
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ లవ్‌లో ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతూనే ఉన్నారీ లవ్ బర్డ్స్. అయితే ఉన్నట్లుండి ఏమైందో ఏమో కానీ వీరు విడిపోయారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. వాళ్ల మధ్య ఏవో పొరపచ్చాలు వచ్చాయని, ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకుని బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఓ వార్త బీటౌన్‌లో వైరల్‌గా మారింది.
ఇక దిశా పటానీ టైగర్ సోదరి క్రిష్ణ ష్రాఫ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా! తరచూ వాళ్లింటికి కూడా వెళ్తూ అతడి కుటుంబంతోనూ చక్కగా కలిసిపోయేది. ఏదేమైనా చూడచక్కగా ఉండే ఈ జంట విడిపోవడం బాధాకరమే అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించని వీరు సోషల్ మీడియాలో మాత్రం ఒకరినొకరు ఫాలో అవుతూ వారి పోస్ట్‌లకు కామెంట్ చేశారు. కాగా ప్రస్తుతం ఇద్దరూ వారి వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా, గణపత్: పార్ట్ 1, బడేమియా చోటేమియా సినిమలతో బిజీ ఉన్నాడు. దిశా పటానీ.. ఏక్ విలన్ రిటర్న్స్, ప్రాజెక్ట్ కె, యోధ, కెటినా సినిమాలు చేస్తోంది.
చదవండి: అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్
ఫ్యాన్స్‌కి షాక్.. ఏడాదికే బ్రేకప్ చెప్పుకున్న ‘బిగ్‌బాస్’ జోడీ
Comments
Please login to add a commentAdd a comment