ముంబై: బాలీవుడ్ ప్రేమ జంట టైగర్ ష్రాఫ్, దిశా పటానీ ప్రయాణిస్తున్న కారును మంగళవారం ముంబై పోలీసులు అడ్డుకున్నారు. రాకపోకలకు వీలు లేని రహదారిలోకి చొచ్చుకురావడంతో వారి కారును ఆపేసినట్లు పోలీసులు తెలిపారు. వారు ప్రవేశించిన దారిలో రోడ్డుకు మరమ్మత్తులు చేస్తున్నందున ఇతర మార్గం గుండా వెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. టైగర్, దిశా.. జిమ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కాగా టైగర్, దిశా కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారు ఇంతవరకు అధికారికంగా ధృవీకరించనేలేదు. కానీ, ఎక్కడికైనా కలిసే వెళ్లడం, ఎవరింట్లో పార్టీ ఉన్నా ఇద్దరూ ప్రత్యక్షమవడం, కలిసి విహారయాత్రలకు చెక్కేయడం.. సోషల్ మీడియాలో ఒకరి పోస్టుల మీద మరొకరు ప్రేమ కురిపించడం వంటివి చూశాక వారి మధ్య ఇష్క్ ఉందని అభిమానులతో పాటు బాలీవుడ్ మీడియా కూడా ఫిక్సైపోయింది. ఇదిలా వుంటే టైగర్ చివరిసారిగా హృతిక్ రోషన్ 'వార్' సినిమాలో కనిపించాడు. దిశా.. సల్మాన్‌ఖాన్‌తో 'రాధే' చిత్రంలో నటించింది. ఇందులో టైగర్ తండ్రి జాకీ ష్రాఫ్ దిశాకు పెద్దన్నయ్యలా నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment