ayesha
-
ఆడుతు పాడుతు ఊడుస్తుంటే...
అంతకు మించిన హాయి ఏమున్నది! శ్రమదానం మనకు కొత్త కాదు. అయితే అయేషా చేసిన శ్రమదానం వీడియో వైరల్ అయింది. ఇంతకీ ఆమె శ్రమదానం ప్రత్యేకత ఏమిటి అనే విషయానికి వస్తే... అయేషా మన అమ్మాయి కాదు. జోద్పూర్ను చూడడానికి తుర్కియే నుంచి వచ్చింది. జోద్‌పూర్‌లోని మాండోర్ గార్డెన్‌కు వెళ్లిన అయేషా అక్కడి పనివాళ్లు ఊడ్చే దృశ్యాలను చూసింది. ‘నాకు కూడా ఒక చీపురు కావాలి’ అని అడిగింది. అక్కడ ఉన్న గైడ్, వర్కర్స్ అయేషా జోక్ చేస్తుంది అనుకున్నారు. కాని ఆమె సీరియస్‌గానే అడిగింది అని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. చీపురుతో అరగంట పాటు ఊడ్చుతూ శ్రమదానం చేసింది.ఈ వీడియోను చూస్తూ నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘గార్డెన్లకు వెళ్లడం అనేది ఆహ్లాదకరమైన అనుభవం. అయితే గార్డెన్లలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తూ చిరాకు కలిగిస్తుంది. చెత్త వేసే వాళ్లు గార్డెన్లకు వెళ్లడానికి అనర్హులు. పరిసరాల పరిశుభ్రత అనే స్పృహ ఉన్న ఆయేషాలాంటి వాళ్లు మనకు ఆదర్శం కావాలి’ ‘శ్రమదానానికి సరిహద్దులు లేవని నిరూపించిన వీడియో ఇది’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
ఆయేషా.. వారెవ్వా..!
సాక్షి, హైదరాబాద్: రష్యాలోని ఉలియనోస్క్ సిటీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో భారత్‌తోపాటు వివిధదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై పలువురు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. అప్పుడే ఒకమ్మాయి లేచి నిల్చుంది. తన మదిలో మెదులుతున్న భావనలను వేదికపై నిలబడి సగర్వంగా చాటిచెప్పింది. ఆమె చెప్పిన మాటలకు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పేరే షేక్ ఆయేషా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ఆయేషా దేశం తరఫున బ్రిక్స్ సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న ఏౖకైక తెలుగమ్మాయి కావడం విశేషం.పెందుర్తి టు సెంట్రల్ యూనివర్సిటీ ఏపీలోని గాజువాక జిల్లా పెందుర్తికి చెందిన మదీనాబీబీ– రెహ్మాన్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో చిన్నకూతురు ఆయేషా. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు సామాజిక చైతన్యంలో ఆయేషా ముందుండేది. డిగ్రీ వరకు విశాఖపట్నంలో చదవగా, విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసింది. మూడేళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సింథటిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీలో చేరింది.సామాజిక సమస్యలపై పోరాటం చదువుతోపాటు సామాజిక స్పృహ కూడా ఆయేషాకు ఎక్కువే. ఎప్పుడూ తన తోటి విద్యార్థులతో కలిసి హక్కుల కోసం గొంతుక వినిపించేది. ఇటీవల హెచ్‌సీయూలో జరిగిన స్టూడెంట్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. గెలుపోటములు పక్కన పెడితే విద్యార్థుల కోసం తాను ఉన్నానంటూ తెలియజెప్పడమే తన ధ్యేయమని ఆయేషా చెబుతోంది.ఐదు రోజుల సదస్సు.. ఈ నెల 22న రష్యాలో ప్రారంభమైన బ్రిక్స్ యూత్ సదస్సు శుక్రవారంతో ముగియనుంది. ఈ సదస్సులో సామాజిక సేవ విషయంలో బ్రిక్స్ దేశాల మధ్య ఎక్సే్చంజ్ ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందని ఆయేషా ప్రతిపాదించింది. సంస్కృతి, యువతనాయకత్వం, కమ్యూనిటీ సర్వీస్ విషయంలో వలంటీర్ వర్క్ ఎలా జరుగుతుందనే విషయాలను బ్రిక్స్ దేశాల యువత పరస్పరం పంచుకోవాలని చెప్పింది. దీనిపై సదస్సులో చర్చ జరిగిందని, బ్రిక్స్ దేశాలు మద్దతు ఇచ్చాయని ఆయేషా వెల్లడించింది. కేంద్ర యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ సహాయమంత్రి రక్ష నిఖిల్ ఖడ్సే కూడా తనపై ప్రశంసలు కురిపించారని ఆమె పేర్కొంది. -
డ్రెస్ సర్దుకునే ఫోటోలు కూడా తీస్తారా? బిగ్ బాస్ నటి ఆగ్రహం!
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ సీజన్- 17 ఫేమ్ అయేషా ఖాన్ చేసిన పోస్ట్ బీ టౌన్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు కావాలనే ఎలా పడితే అలా ఫోటోలు తీస్తున్నారని మండిపడింది. కొందరు మీడియా ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా నటీమణులను అనుచితమైన కోణాల్లో రికార్డ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరంతా కనీస కనీస మర్యాదల గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని... మీ ప్రవర్తన చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఆయేషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ..'అసలు ఆ యాంగిల్స్ ఏమిటి? మీరు ఎక్కడ జూమ్ చేస్తున్నారు? అసలు మీకు అనుమతి ఉందా? కొందరు మీడియా వాళ్లు ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నారు? ఒక స్త్రీ భయం లేకుండా తన దుస్తులు కూడా సర్దుకునే స్వేచ్ఛ లేదా? ఇది తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది. ఒక మహిళ తన కారులో నుంచి దిగే ముందు తన దుస్తులను సర్దుకుంటూ కనిపిస్తుంది. ఆ ఫోటోలను కూడా మీరు క్యాప్చర్ చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నారా? ఒక మహిళ తనను వెనుక నుంచి ఫోటోలు తీయవద్దని కోరుకుంటుంది. మహిళలకు కనీస మర్యాద ఎలా ఇవ్వాలో మీరు నేర్చుకోండి అంటూ' చురకలు అంటించింది. కాగా.. సోషల్ మీడియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి.. హిందీ బిగ్ బాస్ సీజన్-17లో మెరిసింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఐటమ్ సాంగ్‌లో కనిపించనుంది. అ తర్వాత మలయాళ చిత్రం లక్కీ బాస్కర్‌లో నటించనుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా కనిపించనున్నారు. -
The Little Theatre: వందలాది పిల్లల అమ్మ
‘ఆరంభ శూరత్వం’ చాలామందిలో కనిపిస్తుంది. అయితే చెన్నైకి చెందిన అయేషా మేడమ్‌లో అది మచ్చుకైనా కనిపించదు. మూడు దశాబ్దాల క్రితం నాటకరంగంలోకి అడుగు పెట్టిన అయేషా పిల్లల్లో సృజనాత్మక కళల వికాసానికి ‘ది లిటిల్ థియేటర్’ ప్రారంభించింది. కాలంతో పాటు నడుస్తూ కొత్త ఆలోచనలు జత చేస్తూ థియేటర్‌ను ఎప్పటికప్పుడు క్రియాశీలంగా, నిత్యనూతనంగా నిర్వహిస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ‘క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేయాలని ఉంది’ అని తన మనసులో మాటను తండ్రి దగ్గర బయట పెట్టింది అయేషా. ఆయన ప్రోత్సాహకరంగా మాట్లాడారు. అలా తండ్రి–కూతురు ఆలోచనల్లో నుంచి వచ్చిందే ది లిటిల్ థియేటర్ ట్రస్ట్. ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత చాలామందిలో కరుగుతూ పోతుంది. కాని మూడు దశాబ్దాలు దాటినా ‘ది లిటిల్ థియేటర్’ ఉత్సాహం. సృజన శక్తి రవ్వంత కూడా తగ్గలేదు. ‘ఇంకా కొత్తగా ఏం చేయవచ్చు’ అని ఆలోచిస్తూ వెళుతోంది ది లిటిల్ థియేటర్. కళలు, ఆరోగ్యాన్ని మేళవించి 2015లో చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో ‘హాస్పిటల్ క్లౌన్స్’ను పరిచయం చేసింది లిటిల్ థియేటర్. కీమో థెరపీ చేయించుకునే పిల్లలకు ‘క్రియేటివ్ థెరపీ’ అందిస్తోంది. ‘లిటిల్ థియేటర్’ ద్వారా ఏడాది పొడవునా సృజనాత్మక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లల కోసం ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఫైర్ కథల కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. కోవిడ్ కల్లోల సమయంలో ‘లిటిల్ థియేటర్’ ఆన్‌లైన్‌లోకి వచ్చింది. మల్టీ–కెమెరా సెటప్‌తో షోలను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవారు. యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతోమందికి చేరువ అయింది. వన్స్ అపాన్ ఏ టైమ్ తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తూ ‘పిల్లలకు క్లాసు, హోంవర్క్ తప్ప మరో వ్యాపకం లేకుండా ఉంది’ అని నిట్టూర్చింది అయేషా. విదేశాల్లో ఉన్నత చదువు చదివిన అయేషా అక్కడ పిల్లల సృజనాత్మక వికాసానికి ఎన్నో వేదికలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడ వాటి కొరత ఉంది అని గ్రహించి ‘ది లిటిల్ థియేటర్’కు శ్రీకారం చుట్టింది. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లితో ‘నాకు వందలాది పిల్లలు పుడతారు’ అని చెప్పింది చిన్నారి అయేషా. కూతురు మాట విని తల్లి పెద్దగా నవ్వింది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ‘నా మాట నిజమైంది. ఇప్పుడు నాకు వందలాది పిల్లలు. ది లిటిల్ థియేటర్‌కు దగ్గరైన వాళ్లందరూ నా పిల్లలే’ అంటుంది అయేష. స్కూల్ ముగిసిన తరువాత పిల్లల కోసం నాటకానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను పరిచయం చేసే కార్యక్రమాల నుంచి కుండల తయారీ వర్క్‌షాప్‌ల వరకు ఎన్నో నిర్వహించింది ది లిటిల్ థియేటర్. ‘ది లిటిల్ థియేటర్’ ట్రస్టు ప్రతి సంవత్సరం వందలాది మంది నిరుపేద పిల్లలకు సహాయపడుతుంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న అయేషా థియేటర్‌కు సంబంధించి సృజనాత్మక కార్యకలాపాలను మాత్రం యువతరానికే అప్పగించింది. ‘ప్రతిభావంతులైన యువతరానికి సృజనాత్మక బాధ్యతలు అప్పగిస్తే కంటెంట్‌లో కొత్తదనం కనిపిస్తుంది. సంస్థ మరింత ముందు వెళుతుంది’ అంటుంది అయేషా. ‘నాటకరంగంలోకి అడుగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా, నేర్చుకున్నది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు ఆమె మాటల్లోనే... ‘నాటకరంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. అయినప్పటికీ నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనిపిస్తుంది. నాటకరంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ కోర్సులలో చేరుతుంటాను. నేను నేర్చుకున్నదాన్ని లిటిల్ థియేటర్‌కు తీసుకువస్తుంటాను’ అంటోంది అయేషా. క్రియేటివ్ థెరపీ హాస్పిటల్ వాతావరణంలో గాంభీర్యం, విషాదం, నిర్వేదం మిళితమై కనిపిస్తుంటాయి. ఈ వాతావరణాన్ని మార్చడానికి ఆస్పత్రిలో చేరిన పిల్లల్లో హుషారు తెప్పించడానికి, వారి పెదవులపై నవ్వులు మెరిపించడానికి చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో ది లిటిల్ థియేటర్ ‘క్రియేటివ్ థెరపీ’ నిర్వహిస్తోంది. కథల కార్యక్రమం నుంచి తోలుబొమ్మలాట వరకు రకరకాల సృజనాత్మక కళలలో పేషెంట్లుగా ఉన్న పిల్లలను కలుపుకుంటూ వారిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతారు. ‘క్రియేటివ్ థెరపీ’ కోసం హాస్పిటల్లో ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ ఏసీ స్టూడియోలో పెర్ఫార్మెన్స్ లైట్లు, సౌండ్ సిస్టమ్స్, డిజిటల్ టీవీ స్క్రీన్, వర్క్‌షాప్‌కు సంబంధించి రకరకాల వస్తువులు ఉంటాయి. హాస్పిటల్‌లోని పిల్లల దిగులును దూరం చేయడంలో క్రియేటివ్ థెరపీ సత్ఫలితాలు ఇచ్చింది. హాస్పిటల్‌లోని పిల్లల కోసం షెల్ఫ్‌ల నిండా బట్టలు, బొమ్మలు, కలరింగ్ బుక్స్... మొదలైనవి ఏర్పాటు చేశారు. ఇతర హాస్పిటల్స్ కూడా పిల్లల కోసం ‘ఆర్ట్ థెరపీ’ని మొదలుపెట్టాయి. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రకరకాల పూల మొక్కలు, ప్లే పార్క్, పిట్టగూళ్లతో పేషెంట్ల కోసం ‘హ్యాపీ ప్లేస్’ను ప్రారంభించింది. మా అదృష్టం ‘చదువే కాదు మా పిల్లలకు కళలు కూడా కావాలి’ అంటున్న తల్లిదండ్రుల పరిచయం నిజంగా మా అదృష్టం. ‘చదువు తప్ప మా పిల్లలకు ఏమీ అవసరం లేదు’ అని వారు అనుకొని ఉంటే ది లిటిల్ థియేటర్ ఇంత దూరం వచ్చేది కాదు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది కాదు. డబ్బున్న కుటుంబం, డబ్బు లేని కుటుంబం అని తేడా లేకుండా పిల్లలందరూ కళలతో మమేకం కావాలి. మనిషి సంపూర్ణ మానవుడిగా మారడానికి కళలు ఉపయోగపడతాయి. – అయేషా, ఫౌండర్, ది లిటిల్ థియేటర్ -
రెండో ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్.. అలా చేస్తే కోచింగ్ అనసవరం: షేక్ అయేషా
‘ఓటమి ఎదురైనప్పుడే మరింత శ్రమించడం అలవాటవుతుంది... అప్పుడే విజయం ముంగిటకు వచ్చి వాలుతుంది. పట్టుదలతో ముందుకు సాగితే ఎంతటి లక్ష్యమైనా ఇదిగో ఇట్టే మన సొంతమవుతుంది..’ ఇదీ ఏపీపీఎస్సీ గ్రూప్–1 విజేత, డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై న మదనపల్లెకు చెందిన షేక్ ఆయేషా చెప్పిన మాటలు. పేదరికంలో పుట్టినా.. కష్టాలు పలకరించినా వెనుదిరగలేదు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలచుకుని డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆయేషా విజయప్రస్థానం ఆమె మాటల్లోనే.. అన్నమయ్య : లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒకసారి వైఫల్యం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే ఎంతటి విజయానైన్నా ఇట్టే సాధించవచ్చు. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్, ఇంటర్నెట్ లాంటి సాధనాలు అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీకాదు. ప్రణాళిక, పట్టుదల ఉంటే కోచింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ప్రతి రోజు దినపత్రికలు చదివి , కరెంట్ ఎఫైర్స్ నోట్స్ సొంతంగా తయారు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించగలం. దానికి నేనే ఉదాహరణ. లక్షసాధనకు ఐదేళ్లు తపస్సు సివిల్స్ నా చిన్ననాటి కల. బీటెక్ పూర్తి చేసిన తరువాత పినాకా ఆర్గనైజేషన్ నిర్వాహకులు యాదగిరి ,ముంబైలోని ఆర్బిఐ గ్రేడ్–బి మేనేజర్ మిథున్ల సూచనలు, సలహాలతో సివిల్స్ వైపు దృష్టి సారించా. 2018లో బీటెక్ పూర్తి చేసే సమయంలోనే క్యాంపస్ సెలక్షన్స్‌లో, టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యా. అయినా నా లక్ష్యం గ్రూప్స్ కావడంతో ఉద్యోగంలో చేరలేదు. 2004 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించే పినాకా స్టూటెండ్స్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ వాట్స్ప్ గ్రూపులో చేరాను. ఇందులో గ్రూప్స్‌కు ప్రిపేర్ కావడానికి అవసరమైన మెటీరియల్ లభించేది. దీనితో పాటు యాదగిరి పూర్తిగా సహకారం అందించారు. 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడగా దరఖాస్తు చేసుకున్నాను. మొదటి ప్రయత్నంగా 2019లో గ్రూప్–1 ప్రిలిమినరీ, 2020లో మెయిన్స్ పాసై ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కాని ఎంపిక కాలేదు. ఆ సమయంలో తల్లిదండ్రులు అండగా నిలబడి మరింత ప్రోత్సాహాన్ని అందించారు. మరో ప్రయత్నం చేయడానికి మనోధైర్యాన్ని కల్పించారు. దీంతో నాలో పట్టుదల పెరిగింది. 2022 సెప్టెంబర్‌లో గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ కాగా ఆత్మస్థైర్యంతో మరింత కష్టపడి పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించాను. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగాను. ఐదేళ్ల తపస్సు నెరవేరింది. సాధారణ విద్యార్థినే.. 1 నుంచి 10 వరకు ఆరోగ్యమాత ఎయిడెడ్ ఉన్నత పాఠశాలో చదివాను. ప్రాథమిక పాఠశాలలో సాధారణ విద్యార్థిని. ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పద్మావతి, సుబ్బలక్ష్మి, హెచ్ఎం వాసుదేవరావులు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. మూడో తరగతి నుంచి నాకు మంచి ఫౌండేషన్ వేశారు. పదిలో 9.8 పాయింట్లు వచ్చాయి. ఇంటర్మీడియట్ తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజీలో చేరాను. కాలేజీలో ఫిజిక్స్ అధ్యాపకులు గోవిందరాజులు నన్ను బాగా ప్రోత్సహించారు. ఇంటర్మీడియట్లో 982 మార్కులు సాధించాను. బీటెక్ తమిళనాడు తంజావూరులోని శస్త్ర యూనివర్శిటీలో చదివాను. 2018లో బీటెక్ పూర్తి చేశాను. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నా... తమిళనాడు తంజావూరు శస్త్ర యూనివర్శిటీలో బిటెక్ పూర్తి చేశా. టెక్ట్స్ బుక్స్, ఎన్‌సీఈఆర్‌టి బుక్స్ చదివి సొంతంగానే నోట్స్ తయారు చేసుకున్నా. క్రమం తప్పకుండా ప్రతి రోజూ దినపత్రికలు హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, సాక్షి చదవడం అలవాటు చేసుకున్నా. ఆయా పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్ కాలమ్స్,కరెంట్ ఎఫైర్స్ చదవడం అలవాటుగా మారింది. రోజుకు తొమ్మిది గంటల పాటు చదివాను. తల్లిదండ్రులే కొండంత అండ: గ్రూప్స్ ప్రిపరేషన్లో తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు. నాన్న షేక్ అహ్మద్‌బాషా చిరు వ్యాపారి. అమ్మ గౌసియాబేగం సాధారణ గృహిణి. నా సక్సెస్‌లో వారి ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేను. ఏ సమయంలోనైనా నేను ఒత్తిడికి గురైతే నన్ను వెన్నుతట్టి నాలో ఆత్మస్థైర్యాన్ని కల్పించేవారు. ఇక స్కూలు రోజుల్లో ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పద్మావతి, సుబ్బలక్ష్మి ,వాసు నా చదువులో ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఐఏఎస్ కావాలనేది నా ఆకాంక్ష ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. అందుకు శక్తివంచన లేకుండా నా ప్రయత్నాలు చేస్తా. మహిళలను విద్యావంతులు చేయడం, అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడం, ఆర్థికంగా ఎదిగే విధంగా తోడ్పాటునందిస్తా. ఎక్కడ పని చేసినా అక్కడ నిరక్షరాస్యత లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతా. ఫ్రొఫైల్ పేరు : షేక్ ఆయేషా తండ్రి : షేక్ అహ్మద్‌బాషా తల్లి : షేక్ గౌసియా బేగం నివాసం : మదనపల్లె పాఠశాల విద్య : ఆరోగ్యమాత ఇంగ్లీషు మీడియం స్కూల్, మదనపల్లె కళాశాల విద్య : ఎన్ఆర్ఐ కాలేజీ, తిరుపతి బీటెక్ : శస్త్రా యూనివర్శిటీ, తంజావూరు, తమిళనాడు తన కలే మా కల ఆయిషా చిన్నప్పటి నుంచి సివిల్స్‌లో రాణించడమే లక్ష్యంగా ఎంచుకుంది. అందు కోసం నిరంతరం శ్రమించింది. తన కలను మాకలగా మార్చుకుని అన్ని విధాలుగా ప్రోత్సహించాం. ఈ సుదీర్ఘప్రయాణంలో చదువులో అవసరమైన అన్నింటిని సమకూర్చాం. దీంతో తన స్వప్నం సాకారం కావడం మాకు సంతోషాన్ని కలిగించింది. – షేక్ అహ్మద్‌బాషా, గౌసియాబేగం, తల్లిదండ్రులు -
స్టార్ హీరో మదర్‌ను మోసం చేసిన ఉద్యోగి
బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరో జాకీ ష్రాఫ్ భార్య, టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్‌ను అలెన్ ఫర్నాండో అనే వ్యక్తి రూ.58 లక్షలకు మోసం చేశాడు. ఈ మేరకు అయేషా ష్రాఫ్ ముంబయ్‌లోని శాంటాక్రజ్ పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది. ఫెర్నాండెజ్‌పై సెక్షన్ 420, 408, 465, 467, 468 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 20, 2018న MMA మ్యాట్రిక్స్ అనే జిమ్ కంపెనీని టైగర్ ష్రాఫ్ తన సోదరితో కలిసి స్టార్ట్ చేశాడు. (ఇదీ చదవండి: నాగార్జున సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన డైరెక్టర్) అక్కడ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా అలెన్ ఫర్నాండోను వారు నియమించారు. టైగర్ ష్రాఫ్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల దాని బాధ్యతలను తల్లి అయేషా చూసుకుంటుంది. MMA మ్యాట్రిక్స్ ద్వారా పలు టోర్నమెంట్లను నిర్వహించడం కోసం కొందరి నుంచి రూ.58 లక్షలు తీసుకున్నట్లు ఆమె ఆరోపించింది. అలెన్ ఫర్నాండోను ముంబయ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న జనతా గ్యారేజ్ నటి.. ఫోటో షూట్ వైరల్!) -
సివిల్స్ ఫలితాల్లో ఇద్దరికి ఓకే ర్యాంకు.. తేల్చేసిన యూపీఎస్సీ?
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేంది. . వీరిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మంది ఉన్నారు. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మంది, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. కాగా యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాక మధ్యప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులకు ఒకే ర్యాంక్ వచ్చింది. ముందుగా సివిల్స్‌కు ఎంపిక అవ్వడంతో అంతులేని ఆనందానికి లోనయ్యారు. తమ శ్రమ ఫలించిందనుకున్నారు. ఇంతలోనే తన పేరు, ర్యాంకు, రోల్ నంబర్లతో మరో అమ్మాయి ఉందని తెలియడంతో నిర్ఘాంతపోయారు. ఆ ర్యాంకు నాదంటే.. నాదంటూ యూపీఎస్సీకి తమ అడ్మిట్ కార్డులను సమర్పించారు. ఒకే పేరుతో ఇద్దరు దేవాస్ జిల్లాకు చెందిన ఆయేషా ఫాతిమా (23), అలీరాజ్‌పూర్‌కు చెందిన ఆయేషా మక్రాని (26) ఇద్దరూ ఇటీవల వెల్లడించిన యూపీఎస్సీ ఫలితాల్లో అర్హత సాధించారు. వారిరువురికీ 184వ ర్యాంకు వచ్చింది. వీరిద్దరి రోల్ నంబర్లు కూడా ఒకటే. దీంతో అసలు సమస్య వచ్చిపడింది. ఆ ర్యాంకు నాదంటే.. నాదంటూ ఇద్దరూ యూపీఎస్సీకి తమ అడ్మిట్ కార్డులను సమర్పించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదులు చేశారు. చదవండి: చితికి చేరుతున్న చీతాలు.. ‘ప్రాజెక్ట్ చీతా’పై కొత్త కమిటీ తేల్చేసిన యూపీఎస్సీ వారిద్దరి అడ్మిట్ కార్డులను గమనిస్తే కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూ నిర్వహించిన తేదీ ఇక్కడ కీలకంగా మారింది. వీరిద్దరికీ ఏప్రిల్ 25, 2023న పర్సనాలిటీ టెస్టు నిర్వహించారు. అయితే.. మక్రానీ అడ్మిట్‌కార్డులో గురువారం ఉండగా.. ఫాతిమా కార్డులో మంగళవారం అని స్పస్టంగా ఉంది. క్యాలెండర్ ప్రకారం ఆ రోజు మంగళవారమే. అంతేకాకుండా ఫాతిమా అడ్మిట్‌కార్డులో యూపీఎస్సీ వాటర్ మార్కుతోపాటు క్యూఆర్ కోడ్ సైతం ఉంది. మక్రానీ అడ్మిట్‌కార్డుపై ఇవేం లేవు. దీంతో యూపీఎస్సీ అధికారులు ఫాతిమానే అసలు అభ్యర్థి అని పేర్కొన్నారు. మరోచోట కూడా మరోవైపు తుషార్ అనే పేరుతోనూ ఇలాంటి సమస్యే ఎదురైంది. తమకు 44వ ర్యాంక్ వచ్చిందని హరియాణాకు చెందిన తుషార్, బిహార్‌కు చెందిన తుషార్ కుమార్ చెప్పారు. దీంతో దర్యాప్తు చేపట్టిన యూపీఎస్పీ.. బిహార్‌కు చెంది తుషార్ కుమార్ నిజమైన అభ్యర్థిగా గుర్తించింది. ఆయేషా మక్రాని (26)తో సహా బిహార్‌కు చెందిన తుషార్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు యూపీఎసీ పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షల్లో మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగబోవని హామీ ఇచ్చారు. చదవండి: లండన్‌లో ఉద్యోగం వదిలేసి సివిల్స్ వైపు.. థర్డ్ అటెంప్ట్‌లో ఫస్ట్ ర్యాంక్ -
Pravasi Bharatiya Divas: విదేశాల్లో ఉన్నా స్వదేశంలో సేవ
జీవితంలో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో విదేశాలకు వెళ్లినవారు తమను తాము నిరూపించుకునే దిశగా సాగుతారు. కలల లక్ష్యాలను చేరుకోవడానికి శ్రమించడంతో పాటు తమ చుట్టూ ఉన్నవారికి చేయూతనివ్వాలనుకుంటారు. తమ మూలాలను గుర్తుపెట్టుకొని సొంత గడ్డ అభ్యున్నతికి పాటుపడాలని తపిస్తుంటారు. వారి ఆలోచనలతో మరికొందరి అడుగులకు స్ఫూర్తిగా నిలుస్తారు. విదేశాల్లో తాము ఎంచుకున్న రంగాల్లో కృషి చేస్తూనే సేవా కార్యక్రమాల ద్వారా స్వదేశంలో ఉన్నవారికి చేయూతనందిస్తున్నారు విజయవాడ వాసి అయేషా, ఖమ్మం జిల్లా వాసి ఝాన్సీ. పిల్లలకు కష్టం విలువ తెలియాలని.. విజయవాడ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు ఆయేషా. ఉద్యోగం, కుటుంబం బాధ్యతలతో బిజీగా ఉన్న ఆమె సేవాకార్యక్రమాలవైపు మళ్లిన ఆలోచనావిధానం గురించి తెలిపారు. ‘మా కుటుంబంతో కాలిపోర్నియాలో స్థిరపడ్డాను. నేను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ఇటీవల నాన్‌ప్రాఫిట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కూడా అందుకున్నాను. ఉద్యోగినిగా ఉన్న నేను మొదట ఒక తల్లిగా మా పిల్లలకు సేవా ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాను. అదే సమయంలో మా చుట్టుప్రక్కల ఉండే పిల్లల పరిస్థితి గమనించాను. పిల్లల్లో మానవతా విలువలు పెంచాలని కమ్యూనిటీ సర్వీస్ చేయాలనే సదుద్దేశంతో ఏడేళ్ల క్రితం ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థని ప్రారంభించాను. ఇప్పుడు వందలాది మందికి పైగా వలెంటీర్లు మా ఆర్గనైజేషన్‌లో సేవలందిస్తున్నారు. మా అమ్మనాన్నలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. వారిని చూడటం కోసం మొదట మా పిల్లలను తీసుకొని ఇండియాకు వచ్చేదాన్ని. మారుమూల గ్రామాల్లోని పాఠశాల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, ఆ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. స్వచ్ఛందంగా పనిచేసే మిత్రులు కొందరు పరిచయమయ్యారు. వారితో నిరంతరం కాంటాక్ట్‌లో ఉంటూ అమెరికాలో మేమున్న ప్రాంతంలో సేకరించిన పుస్తకాలను ఆంధ్రాలోని గ్రామాల స్కూళ్లకు అందజేసేవాళ్లం. ఈ కార్యక్రమం ప్రతియేటా నిర్వహించేవాళ్లం. నాతోపాటు ప్రతి యేటా వలెంటీర్లుగా వర్క్ చేసే పిల్లలు కనీసం పదిమందినైనా ఇండియాకు తీసుకువచ్చేదాన్ని. వారితో ఇక్కడి స్కూల్ పిల్లలకు వర్క్‌షాప్స్ కండక్ట్ చేసేదాన్ని. ఆ తర్వాత సమస్యలు తెలుస్తున్న కొద్దీ వాటి మీద దృష్టి పెడుతూ వచ్చాను. అందరం ఉపాధి కోసం విదేశాలకు వచ్చినవాళ్లమే. కాని మా మూలాలను ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పరిస్థితులలోనే స్వదేశంలోని పిల్లలకు సర్వీస్ చేయాలనుకున్నాను. ట్రైబల్ ఏరియాలోని పిల్లలకు మా సేవలు అందేలా కృషి చేస్తుంటాను. స్వచ్ఛంద సంస్థల ద్వారా మా సేవకార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. నిరుపేదలకు ఏదైనా సాయం కావాలని మా దృష్టికి వస్తే ఇక్కడ ఫండ్ రైజింగ్ కి వెబ్సైట్ లో ప్రకటిస్తాం. ఇప్పటి వరకు మనవాళ్లు ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు’’ అని తెలిపారు ఆయేషా. మహిళల శ్రేయస్సు కోసం.. ఖమ్మం జిల్లా వాసి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేశారు. మహిళలు, బాలికల సంక్షేమం కోసం అక్కడే ‘వెటా’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, వివిధ కార్యక్రమాల ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే, పుట్టి పెరిగిన గడ్డకు మేలు చేయాలనే ఆలోచనతో స్వదేశంలోనూ సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ‘‘లక్ష్యం పెద్దదిగా ఉండాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దానిని సాధించే దిశగానే మన అడుగులు ఉండాలి. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అమెరికా వెళ్లి, అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. పిల్లలు పుట్టాక వారిని చూసుకునే క్రమంలో ఉద్యోగాన్ని మానేసి, రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాను. ఒక మహిళ ఏం చేస్తుంది ఈ రంగంలో అనుకునేవారికి నా విజయం ద్వారానే సమాధానం చెప్పాను. అమెరికాలోని మన భారతీయ మహిళల సమస్యల గురించి అర్థం చేసుకున్నాను. సొంతంగా ఎదగాలనుకునేవారు, ఉద్యోగాలు చేయాలనుకునేవారు, గృహహింస వంటి బాధలు పడేవారు .. అన్ని రకాలుగా జీవితంతో పోరాటం చేసేవారున్నారు. అలాంటివారి శ్రేయస్సు కోసం పనిచేయాలని ‘వెటా’ను స్థాపించాను. మన విజయాలను మన అనుకున్న నలుగురికి కూడా పంచాలి. మా సొంత ఊళ్లకు వచ్చినప్పుడు అక్కడి పరిస్థితులను గమనించి అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వచ్చాం. మా ఊరు బనిగండ్లపాడు గ్రామంలోనే కాదు, మా వారు పుట్టి పెరిగిన వరంగల్ జిల్లా తొర్రూరులోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గ్రంథాలయాలను ఏర్పాటు చేశాం. స్కూల్ భవనాలను కట్టించి, ప్రభుత్వానికి అప్పజెప్పాం. తొర్రూరులో హాస్పిటల్ కట్టించాం. గ్రామపంచాయితీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేశాం. మా చుట్టుçపక్కల మరో ఆరుగ్రామాల వరకు మా సేవలు అందిస్తుంటాం. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది మా ఆలోచన. అందుకే, పేద విద్యార్థులకు ప్రతియేటా ఆర్థిక సాయం చేస్తుంటాం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మాకు చేతనైంత సాయం అందించాలన్నదే మా సిద్ధాంతం. ముందుగా మనకు మనంగా ఎదగాలి. అందుకోసం ఎంతటి కష్టమైనా పడాలి. అలాగే, నలుగురి మేలు కోసం పాటుపడినప్పుడే మన జీవితానికి సంతృప్తి లభిస్తుంది’’ అని వివరించారు ఝాన్సీరెడ్డి. -
లతా మంగేష్కర్ పాటకు మిస్టర్ బీన్ స్టెప్పులు
అయేషా.. గత వారం రోజులుగా ఇంటర్నెట్ను ఊపేస్తున్న పేరు. లతాజీ పాడిన క్లాసిక్ సాంగ్ ‘మేరా దిల్ యే పుకారా ఆజా’ రీమిక్స్ వెర్షన్‌కు ఓ వివాహ వేడుకలో ఆ చిన్నది వేసిన చిందులకు యావత్ ఇంటర్నెట్ ప్రపంచం ఫిదా అయ్యింది. పాకిస్థాన్ లాహోర్‌కు చెందిన అయేషా.. ఓ వెడ్డింగ్ రిసెప్షన్లో భారతరత్న లతా మంగేష్కర్ ఆలపించిన మేరా దిల్ యే పుకారా ఆజా సాంగ్ రీమిక్స్‌కు లయబద్ధంగా స్టెప్పులు వేసింది. ఆ వీడియో కాస్త ఇంటర్నెట్ను షేక్ చేసింది. మన దేశంతో సహా ఎంతో మంది ఆమె స్టెప్పులకు ఫిదా అయిపోయారు. ఓవర్ నైట్‌లోనే ఫాలోవర్స్‌ను అమాంతం పెంచేసుకుని ఈ-సెలబ్రిటీ అయిపోయింది అయేషా. అయేషా స్ఫూర్తితో ఇన్‌స్టాలో రకరకాల వెర్షన్లు వచ్చేశాయి. అంతేకాదు నాగిని(1954) చిత్రంలోని ఒరిజినల్ పాట కోసం, లతాజీ గాత్రం కోసం ఎంతో మందిని వెతుక్కునేలా చేసింది. మరోవైపు ఫన్నీగా, క్రియేటివ్‌గా రీల్స్ రూపొందించే యత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే మిస్టర్ బీన్ వెర్షన్. మిస్టర్ బీన్స్ హాలీడే చిత్రంలో రోవన్ అట్కిన్సన్ ఓ సీన్లో ఆయన డ్యాన్స్ చేస్తారు. ఆ వీడియోను.. మేరా దిల్ యే పుకారా ఆజాకు ముడిపెట్టిన ఫన్నీ రీల్ క్రియేట్ చేశారు. ఆ ఫన్నీ వెర్షన్‌తో పాటు అయేషా వెర్షన్‌పైనా ఓ లుక్కేయండి మరి!. View this post on Instagram A post shared by 𝐅𝐑𝐊 𝐌𝐀𝐆𝐀𝐙𝐈𝐍𝐄 𝐏𝐀𝐊𝐈𝐒𝐓𝐀𝐍 (@frk.magazine) -
Sania Mirza: సానియా మీర్జాతో విభేదాలు!? నటితో షోయబ్ మాలిక్ ఫొటోలు వైరల్
Sania Mirza- Shoaib Malik- Ayesha Omar: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు అభిమానులకు మరింతగా చేరువయ్యే అవకాశం దొరికింది. తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలు పంచుకునే వెసలుబాటు కలిగింది. అయితే, ఒక్కోసారి నోరు తెరచి స్వయంగా ఏ విషయం చెప్పకపోయినా.. నేరుగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా సరే.. వాళ్లు షేర్ చేసే ఫొటోలు, వాటికి జత చేసే క్యాప్షన్లు చాలు.. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి వదంతులు వ్యాపించడానికి! క్రీడా జంట సానియా మీర్జా- షోయబ్ మాలిక్ విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులకు సిద్ధమయ్యారంటూ రూమర్లు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే వీరిద్దరు విడిగా ఉంటున్నారని, విడాకులకు సంబంధించిన ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రకటన చేయనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమే కారణం అంటూ! అంతేకాదు.. ఓ పాకిస్తాన్ మోడల్ ఇందుకు కారణమని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె పేరు తెరపైకి రావడానికి కారణం ఏమిటంటే.. సదరు మోడల్ పేరు ఆయేషా ఒమర్. స్థానిక మ్యాగజీన్ కోసం షోయబ్ ఆమెతో కలిసి 2021లో ఓ బోల్డ్ ఫొటోషూట్ చేశాడు. హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌పై అవగాహనలో భాగంగా రూపొందించిన వీడియోలో తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వీళ్లు ఆ ఫొటోషూట్‌లో చాలా సన్నిహితంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయేషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. షోయబ్ రెండో పెళ్లికి సిద్దమైనట్లుగా కనిపిస్తోంది అంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు. స్విమ్మింగ్‌పూల్‌లో దిగి ఇలా ఫోజులివ్వడమే ప్రొఫెషనలిజమా అంటూ ప్రశ్నించారు. మీ భర్త కూడా ఇలాగే చేస్తే ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో షోయబ్ మాలిక్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఫొటోషూట్ సమయంలో ఆయేషా తనకు సహకరించారంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఫొటోషూట్ గురించి మీ భార్య సానియా ఎలా స్పందించారని హోస్ట్ ప్రశ్నించగా.. సమాధానం దాటవేసిన షోయబ్.. ‘‘మీ భర్త కూడా ఇలాంటి ఫొటోషూట్‌లో పాల్గొంటే మీ రియాక్షన్ ఏంటీ’’అంటూ ఎదురు ప్రశ్నించాడు. PC: Ayesha Omar Instagram ఇందుకు వెంటనే స్పందించిన ఆమె..‘‘నాకింకా పెళ్లి కాలేదు’’అని సమాధానమిచ్చింది. అవునా.. మీ లాగే సానియా కూడా రియాక్ట్ అవ్వలేదు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు తోడు ఇటీవల సానియా.. ‘‘హృదయం ముక్కలైందంటూ’’వరుస పోస్ట్‌లు చేస్తూ ఉండటం ఈ రూమర్లకు ఊతమిచ్చింది. భార్యా కొడుకుతో షోయబ్ మాలిక్ ఆయేషా ఎవరంటే ఆయేషా ఒమర్ నటి, గాయని, యూబ్యూబర్. 1981లో జన్మించిన ఆమె తొలుత వీడియో ఆల్బమ్‌లతో లైమ్‌లైట్‌లోకి వచ్చారు. 2015లో కరాచీ సే లాహోర్ అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇక సానియా- షోయబ్ మాలిక్ విడాకుల వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఆయేషా- షోయబ్ మాలిక్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా 2010లో పెళ్లి చేసుకున్న సానియా- షోయబ్‌కు కుమారుడు ఇజహాన్ సంతానం. చదవండి: T20 WC 2022 Final: ఇంగ్లండ్- పాక్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దు అయితే? IND vs NZ: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్! View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) -
అయేషా చెప్తున్న అందమైన కథ (ఫోటోలు)
-
మహిళా సాధికారతకు ప్రతీక.. పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్
సంప్రదాయ ముస్లిం మెజారిటీ గల పాకిస్థాన్ దేశ న్యాయ చరిత్రలో ఒక మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టులోని సెరిమోనియల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ ఆహ్మద్ 55 ఏళ్ల జస్టిస్ మాలిక్‌తో ప్రమాణం చేయించారు. దీనికి పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, లాయర్లు, లా అధికారులు.. హాజరయ్యారు. జస్టిస్ మాలిక్ 2012లో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ విధంగా పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించారు ఆయేషా మాలిక్. జూన్ 2031లో పదవీ విరమణ పొందేవరకు ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారు. జస్టిస్ మాలిక్ పదోన్నతిని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ గత శువ్రారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జూన్ 2030లో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఆయేషా మాలిక్‌కు ఉంది. ఆ విధంగా ఆమె మళ్లీ పాకిస్థాన్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి గా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఆమె ఘనతను చెప్పే స్థాయి.. వేడుక ముగిసిన తర్వాత చీఫ్ జస్టిస్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ ‘జస్టిస్ మాలిక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యేంత సమర్ధురాలు, ఆమె ఘనతను చెప్పేంత స్థాయి ఎవరికీ లేదు’ అన్నారు. సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి, జస్టిస్ మాలిక్ సాధించిన ‘మైలు రాళ్ల’కు అభినందనలు తెలిపారు. శ్రీ ఫవాద్ ట్వీట్ చేస్తూ ‘ఒక శక్తిమంతమైన చిత్రం. పాకిస్థాన్‌లో మహిళా సాధికారతకు ప్రతీక’ అని ప్రమాణ స్వీకారోత్సవ చిత్రంతో పాటు, జస్టిస్ ఆయేషా దేశ ‘న్యాయ వ్యవస్థ’కు ఒక ఆస్తిగా ఉంటారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. మహిళ అనే ఆశ్చర్యమా! లాహోర్ హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ జస్టిస్ మాలిక్ అత్యుత్తమ స్థానానికి ఎంపికైనప్పుడు చాలామంది తమ కనుబొమలను పైకెత్తారు. ఆమె నామినేషన్‌ను పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ (జేసీపీ) గతేడాది తిరస్కరించింది. కానీ, కమిషన్ ఈ నెల ప్రారంభంలో ఆమె పేరును రెండోసారి పరిశీలనకు తీసుకురాగా స్వల్ప మెజారిటీతో ఆమెదించింది. అత్యున్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను నామినేట్ చేసే అత్యున్నత సంస్థ జెసీపీ సమావేశానికి చీఫ్ జస్టిస్ అహ్మద్ అధ్యక్షత వహించారు. సుపీరియర్ జ్యూడీషియరీ నియామకంపై జేసీపీ తర్వాత ద్వైపాక్షిక పార్లమెంటరీ కమిటీ ఆమోదం కోసం మాలిక్ నామినేషన్ ముందుకు వచ్చింది. మాలిక్ లాహోర్ హైకోర్ట్‌కి మొదటి మహిళా అత్యున్నత న్యాయమూర్తి కావడం వల్ల సీనియారిటీ సూత్రాన్ని పక్కన పెట్టి, కమిటీ ఆమె నామినేషన్‌ను ఆమోదించింది. సాధారణంగా హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. సుప్రీంకోర్టుకు వారి పదోన్నతిని ఆమోదించేటప్పుడు, గత సంవత్సరం ఆమె పేరును జేసీపీ తిరస్కరించడానికి ఇదీ ఓ కారణం. 1966లో జన్మించిన మాలిక్ పారిస్, న్యూయార్క్, కరాచీలోని పాఠశాలల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆమె లాహోర్‌లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా లో ‘లా’ చదివారు. హార్వర్డ్ లా స్కూల్ నుండి ఎల్ఎల్ఎమ్ చేశారు. జూన్ 2021లో లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారి పరీక్ష కోసం కన్యత్వ పరీక్షలు ‘చట్ట విరుద్ధం, పాకిస్థాన్ రాజ్యాంగానికీ వ్యతిరేకం’ అని ఆమె ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి. సోమవారం ఇస్లామాబాద్‌లోని సుప్రీంకోర్టు భవనంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తున్న ఆయేషా మాలిక్. -
తన స్నేహితుడితో భార్య ‘బంధం’.. భరించలేక నాడు ఆ క్రికెటర్..
Shikhar Dhawan-Ayesha Mukherjee Divorce: ‘‘రెండోసారి డైవోర్సీ అయ్యేంత వరకు విడాకులు అనేది చెత్తపదం అనుకున్నా’’ అంటూ టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ భార్య అయేషా ముఖర్జీ తాము విడిపోయిన విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. శిఖర్‌తో తన బంధం ఇక ముగిసిపోయిందని ఆమె స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ అన్యోన్యతను ప్రదర్శించే ఈ జంట విడాకులు తీసుకోవడం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది. అంతేకాదు.. ఈ విషయంపై గబ్బర్ ఇంతవరకు స్పందించకపోవడంతో ‘‘ఇంతకూ ఇది నిజమేనా’’ అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూడా. ఏదేమైనా.. శిఖర్ విడాకుల అంశం క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ క్రమంలో గతంలో భార్యలతో విడిపోయిన టీమిండియా స్టార్, మాజీ క్రికెటర్ల గురించి నెటిజన్లు చర్చింకుంటున్నారు. మహ్మద్ అజారుద్దీన్- సంగీత బిజ్లానీ భారత జట్టు మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్- సంగీత బిజ్లానీ బిగ్గెస్ట్ సెలబ్రిటీ జంటగా పేరొందారు. బాలీవుడ్ నటి అయిన సంగీత అందానికి ఫిదా అయిన అజారుద్దీన్ మొదటి భార్యకు దూరమై.. 1996లో ఆమెను వివాహమాడాడు. అప్పటికే అజారుద్దీన్‌కు ఇద్దరు కొడుకులు. ఇక సంగీతతో కూడా అతడు సుదీర్ఘకాలం పాటు బంధం కొనసాగించలేకపోయాడు. 2010లో ఈ జంట విడిపోయింది. వినోద్ కాంబ్లీ- నోయెలా లూయిస్ టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ, తన చిన్ననాటి స్నేహితురాలు నోయెలా లూయిస్‌ను పెళ్లాడాడు. 1998లో వివాహ బంధంతో ఒక్కటైన జంట అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకుంది. అయితే, కొంతకాలం తర్వాత మాజీ మోడల్ ఆండ్రియా హెవిట్‌ను వివాహమాడిన వినోద్ కాంబ్లీ ఆమెతో జీవనం కొనసాగిస్తున్నాడు. జవగళ్ శ్రీనాథ్- జ్యోత్స భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ వైవాహిక బంధం కూడా సాఫీగా సాగలేదు. 1999లో జ్యోత్స అనే మహిళను పెళ్లాడిన శ్రీనాథ్.. తొమ్మిదేళ్ల పాటు ఆమెతో జీవితం పంచుకున్నాడు. కానీ, మనస్పర్దల కారణంగా 2008లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం ఐసీసీ మ్యాచ్ రిఫరీగా ఉన్న శ్రీనాథ్ జర్నలిస్టు మాధవి పాత్రవళిని పెళ్లి చేసుకున్నాడు. దినేశ్ కార్తీక్- నికితా వంజారా టీమిండియా క్రికెటర్ల విడాకుల అంశంలో నేటికీ హాట్‌టాపిక్ అంటే దినేశ్- నికితా జంటదే. చిన్ననాటి స్నేహితురాలైన నికితను పెళ్లాడిన దినేశ్‌కు ఆమె ఊహించని షాకిచ్చింది. దినేశ్ సహ ఆటగాడు, భారత క్రికెటర్ మురళీ విజయ్‌తో ఆమె బంధం కొనసాగించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న దినేశ్ 2012లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. మూడేళ్ల తర్వాత స్వ్యాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్‌ను వివాహమాడాడు. మరోవైపు.. నికితా.. మురళీ విజయ్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. చదవండి: Ind Vs Eng: టీమిండియాదే క్రెడిట్ అంతా: ఇంగ్లండ్ కోచ్ -
ఆయేషాతో శిఖర్ ధావన్ విడాకులు
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోయాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆయేషా నిర్ధారించింది. వీరిద్దరికి 2012లో వివాహం కాగా... జొరావర్ అనే 7 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మెల్బోర్న్కు చెందిన ఆయేషాకు శిఖర్‌తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే వారిద్దరిని తన పిల్లలుగానే ప్రకటించిన ధావన్ బాధ్యతను కూడా తీసుకొని మెల్‌బోర్న్‌లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. (చదవండి: Actor Bala: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న నటుడు బాలా) వ్యక్తిగతంగా, తన కెరీర్ ఎదుగుదలలో ఆయేషా పాత్ర ఎంతో ఉందంటూ చాలా సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన ధావన్ తమ అన్యోన్యతను ప్రదర్శిస్తూ వచ్చాడు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగిపోయి దురదృష్టవశాత్తూ విడిపోయే పరిస్థితి వచ్చింది. జీవితంలో రెండోసారి తాను విడాకులు తీసుకోవాల్సి రావడంపై ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయేషా తన ఆవేదనను వ్యక్తం చేసింది. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు: అలా పెళ్లి.. ఇలా విడాకులు) View this post on Instagram A post shared by Aesha Mukerji (@apwithaesha) -
ముస్తఫా మొదటి భార్య ఆరోపణలు... ప్రియమణి స్పందన
నటి ప్రియమణి, ముస్తాఫా రాజ్‌ల వివాహం చెల్లదంటూ ఆయన మొదటి భార్య అయేషా వాదిస్తోన్న సంగతి తెలిసిందే. ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని.. కనుక ఇప్పటికీ ఆయన తన భర్తే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా అయేషా వ్యాఖ్యలపై ప్రియమణి పరోక్షంగా స్పందించింది. తమది చట్టవిరుద్ధ సంబంధం కాదని, చాలా బంధానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని(సెక్యూర్ రిలేషన్షిప్) అని స్పష్టం చేసింది. ఓ జాతీయ మీడియాతో ప్రియమణి మాట్లాడుతూ.. తన వివాహంపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. ముస్తఫా భర్తగా దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారని, అయినప్పటికీ రోజూ ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటామని చెప్పింది. ‘ఎక్కడ ఉన్నా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనది. నాకు, ముస్తాఫాకు మధ్య ఉన్న రిలేషన్ గురించి అడిగితే.. మేము చాలా అన్యోన్యంగా ఉంటున్నాం. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటీకి ఇద్దరం ప్రతి రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం. ఒకవేళ బిజీగా ఉండి మాట్లాడుకోకపోతే.. కనీసం హాయ్, బాయ్ అయినా చెపుకుంటాం. ఆయన ఫ్రీగా ఉంటే నాతో చాట్ చేస్తాడు. నేను కూడా షూటింగ్స్ లేకుండా ఖాళీగా ఉంటే అతనికి ఫోన్ చేస్తా. ఇలా ప్రతి రోజు మేం మాట్లాడుకుంటునే ఉంటాం. కొంతమంది మా బంధంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారందరికి నేను చెప్పేది ఒక్కటే. మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాం. ఏ బంధానికైనా అది చాలా అవసరం’ అని ప్రియమణి చెప్పుకొచ్చింది. కాగా.. ముస్తఫా రాజ్, ప్రియమణిని పెళ్లి చేసుకోక ముందే 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత.. భేదాభిప్రాయాలతో విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరు విడివిడిగా ఉంటూ వచ్చారు. ఇక తమ పిల్లల కోసం ముస్తఫా రాజ్ ప్రతి నెలా కొంత మొత్తం పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే 2017లో హీరోయిన్ ప్రియమణిని వివాహం చేసుకున్నాడు ముస్తాఫా రాజ్. అప్పటి నుంచి ప్రియమణితో కలిసి ఉంటున్నాడు. -
ప్రియమణితో నా భర్త పెళ్లి చెల్లదు గాక చెల్లదు
Priyamani, Mustafa Raj Marriage: ముస్తఫా రాజ్.. నటి ప్రియమణితో పెళ్లయ్యేనాటికి ఇతడికో భార్య ఉంది. ఆమె పేరు ఆయేషా. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ దంపతుల మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఇద్దరూ 2010 నుంచే విడివిడిగా బతుకుతున్నారు. ఈ క్రమంలో ముస్తఫా 2017లో ప్రముఖ నటి ప్రియమణిని పెళ్లాడాడు. రెండో పెళ్లి తర్వాత తన మొదటి భార్య పిల్లల కోసం ప్రతి నెలా ఎంతో కొంత డబ్బు పంపిస్తూ వస్తున్నాడు. అయితే తన భర్త పిల్లలను పట్టించుకోవడం లేదంటూ ఆయేషా మీడియా ముందు వాపోయింది. దీంతో ఈ ఆరోపణలను ముస్తఫా తోసిపుచ్చాడు. 'నా మీద వచ్చిన ఆరోపణలు అబద్ధం. పిల్లల పెంపకం కోసం అవసరమైనంత డబ్బును ఆయేషాకు క్రమం తప్పకుండా ఇస్తున్నాను. కానీ ఆమె నా దగ్గర నుంచి మరింత డబ్బును దొంగిలించాలని చూస్తోంది. పైగా హింసించానంటూ మాట్లాడుతోంది. మరి నేను తనను హింసింస్తే ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదు?' అని ప్రశ్నించాడు. మరోవైపు ఆయేషా మాత్రం ముస్తఫా తనకు మాజీ కాదని, ఇప్పటికీ భర్తే అని పేర్కొంది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదు. ఎందుకంటే ప్రియమణిని పెళ్లి చేసుకునేనాటికి కనీసం మేము విడాకుల కోసం కూడా దరఖాస్తు చేయలేదు. కాబట్టి ఇది అక్రమం కిందకే వస్తుంది. ఇద్దరు పిల్లల తల్లిగా మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పండి? వీలైతే మాట్లాడుకుని సమస్యను చక్కదిద్దుకోవాలని చూస్తారు, లేదంటే వేరే దారి చూసుకోవడం తప్ప మరో దిక్కు లేదు. కానీ ఇప్పుడతడు తన సమయాన్ని నాకు వ్యతిరేకంగా వాడాలని చూస్తున్నాడు' అని ఆయేషా అభిప్రాయపడింది. మరి ఈ వ్యవహారంపై ప్రియమణి ఎలా స్పందిస్తుందో చూడాలి! ఇదిలా వుంటే ప్రియమణి ఇటీవలే నటించిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్, 'నారప్ప' చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లు సాధించి ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటిస్తోన్న ప్రియమణి దక్షిణాదిన టాలెంటెడ్ నటిగా గుర్తింపు సంపాదించింది. -
‘లక్షద్వీప్’ కేసులో కేరళ హైకోర్టుకు ఆయేషా
కొచ్చి: లక్షద్వీప్‌లో కోవిడ్ విజృంభణకు లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వివాదంలో అరెస్ట్ నుంచి బయటపడేందుకు ఫిల్మ్ మేకర్ అయేషా సుల్తానా సోమవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కవరట్టికి తిరిగి వెళ్తే తనను అరెస్ట్‌చేస్తారని, ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ‘ ఒకప్పుడు కరోనా పాజటివ్ కేసులులేని లక్షద్వీప్‌లో ప్రఫుల్ పటేల్ వచ్చాక కోవిడ్ పరిస్థితులు దారుణంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం సంధించిన జీవాయుధం ఆయన’ అంటూ ఇటీవల ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆయేషా వ్యాఖ్యానించారు. ఆయేషా కేంద్రప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశారంటూ లక్షద్వీప్ బీజేపీ చీఫ్ అబ్దుల్ ఖాదర్ ఆమెపై పోలీసు ఫిర్యాదుచేశారు. దీంతో పదో తేదీన దేశద్రోహం ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. ప్రఫుల్‌కు ‘బ్లాక్ డే’ స్వాగతం లక్షద్వీప్‌లో సంస్కరణల పేరిట అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ అమల్లోకి తెచ్చిన విధానాలపై అక్కడి ప్రజల నుంచి వ్యక్తమవుతోన్న నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రఫుల్ లక్షద్వీప్‌కు విచ్చేసిన నేపథ్యంలో నిరసనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. చాలా చోట్ల జనం నల్లటి మాస్కులు ధరించి, వారి ఇళ్లపై నల్ల జెండాలను ఎగరేశారు. ప్రఫుల్ వ్యతిరేక నినాదాలిచ్చారు. -
బాలీవుడ్ లవ్ బర్డ్స్‌పై కేసు: హీరో తల్లి ఏమందంటే?
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బుధవారం ముంబై వీధుల్లో ప్రయాణించిన బాలీవుడ్ ప్రేమజంట టైగర్ ష్రాఫ్, దిశా పటానీలకు ముంబై పోలీసులు షాకిచ్చిన విషయం తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలకు నీళ్లొదులుతూ రోడ్ల మీద షికారుకొచ్చిన సెలబ్రిటీల మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సరైన కారణం లేకుండానే వారు బయటకు వచ్చారని తెలిపారు. దీంతో కరోనా టైంలో షికారేంటని ఈ జంట మీద కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా దాన్ని తీవ్రంగా ఖండించింది టైగర్ తల్లి ఆయేషా. "మీరు తప్పుగా అనుకుంటున్నారు. టైగర్, దిషా ఇంటికి కారులో తిరిగొస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని ఆధార్ కార్డులు చూపించమని అడిగారు. అయినా ఈ సమయంలో ఎవరూ అలా బయట చక్కర్లు కొట్టడానికి వెళ్లరు. ఏదైనా మాట్లాడేముందు నిజానిజాలు తెలుసుకోండి" అని మండిపడింది. 'టైగర్ ష్రాఫ్.. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఉచిత భోజనం అందించినదాని గురించి ఎవరూ మాట్లాడరు కానీ అతడి ప్రతిష్టను దిగజార్చేందుకు మాత్రం సిద్ధంగా ఉంటారు. అయినా అత్యవసరమైన వాటి కోసం బయటకు వెళ్లేందుకు అనుమతి ఉందన్న విషయం గుర్తుంచుకోండి' అని ఆయేషా చెప్పుకొచ్చింది. In the ongoing ‘War’ against the virus, going ‘Malang’ on the streets of Bandra cost dearly to two actors who have been booked under sections 188, 34 IPC by Bandra PStn . We request all Mumbaikars to avoid unnecessary ‘Heropanti’ which can compromise on safety against #COVID19 — Mumbai Police (@MumbaiPolice) June 3, 2021 చదవండి: దిశా మాజీ ప్రియుడి ఫొటోలు.. సల్మాన్ 2 రూపాయల ఆర్టిస్ట్! -
‘నిప్పు’లాంటి మనిషి ఒక్క నేస్తం చాలంటాను
ఇంట్లో ముగ్గురూ ఆడపిల్లలే. హర్షళ పెద్దమ్మాయి. మూడేళ్ల క్రితం తల్లి చనిపోయినప్పుడు తనే అంత్యక్రియలు నిర్వహించింది. ఇప్పుడు తండ్రి! కరోనా తో మే 9 న ఆయన హాస్పిటల్లో చనిపోయారు. హర్షళకు, చెల్లెళ్లకు కరోనా! లేచే పరిస్థితి లేదు. హర్షళ తన స్నేహితురాలికి ఫోన్ చేసి తన తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగలవా అని అడిగింది. ఆయేషా ఆ సమయంలో రంజాన్ ఉపవాసాల్లో ఉంది. ‘అలాగే హర్షా..’ అంది. మరి ఆ ‘తుది’ కార్యం?! హర్షళకు ఒక మాట చెప్పి ఆ కార్యాన్నీ తనే సంప్రదాయబద్ధంగా పూర్తి చేసింది! మతాల అంతరాలను చితాభస్మం చేసిన ఆయేషా ఇప్పుడు స్నేహమయిగా సర్వమత దీవెనలకు పాత్రమవుతోంది. కొల్హాపూర్‌లోని ఆస్టర్ ఆధార్ హాస్పిటల్లో సీనియర్ మేనేజర్ ఆయేషా. మహారాష్ట్ర ఇప్పుడు ఎలా ఉందో ఎవరూ వినంది కాదు. ఆస్టర్ ఆసుపత్రి కూడా అలానే ఉంది! డాక్టర్లు, నర్సులతో సమానంగా ఆసుపత్రి సీనియర్ మేనేజర్‌గా ఆయేషా మీద పడుతున్న ఒత్తిడి కూడా సాధారణంగా ఏమీ లేదు. ఆప్తుల్ని కోల్పోయిన వారికి ఓదార్పు నివ్వడం, కొన్నిసార్లు ఆ ఆప్తులకు ‘చివరి’ ఏర్పాట్లు చూడటం కూడా ఆమె పనే అవుతోంది. ప్రస్తుతం ఆమె రంజాన్ ఉపవాసంలో కూడా ఉన్నారు. నిజానికి ఈ పవిత్ర మాసం ప్రారంభం అయిన నాటినుంచే ఆయేషా, ఆమె కుటుంబ సభ్యులు కొల్హాపూర్ నగరంలోని సమాధిస్థలులు, దహన వాటికల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నవారికి ఉచితంగా పి.పి.ఇ. కిట్లు పంచి పెడుతున్నారు. ఆ పని మీదే ఈ నెల 9న ఆయేషా పంచగంగ శవ దహనశాలలో ఉన్నప్పుడు డాక్టర్ హర్షళావేదక్ నుంచి ఫోన్ వచ్చింది. ‘‘ఆయేషా.. నాన్నగారు పోయారు’’ అని చెప్పారు హర్షళ. ఆయన పోయింది ఆయేషా పని చేస్తున్న ఆస్టర్ ఆధార్ ఆసుపత్రిలోనే. ఆ ముందు రోజే ఆయన్ని కరోనాకు చికిత్సకోసం అక్కడ చేర్పించారు. ఆయేషా, హర్షళ స్నేహితులు. ఒకే వృత్తిలో ఉన్నవారు. హర్షళ కొల్హాపూర్‌లోనే ఛత్రపతి ప్రమీలారాజే ప్రభుత్వ ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయేషాకు ఆమె ఫోన్ చేసే సమయానికి హర్షళ కూడా కరోనాతో బాధపడుతున్నారు. ఆమె ఒక్కరే కాదు, ఆమె ఇద్దరు చెల్లెళ్లు కూడా. పైకి లేచే పరిస్థితి లేదు. ఆ సంగతి ఆయేషాకు తెలుసు. ‘‘ఆయేషా.. నాన్నగారికి ఏర్పాట్లు చేయించగలవా?’’ అని అడిగారు హర్షళ. ‘‘తప్పకుండా’’ అని చెప్పారు ఆయేషా. చనిపోయిన హర్ష తండ్రి సుధాకర్ వేదక్ వయసు 81 ఏళ్లు. మూడేళ్ల క్రితమే ఆయన భార్య కన్ను మూశారు. ఇక ఆయనకున్నది ముగ్గురు కూతుళ్లు. ఆ సంగతీ ఆయేషాకు తెలుసు. తనే ఆయన భౌతికకాయాన్ని ‘పంచగంగ’కు తెప్పించి దగ్గరుండి మరీ దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయించారు. అయితే మరింత దగ్గరగా ఉండవలసిన ప్రధాన కార్యం ఒకటి ఉంటుంది కదా. అక్కడ ఆమె ఆగిపోయారు. అది చేయించవలసిన కార్యం కాదు. చేయవలసిన కార్యం. చితికి నిప్పు పెట్టడం. పెడితే కొడుకు పెట్టాలి. కొడుకు లేకుంటే కూతురు. కానీ ఆయన ముగ్గురు కూతుళ్లు కరోనా బెడ్ మీద ఉన్నారు. హర్షళకు ఫోన్ చేశారు ఆయేషా. ‘‘హర్షా, ఎలా?’’ అని. ‘‘నీ చేతుల మీదే కానివ్వు’’ అని హర్షళ అన్నారు. ఆయేషా అప్పటికప్పుడు పి.పి.ఇ. గౌన్ ధరించారు. పురోహితుడు దూరంగా ఉండి.. ఆమె చేతుల మీదుగా ‘జరగవలసిన పని’ని జరిపించారు. ‘‘ఇలా చేసినందుకు మీ ‘వాళ్లు’ , మీ ఇంట్లో వాళ్లు ఏమీ అనలేదా?!’ అనే ప్రశ్న ఆయేషాకు.. ‘‘అలా ఎలా చేయించావ్, మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుందా?!’’ అనే ప్రశ్న హర్షళకు.. ఎదురైంది! ‘‘మేము చేయలేని స్థితిలో ఆయేషాను మా తోబుట్టువనే అనుకున్నాం’’ అని చెప్పారు హర్షళ. ‘‘ఇందులో అనడానికి, అనుకోడానికి ఏముంది?! మనిషికి మనిషి సాయపడటం అన్నది దేవుని ఆదేశమే కదా..’’ అని అన్నారు ఆయేషా. మూడేళ్ల క్రితం ముంబైలో హర్షళ తల్లి క్యాన్సర్‌తో చనిపోయినప్పుడు హర్షళే ఆమెకు అంతిమ సంస్కారాలు జరిపారు. తండ్రి విషయంలో ఆ అవకాశం లేకుండా పోయింది. ‘‘మా అమ్మానాన్న మమ్మల్ని ఆడపిల్లలమన్న వివక్షతో, పాతకాలపు కట్టుబాట్లతో పెంచలేదు. ఆయేషా మా నాన్నగారికి దహన క్రియలు నిర్వహించినంత మాత్రాన ఆయన ఆత్మకు శాంతి కలగకుండా పోదు’’ అని హర్షళ అంటుంటే.. ‘‘నేను స్వీకరించిన నా స్నేహితురాలి బాధ్యతను ఎవరూ హర్షించకుండా లేరు. అలాగైతే మరి కొల్హాపూర్ చరిత్రలో ఎన్ని సామాజిక సంస్కరణల ఉద్యమాలు జరగలేదూ..’’ అంటున్నారు ఆయేషా. -
ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు
కార్తీక్ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయేషా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అమ్మాయంటే అలుసా?’. నేనే శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో వై. బ్రహ్మ శేఖర్, వై. లిఖితా చౌదరి నిర్మించారు. ఈ నెల 16న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నేనే శేఖర్ మాట్లాడుతూ – ‘‘ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు. వారికి గౌరవం ఇవ్వాలి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. చాలా సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమా తెరకెక్కించాను’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: వినీష్ గౌడ్, కో ప్రొడ్యూసర్: ఎన్. మాధవరెడ్డి. -
ఏడేళ్లుగా ఇదే ఫిట్నెస్తో ఉన్నా!
కేరళలో పుట్టి, చెన్నైలో పెరిగిన ఆయేషా...నందినిగా తెలుగువారికి సుపరిచితమే. ‘స్టార్ మా’టీవీలోప్రసారమవుతున్న ‘సావిత్రమ్మగారి అబ్బాయి’ సీరియల్ద్వారా ‘మా అమ్మాయే’ అని తెలుగునోట ప్రశంసలు అందుకుంటున్న ఆయేషా చెబుతున్న ముచ్చట్లివి. ‘‘నన్ను తెలుగు ప్రేక్షకులు ‘మా అమ్మాయే’ అనుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ‘సావిత్రమ్మగారి అబ్బాయి’సీరియల్ బాగా పల్లె వాతావరణంతో ముడిపడి ఉంటుంది. బాలరాజు – నందినిల జోడీ చూడముచ్చటగా ఉందని అందరూఅంటున్నారు. అలాంటి ఫ్యామిలీ రియల్ లైఫ్‌లో దొరికితే సూపర్ హ్యాపీ (నవ్వుతూ). ఈ సీరియల్ చూస్తూ మా అమ్మ నాకుచెన్నై నుంచి ఫోన్ చేస్తారు ‘ఈ సన్నివేశంలో బాగా యాక్ట్ చేశావ్, ఇప్పుడు మీ అత్తగారు ఎలా ఉన్నారు?’ అంటూఫన్నీగా మాట్లాడతారు. ఏవైనా సజెషన్స్ ఉంటే చెబుతారు. ఇప్పుడు రోజులు చాలా సరదాగా జరిగిపోతున్నాయి. తెలిసిన వారి ద్వారా! చదువుకునే రోజుల్లో నుంచే యాక్టింగ్ అంటే బాగా ఇష్టం. నాకు ఓ తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. నాన్న బిజినెస్ మ్యాన్. అమ్మ గృహిణి. చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. నాకు ప్రొడక్షన్ టీమ్స్ ద్వారా సీరియల్ ఆఫర్స్ వచ్చాయి. ముందు తమిళ్లో మూడు సీరియల్స్ చేశాను. ఇప్పుడు తెలుగులో ‘సావిత్రమ్మగారి అబ్బాయి’ సీరియల్ చేస్తున్నాను. తమిళ్లో కూడా ‘సత్య’ అనే సీరియల్ చేస్తున్నాను. అంతకుముందు ఓ తమిళ్ సినిమాలోనూ నటించాను. ఒప్పించడం చాలా కష్టం మా అమ్మానాన్న ముందు నేను ‘యాక్టింగ్’ అంటే మరో మాట లేకుండా ‘నో’ అన్నారు. ఇంట్లో అంతా ‘నాట్ గుడ్’ అన్నారు. అందరినీ ఒప్పించడానికి నాకు బాగానే టైమ్ పట్టింది. చివరికి ఇక నా ఆసక్తి గమనించి ‘ఓకే’ చేశారు. ఇప్పుడు అమ్మ, నాన్న చాలా హ్యాపీ. మా రిలేటివ్స్ కూడా ఇప్పుడు నా సీరియల్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఏ ఎపిసోడ్లో బాగున్నాను, ఎలా యాక్ట్ చేస్తున్నాను.. అనే విషయాలు నాకు ఫోన్ ద్వారానో, కలిసినప్పుడో చెబుతారు. కలర్‌ఫుల్ లైఫ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. రోజంతా వర్క్ అంటే నాకు ఇష్టం లేదు. లైఫ్ కలర్ఫుల్గా, ఎంజాయ్‌గా గడిచిపోవాలని కోరుకుంటాను. నాక్కాబోయే భర్త కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. నేను పూర్తిగా నాన్వెజిటేరియన్. ఎలాంటి ఫిట్నెస్ జాగ్రత్తలు లేవు. ఏడేళ్లుగా ఇదే ఫిట్నెస్తో ఉన్నాను. బహుశా ఎక్కడా ఖాళీ లేకుండా, హ్యాపీగా ఉండటం వల్ల ఇప్పుడూ అలాగే ఉన్నాను. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ఈ లైఫ్‌ని ఇలా హ్యాపీగా గడిపేస్తే చాలనుకుంటున్నాను.’’ టైమ్ దొరికితే నిద్ర చదువుకునే టైమ్‌లో పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు అస్సలు ఖాళీ అస్సలు టైమ్ లేదు. కాస్త ఖాళీ టైమ్ దొరికితే చాలు నిద్రపోతాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు నెలలో ఇరవై రోజులు వర్క్ ఉంటుంది. -
ఆయేషాకు ఆర్థికసాయం
వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట: కడపలోని రాజీవ్ గాంధీనగర్‌కు చెందిన ఆయేషా(8) చిన్ని వయసులోనే పెద్ద వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఉన్నట్టుండి కోమాలోకి వెళుతోంది. కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం లేదని వైద్యులు చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.40లక్షలు అవసరం అవుతాయి. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద తల్లిదండ్రులు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విషయంపై ఈ నెల5న అయ్యో ఆయేషా శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల (ఏఐటీఎస్) విద్యార్థులు షేక్‌మస్తాన్, షేక్ ఖాదర్‌వల్లి స్పందించారు. సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గురువారం వారు మాట్లాడుతూ ఆయేషాకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఆర్థిక సాయం అందించాలని భావించామన్నారు.తమ నగదుతోపాటు రాజంపేట పట్టణంలోని కాకతీయ, నలందా విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించామన్నారు. ఈ విధంగా వచ్చిన రూ.50వేలను ఆయేషా తల్లిదండ్రులకు అందజేసినట్లు వివరించారు. ప్రస్తుతం చిన్నారి చెన్నైలోని ఎగ్మోర్‌పరిధిలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పోందుతోందని చెప్పారు. -
మూడు పుష్అప్స్కే చేతులెత్తేసిన స్టీఫెన్ కర్ర్రీ
-
ఆయేషా పేరెంట్స్‌కు న్యాయం జరగాలి
-
ఆయేషా పేరెంట్స్‌కు న్యాయం జరగాలి: సత్యంబాబు
రాజమండ్రి : ఆయేషా హత్య కేసులో 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు ఆదివారం ఉదయం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా సత్యంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆయేషా హత్య కేసులో న్యాయం గెలిచిందన్నారు. తన కుటుంబం దీనస్థితిలో ఉందన్నారు. ఈ కేసులో తనకు ఆయేషా తల్లిదండ్రులు ఎంతో సహాయం చేశారని పేర్కొన్నారు. ఆయేషా హత్య కేసులో తనకు ప్రమేయం లేదని మొదట్నుంచి ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారని గుర్తు చేశారు. ఆయేషా తల్లిదండ్రులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనలాగే ఎంతోమంది అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. వారందరికీ ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఆయేషా హత్య కేసులో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం విదితమే. హైకోర్టు తీర్పుతో సత్యంబాబు ఇవాళ విడుదలయ్యారు. -
పాతబస్తీలో దారుణం
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ ఖాజీపురాలో బుధవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో అంజాద్ అనే యువకుడు ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ప్రియురాలు అయేషా తీవ్రంగా గాయపడింది. కూతురుపై జరుగుతున్న దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులపై సైతం అంజాద్ దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు శాలిబండ పోలీసులు అంజాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై నిర్భయ, హత్యాయత్నం కేసులు నమోదుచేశారు. -
యువతి పెళ్లికి నిరాకరించిందని..
-
డెంగీతో బాలిక మృతి
జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ జమాల్ కాలనీకి చెందిన ఓ బాలిక డెంగీతో బాధపడుతూ మృతి చెందింది. స్థానికంగా నివాసముంటున్న ఆయేషా(12) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. -
29 ఏళ్ల తరువాత... అమ్మ దొరికింది!
-
28 ఏళ్ల తరువాత... అమ్మ దొరికింది!
- పేగుబంధం కోసం యూఏఈ నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు - పోలీసుల సాయంతో ఒక్కటైన వైనం హైదరాబాద్: ‘‘మీకు తల్లి ఉంది. ఆమె పేరు నాజియా. 35 ఏళ్ల కింద హైదరాబాద్ బార్కాస్‌లో ఆమెను వివాహం చేసుకున్నా. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు మనస్పర్థల కారణంగా విడాకులిచ్చి పంపాను..’’ చనిపోతున్న సమయంలో ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు చెప్పిన మాటలివీ! చిన్నప్పట్నుంచీ కన్నతల్లి ప్రేమకు దూరంగా బతికిన ఆ అక్కాచెల్లెళ్లు ఈ మాటలతో తల్లి అన్వేషణలో పడ్డారు. చివరికి హైదరాబాద్ పోలీసుల చొరవతో 28 ఏళ్ల తర్వాత యూఏఈ(యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్)కు చెందిన ఆ అక్కాచెల్లెళ్లకు వారి తల్లి ఆచూకీ దొరికింది. యూఏఈలో నివాసం ఉంటున్న ఆయేషా, ఫాతిమాల తండ్రి రాషెద్ ఆరు మాసాల క్రితం చనిపోయారు. కన్నుమూసే ముందు తన బిడ్డలకు హైదరాబాద్‌లో ఉంటున్న తల్లి జాడ చెప్పాడు. దీంతో ఆ అక్కాచెల్లెళ్లు యూఏఈ నుంచి ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ వచ్చి దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణను కలిశారు. తమ తల్లిని వెతికి పెట్టాలని కోరారు. పోలీసులు పూర్తి వివరాలు సేకరించి నాజియా బేగానికి సంబంధించిన ఫోటోలతో కరప్రతాలు పంపిణీ చేశారు. పెళ్లిళ్లు జరిపించే కాజీలు, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులతో సమావేశమవగా చిన్నపాటి క్లూ దొరికింది. దాని ఆధారంగా ఎట్టకేలకు గురువారం నాజియాను గుర్తించారు. విడాకులిచ్చి భర్త వదిలేసిన అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన నాజియాకు రెండేళ్ల తర్వాత ఆమె తల్లిదండ్రులు కర్ణాటకలోని బీదర్‌కు చెందిన పండ్ల వ్యాపారితో పెళ్లి చేశారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఆయేషా, ఫాతిమాను, తల్లి నాజియాను డీసీపీ కార్యాలయానికి పిలిపించి కలిపారు. చిన్నప్పటి జ్ఞాపకాలను పోలీసులు అడగ్గా.. నాజియా తన చిన్న కూతురు ఫాతిమా చేతికి ఆరు వేళ్లు ఉన్నాయని చెప్పింది. ఆమె చెప్పినట్లే ఫాతిమాకు ఆరు వేళ్లున్నాయి. దీంతో తల్లి కూతుళ్లను ఒకే దగ్గరికి తీసుకురావడంతో ఒక్కసారిగా వారు భావోద్వేగానికి గురై ఆనందభాష్పాలు రాల్చారు. ఈ జన్మలో తల్లిని చూస్తామనుకోలేదంటూ సంబరపడ్డారు. తల్లి అంగీకరిస్తే తమతోపాటు యూఏఈకి తీసుకెళ్తామని అక్కాచెల్లెళ్లు తెలిపారు. -
సెల్ఫీ తీసుకుంటున్న భార్యను తోసేశాడు
మీరట్: కట్నం కోసం ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పైపెచ్చు భార్య కాల్వలో పడిపోయిందంటూ కల్లబొల్లి ఏడ్పులతో పోలీసులనే తప్పుదోవ పట్టించాడు. చివరకు పోలీసులు రంగంలోకి దిగటంతో అతగాడు అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఈ సంఘటన సోమవారం ఉత్తరప్రదేశ్ మీరట్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... అఫ్తాబ్ (30) భార్య అయేషాతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఆమె గంగా కెనాల్ వద్ద సెల్ఫీ తీసుకుంటోంది. అదును చూసుకుని అఫ్తాబ్ ...భార్యను కాల్వలోకి తోసేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు సర్దానా పోలీస్ స్టేషన్లో తన భార్య ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయినట్లు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు అయేషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అయితే విచారణలో అఫ్తబ్ పొంతనలేని సమాధానం చెప్పడంతో అతడిని అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపడంతో నేరాన్ని అంగీకరించాడు. అయేషాను అడ్డు తొలగించుకునేందుకే ఆమెను అంతం చేసినట్లు తెలిపాడు. అఫ్తాబ్, అయేషాలకు ఏడాదిన్నర క్రితమే వివాహం అయింది. వీరికి ఎనిమిది నెలల కుమారుడు కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించి అఫ్తాబ్ తో పాటు అతని సోదరుడు షహ్నాజ్పై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. -
దుబాయ్ నుంచి అమ్మ కోసం..
మూడు దశాబ్దాల తర్వాత కన్నతల్లిని వెతుక్కుంటూ ఎడారి దేశం దుబాయ్ నుంచి ఇద్దరు అక్కాచెల్లెళ్లు హైదరాబాద్ వచ్చారు. తమ తల్లి జాడ చెప్పండని వారు కనిపించిన వారినల్లా వేడుకుంటున్నారు. నగర పోలీసులను ఆశ్రయించి ముప్పై ఏళ్ల క్రితం తమను వదిలి వెళ్లిన తమ తల్లిని వెతకమని అభ్యర్థించారు. తమ వద్ద నున్న తల్లి ఫోటోను, వివరాలను వారికి అందజేశారు. ఈ సంఘటన సంబంధించిన పూర్తి సమాచారం ఇలా ఉంది..1981 డిసెంబర్ 7న హైదరాబాద్ పాతబస్తీకి చెందిన రజియా బేగం అనే అమ్మాయిని దుబాయ్‌కు చెందిన రషీద్ ఈద్ ఒబేద్ రిఫక్ మస్మారీ అనే అరబ్ షేక్ హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. అనంతరం రజియాను తనతో పాటు దుబాయ్ తీసుకెళ్లాడు. వీరు 7 ఏళ్ల కాపురం తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రజియా హైదరాబాద్ వచ్చేసింది. రజియా, మస్మారీ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఆ తర్వాత మస్మారీ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు సవతి తల్లి దగ్గరే పెరిగారు. తండ్రి చనిపోతూ అసలు విషయం చెప్పాడు. ఈమె మీకు సవతితల్లే కానీ కన్న తల్లి కాదు అనీ.. మీ కన్న తల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిపాడు. దీంతో ఇద్దరు యువతులు కన్నతల్లి కోసం వెతుకులాట ప్రారంభించారు. అయేషా రషీద్ ఈద్ ఒబేద్(29), ఫాతిమా రషీద్ ఈద్ ఒబేద్(25) అనే ఇద్దరు యువతులు మీడియాతో మాట్లాడుతూ..మా తండ్రి, మా అమ్మకు 1988లో విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి మా అమ్మను చూసే అవకాశం రాలేదు. నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మ కోసం హైదరాబాద్‌కు వచ్చాం. కానీ ఆమె జాడ కనిపెట్టలేకపోయాం. కొంత మంది మిత్రుల సహాయంతో మళ్లీ అమ్మను వెతకటానికి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. మా జీవితంలో ఒక్కసారైనా అమ్మను చూడాలనేదే తమ కోరికన్నారు. ఇద్దరు యువతులు సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణను కలిసి తమ అమ్మ జాడ కనిపెట్టాల్సిందిగా అభ్యర్థించారు. -
'ఆమె' ప్రపంచాన్ని జయించింది!
