మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్, ప్రముఖ మోడల్, నటుడు రోహ్మాన్ షాల్ తమ ప్రేమాయణానికి ముగింపు పలికినట్లు ఫిల్మీదునియాలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ విడిపోయిన నేపథ్యంలో రోహ్మన్ నేడు(డిసెంబర్ 23) సుష్మిత ఇంటి నుంచి బయటకు వచ్చేసి తన స్నేహితుడి ఇంట్లో ఉంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది సుష్మిత. 'ఫ్రెండ్స్‌గా మొదలైన మా ప్రయాణంలో ఫ్రెండ్స్‌గానే మిగిలిపోతున్నాము. చాలాకాలం క్రితమే రిలేషన్‌షిప్ ముగిసింది కానీ ప్రేమ మిగిలింది. ఐ లవ్ యూ గయ్స్' అని రాసుకొచ్చింది. దీనికి రోహ్మాన్‌తో దిగిన ఫొటోను జత చేసింది. ఇక ఈ పోస్ట్‌పై రోహ్మన్ రియాక్ట్ అవుతూ 'ఎల్లప్పుడూ అలాగే ఉందాం' అని కామెంట్ చేశాడు. కాగా సుష్మిత తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మన్‌తో మూడేళ్లుగా డేటింగ్ చేస్తోంది. వీరిద్దరి జంటను చూసి ముచ్చటపడిన అభిమానులు బ్రేకప్ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment