
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ హాట్ జోడీ దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు డేటింగ్‌లో ఉన్నారని, వీరి మధ్య సంబంధాలు ఇటీవల బెడిసికొట్టాయని వచ్చిన వార్తలకు ఈ జంట బ్రేక్ వేసింది. వీరిద్దరు కలిసి ఇటీవల ముంబైలోని ఓ రికార్డింగ్ స్టూడియోలోకి చేరుకుంటూ తమపై వచ్చిన వదంతులను కొట్టిపారేశారు. అప్పటినుంచి పలు సందర్భాల్లో వీరు సన్నిహితంగా ఉంటూ కెమెరాల కంట పడ్డారు. తాజాగా దిషా, టైగర్‌లు బాంద్రాలో సెలబ్రిటీలు తరచూ సందర్శించే ప్రముఖ రెస్టారెంట్ బాస్టిన్‌లో బ్రంచ్ చేశారు. అయితే ఇప్పటివరకూ తమ మధ్య ఉన్న సంబంధం గురించి వీరు నోరుమెదపకపోవడం గమనార్హం.
ఇక వృత్తిపరంగా దిశా పటానీ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న భారత్‌లో మెరవనున్నారు. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో రూపొందుతూ కత్రినా కైఫ్, టబు, సునీల్ గ్రోవర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ 2019 ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు టైగర్ ష్రాఫ్ కరణ్ జోహార్ నిర్మించే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో నటిస్తున్నారు. అనన్య పాండే తెరంగేట్రం చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మేలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment