Know Interesting Facts About Ayesha Mukherjee - Sakshi
Sakshi News home page

Ayesha Mukherjee: అసలు ఎవరీ అయేషా..? శిఖర్‌తో విడిపోవడం వెనుక..

Published Wed, Sep 8 2021 11:39 AM | Last Updated on Thu, Sep 9 2021 2:53 PM

Shikhar Dhawan Divorce: Who Is Ayesha Mukherjee Interesting Facts - Sakshi

మెల్‌బోర్న్‌: టీమిండియా  స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా అయేషా ముఖర్జీ విడాకుల విషయాన్ని అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అయేషాను ప్రేమించిన ధావన్‌ 2012లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.  ఈ దంపతులకు 2014లో కుమారుడు జొరావర్ జన్మించాడు. దాదాపు తొమ్మిది ఏళ్ల కలిసి ఉన్న తర్వాత అయేషా ఇలాంటి ప్రకటన చేయడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

కాగా విడాకుల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో అయేషా భావోద్వేగపూరితంగా ఓ పోస్టు పెట్టింది. విడాకులు అనే పదం ఒక చెత్తం పదం అని.. ‘మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు నేను చాలా భయపడ్డానని, ఏదో తప్పు చేస్తున్నాని,జీవితంలో నేనేదో కోల్పోయినట్లు బాధపడ్డాను. నా స్వార్థం కోసం తల్లిదండ్రులు,పిల్లలను ఇబ్బంది పెడుతున్నానని అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాను. జీవితంలో నేను నేంటో నిరూపించుకోవడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది అంటూ అయేషా రాసుకొచ్చింది.

అసలు ఎవరీ ఆయేషా ముఖర్జీ?
పశ్చిమ బెంగాల్‌కి చెందిన అయేషా ముఖర్జీ  కుటుంబం ఆమె 8 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వెళ్లి స్థిరపడింది. కిక్ బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొందిన అయేషా.. జాతీయ స్థాయి కిక్‌బాక్సర్‌గా గుర్తింపు పొందింది. కాగా ధావన్‌ను వివాహం చేసుకోవడానికి ముందు ఆయేషా ముఖర్జీ ఆస్ట్రేలియా వ్యాపారవేత్తను  వివాహం చేసుకుంది. అయితే.. కొన్నాళ్లకే  వారి వైవాహిక బంధానికి తెర పడింది. వాళ్ల దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు ఆడ పిల్లలు కూడా ఉన్నారు.

శిఖర్ ధావన్‌ లవ్‌ స్టోరీ:
శిఖర్ ధావన్‌తో అయేషా ముఖర్జీ మొదటి పరిచయం ఫేస్‌బుక్ ద్వారా జరిగింది. వీరిద్దరికి టీమిండియా వెటరన్‌ క్రికెటర్ హర్భజన్ సింగ్ కామన్ ఫ్రెండ్. శిఖర్ ధావన్, భజ్జీ ఫేస్‌బుక్‌లో అయేషా ఫోటోను చూసి తొలి చూపులోనే  ప్రేమలో పడ్డాడు. అయితే వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన ధావన్ భజ్జీ స్నేహితుడు కావడంతో శిఖర్ ధావన్ కు లైన్‌ క్లియర్‌ అయిపోయింది. 

స్నేహంతో మొదలైన ఆ పరిచయం ప్రేమగా మారింది. తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానకి నిశ్చయించుకున్నారు. అయితే ఈ పెళ్లికి శిఖర్ ధావన్‌   కుటుంబ సభ్యులు  అంగీకరించలేదు. శిఖర్ ధావన్ కంటే అయేషా దాదాపు 10 ఏళ్లు పెద్ద కావడం ఇందుకు ఒక కారణమని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే, తన తల్లి అంగీకారంతో 2009లో ఇంటి నుంచి బయటకు వచ్చిన శిఖర్‌ .. 2012 సంవత్సరంలో అయేషాను పెళ్లి చేసుకున్నాడు.

ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే వారిద్దరిని తన పిల్లలుగానే ప్రకటించిన ధావన్‌.. బాధ్యతను కూడా తీసుకొన్నాడు. ఎప్పుడూ సంతోషంగా,హుషారుగా కనిపించే ఈ జంట ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడం ధావన్  అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. వీరు ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలేమిటో అర్థం కావడం లేదంటూ పలువురు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మీమ్స్‌తో ఇష్టారీతిన ట్రోల్‌ చేస్తున్నారు. కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొనే క్రమంలో శిఖర్‌ ప్రస్తుతం యూఏఈలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై గబ్బర్‌ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.

చదవండి: Shikhar Dhawan Divorce: విడాకులు తీసుకున్న టాప్‌-4 జంటలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement