BREAK-UP
-
Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..!
ఫిబ్రవరి అంటే ప్రేమికుల నెలమాత్రమే కాదు. మరొకటి కూడా ఉంది. ఫిబ్రవరి 14 వరకు వారంరోజుల పాటు వాలెంటైన్స్ వీక్ సందడి ఉంటుంది. అంతా ప్రేమికులకు, ఓకే చెప్పడానికి అయితే.. తిరస్కరించడానికీ, భగ్న ప్రేమికులకీ ఉండాలిగా అన్నట్టు యాంటీ వాలెంటైన్స్ వీక్ సందడి కూడా షురూ అవుతుంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి! రోజ్ డే, ప్రపోజల్ డే, లవ్ డే, కిస్ డే, హగ్ డే, టెడ్డీ డే అంటూ ప్రేమ పక్షులు సందడి చేస్తే ..ఫిబ్రవరి 15నుంచి యాంటీ వాలెంటైన్స్ వీక్ భగ్నప్రేమికులకు, ప్రేమను తిరస్కరించే కిక్కు అన్నట్టు..ఫిబ్రవరి 15న చెంపదెబ్బతో మొదలై, ఫిబ్రవరి 21న బ్రేకప్‌తో తృప్తి పడతారు వాలెంటైన్స్ వీక్ అంతా. యాంటీ వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 15, స్లాప్ డే: గుండె పగిలిన వారందరూ తమ బాధలన్నింటికీ కారణమైన తమ మాజీలను చెంపదెబ్బ కొట్టడానికి ఈ రోజు అనుమతిస్తుంది. ఒక విధంగా ఇది ఇబ్బంది పెట్టే చెడు ఆలోచనలు, జ్ఞాపకాలను దూరం చేసే రోజు. ఫిబ్రవరి 16,కిక్ డే: ప్రేమలో మోసం చేసిన వారి జ్ఞాపకాలన్నింటినీ వదిలించుకోవడం, జీవితంలో నింపిన విషాదాన్ని, కోపాన్ని వదిలేయడం. అంతేకాదు వాళ్లిచ్చిన గిఫ్ట్స్‌లు, ఇతర గుర్తులను పూర్తిగా వదిలివేయడం. ఫిబ్రవరి 17, పెర్ఫ్యూమ్ డే: పదే పదే వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, మంచి పరిమళంతో కొత్త ఆహ్లాదాన్ని నింపుకోవడం ఫిబ్రవరి 18, ఫ్లర్ట్ డే: ఈ రోజున కొత్త వ్యక్తిని కలుసుకుని వారితో సరదాగా గడపడం ఫిబ్రవరి 19, కన్ఫెషన్ డే: తప్పులను ఒప్పుకోవడం, ఎదుటివారిని క్షమించమని అడగడం ఫిబ్రవరి 20, మిస్సింగ్ డే : ఎవరైనా తమ వాలెంటైన్‌ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటే వాళ్లకి మెమొరీస్‌ని గుర్తు చేయడం ఫిబ్రవరి 21, బ్రేకప్ డే:ఇది కీలకమైందీ.. చివరి రోజు కూడా అవతలి వారి ప్రేమ నిజమైంది కాదనిపిస్తే..నిస్సందేహంగా వదిలివేయడం హ్యాపీగా ఉండటం. ప్రేమ అందమైందే ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం చాలా చాలా అందంగా కనిపిస్తుంది. కానీ తేడా వస్తే విడిపోతే భరించడం కష్టమే. నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది.. కానీ జీవితం అక్కడితో ఆగిపోకూడదు. మనలాంటివాళ్లని దక్కించుకోలేని దురదృష్టవంతులు అనుకొని వదిలేయాలి. నిజానికి గమనిస్తే.. నిస్వార్థంగా మనల్ని మనంగా ప్రేమించే వాళ్లు చాలామంది ఉంటారు. దాన్ని మనం గుర్తించగలగాలి అంతే. -
ఆకాశానికి నిచ్చెనలు వద్దు..ఎత్తయిన భవన నిర్మాణాలకు బ్రేక్
ఆకాశహర్మ్యాలకు పారిస్ పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్ దగ్గర్నుంచి ఎన్నో భవంతులు నింగికి నిచ్చెన వేసినట్టుగా ఆకర్షిస్తూ ఉంటాయి. పారిస్ ఇప్పుడు వాటి నిర్మాణానికి బ్రేక్ వేసింది. మొట్టమొదటి ఆకాశాన్నంటే భవనాన్ని నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పారిస్ సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటే భవన నిర్మాణాలు ఇంకా కొన సాగితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై సాధారణ భవనాలదే భవిష్యత్ అన్నది పర్యావరణ వేత్తల మాట. ప్రపంచ పర్యాటక స్వర్గధామం పారిస్. ఫ్యాషన్లకు పుట్టినిల్లయిన ఈ సుందర నగరాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది కోట్లాదిమంది విదేశీయులు తరలివస్తుంటారు. ఈఫిల్ టవర్, మోపానాసే టవర్, లౌవ్రే పిరమిడ్ వంటి ఆకాశహర్మ్యాలను సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటారు. అంతస్తుల మీద అంతస్తులు నింగికి నిచ్చెనలా వేసుకుంటూ నిర్మించిన భవనాల అందాలు వర్ణించ వీల్లేదు. 330 మీటర్ల ఎత్తైన ఈఫిల్ టవర్ , 210 మీటర్ల ఎత్తయిన మోపానాస్ టవర్ (689 అడుగులు) పారిస్‌కున్న సిటీ ఆఫ్ లైట్స్‌కి ప్రత్యామ్నాయంగా నిలిచాయి. పారిస్‌లో ఎత్తైన భవన నిర్మాణాలు మనకి ఇక కనిపించవు. వాటి నిర్మాణంపై పారిస్ నగర కౌన్సిల్ నిషేధం విధించింది. స్థానికంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కొత్తగా నిర్మించే భవనాలేవైనా 12 అంతస్తులు లేదంటే 37 మీటర్లకు మించకూడదని ఆంక్షలు విధించింది. ఇటీవల కాలంలో అంతటి అందాల నగరం మురికి కూపంలా మారిపోయింది. పారిస్‌కు తిరిగి పూర్వ వైభవం కల్పించాలంటే కాలుష్య కారకమైన ఆకాశహర్మ్యాల నిర్మాణాన్ని నిలిపివేశారు. 18వ శతాబ్దంలో పారిస్ అంటే చిన్న చిన్న ఇళ్లతో చూడముచ్చటగా ఉండేది. ఆ దేశ మొట్ట మొదటి అధ్యక్షుడు నెపోలియన్ –3 రాజధానిపై ఎన్నో కలలు కన్నారు. ఆధునిక, చైతన్యవంతమైన నగరంగా పారిస్‌ను రూపొందించడానికి ప్రత్యేకంగా కొందరు ఇంజనీర్లను నియమించారు. చిన్న చిన్న భవనాలు, ఉద్యాన వనాలు అండర్ డ్రైనేజీ వంటి వ్యవస్థలతో పారిస్ అత్యంత పరిశుభ్రంగా పచ్చదనంతో అలరారేలా మారింది. ఆరు అంతస్తుల రాతి నిర్మాణాలు చూడడానికి అందంగా , నివాస యోగ్యంగా ఉండేవి. ఈఫిల్ టవర్ మినహాయించి మరో ఎత్తైన భవనం లేదనే చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధంలో నగరం చాలా వరకు ధ్వంసం కావడంతో ఆ శిథిలాల నుంచి ఇప్పుడు మనందరం చూస్తున్న సరికొత్త పారిస్ నగరం పుట్టింది. అప్పటికే ఆకాశాన్నంటే భవంతులతో అందరినీ ఆకట్టుకుంటున్న న్యూయార్క్, లండన్ వంటి నగరాల బాటలో పారిస్ నడిచింది. 40 అంతస్తులు, 50 అంతస్తులు, 59 అంతస్తులు ఇలా కట్టుకుంటూ వెళ్లిపోయింది. 1973లో తొలిసారిగా అత్యంత ఎత్తైన మోపానాస్ టవర్ నిర్మాణం జరిగింది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెతలా మళ్లీ ఆ నాటి నిర్మాణాల వైపు చూస్తోంది. ప్రజలకి తగ్గిన మోజు రానురాను ప్రజలకీ ఈ హంగు ఆర్భాటాల్లాంటి భవనాలపై మోజు తగ్గింది. మళ్లీ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నాటి పారిస్‌గా మారిపోవాలని వారు కోరుకుంటున్నారు. పైగా అన్నేసి అంతస్తులున్న భవనాల్లో నివాసం మా వల్ల కాదంటూ ఒక దండం పెట్టేస్తున్నారు. ఒకప్పుడు 50 అంతస్తుల భవనం నిర్మిస్తే పై అంతస్తులో నివాసం కోసం ప్రజలు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు వాటికి డిమాండ్ బాగా తగ్గిపోయింది. దీనికి పలు కారణాలున్నాయి. పై అంతస్తుల్లో ఉండే వారిలో ఒంటరితనం వెంటాడుతోంది. సమూహం నుంచి దూరంగా ఉన్న భావన పెరిగిపోయి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అంత ఎత్తు నుంచి కిందకి రావడమే ఒక ప్రసహనంగా మారుతోంది. దీంతో నాలుగ్గోడల మధ్య అధికంగా కాలక్షేపం చేయడంతో శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రజలు కూడా ఎత్తైన భవనాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పర్యావరణానికీ దెబ్బే అతి పెద్ద అంతస్తులు పర్యావరణానికి కూడా హానికరంగా మారుతున్నాయి. ఇంధనం వినియోగం విపరీతంగా ఉంటుంది. సాధారణ భవనంలో ప్రతీ చదరపు మీటర్‌కి ఖర్చు అయ్యే ఇంధనానికి ఆకాశహర్మ్యాలలో రెట్టింపు ఖర్చు అవుతుంది. కాలుష్యం 145% అధికంగా విడుదల అవుతుంది. పై అంతస్తులకి నీళ్లు పంప్ చెయ్యడానికి అధికంగా విద్యుత్ వినియోగించాలి. భవనాల నిర్వహణ ఖర్చు కూడా తడిసిమోపెడవుతోంది. ఈ భవన నిర్మాణాలతో ఇంధనం 48% , కర్బన ఉద్గారాలు విడుదల 45% , వ్యర్థాలు 25% వస్తూ ఉంటే నీటి వినియోగం 15% ఉంటోంది. భావితరాలు వినియోగించాల్సిన సహజ వనరుల్ని ఇప్పుడే మనం ఖర్చు చేసేయడంపై పర్యావరణవేత్తల్లో ఆందోళన కూడా నెలకొంది.అందుకే ఇక భవిష్యత్ అంతా సాధారణ భవనాలదేనని పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. చైనా కూడా పారిస్ బాటలోనే నడుస్తూ ఎత్తయిన భవన నిర్మాణాలను నిలిపివేసింది. గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరుగుతూ ఉంటే ఇతర దేశాల్లో అతి పెద్ద నగరాలు కూడా పారిస్ బాటలో నడవక తప్పదు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరేళ్ల లవ్వాయణానికి బ్రేక్, స్టార్ జంట బ్రేకప్!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ లవ్‌లో ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతూనే ఉన్నారీ లవ్ బర్డ్స్. అయితే ఉన్నట్లుండి ఏమైందో ఏమో కానీ వీరు విడిపోయారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. వాళ్ల మధ్య ఏవో పొరపచ్చాలు వచ్చాయని, ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకుని బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఓ వార్త బీటౌన్‌లో వైరల్‌గా మారింది. ఇక దిశా పటానీ టైగర్ సోదరి క్రిష్ణ ష్రాఫ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా! తరచూ వాళ్లింటికి కూడా వెళ్తూ అతడి కుటుంబంతోనూ చక్కగా కలిసిపోయేది. ఏదేమైనా చూడచక్కగా ఉండే ఈ జంట విడిపోవడం బాధాకరమే అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించని వీరు సోషల్ మీడియాలో మాత్రం ఒకరినొకరు ఫాలో అవుతూ వారి పోస్ట్‌లకు కామెంట్ చేశారు. కాగా ప్రస్తుతం ఇద్దరూ వారి వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా, గణపత్: పార్ట్ 1, బడేమియా చోటేమియా సినిమలతో బిజీ ఉన్నాడు. దిశా పటానీ.. ఏక్ విలన్ రిటర్న్స్, ప్రాజెక్ట్ కె, యోధ, కెటినా సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) చదవండి: అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యాన్స్‌కి షాక్.. ఏడాదికే బ్రేకప్ చెప్పుకున్న ‘బిగ్‌బాస్’ జోడీ -
మా బంధం ముగిసింది: బ్రేకప్‌పై సుష్మితా సేన్ క్లారిటీ
మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్, ప్రముఖ మోడల్, నటుడు రోహ్మాన్ షాల్ తమ ప్రేమాయణానికి ముగింపు పలికినట్లు ఫిల్మీదునియాలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ విడిపోయిన నేపథ్యంలో రోహ్మన్ నేడు(డిసెంబర్ 23) సుష్మిత ఇంటి నుంచి బయటకు వచ్చేసి తన స్నేహితుడి ఇంట్లో ఉంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది సుష్మిత. 'ఫ్రెండ్స్‌గా మొదలైన మా ప్రయాణంలో ఫ్రెండ్స్‌గానే మిగిలిపోతున్నాము. చాలాకాలం క్రితమే రిలేషన్షిప్ ముగిసింది కానీ ప్రేమ మిగిలింది. ఐ లవ్ యూ గయ్స్' అని రాసుకొచ్చింది. దీనికి రోహ్మాన్తో దిగిన ఫొటోను జత చేసింది. ఇక ఈ పోస్ట్‌పై రోహ్మన్ రియాక్ట్ అవుతూ 'ఎల్లప్పుడూ అలాగే ఉందాం' అని కామెంట్ చేశాడు. కాగా సుష్మిత తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మన్తో మూడేళ్లుగా డేటింగ్ చేస్తోంది. వీరిద్దరి జంటను చూసి ముచ్చటపడిన అభిమానులు బ్రేకప్ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
స్నేహితుల బ్రేకప్ పార్టీ..వైరల్!
-
బ్రేకప్: దోస్తుకు కిర్రాక్ పార్టీ!
స్నేహితులు అంటే అంతే.. బాధయినా ఆనందమైనా కలిసి పంచుకుంటారు. విజయాలు సాధించినప్పుడు భుజాలపై మోస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నంటి నడుస్తారు. అలాంటి వారే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్.. బ్రేకప్ చేసుకొని బాధలో ఉన్న స్నేహితుడిని ఎలా ఒంటరిగా వదిలేస్తారు. అందుకే బ్రేకప్ చేసుకున్నా... ఇదిగో ఈ విధంగా గ్రాండ్‌గా పార్టీ చేశారు పాకిస్థాన్ కుర్రాళ్లు. ఇస్లామాబాద్ కాలేజీకి చెందిన ఓ కుర్రాడు ఇటీవల బ్రేకప్ చేసుకున్నాడు. ఆ విషయం తెలియడంతో బాధలో తమ స్నేహితుడిలో జోష్ నింపేందుకు తోటి విద్యార్థులు బ్రేకప్ పార్టీ ఇచ్చారు. బ్రేకప్ అయిన మిత్రుడికి పూలదండతో స్వాగతం చెప్పి.. అతడితో రుచికరమైన చాక్లెట్ కేక్‌ను కట్ చేయించి.. అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. మిత్రుడికి ‘ఆజాదీ’ (స్వాతంత్ర్యం) వచ్చిందంటూ.. అతడి ప్రియురాలు పారిపోయిందంటూ నినాదాలు చేస్తూ.. హంగామా చేశారు. ఇస్లామాబాద్‌లోని కమ్శాట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఐఐటీ)లో ఈ ఘటన చోటుచేసుకుంది. చూడటానికి సరదాగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
ఆ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది.. ట్వీట్ల దుమారం!
సంజయ్‌లీలా భన్సాలీ తాజా దృశ్యకావ్యం 'పద్మావతి' సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రేమజంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ మధ్య ఏదో విభేదాలు పొడసూపాయన్న వార్తలు బాలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం.. బాలీవుడ్ లవ్‌బర్డ్స్‌గా ముద్రపడిన రణ్వీర్-దీపిక మధ్య అంత సవ్యంగా లేదట. తన లవ్లేడీ దీపిక తీరుతో రణ్వీర్ తీవ్రంగా నోచ్చుకున్నాడని తెలుస్తోంది. 2013లో ఈ జంట భన్సాలీ 'గోలియోంకీ రాస్లీలా రామ్‌లీలా' సినిమాతో అలరించారు. అప్పటినుంచి వీరు డేటింగ్ చేస్తున్నట్టు కథనాలు గుప్పుమన్నాయి. తాము ప్రేమలో ఉన్నామని ఈ జంట ఏనాడూ మీడియాముఖంగా చెప్పిందీ లేదు. కానీ, జంటగా కనిపిస్తూ.. సినీ వేడుకలకు హాజరవుతూ.. సన్నిహితంగా పార్టీలకు వెళుతూ.. తమ ప్రేమను అనేకసార్లు వీరు చాటుకున్నారు. వీరి మధ్య ఉన్న ఈ కెమిస్ట్రీయే భన్సాలీ తీసిన 'బాజీరావు మస్తానీ' సినిమాలోనూ వ్యక్తమైంది. ప్రేమలో మునిగిపోతున్నట్టు భావిస్తున్న ఈ జంట మధ్య తాజాగా విభేదాలు రావడానికి కారణం.. 'పద్మావతి' త్రీడీ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక. రెండురోజుల కిందట జరిగిన ఈ వేడుకకు దీపిక కళ్లుచెదిరేరీతిలో జిగేల్ మనేలా హాజరైంది. ఆమె హాజరు ఈ వేడుకకు వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. కారణం ఈ వేడుక అతిథుల జాబితాలో ఆమె పేరు లేకపోవడమే. అయినా అనూహ్యంగా ఆమె రావడం.. అదే సమయంలో ఈ చిత్రంలో ఇతర ప్రధాన నటులైన రణ్వీర్, షాహిద్ కపూర్ రాకపోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. 3డీ ట్రైలర్ లాంచ్ వేడుకకు దీపిక ఒంటరిగా హాజరుకావడం.. ఆమె సహ నటులు రణ్వీర్, షాహిద్‌లకు కోపం తెప్పించినట్టు తెలుస్తోంది. తాము తీరికతోనే ఉన్నా.. తమకు సమాచారం ఇవ్వకుండా దీపిక ఒంటరిగా వెళ్లడంతో వారికి పుండు మీద కారం చల్లినట్టు అయిందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా 'పద్మావతి' ట్రైలర్ విడుదలైన నాటినుంచి అల్లావుద్దీన్ ఖిల్జీగా నటించిన రణ్‌వీర్‌కు విశేషమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఇది కూడా దీపికలో అభద్రతాభావాన్ని నింపిందని, అందుకే ఆమె సహ నటులకు మాటమాత్రమైన చెప్పకుండా ఒంటరిగా 3డీలాంచ్ వేడుకకు వెళ్లి హల్చల్ చేసిందని ఆ వర్గాలు అంటున్నాయి. 'పద్మావతి'లో దీపిక టైటిల్ రోల్ పోషించినా.. రణ్వీర్, షాహిద్‌లకు వచ్చినంత పేరుప్రఖ్యాతలు, ప్రశంసలు దీపికకు రాలేదని అంటున్నారు. ఈ క్రమంలో బాయ్‌ఫ్రెండ్ అయిన తనకే టోకరా ఇచ్చి దీపిక ఒంటరిగా వెళ్లడం రణ్‌వీర్‌కు షాక్‌కు గురిచేసిందట. దీంతో కోపోద్రిక్తుడైన రణ్వీర్.. తన పర్సనల్ టీమ్‌ను తీసిపారేయడమేకాకుండా.. అప్పటినుంచి దీపికతో మాట్లాడటం లేదని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ వేడుక తర్వాత రణ్వీర్ పెట్టిన నిగూఢమైన ట్వీట్స్ సైతం ఇదే విషయాన్ని చాటుతుండటం గమనార్హం. మొదటి ట్వీట్లో పద్మావతి 3డీ ట్రైలర్ తనకు బాగా నచ్చిందని, 3డీలో తనను తాను చూసుకోవడం అద్భుతంగా ఉందని పేర్కొన్న రణ్వీర్.. అనంతరం తొలిసారి తనను ఒక తేనేటీగ కుట్టిందని, ఆ ఫొటో పెడితే.. ఆ తేనేటీగ ఫేమస్ అవుతుందని పెట్టడం లేదని ట్వీట్ చేశాడు. ఇక మిగిలిన తన జీవితంలో ఇదే తొలిరోజు అని, ఇప్పటివరకు జరిగినదానితో విసిగిపోయానని రణ్వీర్ పేర్కొన్నాడు. దీపికపై కోపంతోనే.. ఆమెను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఈ ట్వీట్లు చేశాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. Saw #Padmavati 3D trailer last night! Holy smokes! It was jaw-dropping! Also 1st time I'm seeing myself in 3D so..! Hahaa! Pretty badass 😂🤙🏾 — Ranveer Singh (@RanveerOfficial) October 31, 2017 Also stung by a Bee 4 the 1st time earlier today🐝thought Id post a picture but then I was like I dont wanna make that Bee famoussss haha😂🤙🏾 — Ranveer Singh (@RanveerOfficial) October 31, 2017 In other firsts, it's also the first day of the rest of my Life. Ok, now I'm done. — Ranveer Singh (@RanveerOfficial) October 31, 2017 -
ఔను.. బ్రేకప్ అయింది: యువ హీరో
సెలబ్రిటీల చుట్టూ గాసిప్‌లు కొత్త కాదు. నిత్యం ఏదో రకమైన వదంతి సినీ ప్రముఖుల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. బాలీవుడ్ యువజంట సిద్ధార్థ్ మల్హోత్రా- అలియా భట్ డేటింగ్ చేస్తున్నట్టు ఎన్నోసార్లు కథనాలు వచ్చాయి. ఈ ఇద్దరు ప్రేమలో మునిగితేలినట్టు ఆ మధ్య వినిపించింది. ఆ తర్వాత ఏమైందో ఏమిటో తెలియదు కానీ వీరి మధ్య దూరం పెరిగింది. ఇదే విషయాన్ని సిద్ధార్థ్ పరోక్షంగా ధ్రువీకరించాడు. ఆలియా భట్‌తో బ్రేకప్ అయిన విషయాన్ని చెప్పకనే చెప్పాడు. నేహా ధూఫియా చాట్‌షో 'నో ఫిల్టర్ నేహా' కార్యక్రమంలో మాట్లాడిన సిద్ధార్థ్.. 'నేను ఎప్పుడు ఒంటరిగానే ఉన్నా' అని స్పష్టం చేశాడు. ఆలియాతో రిలేషన్షిప్లో ఉన్న విషయాన్ని కూడా సిద్ధార్థ్ ఏ రోజు ధ్రువీకరించలేదు. కానీ సినీ పరిశ్రమలో మీకు బాగా నచ్చే వ్యక్తి ఎవరని నేహా అడిగితే.. వెంటనే ఆలియా పేరు చెప్పేశాడు. గతంలో ఈ యువ జంట చాలా సన్నిహితంగా పార్టీలు, వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. 'ఆలియా నా కళ్లలోకి చూస్తుంది. నేను తన కళ్లలోకి చూస్తాను. ఇద్దరం ప్రపంచాన్ని మరిచిపోతాం. తను నాకు ఎంతో సన్నిహితురాలు. ఇప్పుడు నా జీవితంలో తను ఎంతో ముఖ్యమైన వ్యక్తి' అని సిద్ధార్థ్ గతంలో మీడియాతో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
కొడుక్కి క్లాస్ పీకిన టాప్ హీరో!
ముంబై: అనిల్ కపూర్ తనయుడు, వర్ధమాన హీరో హర్షవర్థన్ కపూర్ తన ప్రేయసి సప్నా పాబీకి బ్రేకప్ చెప్పాడు. వీరిద్దరూ అనిల్ కపూర్ కారణంగా విడిపోయినట్టు బాలీవుడ్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. '24' సినిమాలో అనిల్ కపూర్ కూతురిగా నటించిన సప్నాతో హర్షవర్థన్ ప్రేమలో పడ్డారు. యువజంట ప్రేమలోకాల్లో విహరించింది. విషయం అనిల్ కపూర్ కు తెలియడంతో కొడుక్కి క్లాస్ తీసుకున్నాడట. కెరీర్ ఆరంభంలో ప్రేమాదోమా అంటూ తిరిగితే మంచిది కాదని సలహాయిచ్చాడట. నీతో పాటు ఆమె కెరీర్ కూడా పాడవుతుందని నచ్చచెప్పాడు. తండ్రి మాటలను తలకెక్కించుకున్న హర్షవర్థన్ ప్రియురాలికి బ్రేకప్ చెప్పాడు. తన తమ్ముడికి సోనమ్ కపూర్ కూడా బ్రెయిన్ వాష్ చేసిందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. 'మిర్జియా' సినిమాతో హర్షవర్థన్ హీరోగా బాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు 'రంగ్ దే బసంతి' ఫేమ్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది. -
వీరిద్దరి బ్రేకప్‌కు సల్మాన్ ఖాన్ కారణమ?
‘‘ఇంట్లో వాళ్లు కూడా ఒప్పేసుకు న్నారు... ఇక పెళ్లిపీటలు ఎక్కడమే ఆలస్యం. ఈ ఏడాది దంపతులైపోతారు’’... ఇవి బాలీవుడ్ ప్రేమజంట రణబీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల గురించి ప్రతిరోజూ వస్తున్న అప్డేట్స్. రణబీర్-కత్రినా కైఫ్‌లు తమ బంధానికి గుడ్‌బై చెప్పుకున్నారన్నది తాజా ఖబర్. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కత్రినా కైఫ్ వీరిద్దరూ ఉంటున్న ఫ్లాట్ నుంచి తన లగేజ్ మొత్తం సర్దుకుని వెళ్లిపోయారట. ‘‘రణబీర్ ఎప్పుడూ తన నిర్ణయాల మీద నిలబడిన దాఖలాలు లేవు. ఓ రిలేషన్‌షిప్‌కు కమిట్ అయ్యే వ్యక్తి కాదు. ఎప్పుడూ తన నిర్ణయాలను మార్చుకుంటూనే ఉంటాడు’’ అని కత్రిన ఇటీవల ఓ సందర్భంలో అన్నారు. గతంలో దీపికా పదుకొనే కూడా ఇలాంటి కారణం చెప్పే రణబీర్ నుంచి బ్రేకప్ అయ్యారు. ఇప్పుడు కత్రిన కూడా దూరమయ్యారనే వార్త బలంగా వినిపిస్తోంది. వీరిద్దరి బ్రేకప్‌కు సల్మాన్ ఖాన్ కారణమనే వార్త ప్రచారంలో ఉంది. నిజమేంటనేది నిలకడగా తెలుస్తుంది.