Disha Patani New Boyfriend Alexander Alex - Sakshi
Sakshi News home page

Disha Patani: ప్రియుడ్ని కన్ఫర్మ్ చేసేసింది.. మరి టైగర్ పరిస్థితి?

Aug 6 2023 2:13 PM | Updated on Aug 6 2023 2:54 PM

Disha Patani New Boyfriend Alexnder Alexi - Sakshi

స్టార్ హీరోయిన్ దిశా పటానీ తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఎందుకంటే తనతో పాటు కలిసి నటించిన ఓ హీరోతో ఈమె గత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నట్లు తెగ రూమర్స్ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు మరో వ్యక్తితో కలిసి పార్టీలో కనిపించడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరతడు?

ముంబయి బ్యూటీ దిశా పటానీ.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ మరో తెలుగు మూవీ చేయలేదు. బాలీవుడ్ కి చెక్కేసింది. యంగ్, స్టార్ హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే భాఘీ 2, భాఘీ 3 సినిమాల్లో తనతో పాటు కలిసి నటించిన టైగర్ ష్రాఫ్‌తో ఈమె చాలాకాలం నుంచి రిలేషన్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. 

(ఇదీ చదవండి: నటి పవిత్ర లోకేష్‌కు బిగ్‌ షాక్‌...)

ఎందుకంటే 2018లో 'భాఘీ 2' వచ్చింది. దీని తర్వాత దిశా-టైగర్ కలిసి ఒక్క సినిమా మాత్రమే చేశారు. కానీ పార్టీలు-పబ్బులు-ఈవెంట్స్ అని ఎక్కడి పడితే అక్కడ కనిపించేవారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ చూస్తే ఎవరికైనా సరే డేటింగ్ చేస్తున్నారా అనిపించేది. అలాంటిది వీళ్లకు బ్రేకప్ అయిందని గతేడాది రూమర్స్ వస్తున్నాయి. ఆ తర్వాత పలు సందర్భాల్లో టైగర్.. దిశా తనకు ఫ్రెండ్ లాంటిదని చెప్పుకొచ‍్చాడు. 

అయితే దిశా-టైగర్ ష్రాఫ్ విడిపోలేదని ఫ‍్యాన్స్ అనుకుంటున్నారు. అలాంటిది దిశా ఇప్పుడు అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో ఓ పార్టీలో కనిపించింది. అతడిని తన ఫ్రెండ్స్‌కి పరిచయం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఆమె.. కొత్త బాయ్ ఫ్రెండ్ అని కన్ఫర్మ్ చేసేసిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి టైగర్ పరిస్థితి ఏంటి? అని మాట్లాడుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. దిశా కొత్త బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ ఎవరో కాదు టైగర్ ఫిట్‌నెస్ కోచ్. 

(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. ఫోటో వైరల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement