బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌పై కేసు: హీరో తల్లి ఏమందంటే? | Tiger Shroff Mother Ayesha Shroff Defends Him And Disha Patani After Police Case | Sakshi
Sakshi News home page

ప్రేమజంటపై కేసు: మండిపడ్డ హీరో తల్లి!

Published Thu, Jun 3 2021 5:17 PM | Last Updated on Thu, Jun 3 2021 5:29 PM

Tiger Shroff Mother Ayesha Shroff Defends Him And Disha Patani After Police Case - Sakshi

టైగర్‌, దిషా ఇంటికి కారులో తిరిగొస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని ఆధార్‌ కార్డులు చూపించమని అడిగారు. అయినా ఈ సమయంలో ఎవరూ అలా బయట చక్కర్లు కొట్టడానికి వెళ్లరు...

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ బుధవారం ముంబై వీధుల్లో ప్రయాణించిన బాలీవుడ్‌ ప్రేమజంట టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీలకు ముంబై పోలీసులు షాకిచ్చిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలకు నీళ్లొదులుతూ రోడ్ల మీద షికారుకొచ్చిన సెలబ్రిటీల మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సరైన కారణం లేకుండానే వారు బయటకు వచ్చారని తెలిపారు.

దీంతో కరోనా టైంలో షికారేంటని ఈ జంట మీద కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా దాన్ని తీవ్రంగా ఖండించింది టైగర్‌ తల్లి ఆయేషా. "మీరు తప్పుగా అనుకుంటున్నారు. టైగర్‌, దిషా ఇంటికి కారులో తిరిగొస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని ఆధార్‌ కార్డులు చూపించమని అడిగారు. అయినా ఈ సమయంలో ఎవరూ అలా బయట చక్కర్లు కొట్టడానికి వెళ్లరు. ఏదైనా మాట్లాడేముందు నిజానిజాలు తెలుసుకోండి" అని మండిపడింది.

'టైగర్‌ ష్రాఫ్‌.. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు ఉచిత భోజనం అందించినదాని గురించి ఎవరూ మాట్లాడరు కానీ అతడి ప్రతిష్టను దిగజార్చేందుకు మాత్రం సిద్ధంగా ఉంటారు. అయినా అత్యవసరమైన వాటి కోసం బయటకు వెళ్లేందుకు అనుమతి ఉందన్న విషయం గుర్తుంచుకోండి' అని ఆయేషా చెప్పుకొచ్చింది.

చదవండి: దిశా మాజీ ప్రియుడి​ ఫొటోలు​.. సల్మాన్ 2 రూపాయల ఆర్టిస్ట్​!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement