విడాకుల ప్రకటన.. వైరలవుతోన్న శిఖర్‌ ధావన్‌ పోస్ట్‌ | Shikhar Dhawan Breaks Silence After Ayesha Mukherjee Announces Divorce | Sakshi
Sakshi News home page

Shikhar Dhawan-Ayesha Mukherjee Divorce: వైరలవుతోన్న శిఖర్‌ ధావన్‌ పోస్ట్‌

Published Wed, Sep 8 2021 8:03 PM | Last Updated on Wed, Sep 8 2021 8:47 PM

Shikhar Dhawan Breaks Silence After Ayesha Mukherjee Announces Divorce - Sakshi

న్యూఢిల్లీ: తాము విడిపోయినట్లు ప్రకటించి.. క్రీడాభిమానులతో పాటు సామాన్యులకు షాక్‌ ఇచ్చారు భారత క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ దంపతులు. విడాకుల అంశం గురించి శిఖర్‌ ధావన్‌ భార్య ఆయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే విడాకుల అంశంపై శిఖర్‌ ధావన్‌ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దాంతో చాలా మంది ఈ వార్త అవాస్తవం అయి ఉండవచ్చు.. త్వరలోనే ఇద్దరి మధ్య సఖ్యత కుదరవచ్చని భావించారు. (చదవండి: ఆయేషాతో శిఖర్‌ ధావన్‌ విడాకులు)

ఈ క్రమంలో తాజాగా శిఖర్‌ ధావన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో శిఖర్‌ ధావన్‌ విడాకుల అంశం గురించి ఎక్కడా సూటిగా ప్రస్తావించలేదు. క్రిప్టిక్‌ మెసేజ్‌ షేర్‌ చేశాడు. ‘‘మీ కలను సాకారం చేసుకోవడానికి మీరెంతో కష్టపడాలి. మనం చేసే పనిపై ప్రేమ ఉండాలి. అలా ఉంటేనే అసలు సిసలు ఎంజాయ్ అంటే ఎంటో తెలుస్తోంది. మీ కలలు సాకారం కావాలంటే.. కష్టపడండి’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు ధావన్‌. ఈ పోస్ట్‌ చూస్తే తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న తుఫాను గురించి ధావన్‌ పెద్దగా ఆందోళన  చెందడం లేదనిపిస్తోంది అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: శిఖర్‌ కంటే పదేళ్లు పెద్ద.. మొదటి భర్త నుంచి విడిపోయినప్పటికీ..)

శిఖర్‌ ధావన్‌-ఆయేషా ముఖర్జీలకు 2012లో వివాహం కాగా... జొరావర్‌ అనే 7 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన ఆయేషాకు శిఖర్‌తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే వారిద్దరిని తన పిల్లలుగానే ప్రకటించిన ధావన్‌ బాధ్యతను కూడా తీసుకొని మెల్‌బోర్న్‌లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. తన కెరీర్‌ ఎదుగుదలలో ఆయేషా పాత్ర ఎంతో ఉందంటూ ధావన్‌ పలు సందర్భాల్లో ఆమెపై ప్రశంసలు కురిపించాడు. అయితే గత కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో.. చివరకు విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. జీవితంలో రెండో సారి విడాకులు తీసుకోవాల్సి రావడంపై ఆయేషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్‌ చేశారు ఆయేషా.
చదవండి: తన స్నేహితుడితో భార్య ‘బంధం’.. భరించలేక నాడు ఆ క్రికెటర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement