊపిరాడదని తెలిపింది. చివరకు క్రేన్ ద్వారా వీరందరినీ ఆ సిబ్బంది కిందకు దించారు. ప్రమాదాలు చెప్పి రావు. అవి వచ్చిపడినప్పుడు ఎలాంటివారైనా అయోమయంలో పడతారు. ఏం చేయాలో పాలుబోక పొరబాట్లు చేసి ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. మన పాఠ్య పుస్తకాల్లో ఏదో మొక్కుబడిగా తప్ప వీటిపై అవగాహన కలిగించే ప్రయత్నం కనబడదు. అలాగే నిర్ణీత వ్యవధిలో ఎప్పటికప్పుడు వివిధ రకాల ప్రమాదాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తు చేయిం చటం అసలే ఉండదు. వాటి అవసరం ఎంత ఉందో జెన్ తెలియజెప్పింది. నదీ తీరాల్లో, జలా శయాల్లో, కొండల్లో, లోయల్లో పొంచి ఉండే ప్రమాదాలేమిటో చెప్పటం, ఆయా ప్రాంతాల్లో తీసు కోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలేమిటో వివరించటం అనే సంస్కృతి మన విద్యా సంస్థల్లో కన బడదు. ఎప్పుడో తప్పనిసరై మొక్కుబడిగా ఆ తరహా కార్యక్రమాలు నిర్వహించటం తప్ప దాన్నొక కీలకమైన అవసరంగా గుర్తించినట్టు కనబడదు. నాలుగేళ్లక్రితం హైదరాబాద్ శివార్లలోని విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్ సందర్శనకెళ్లి అక్కడి బియాస్ నదిలో మృత్యు వాత పడిన ఉదంతం ఎవరూ మరవలేరు. 24మంది యువ ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఆ విషాద ఉదంతం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఉంటే అసలు జరిగేదే కాదు. విద్యు దుత్పాదన కోసమని నిర్మించిన బరాజ్ వద్ద అవసరాన్నిబట్టి అప్పుడప్పుడు గేట్లు తెరవటం, జలాశయంలోని నీరు పెద్దయెత్తున ఎగిసిపడుతూ బయటకు రావడం సంగతి ఆ పిల్లలకు తెలి యదు. విద్యుదుత్పాదన కేంద్రం వద్ద అలా నీరు వదులుతారని ఆ పిల్లలకు అవగాహన ఉంటే అసలు కిందికి దిగేవారు కాదు. ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చినవారికి అది తెలిసే అవకాశం లేదని స్థానిక ప్రభుత్వ యంత్రాంగమైనా గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టి ఉంటే బాగుండేది. తరచు భూకంపాలతో సతమతమయ్యే జపాన్... వాటిపై పౌరుల్లో అప్రమత్తత పెంచటం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అలారం మోగగానే ఏం చేయాలో అక్కడి పాఠశాలల పిల్లలకు తెలుసు. ప్రతి నెలా ఇందుకు సంబంధించిన కసరత్తులు వారితో చేయిస్తుంటారు. భద్రతా చర్యల గురించి పాఠ్యాంశాలుంటాయి. భూకంపం వస్తున్నదని గుర్తించిన వెంటనే హెల్మెట్ ధరించటం, ఏమాత్రం ఆందోళనపడకుండా ప్రశాంతంగా తరగతి గదుల్ని విడిచి బయటకు రావటం వారికి ఎవరూ చెప్పాల్సిన అవసరం ఉండదు. భవంతుల నిర్మాణంలో తీసుకునే ముందస్తు జాగ్రత్తలు సరేసరి. అవి భూకంపాలను తట్టుకునే విధంగా ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు చోటు చేసు కున్నప్పుడు తక్షణం అంబులెన్స్‌కు కబురు చేయాలని ఎవరికీ తోచకపోవటం వల్ల సకాలంలో వైద్యం అందక అనేకమంది మరణిస్తున్నారు. కేరళలో వచ్చిన వరదలు ఆనకట్టల విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని వెల్లడించాయి. ఆనకట్టలకు సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వమూ కార్యాచరణ ప్రణాళికలనుగానీ, ముంపు ప్రాంతాల మ్యాప్‌లను గానీ రూపొందించుకోలేదని నిరుడు కాగ్ నివేదిక తెలిపింది. జలాశయాల నీటి మట్టం పెరిగింది గనుక నీరు బయటకు వదులుతామని హెచ్చరించటం తప్ప ఏ స్థాయిలో నీరు వదిలితే ఎంత మేర ప్రాంతం ముంపునకు గురవుతుందో అంచనా వేసుకునే ఉపకరణాలు ప్రభుత్వ యంత్రాంగం దగ్గర ఉండటం లేదు. దేశం మొత్తం మీద 4,862 పెద్ద ఆనకట్టలుండగా కేవలం 349 ఆనకట్టలకు(7 శాతం) మాత్రమే ఇటువంటి అత్యవసర ప్రణాళికలున్నాయని కాగ్ తెలిపింది. ఆకస్మికంగా నీరు వచ్చిపడితే, దాన్ని పెద్ద మొత్తంలో విడుదల చేయక తప్పని స్థితి ఏర్పడితే... అనుకోకుండా ఆనకట్టలు బద్దలైతే ఎంత విస్తీర్ణంలోని ప్రాంతం ముంపు బారిన పడుతుందో, అటువంటి సమయాల్లో తీసుకునే చర్యల క్రమం ఎలా ఉండాలో ఎవరి దగ్గరా ప్రణాళికలు లేవు. కేరళలో 61 ఆనకట్టలుంటే ఒక్కదానికీ అత్యవసర ప్రణాళిక లేదు. ఈ విషయంలో దాదాపు అన్ని రాష్ట్రాల పరిస్థితీ ఇంచుమించు అలాగే ఉంది. సాధారణ పౌరుల మొదలు ప్రభుత్వాల వరకూ అన్ని స్థాయిల్లోనూ తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు, ముందస్తు చర్యలు నష్టాలను నివారిస్తాయి. భద్రతకు భరోసానిస్తాయి. పదేళ్ల జెన్ నుంచి అందరూ నేర్చు కోవాల్సింది ఇదే. -
కుటుంబం ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో 50పేర్లు
సాక్షి, ముంబై : ఓవైపు అప్పుల బాధ, మరోవైపు కూతురి మరణం వెరసి ఓ కుటుంబం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ముంబైలోని కఫే పరేడ్ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కఫే పరేడ్‌కు చెందిన ప్రవీణ్ పటేల్, భార్య వీణా పటేల్, కొడుకు ప్రభు పటేల్‌తో కలిసి మత్స్యకారుల కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ప్రవీణ్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుండేవాడు. కొన్ని నెలల క్రితం అతని కూతురు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందింది. కూతురి మరణంతో పాటు అప్పుల బాధ తాళలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. ముందుగా కొడుకును ఉరివేసి, ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ప్రవీణ్ ఇంటి నుంచి దుర్వాసన రావటం గుర్తించిన పొరుగింటి వారు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరచిచూడగా ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సంఘటనా స్థలంలో లభించిన ఓ సూసైడ్ నోట్లో మృతులు దాదాపు 50 మంది పేర్లను ప్రస్తావించటం పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఇంటి సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారా? లేదా... ఆత్మహత్య చేసుకునేలా ఎవరన్నా ప్రేరేపించారా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. -
షరీఫ్ పేల్చిన బాంబు!
అందరికీ తెలిసిన కథే. తొమ్మిదేళ్లక్రితం అమెరికా పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పిన సంగతే. ముంబై మహా నగరంపై 2008 నవంబర్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడి 166మందిని పొట్టనబెట్టుకున్న ఉదంతం వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉన్నదని ప్రపంచ దేశా లన్నిటికీ అర్ధమైన విషయమే. అయిదు రోజులక్రితం పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా పరోక్షంగా అదే చెప్పారు. ఎన్నాళ్లు పాక్ గడ్డపై ఉగ్రవాద ముఠాలను పెంచి పోషిస్తూ పొరుగుదేశంపై దాడులకు పంపుతామని ఆయన ప్రశ్నించారు. అంతే...అక్కడ వ్యవస్థలన్నీ వణికిపోతున్నాయి. సొంత పార్టీ పాకిస్తాన్ ముస్లింలీగ్ (పీఎంఎల్)–ఎన్తో సహా అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు రావడంతో షరీఫ్ స్వరం మార్చి తన మాటల్ని మీడియా వక్రీకరించిందంటూ సంజాయిషీ ఇచ్చుకున్నారు. పాకిస్తాన్ సైన్యం ప్రధాని షహీద్ ఖాకాన్ అబ్బాసీని హడావుడిపెట్టి జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయించింది. ఆయన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. షరీఫ్ అపార్ధం చేసుకుని ఉండొచ్చు లేదా ఆయనకు దురభిప్రాయాలు ఏర్పడి ఉండొచ్చునని అభిప్రాయపడింది. జాతీయ భద్రతా మండలి షరీఫ్ మాటల్ని ఖండించ లేదని, మీడియా వక్రీకరించిందని మాత్రమే అభిప్రాయపడిందని పీఎంఎల్–ఎన్ చెబుతోంది. నవాజ్ షరీఫ్ తన మాటల్లో ఎక్కడా సైన్యం గురించి నేరుగా మాట్లాడలేదు. ఉగ్రవాద సంస్థలకు సైన్యం తోడ్పాటునిస్తున్నదని చెప్పలేదు. అయినా ‘గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు’ పాక్ సైన్యానికి కంగారు ఎక్కువైంది. బహుశా తనకూ, సైన్యానికీ మధ్య విభేదాలు రాకుండా ఉంటే షరీఫ్ ఇంత బాహాటంగా పాక్ తప్పిదాన్ని అంగీకరించేవారు కాదేమో! ఆయన ప్రధానిగా ఉండగా ముంబై దాడుల ప్రస్తావన వస్తే తమకేమీ సంబంధం లేదనే చెప్పేవారు. పైగా ఆ దాడులపై పాక్‌లో సాగుతున్న విచారణకు భారత్ సహకరించడం లేదని ఆరోపించారు. తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి, ఆ తర్వాత అనర్హత వేటు వేయడానికి సైన్యం లోపాయికారీగా సుప్రీంకోర్టుపై ఒత్తిడి తెచ్చిన తీరు చూశాక ఆయన ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా పని చేశారు కాబట్టి ఆయనకు మొదటి నుంచీ సైన్యం వేస్తున్న వేషాలన్నీ తెలుసు. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హక్కానీ నెట్వర్క్ వంటి ఉగ్రవాద ముఠాలకు డబ్బులిచ్చి, ఆయుధాలిచ్చి, శిక్షణ ఇచ్చి మన దేశంపైకి ఉసిగొల్పుతున్న తీరు గురించిన సమస్త సమాచారమూ ఆయన వద్ద ఉంటుంది. కారణాలేమైనా కావొచ్చుగానీ షరీఫ్‌కూ, సైన్యానికీ మొదటినుంచీ పడటం లేదు. ఆయన రెండోసారి ప్రధాని అయ్యాక 1999లో అప్పటి సైనిక దళాల చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ తిరుగుబాటు చేసి ఆయన్ను పదవీచ్యుతుణ్ణి చేశారు. ఆ తర్వాత ఖైదు చేయించారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి సౌదీ అరేబియా వెళ్లిపోతానని హామీ ఇచ్చాకే ఆయనకు విముక్తి లభించింది. 2013లో షరీఫ్ తిరిగి ప్రధాని కాగానే ముషార్రఫ్ పాలనాకాలంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించారు. 1999నాటి సైనిక కుట్ర గురించి కూడా విచారించి అందుకు ఆయన్ను శిక్షించాలని పట్టుబట్టారు. ఇదంతా సైన్యానికి నచ్చలేదు. పాకిస్తాన్లో మూడు అధికార కేంద్రాలుంటాయి. అవి సమాంతరంగా, స్వతంత్రంగా పని చేస్తుంటాయి. అందులో మొదటిది పౌర ప్రభుత్వం. రెండోది సైన్యం. మూడోది సుప్రీంకోర్టు. ఏ దేశంలోనైనా సైన్యం పౌర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటుంది. అది తీసుకునే నిర్ణయాలకూ, రూపొందించే విధానాలకూ కట్టుబడి ఉంటుంది. కానీ పాకిస్తాన్లో దీనికి విరుద్ధంగా జరుగు తుంది. సైన్యం స్వతంత్రంగా వ్యవహరించాలనుకుంటుంది. ప్రజలెన్నుకున్న పౌర ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తుంది. అదును దొరికితే దాన్ని చాప చుట్టి తానే ఏలాలని చూస్తుంది. పాకిస్తాన్ అవతరణ నాటినుంచి ఆ దేశంలో ఎక్కువకాలం సైనిక పాలనే నడిచింది. పదేళ్లుగా సైన్యం ఇలాంటి కుట్రలకు దూరంగా ఉన్నా తెరవెనకనుంచి పౌర ప్రభుత్వాలను శాసించే ధోరణి మానుకోలేదు. మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) వంటి పార్టీల ద్వారా పౌర ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేయాలని చూస్తూనే ఉంది. నాలు గేళ్లక్రితం నవాజ్ షరీఫ్‌ను గద్దె దించడమే లక్ష్యమంటూ పార్లమెంటును ముట్టడించిన ఇమ్రాన్ ఖాన్‌కు సైన్యమే అండదండలిచ్చింది. ఆయనకు జనంలో అంతగా ఆదరణ లేకపోవడంతో ఆ ముట్టడి కార్యక్రమం నవ్వులపాలైంది. ఈలోగా 2016లో పనామా పత్రాలు వెల్లడై అందులో నవాజ్ షరీఫ్ కుటుంబసభ్యుల పేర్లున్నాయని తెలిశాక సైన్యం ఆయన అడ్డు తొలగించుకునే పని మొదలుబెట్టింది. సుప్రీంకోర్టును ప్రభావితం చేసి ఆయనపై విచారణ తంతు నడిపించి ప్రధాని పదవి నుంచి తప్పుకునేలా చేసింది. ఆ తర్వాత రాజకీయాలకే ఆయన అనర్హుడంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ పరిణామాల పర్యవసానంగానే నవాజ్ షరీఫ్ గళం విప్పారు. పరోక్షంగా సైన్యం సాగిస్తున్న కుట్రలను ప్రపంచానికి వెల్లడించారు. పాకిస్తాన్లో సాగుతున్న అంతర్గత కుమ్ములాటల మాట అలా ఉంచి ఉగ్రవాదానికి అక్కడి సైన్యం అందిస్తున్న తోడ్పాటుపై అమెరికా మాత్రమే కాదు... చైనా, సౌదీ అరేబియా వంటి సన్నిహిత దేశాలు సైతం అసహనంతో ఉన్నాయి. ఉగ్రవాద ముఠాలను కట్టడి చేయకపోతే ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయన్ను ప్రసన్నం చేసుకుని ఈ గండం నుంచి గట్టెక్కుదామని ప్రయత్నిస్తుండగా షరీఫ్ ఉన్నట్టుండి ఈ బాంబు పేల్చడంతో సైన్యానికి దిక్కుతోచడం లేదు. అందుకే ఈ ఉలికిపాటు. ఏ ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా ఉగ్రవాద ముఠాలకు తోడ్పాటునిస్తున్న ధోరణులపై సాక్షాత్తూ మాజీ ప్రధానే మాట్లాడటం ఒక రకంగా మంచిదే. ప్రపంచం నలుమూలలనుంచీ పాక్‌పైఒత్తిళ్లు పెరుగుతాయి. సైన్యం కుటిల ధోరణులకు కళ్లెం పడేందుకు ఇది దోహదపడుతుంది. ఆ దేశంలో పౌర ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే అది మనకు కూడా మేలు కలిగిస్తుంది. ఇరు దేశాల మధ్యా సామరస్య సంబంధాలు ఏర్పడతాయి. ఉగ్రవాద ముఠాల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది. -
ఎన్ఆర్ఐ మహిళ అదృశ్యం
ముంబై : భారత సంతతికి చెందిన మహిళ అదృశ్యమైన ఘటన ముంబై నగరంలో కలకలం రేపింది. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న 76 ఏళ్ల దేవికమ్మ పిళ్లై అనే మహిళ లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి భువనేశ్వర్‌లో రైలులో బయలు దేరిన అదృశ్యమైనట్టు రైల్వే పోలీసులు తెలిపారు. సెలవులు గడపడానికి నెల కిందట వచ్చిన ఆమె ఫిబ్రవరి 21 నుంచి దక్షిణ ముంబైలో కొలబ ప్రాంతంలోని గెస్ట్ హౌస్‌లో ఉంటోంది. ఫిబ్రవరి 23న భువనేశ్వర్‌కు రైలులో వెళ్లినప్పటి నుంచి కనిపించటం లేదని ఆమె కూతురు సమాచారమిచ్చినట్లు రైల్వే పోలీసులు చెప్పారు. చివరిసారిగా ఆమె మహారాష్ట్రలోని గోండిగా ప్రాంతంలో ఉన్నట్లు ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించినట్టు వెల్లడించారు. మార్చి 1న దేవికమ్మ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దక్షిణాఫ్రికా నుంచి ఆమె కూతురు గెస్ట్ హౌస్‌కు ఫోన్ చేసింది. ఆమె అక్కడి నుంచి వెళ్లపోయి, ఇంటికి తిరిగి రాకపోవడంతో ముంబైలోని పోలీసులను సంప్రదించింది. ఆమె కనిపించకుండా పోవడంతో గెస్ట్‌హౌస్ మెనేజర్ ఫిర్యాదు చేశాడు. భువనేశ్వర్‌లో ఆమె ఏ స్నేహితురాలిని కలుస్తానని వెళ్లిందో తెలుసుకున్నామని రైల్వేపోలీసు అధికారి మహేశ్ బల్వంత్‌రావ్ అన్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేసి ఆమె ఆచూకీ కనుగొంటామన్నారు. -
ముంబైలో మరాఠాలు, దళితుల మధ్య ఘర్షణలు
-
ముఖ్యమంత్రిగా ఆ పని చేయడం తప్పా!
'ముఖ్యమంత్రి బ్రోకర్లా మారారు.. పాకిస్థానీలకు వత్తాసు పలుకుతున్నారు' అని మిత్రపక్షం శివసేన చేస్తోన్న తీవ్ర ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల విషయంలో నెలకొన్న ఉద్రిక్తతను పరిష్కరించే దిశగా సీఎం.. దర్శకనిర్మాతలకు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్)కు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సీఎంతో భేటీ తర్వాత రాజ్ ఠాక్రే 'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి' అని డిమాండ్ చెయ్యడంతో అందరితోపాటు ఫడ్నవిస్ కూడా ఖంగుతిన్నారట! తన అధికారిక నివాసం 'వర్ష'లో సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం అసలేంజరిగిందో చెప్పుకొచ్చారు.. (సీఎం సమక్షంలో సినిమా వివాదానికి తెర!) 'నా ముందు రెండు దారులున్నాయి. ఒకటి.. ఆ సినిమా విడుదలయ్యే అన్ని థియేటర్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడం. తద్వారా పండగ(దీపావళి)పూట పోలీసులు కుటుంబాలకు దైరంగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఆందోళనలు దారితప్పితే కొత్త సమస్యలు తలెత్తుతాయి. అందుకే నేను రెండో దారి.. అంటే చర్చలకు మొగ్గుచూపా. ఇరుపక్షాలను పిలిపించా. అక్కడ రాజ్ ఠాక్రే మూడు డిమాండ్లు మా ముందుంచారు. అందులో రెండింటికి(ఉడీ అమరజవాన్లకు నివాళులు అర్పించడం, భవిష్యత్ లో పాక్ నటులను తీసుకోకపోవడం) ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇక మూడోదైన 'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి' డిమాండ్ ను మాత్రం నేను అక్కడికక్కడే ఖండించా. సైనిక సహాయనిధికి విరాళాలు డిమాండ్ చేయడం సరికాదని రాజ్ ఠాక్రేను వారించా' అని ఫడ్నవిస్ చెప్పారు. చర్చల ద్వారా మంచి ఫలితాన్ని రాబట్టిన తనను అభినందించాల్సిదిపోయి విమర్శలు గుప్పించడం అజ్ఞానమన్న సీఎం ఫడ్నవిస్.. కశ్మీర్ వేర్పాటువాదులతోనూ, తీవ్రవాదులతోనూ ప్రభుత్వాలు చర్చలు జరపడంలేదా?అని ప్రశ్నించారు. అమరజవాన్ల కుటుంబాలకు బాసటగా నిలవడంలో తప్పులేదని, అయితే అలా చేయాలని డిమాండ్ చేయడం మాత్రం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. ఎంఎన్ఎస్ పట్ల ప్రభుత్వానికి సాఫ్ట్ కార్నర్ ఉందన్న విమర్శలు అర్థంలేనివని అన్నారు. -
ప్రేయసి ఆలస్యానికి కూతురు హత్య
ముంబై: ప్రేయసిపై కోపంతో కూతురును హత్య చేశాడో తండ్రి. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అయితే, చంపబడిన పాప వారిద్దరికి జన్మించినమ్మాయే. విపుల్ మెహతా(39), నగ్మా షేక్(24) అనే ఇద్దరు కొన్నేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరికి పియా(5) అనే ఓ పాప జన్మించింది. గత కొంతకాలంగా నగ్మా షేక్ ఇంటికి ఆలస్యంగా వస్తోందని విపుల్ మెహతా గొడవపడుతున్నాడు. విపుల్ హెచ్చరించినప్పటికీ బుధవారం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిన నగ్మా గురువారం తెల్లవారే వరకు కూడా రాలేదు. అతడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తిరిగి సమాధానం ఇవ్వలేదు. దీంతో మధ్యపానం సేవించిన విపుల్ ఇంట్లో ఉన్న పాప పియా గొంతునులిమేశాడు. ఈ సమయంలో పాప గట్టిగా కేకలు వేయగా చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పారు. ఈలోపే విపుల్ కూడా పురుగుల మందు తాగాడు. నగ్మా వచ్చి పాపను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయింది. విపుల్ ఆస్పత్రిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. -
దుస్తులు మరచిపోయినా.. ఫోన్ మాత్రం!
న్యూఢిల్లీ:మనం ఎవరికైనా అత్యవసరంగా మెసేజ్ ను పాస్ చేయాలంటే మొబైల్ నే ప్రముఖంగా ఉపయోగిస్తూ ఉంటాం. నిత్య జీవితంలో మొబైల్ వాడకం అనేది ఒక భాగం అయిపోయింది. ఈ విషయం ఎవరూ కాదనలేని వాస్తవం. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు మన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. కాకపోతే కాస్త భిన్నంగా, తన దైన శైలిలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. 'నువ్వు దుస్తులు వేసుకోవడం మరచి పోయినా ఫర్వాలేదు కానీ మొబైల్ ఫోన్ వాడటాన్ని మరచిపోకు' అంటున్నాడు. విలాసవంతమైన వస్తువుల కంటే అత్యవసరమైన వాటికే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని అర్జున్ కపూర్ స్పష్టం చేస్తున్నాడు. ఊపిరి సలపని పనిలో ఉన్నా కూడా తాను మొబైల్ తో అమితమైన వినోదాన్ని పొందుతానని కపూర్ స్పష్టం చేస్తున్నాడు. మార్కెట్ లో ఎన్నో రకాల గాడ్జెట్ లు అందుబాటులో ఉన్నా.. ఫోన్ కు మాత్రం ప్రత్యేక స్థానం ఇవ్వాలని కోరుతున్నాడు. కనీసం అతని కోసమైనా ఆ ప్రయత్నం చేయమంటున్నాడు. 'ఎక్కువ సమయం బిజీ షెడ్యూల్ తో ఉండే నా దృష్టిలో ఫోన్ అనేది నిజంగా ప్రత్యేకమైనదేనని పేర్కొన్నాడు. 'నువ్వు దుస్తులు వేసుకోవడం మరిచిపోయినా.. ఫోన్ ను మాత్రం మరిచిపోకు'అంటూ మొబైల్ పై తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే 'గుండే', 2 స్టేట్స్ చిత్రాల్లో నటించి బాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఈ నటుడికి అభిమానుల ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. ఒక లక్షకు పైగా ట్విట్టర్లో ఫాలోవర్స్ ను సంపాదించుకున్న అర్జున్ ను మీ ట్విట్టర్ జర్నీ ఎలా ఉందని ప్రశ్నించగా.. ప్రపంచంలో చాలా మందితో టచ్ లో ఉంటున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. -
‘తెలంగాణ’తో ఉద్యోగావకాశాలు
సాక్షి, ముంబై: ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ గౌడ్ అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆజాద్‌మైదాన్‌లో ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ దీక్షలో పాల్గొన్న తెలంగాణవాదులను సుధాకర్ గౌడ్ కలిశారు. అక్కడ చేపడుతున్న ధర్నా, దీక్షలో పాల్గొన్న వారితో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం మట్లాడుతూ ముంబై నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత మన తెలంగాణ ప్రజ లకే దక్కిందని కొనియాడారు. తెలంగాణలో ఉద్యో గావకాశాలు లేకపోవడంవల్ల వలసలు పెరిగాయ ని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అవి తగ్గిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలతో దేశం అభివృద్ధి చెందుతుందని, అప్పట్లో భార త రాజ్యాంగకర్త డాక్టర్ అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. అంతకుముందు దీక్ష ప్రాంగణానికి చేరుకున్న సుధాకర్‌కు తెలంగాణవాదులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ పాటల తో హోరెత్తించారు. కార్యక్రమం లో బోరివలికి చెందిన గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు తోకల రాములు, కె.శంకర్, తెలంగాణ ఐక్య ప్రజాఫ్రంట్ నాయకులు అక్కనపెల్లి శ్రీనివాస్, నాగిల్ల వెంకన్న, తెలంగాణ బెస్త సంఘం అధ్యక్షు డు ఎన్.మల్లేశ్ బెస్త, ఆర్.లక్ష్మణ్ బెస్త పాల్గొన్నారు. -
నివాసాలుగా ఉప్పు భూములు
సాక్షి, ముంబై: నగర శివారు ప్రాంతాల్లో వృథాగా ఉన్న ఉప్పు భూముల్లో నివాస గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభించిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ బృహత్ నిర్ణయం వల్ల శివారు ప్రాంతాల్లో వృథాగా ఉన్న సుమారు మూడు వేల ఎకరాల స్థలాలు వివిధ అభివృద్ధి పనులకు వినియోగించేందుకు మార్గం సుగమమైందన్నారు. నగరంలో సొంత గూడు లేక అద్దె ఇంట్లో ఉంటున్న వేలాది పేదలకు గిట్టుబాటయ్యే ధరలకు ఈ స్థలంలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు వీలుకానుంది. ముంబై చుట్టూ ఉన్న సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న స్థలాల్లో రైతులు ఉప్పు తయారుచేసేవారు. ప్రస్తుతం ఇక్కడ ఉప్పు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయి కొన్ని ఎకరాల స్థలాలు వృథాగా ఉన్నాయి. ఈ స్థలాల్లో గృహ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే బాగుంటుందనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఇందుకోసం మూడు వేల ఎకరాల స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం పేరుపై బదిలీ చేయడానికి ఆమోదం లభించింది. అయితే శివారు ప్రాంతాల్లో ఉన్న వేలాది ఎకరాల స్థలాలపై గత కొంత కాలంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. అందులో మూడు వేల ఎకరాల స్థలాలపై నివాస సముదాయాలు నిర్మించేందుకు మార్గం సుగమమైంది. నగరానికి ఆనుకుని ఉన్న 10 శివారు ప్రాంతాల్లో 59 చోట్ల స్థలాలున్నాయి. వీటిని అభివృద్ధి పనుల కోసం ఖాళీ చేస్తే అనేక ఎకరాల స్థలాలు అందుబాటులోకి వస్తాయి. ఇదే తరహాలో మూతపడిన మిల్లు స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుని మాడా ద్వారా ట్రాన్సిట్ క్యాంపులు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ మూడు వేల ఎకరాల స్థలాల్లో 1,672 ఎకరాల స్థలం మాత్రమే ఇళ్లు నిర్మించేందుకు అనుకూలంగా ఉందనే విషయం ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. మిగతా భూములు నివాసాలకు పనికిరావని తేలింది. అయితే ఆ స్థలాలను రాళ్లు, మట్టితో నింపితే కొంత ఉపయోగపడవచ్చని స్పష్టం చేసింది. మొత్తం స్థలాల్లో 31 శాతం నివాసాలకు, మిగతా వాణిజ్య, పరిశ్రమలు, ఇతర సంస్థలకు వినియోగించుకోవచ్చని తెలిపింది. -
వెనకడుగేస్తే కాంగ్రెస్‌కే దెబ్బ
ముంబై : అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ‘ఆప్’ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ ప్రజలు క్షమించరని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తమ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. తాము కాంగ్రెస్ మద్దతు తీసుకోలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో వారే తమకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. మద్దతుకు వారి విధించే ఎటువంటి షరతులకూ తాము ఒప్పుకునేదిలేదని ముందే చెప్పామన్నారు. ఆప్ సర్కారుకు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటే.. పరిస్థితి ఏంటని విలేకరులు అడిగిన ప్రశ్నకు అయన సమాధానమిస్తూ.. ఒకవేళ కాంగ్రెస్ అలాంటి నిర్ణయం తీసుకుంటే ఢిల్లీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఏమాత్రం క్షమించబోరని ఆయన తేల్చి చెప్పారు. తాము అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. జనలోక్‌పాల్, అవినీతిరహిత భారతదేశం లక్ష్యంగా తాము రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు. అయితే జాతీయ పార్టీలు తమను తక్కువ అంచనా వేశాయని, ఢిల్లీ ఎన్నికల్లో తమ ప్రభావం ఉండబోదనే ఆలోచనతో ముందుకు వెళ్లి బోర్లాపడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు.‘ మనం వారిని ఐదేళ్లపాటు పాలించండని ఓటేసి గెలిపించాం. అయితే వారు సామాన్య ప్రజలకు ఎటువంటి ఉపయోగంలేని చట్టాలను తీసుకువచ్చి, బడా పారిశ్రామికవేత్తల కొమ్ముకాశారు..’ అని ఆయన గత పార్టీల పనితీరును దుయ్యబట్టారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అధికార , న్యాయవ్యవస్థల పని విధానం సామాన్య ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేలా లేవని ఆయన విశ్లేషించారు. పోలీస్, ఉద్యోగస్వామ్యం, న్యాయవ్యవస్థల్లో మార్పులు తేవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీల అహాన్ని దెబ్బతీశాయని ఆయన వివరించారు. బీజేపీ బహిరంగ మతతత్వ పార్టీ అయితే, కాంగ్రెస్ ప్రఛన్న మతతత్వ పార్టీ అని ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఢిల్లీ ఎన్నికలు సామాన్య మానవుడిలో ఉన్న భ్రమలను తొలగించాయని ఆయన చెప్పారు. ఆప్‌ను రాజకీయ పార్టీగా కాకుండా వ్యవస్థ మార్పు నకు ఒక సూచికగా పేర్కొనవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ దేశం మొత్తం పోటీచేయనున్నట్లు ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ పార్టీకి మంచి అభ్యర్థులు దొరుకుతారో, ఎక్కడ తమకు పట్టు ఉంటుందో ఆయా స్థానాల్లో పోటీకి సిద్ధపడుతున్నామన్నారు. ప్రస్తుతం పార్టీకి దేశవ్యాప్తంగా 310 జిల్లాల్లో శాఖలున్నాయని చెప్పారు. తమ పార్టీ పాలనా తీరుకు, గత పార్టీల పాలనా విధానం మధ్య వ్యత్యాసాన్ని ఢిల్లీ ప్రజలు ఇప్పటికే గమనించారని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడూ పారదర్శకంగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది తమ పార్టీ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునేదీ లేనిదీ ఇప్పటివరకు నిర్ణయించుకోలేదన్నారు. అయితే చాలావరకు లోకల్ పార్టీలు సైతం అవినీతిమయమై ఉన్నాయన్నారు. తమ పార్టీ కేజ్రీవాల్ నాయకత్వంలోనే లోక్‌సభ ఎన్నికలకు వెళుతుందని, అయితే తాము ఏ ఒక్కరి చరిష్మానో నమ్ముకుని పనిచేయడంలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మధ్య పోలికే లేదన్నారు. మోడీ కేపటలిస్టులకే ఎక్కువ సన్నిహితుడని ఆయన విశ్లేషించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మూడు ప్రైవేట్ విద్యుత్ కంపెనీలపై కాగ్ ఆడిటింగ్‌కు ఆదేశించిందన్నారు. గత ప్రభుత్వాలు ఆ కంపెనీలపై కనీస చర్యలకు కూడా సాహసించలేదని ఆయన గుర్తుచేశారు. రుణాలు తీసుకుని ఎగవేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆప్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాగా, మహారాష్ట్రలో తమ పార్టీ మనుగడకు అన్నాహజారే, మేధా పాట్కర్ వంటి ప్రముఖ సామాజిక కార్యకర్తల మద్దతు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆప్ నాయకుడు మయాంక్ గాంధీ తెలిపారు. ‘మేం అన్నా హజారేను గౌరవిస్తాం.. ఎందుకంటే ఆయన మార్గదర్శక సూత్రాలపైనే మా పార్టీ ఏర్పాటైంది..’ అని మయాంక్ వివరించారు. -
ముంబైపై ముష్కరుల దాడికి ఐదేళ్లు చెదిరిన జ్ఞాపకాలు
ముంబై: పాకిస్థాన్‌కు చెందిన పదిమంది ఉగ్రవాదులు నగరంపై విరుచుకుపడి అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఘటన చోటుచేసుకుని మరో రెండు రోజుల్లో ఐదేళ్లు కానుంది. ఈ దాడులు దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. అయితే ఆనాటి ఈ పీడకల నగరవాసుల జ్ఞాపకాలనుంచి దాదాపు చెదిరిపోయింది. ఏడాదికొకసారి మృతుల స్మారకార్థం కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, వాటిని ప్రసా ర మాధ్యమాలు ప్రజలకు చేరవేయడం జరుగుతోందే తప్ప నగరవాసులు మాత్రం తమ తమ దైనందిన కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమైపోయారు. ఆనాటి దాడి ఘట నలో మొత్తం 166 మంది చనిపోగా. మరో 300 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 26 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. అయితే ఈ నెల 26వ తేదీ (దాడి జరిగిన రోజు) సమీపిస్తుండడంతో ఆనాటి పీడకల మరికొందరి మదిలో మిణుకుమిణుకుమంది. ఈ విషయమై విలేపార్లే ప్రాంతంలో నివసించే సాఫ్ట్వేర్ కన ్సల్టెంట్ దుకుల్ పాండ్యా మాట్లాడుతూ ఆనాటి ఘటన అత్యంత విచారకరమన్నారు. అసలు ఆవిధంగా జరిగి ఉండాల్సింది కాదన్నారు. ఏదిఏమైనప్పటికీ నగరవాసులంతా గతం మరిచిపోయి భవిష్యత్తుపై దృష్టి సారించి ముందుకు సాగాలని ఆ రాత్రంతా మెలకువతో ఉండి టీవీలో వస్తున్న దృశ్యాలను తిలకిస్తూ కాలం గడిపిన పాండ్యా పేర్కొన్నాడు. ఇదే విషయమై బోరివలికి చెందిన కె.ఎస్.మీనాక్షి మాట్లాడుతూ అదొక జాతీయ విషాదమన్నారు. దీని సంగతి అలాఉంచితే ద్రవ్యోల్బణం ప్రభావంతో ధరల పెరుగుతుండడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున ్న సమస్యలతోపాటు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు నగరవాసులు అన్నివిధాలుగా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. 26/11 వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఐదు సంవత్సరాల క్రితం పాకిస్థాన్‌కు చెందిన పది మంది సాయుధ ఉగ్రవాదులు అరేబియా సముద్రమార్గం మీదుగా నగరంలోకి చొరబడ్డారు. అంతకుముందు పాకిస్థాన్ సముద్ర తీరాన్ని దాటివచ్చిన వీరంతా నవంబర్ 26వ తేదీ సాయంత్రం ప్రశాంతంగా దేశరాజధానిలోకి అమాయకుల మాదిరిగా అడుగుపెట్టారు. కొలాబా తీరాన దిగిన వీరంతా ఒక క్రమపద్ధతితో రెండు మూడు బృందాలుగా విడిపోయి తమ తమ లక్ష్యాల దిశగా అడుగులు వేశారు. వీరిలో అబ్దుల్ రెహమాన్, అబూ అలీ, అబూ సోహెబ్‌లు కొలాబాలోని లియోపోల్డ్ కేఫ్ వైపు వెళ్లారు. ఆ తర్వాత తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ దిశగా ముందుకు సాగారు. అబ్దుల్ రెహమాన్ చోటా, ఫహదుల్లాలు ట్రైడెంట్ ఒబెరాయ్ వైపు, నాసిర్ అబూ ఉమర్, బాబర్ ఇమ్రాన్ అలియాస్ అబూ ఆకాశలు నారిమాన్ హౌస్ వైపు, ఇస్మాయిల్ ఖాన్, అబూ ఇస్మాయిల్, అజ్మల్ ఆమిర్ కసబ్‌లు తొలుత నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ టెర్మినస్వైపు, ఆ తర్వాత కామా ఆస్పత్రి దిశగా ముందుకుసాగారు. వీరు ఎంచుకున్న లక్ష్యాలన్నీ అత్యంత ఇరుకైన దక్షిణ ముంబైలో కేవలం ఐదుకిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. అక్కడ బ్యూరోక్రాట్లు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు నివసిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికార నివాసాలు, మంత్రుల నివాసాలు కూడా అక్కడే ఉన్నాయి. ఉగ్రవాదులు నగరంలో విధ్వంసకాండకు దిగినట్టు సమాచారం అందిన తర్వాత రంగంలోకి దిగిన నగర పోలీసులు, సైనిక బలగాలు, నౌకాదళ కమాండోలు, ఇతర పారామిలిటరీ బల గాలు 50 గంటల సుదీర్ఘ పోరాటం జరిపి 22 ఏళ్ల కసబ్ మినహా మిగతా వారందరినీ హతమార్చాయి. ఇక నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున గిర్గావ్ చౌపాటీ వద్ద పోలీసులు అజ్మల్ ఆమిర్ కసబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్, హోటల్ ట్రైడెంట్, నారిమాన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్, కామా ఆస్పత్రి, వాడిబందర్ తదితర ప్రాంతాల్లో సంచరించిన ఈ ఉగ్రవాద బృందం నర మేధానికి పాల్పడింది. అమాయకుల ప్రాణాలను బలిగొంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే విలేపార్లే ప్రాంతంలో తాము ఎక్కిన కారును బాంబులతో పేల్చివేసింది. సజీవంగా దొరికిపోయిన క సబ్‌ను పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారించారు. ఈ విచారణలో దాడులకు ప్రత్యక్ష, పరోక్ష కారకులైన 35 మంది పేర్లను కసబ్ పోలీసులకు వెల్లడించాడు. ఈ కేసుపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం తన వాదనలను సమర్థంగా వినిపించారు. దీంతో కసబ్‌కు ఉరిశిక్ష విధిస్తూ దిగువకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును కసబ్ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ సవాలుచేశాడు. రెండుచోట్లా చుక్కెదురైంది. తనకు క్షమాబిక్ష పెట్టాలంటూ కసబ్ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. దానిని కూడా రాష్ర్టపతి తిరస్కరించడంతో పుణేలోని ఎరవాడ కేంద్ర కారాగారంలో గత ఏడాది నవంబర్ 21వ తేదీన కసబ్‌ను ఉరితీసిన సంగతి విదితమే.