
స్నేహితులు అంటే అంతే.. బాధయినా ఆనందమైనా కలిసి పంచుకుంటారు. విజయాలు సాధించినప్పుడు భుజాలపై మోస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నంటి నడుస్తారు. అలాంటి వారే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్.. బ్రేకప్ చేసుకొని బాధలో ఉన్న స్నేహితుడిని ఎలా ఒంటరిగా వదిలేస్తారు. అందుకే బ్రేకప్ చేసుకున్నా... ఇదిగో ఈ విధంగా గ్రాండ్‌గా పార్టీ చేశారు పాకిస్థాన్ కుర్రాళ్లు. ఇస్లామాబాద్ కాలేజీకి చెందిన ఓ కుర్రాడు ఇటీవల బ్రేకప్ చేసుకున్నాడు. ఆ విషయం తెలియడంతో బాధలో తమ స్నేహితుడిలో జోష్ నింపేందుకు తోటి విద్యార్థులు బ్రేకప్ పార్టీ ఇచ్చారు.
బ్రేకప్ అయిన మిత్రుడికి పూలదండతో స్వాగతం చెప్పి.. అతడితో రుచికరమైన చాక్లెట్ కేక్‌ను కట్ చేయించి.. అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. మిత్రుడికి ‘ఆజాదీ’ (స్వాతంత్ర్యం) వచ్చిందంటూ.. అతడి ప్రియురాలు పారిపోయిందంటూ నినాదాలు చేస్తూ.. హంగామా చేశారు. ఇస్లామాబాద్‌లోని కమ్‌శాట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఐఐటీ)లో ఈ ఘటన చోటుచేసుకుంది. చూడటానికి సరదాగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment