
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోయాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయేషా నిర్ధారించింది. వీరిద్దరికి 2012లో వివాహం కాగా... జొరావర్ అనే 7 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన ఆయేషాకు శిఖర్‌తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే వారిద్దరిని తన పిల్లలుగానే ప్రకటించిన ధావన్ బాధ్యతను కూడా తీసుకొని మెల్‌బోర్న్‌లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు.
(చదవండి: Actor Bala: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న నటుడు బాలా)
వ్యక్తిగతంగా, తన కెరీర్ ఎదుగుదలలో ఆయేషా పాత్ర ఎంతో ఉందంటూ చాలా సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన ధావన్ తమ అన్యోన్యతను ప్రదర్శిస్తూ వచ్చాడు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగిపోయి దురదృష్టవశాత్తూ విడిపోయే పరిస్థితి వచ్చింది. జీవితంలో రెండోసారి తాను విడాకులు తీసుకోవాల్సి రావడంపై ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయేషా తన ఆవేదనను వ్యక్తం చేసింది.
(చదవండి: తొందరపడుతున్న నవ జంటలు: అలా పెళ్లి.. ఇలా విడాకులు)
Comments
Please login to add a commentAdd a comment