ఆమె ఇప్పుడు ప్రపంచాన్ని జయించింది. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ టెలివిజన్ సర్వీస్ తీస్తున్న డాక్యుమెంటరీకి కథగా మారింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న లింగ వివక్షపై సానుకూల మార్పులను ప్రోత్సహించే నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రానికి కథాంశమైంది. కోల్ కత్తా మురికివాడలనుంచి పుట్టిన ముత్యంలా.. అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ గా పేరు తెచ్చుకోవడమే కాక... డాక్యుమెంటరీకి ఎంపికైన ఏకైక భారతీయురాలుగా అయేషా నూర్ గుర్తింపు పొందింది. మూర్ఛరోగం, పేదరికంతో పోరాడుతూనే తన లక్ష్యాన్ని సాధించింది కోల్ కత్తా మురికి వాడకు చెందిన 19ఏళ్ళ యువతి అయేషా నూర్. తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ మరణించినా.. ఆమె వెనుకంజ వేయలేదు. తన కరాటే కోచ్ ప్రోత్సాహంతో ప్రపంచ ప్రఖ్యాత బ్లాక్ బెల్ట్ ను సాధించింది. ఐదు దేశాలకు చెందిన ఐదుగురు యువతుల వ్యక్తిగత గాధలను ఐటీవీ సర్వీసెస్ తెరకెక్కించింది. ఐదుగురి కథాంశం ఒకేలా ఉన్నా... ఒక్కో యువతీ ఇతర యువతులకు ఒక్కో రకంగా సహాయం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అంటారు నెదర్లాండ్ కు చెందిన చిత్ర నిర్మాత కోయెన్ సూయిడ్ గీస్ట్. కోల్ కత్తాలోని మురికివాడకు చెందిన మాఫిడల్ ఇస్లాం లైన్ లోని రెండు బిర్యానీ దుకాణాల మధ్య ఉన్న ఒకే ఒక్క గదిలో అయేషా కుటుంబం నివసిస్తోంది. థాయ్ పిఛాయ్ ఇంటర్నేషనల్ యూత్ కరాటే ఛాంపియన్ షిప్ కు సారధ్యాన్ని వహించిన అయేషా... పన్నెండు మంది సభ్యులున్న భారత జట్టులో ఒకే ఒక్క యువతి. 2012 లో రాష్ట్ర, జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ లో మూడు బంగారు పతకాలను కూడ సాధించింది. రాజ్ బజార్ సైన్స్ కాలేజీకి ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ప్రతి ఆదివారం సాయంత్రం బాలికలు, యువతులు ఆత్మ రక్షణకోసం అయేషా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టి ఎందరికో తర్ఫీదునిస్తోంది. ''తండ్రి మరణంతో కుటుంబాన్ని ఈడ్చేందుకు, కడుపు నింపుకునేందుకు నా తల్లి కుట్టుపని చేయడం ప్రారంభించింది. ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి కరువే. నా కోచ్ ఎం. ఎ. అలీ. ఆయనకు ముందుగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన లేకుండా నాకేదీ సాధ్యమయ్యేది కాదు'' అంటుంది అయేషా. 1988 లో ఓ ప్రముఖ కరాటే టోర్నమెంట్ లో స్వర్ణం సాధించారు అలీ... కుటుంబాన్ని నెట్టేందుకు తాత్కాలిక షూ వ్యాపారం చేసే అయేషా సోదరుడు తన్వీర్.. ఆమె పట్టుబట్టడంతో.. అలీవద్ద శిక్షణకు చేర్పించాడు. ఆమె పట్టుదలే.. అనుకున్నది సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచానికే లింగ వివక్షపై అవగాహన కల్పించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ..లక్ష్య సాధనే ధ్యేయంగా గుర్తింపు పొందిన అయేషా నూర్ కథ... ఇప్పుడు ఓ అసాధారణ గాధగా తెరకెక్కింది. జోర్ధాన్, కెన్యా, పెరు, బంగ్లాదేశ్ లకు చెందిన మరో నలుగురు మహిళల కథలతోపాటు అయేషా నూర్ జీవిత కథ చిత్రంగా రూపొందింది. లాభాపేక్ష లేని సంస్థగా ఐ టీ వీ సర్వీస్... పలు అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రాజెక్లులకు నిధులను ఇచ్చి ప్రోత్సహిస్తుంది. యూఎస్ కాంగ్రెస్ ఆదేశంతో 1988 లో ఈ సంస్థ స్థాపించారు. అయితే డాక్యుమెంటరీ విషయం కోల్ కత్తా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియడంతో, మైనారిటీ వ్యవహారాల శాఖ అయేషా నూర్ కు సాహాయం అందించేందుకు ప్రయత్నించింది. అయితే అయేషా దాన్ని స్వచ్ఛందంగా తిరస్కరించింది. -
కెమెరాలతో నిఘా
= మోడీ సభకు భద్రత కట్టుదిట్టం = పాట్నాలో పేలుళ్ల దృష్ట్యా తనిఖీలు ముమ్మరం = సభకు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని ప్యాలెస్ మైదానంలో ఆదివారం జరుగనున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పించనుంది. సభ మైదానంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే నగరంలో అనుమానాస్పద పరిస్థితుల్లో సంచరిస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బీహార్‌లో ఇటీవల మోడీ సభకు కొద్ది గంటల ముందు సంభవించిన వరుస పేలుళ్ల దృష్ట్యా పోలీసులు ఏ చిన్న అవకాశానికి కూడా తావు లేకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా పోలీసులకు యూనిఫారాలను సరఫరా చేసే ఓ టైలర్ నుంచి ఎవరో అపరిచిత వృద్ధుడు పది జతలను కొనుగోలు చేశారని వెల్లడవడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడిగా భావిస్తున్న ఆ వృద్ధుడు యూనిఫారాలతో పాటు కానిస్టేబుళ్లు ధరించే టోపీ, లాఠీలను కూడా కొనుగోలు చేశారని తెలియ వచ్చింది. దీంతో మోడీకి అత్యంత సమీపంలో విధులు నిర్వర్తించబోయే పోలీసు అధికారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ నిర్ణయించారు. వృద్ధుని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నాకాబందీ నగరంలో వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో బందోబస్తును రెట్టింపు చేశారు. మెజిస్టిక్ బస్టాండు, రైల్వే స్టేషన్లలో నిఘా వేసి అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా బహిరంగ సభ జరిగే ప్యాలెస్ మైదానాన్ని పోలీసులు స్వాధీన పరచుకున్నారు. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. బీజేపీ కార్యకర్తలు, వేదిక నిర్మాణంలో పాల్గొంటున్న కార్మికులను తనిఖీ చేసి లోనికి వదులుతున్నారు. ఇప్పటికే 300 మంది సాయుధ పోలీసులు మైదానం చుట్టూ మోహరించారు. బహిరంగ సభకు సుమారు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశాలున్నందున, మైదానంలో నిఘా టవర్లను ఏర్పాటు చేశారు. మూల మూలన సీసీటీవీ కెమెరాలను నెలకొల్పారు. కొందరు పోలీసులు హ్యాండీ కెమెరాలతో చిత్రీకరణలో నిమగ్నమయ్యారు. భద్రత దృష్ట్యా ఆదివారం బ్యాగులు, నీటి సీసాలను లోనికి అనుమతించేది లేదని పోలీసులు తెలిపారు. మైదానం వద్ద ఆ రోజు మొత్తం ఐదు వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారు. -
అయేషా దంపతుల అరెస్ట్
= మోడీ టార్గెట్‌గా పాట్నాలో జరిగిన పేలుళ్ల కేసు ... = న్యాయస్థానంలో హాజరు పర్చిన పోలీసులు = అనుమతితో కస్టడీలోకి తీసుకున్న బీహార్ పోలీసులు = పాట్నాకు నిందితుల తరలింపు = వివిధ ప్రాంతాల్లోని ఉగ్రవాదులతో వీరికి లింకు = అయేషా ఖాతాల్లో రూ.5 కోట్లకు పైగా నగదు = పని మనిషి నుంచి కోట్లకు పడగలెత్తిన వైనం = 35 బ్యాంకు ఖాతాలు, 25 ఏటీఎం కార్డుల స్వాధీనం బెంగళూరు, న్యూస్‌లైన్ : బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ లక్ష్యంగా బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి మంగళూరుకు చెందిన అయేషా భాను అలియాస్ ఆశ అలియాస్ ఇందిరా, ఆమె భర్త జుబేర్‌లను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మధ్యాహ్నం వారిని మంగళూరులోని మూడవ జే ఎంఎఫ్సీ న్యాయస్థానం ముందు హాజరు పరిచినప్పుడు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా బీహార్ పోలీసులు చేసిన అభ్యర్థనను న్యాయాధికారి ఆమోదించారు. దరిమిలా వారిద్దరూ ట్రాన్సిట్ వారెంట్‌పై పాట్నాకు తీసుకెళ్లారు. అయేషా స్వగ్రామానికి చెందిన రఘు, ఉదయ్‌కుమార్ అనే ఇద్దరిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరి సహాయంతో ఆయేషా ఎస్బీఎం, ఎస్బీఐలలో నకిలీ ఖాతాలను ప్రారంభించినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. అయేషా వద్ద నకిలీ పాన్ కార్డు కూడా ఉంది. ఆమె ఖాతాల్లో రూ. 5 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు తేలింది. ఆమె ఇంటిలో తొమ్మిది మొబైల్ ఫోన్లు, 35 బ్యాంకు పాస్‌బుక్కులు, 25 ఏటీఎం కార్డులనూ స్వాధీనం చేసుకున్నారు. హవాల సొమ్ము రఘు, ఉదయ్‌కుమార్‌ల ఖాతాలలో జమైంది. అనంతరం అయేషా ఖాతాలకు బదిలీ అయింది. దీనికి ప్రతిఫలంగా ఇద్దరికి మొత్తంలో 10 శాతం ముట్టింది. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఉగ్రవాదులకు ఆయేషా, జుబేర్‌లు నగదు సరఫరా చేశారు. జుబేర్ వ్యాపారం నిమిత్తం దుబాయ్‌కు వెళ్లిన సమయంలో అక్కడ ఉగ్రవాదులతో పరిచయమైంది. వారు పంపే నగదు అయేషా, మిగిలిన ఇద్దరి ఖాతాల్లో జమ అయ్యేది. పాట్నాలో వరుస పేలుళ్లు సృష్టించిన వారికి అయేషా నగదు సహాయం చేసినట్లు బీహార్ పోలీసులు ఆధారాలు సేకరించారు. పని మనిషి నుంచి కోట్లకు పడగలెత్తిన అయేషా కొడగు జిల్లా కేంద్రం మడికేరి సమీపంలో ఉన్న విరాజ్‌పేట శివార్లలోని దేవణగెరె గ్రామంలో నివాసం ఉంటున్న భీమయ్య కుమార్తె అయేషా. ఏడో తరగతి వరకు అదే గ్రామంలో చదువుకుంది. మడికేరిలోని పొత్తోలిలో జుబేర్ బంధువులు నివాసం ఉంటున్నారు. వారి ఇంటిలో అయేషా పని చేసేది. జుబేర్ ఆ ఇంటికి వచ్చి వెళుతున్నప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరువాత ప్రేమ వివాహం చేసుకుని మంగళూరులో కాపురం పెట్టారు. జుబేర్‌కు ఆయేషా రెండవ భార్య అని మంగళూరు ఏసీపీ రవి కుమార్ తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
-
చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంటగలిసింది. తల్లి చేసిన అప్పు తీర్చలేదని అయిదేళ్ల కూతురిని పదిరోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేశాడో కామాంధుడు. పదిరోజులుగా గుండెల నిండా భయంతో ఈ విషయాన్ని మౌనంగానే భరించిన ఆ తల్లి .... కూతురు ఎంతకూ తిరిగి రాకపోవడంతో విషయం ఇరుగు పొరుగు వాళ్లకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ముబారక్ ఇంటిపై దాడి చేసి చిన్నారిని విడిపించారు. వివరాల్లోకి వెళ్లితే చిత్తూరు జిల్లా పలమనేరు శివార్లలోని దాబా హోటల్లో ఓ మహిళ కూలీగా పని చేస్తోంది. నాలుగు నెలల క్రితం తన తల్లి వైద్యం కోసం ముబారక్ అనే వ్యక్తి నుంచి 2 వేల రూపాయలు అప్పు తీసుకుంది. అదే పాపమైంది. అప్పు తీర్చలేదని పది రోజుల క్రితం ఆమె 5 ఏళ్ల కూతుర్ని ముబారక్ తనతోపాటు తీసుకెళ్లిపోయాడు. తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా ముట్టజెప్పి బిడ్డను తీసుకెళ్లాలని బెదిరించాడు. దాంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన తల్లి ఇక తన కూతురి కోసం ఇరుగు పొరుగును ఆశ్రయించటంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘాతుకానికి పాల్పడిన కామాంధుడు ముబారక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.