indian cricketer
-
హిట్ మ్యాన్ కాదు.. మ్యాగీమ్యాన్
-
అసలు ఎవరీ నితీష్ రెడ్డి..?
-
నీకో దండం భయ్యా..!
-
ప్రేమలో పడ్డానంటూ షాకిచ్చిన భారత స్టార్ క్రికెటర్ (ఫొటోలు)
-
ఆర్యమన్ విక్రమ్.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ (ఫోటోలు)
-
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూత (ఫొటోలు)
-
పెళ్లి ఫొటోలు షేర్ చేసిన కేకేఆర్ బౌలర్ (ఫొటోలు)
-
సిక్సర్ల కింగ్ శివమ్ దూబే.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
ఈ అందమైన జంట ఎవరో గుర్తుపట్టారా? డ్రీమీ వెడ్డింగ్ పిక్స్.. ఫ్యాన్స్ ఫిదా
-
క్రికెట్‌కు కేదార్ జాదవ్ వీడ్కోలు
పుణే: భారత క్రికెటర్ కేదార్ జాదవ్ ఆటకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన కేదార్ ... ఎమ్మెస్ ధోని శైలిలో తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. ‘నా కెరీర్లో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. 1500 గంటల సమయం నుంచి నేను రిటైర్ అయినట్లుగా గుర్తించగలరు’ అని ట్వీట్ చేశాడు. మహారాష్ట్రకు చెందిన కేదార్ 2014లో భారత్ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 73 వన్డేల్లో 42.09 సగటుతో 2 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు సహా 1389 పరుగులు చేశాడు. 9 టి20ల్లో 122 పరుగులు సాధించాడు. తన ‘స్లింగ్’ తరహా ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌తో అతను 27 వికెట్లు కూడా పడగొట్టాడు. కేదార్ అత్యుత్తమ ప్రదర్శన సొంతగడ్డ పుణేలో వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో అతను 76 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్స్‌లో అజేయంగా 120 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 2019 వన్డే వరల్డ్ కప్ ఆడిన అతను చివరిసారిగా 2020లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో కేదార్ ఢిల్లీ, కొచ్చి, చెన్నై, హైదరాబాద్ జట్ల తరఫున ఆడాడు. -
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ బర్త్‌డే.. అరుదైన ఫొటోలు
-
పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’గా గిల్ నియామకం
త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రంలో ఓటు శాతం పెంచేందుకు ... ఆ రాష్ట్రానికి చెందిన భారత స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌ను ‘స్టేట్ ఐకాన్’గా నియమించారు. యువతలో ఎంతో క్రేజ్ ఉన్న గిల్ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తాడని పంజాబ్ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ సిబిన్ తెలిపారు. గత 2019 ఎన్నికల్లో 65.96 శాతం ఓటింగ్ నమోదు కాగా... ఈసారి 70 శాతానికి పైగా పెంచాలనే లక్ష్యంతో ముందుకెళ్తామని సిబిన్ చెప్పారు. -
కరీబియన్ లీగ్ ఆడనున్న ఆర్సీబీ ఆల్‌రౌండర్.. తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు
భారత అప్‌కమింగ్ మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ అరుదైన ఘనత సాధించింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా (పురుషుల లేదా మహిళల క్రికెట్) రికార్డుల్లో నిలిచింది. ఇటీవల ముగిసిన మహిళల ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన శ్రేయాంక.. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడనప్పటికీ సీపీఎల్ ఆడే జాక్‌పాట్ కొట్టేసింది. సీపీఎల్‌లో గయానా అమెజాన్ వారియర్స్ ఫ్రాంచైజీ శ్రేయాంకతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, భారత పురుషుల క్రికెటర్ల తరహాలో మహిళా క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనడంపై ఎలాంటి అంక్షలు లేవు. గతంలో భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధన, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్, ఇంగ్లండ్ హండ్రెడ్ టోర్నీల్లో పాల్గొన్నారు. అయితే ఏ భారత క్రికెటర్ సీపీఎల్‌లో మాత్రం ఆడింది లేదు. తాజాగా శ్రేయాంకకు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది. 20 ఏళ్ల స్పిన్ అల్రౌండర్ అయిన శ్రేయాంక.. మహిళ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అనంతరం జరిగిన ఏసీసీ మహిళల ఎమర్జింగ్ టీమ్స్ కప్‌లో సత్తా చాటి (ప్లేయర్ ఆఫ్ ద సిరీస్) లీగ్ క్రికెట్లో విదేశీ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శించింది. త్వరలో ప్రారంభంకానున్న సీపీఎల్‌లో శ్రేయాంక.. స్టెఫానీ టేలర్ నేతృత్వంలో గయానా ఆమెజాన్ వారియర్స్‌కు ఆడనుంది. శ్రేయాంకతో పాటు ఆమె ఆర్సీబీ సహచరిణులైన సుజీ బేట్స్, సోఫీ డివైన్‌లను కూడా ఆమెజాన్ వారియర్స్ ఎంపిక చేసుకుంది. లెజెండరీ సౌతాఫ్రికా పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ కూడా ఆమెజాన్ వారియర్స్‌కు ఆడనుంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్.. ఆగస్ట్ 31న మొదలై సెప్టెంబర్ 10 వరకు సాగనుంది. ఈ లీగ్‌లో మొత్తం 3 జట్లు పాల్గొంటాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. -
టీమిండియా మాజీ క్రికెటర్ మృతి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్ బుధవారం మృతి చెందారు. ముంబైకి చెందిన 78 ఏళ్ల సుధీర్ నాయక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సర్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి స్టార్స్ జట్టుకు అందుబాటులో లేని సమయంలో సుధీర్ తన నాయకత్వంలో ముంబై జట్టును 1971 సీజన్లో రంజీ చాంపియన్ గా నిలబెట్టారు. 1974–1975లలో ఆయన భారత్ తరఫున మూడు టెస్టులు ఆడి 141 పరుగులు, రెండు వన్డేలు ఆడి 38 పరుగులు చేశారు. -
విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 వెనుక సూపర్బ్ స్టోరీ
-
ముంబైలో ఘనంగా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి (ఫొటోలు)
-
హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత..!
-
తప్పుగా మాట్లాడుతున్నారు..ఇకనైనా మారండి
-
మాజీ క్రికెటర్ శ్రీశాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
వార్విక్షైర్ జట్టుకు ఆడనున్న కృనాల్ పాండ్యా
ఇంగ్లండ్ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ రాయల్ లండన్ కప్‌లో భారత క్రికెటర్ కృనాల్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు. ఆగస్టు 2 నుంచి 23 వరకు జరిగే ఈ టోర్నీలో కృనాల్ వార్విక్షైర్ కౌంటీ జట్టు తరఫున ఆడనున్నాడు. 31 ఏళ్ల కృనాల్ భారత్ తరఫున ఐదు వన్డేలు, 19 టి20 మ్యాచ్‌లు ఆడాడు. గత ఏడాది వన్డే ఫార్మాట్లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన కృనాల్ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి అరంగేట్రంలో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. -
Mithali Raj: అందని ద్రాక్ష.. అవమానం భరించి.. ఫేర్వెల్ మ్యాచ్?!
సాక్షి క్రీడా విభాగం : భారత క్రికెట్ అంటేనే పురుషుల క్రికెట్... స్టార్లు అంటేనే సన్నీ, కపిల్, వెంగీ, సచిన్, ధోని, కోహ్లి.... భారత్‌లో మతమైన క్రికెట్‌కు మెజార్టీ ప్రజల అభిమతమిదే! ఇలాంటి దేశంలో అమ్మాయిలకూ ఓ అధ్యాయం ఉందని మిథాలీ రాజ్ వచ్చాకే తెలిసింది. దీన్ని సువర్ణాధ్యాయంగా మలిచిన ఘనత కూడా ముమ్మాటికి ఆమె ఆటదే. 23 ఏళ్ల క్రితం ప్రభలేని మహిళా క్రికెట్‌కు కొత్త శోభ తెచ్చింది. ఆమె పరుగులు పెడుతున్నప్పుడు అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డులో మన మహిళా క్రికెట్ లేదు. (ఆలస్యంగా బీసీసీఐ గొడుగు కిందకు వచ్చింది). ఆమె సెంచరీలు కొడుతుంటే... రూ. లక్షల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రైజ్‌మనీ రాలేదు. సిరీస్‌లను గెలిపిస్తే ఖరీదైన కారు (ప్లేయర్ ఆఫ్ ది సిరీస్) ఇవ్వలేని అమ్మాయిల క్రికెట్ గతి అది. ఇవేవీ తనకు దక్కకపోయినా... తను నమ్ముకున్న క్రికెట్‌కు 23 ఏళ్ల పాటు సేవలందించిన ధీరవనిత మిథాలీ. గత కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పు వెనుక మిథాలీ పాత్ర కూడా ఎంతో ఉంది. 23 ఏళ్ల క్రితం ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ శతకంతో తారలా దూసుకొచ్చింది మిథాలీ రాజ్. ఈ 23 ఏళ్లలో మహిళల క్రికెట్లో తరాలు మారాయి. ఫార్మాట్లు మారాయి. ప్లేయర్లు మారారు. కానీ మిథాలీ ఆటలో మాత్రం మెరుపు తగ్గలేదు. అద్భుతమైన బ్యాటింగ్‌తో, తనకే సాధ్యమైన రీతిలో కళాత్మకత, దూకుడు కలగలిపి భారత్ తరఫునే కాకుండా మహిళల క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్‌గా పేరు సంపాదించింది. రోజువారీ ఖర్చులకు సరిపడా డబ్బులు లభించని సమయంలో తనకిష్టమైన భరత నాట్యాన్ని వదులుకొని క్రికెట్ పట్ల ప్రేమతో దానిని కెరీర్‌గా ఎంచుకున్న మిథాలీ టీవీల్లో వాణిజ్య ప్రకటనల్లో కనిపించే స్థాయికి ఎదిగింది. ఆమె ఆటకు సంబంధించి అంకెలు, గణాంకాలను పరిశీలిస్తే మిథాలీని అభిమానులు ఆప్యాయంగా ‘లేడీ సచిన్’ అని పిలుస్తారు. Mithali Raj reflects on her glorious cricketing journey and the struggles behind it 📽️ pic.twitter.com/NwW3q5bukE — ICC (@ICC) June 8, 2022 అంచెలంచెలుగా... హైదరాబాద్ నగరంలోని సెయింట్ జాన్స్ అకాడమీలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న మిథాలీ ఆ తర్వాత వేర్వేరు వయో విభాగాల్లో రాణిస్తూ తన ప్రత్యేకత చాటుకుంది. మహిళల క్రికెట్‌కు ఏమాత్రం గుర్తింపులేని సమయంలో దానిని కెరీర్‌గా ఎంచుకోవడం పెద్ద సాహసమే. అయితే మిథాలీ తల్లిదండ్రులు దొరైరాజ్, లీలా రాజ్ తమ కూతురిని ఎల్లవేళలా ప్రోత్స హించారు. 1999లో వన్డే కెరీర్‌ను శతకంతో మొదలుపెట్టిన మిథాలీ... 2002లో టెస్టుల్లో అరంగేట్రం చేసింది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచినా... మూడో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మిథాలీకి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. కెప్టెన్‌గా అదుర్స్... 2003 వచ్చేసరికి భారత జట్టులో మిథాలీ స్థానం సుస్థిరమైపోయింది. 2005లో ఆమెకు తొలిసారి నాయకత్వ బాధ్యతలు లభించాయి. మిథాలీ కెప్టెన్సీలో భారత జట్టు 2005 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత కూడా మిథాలీ నేతృత్వంలో భారత జట్టు ఎన్నో మధుర విజయాలు సాధించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా కప్‌లు, ముక్కోణపు టోర్నీలు, నాలుగు దేశాల టోర్నీలు ఉన్నాయి. అందని ద్రాక్ష... వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును (పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి) రెండుసార్లు ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పిన మిథాలీ రాజ్ ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. ఆమె కెరీర్లో ఇది లోటుగా ఉండిపోనుంది. 2005 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్... 2017 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. అవమానం భరించి... విండీస్ ఆతిథ్యమిచ్చిన 2018 టి20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మిథాలీ రాజ్‌ను తుది జట్టులో నుంచి తప్పించడం వివాదాస్పదమైంది. టోర్నీ సమయంలో అప్పటి చీఫ్ కోచ్ రమేశ్ పొవార్‌తోపాటు జట్టులోని ఇతర సీనియర్ సభ్యులు తను జట్టులో సభ్యురాలే కాదన్నట్లు ప్రవర్తించారని అప్పటి బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సాబా కరీమ్‌లకు మిథాలీ లేఖ రాయడం పెను దుమారం రేపింది. ఈ వివాదం తర్వాత 2019లో టి20 నుంచి మిథాలీ వీడ్కోలు తీసుకుంది. వన్డే, టెస్టు ఫార్మాట్లపై మరింతగా దృష్టి సారించింది. కరోనా కారణంగా గత రెండేళ్లు పెద్దగా సిరీస్‌లు లేకపోయినా మిథాలీ ఆటలో నిలకడ కనబరుస్తూ వచ్చింది. ఈ ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ సారథ్యంలో భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా కనిపించినా... సమష్టి ప్రదర్శన లేకపోవడంతో భారత్ రౌండ్ రాబిన్ లీగ్‌లో ఐదో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇదే చివరి ప్రపంచకప్ ఈ టోర్నీకి ముందే తనకు ఇదే చివరి ప్రపంచకప్ అని మిథాలీ ప్రకటించింది. దాంతో టోర్నీ ముగిశాక మిథాలీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతుందని అందరూ భావించారు. కానీ మిథాలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ నెలలో శ్రీలంకలో పర్యటనకు భారత వన్డే, టి20 జట్లను బుధవారం ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మిథాలీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. భారత మహిళల క్రికెట్‌కు మిథాలీ రాజ్ సేవలకు గుర్తింపుగా ఆమె కోసం ప్రత్యేకంగా ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావించింది. అయితే దీనిపై మిథాలీ ఆసక్తి చూపలేదని సమాచారం. చదవండి: Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు! Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? View this post on Instagram A post shared by ICC (@icc) -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన టీమిండియా క్రికెటర్
టీమిండియా స్టార్.. కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. మెర్సీడెస్కు చెందిన ఎస్యూవీ లగ్జరీ మెర్సీడెస్-ఏంఎంజీ జి 63ని రూ. 2.45కోట్లు పెట్టి కొన్నాడు. అయ్యర్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయ్యర్ కొనుగోలు చేసిన కారు కేవలం 4.5 సెకన్లలో 100కిమీ వేగాన్ని అందుకుంటుంది. కాగా అయ్యర్ కారుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన మెర్సిడెస్ లగ్జరీ కార్ల కంపెనీ ట్వీట్ చేసింది. ''కంగ్రాట్స్ టూ టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. అలాగే మా మెర్సిడెస్ బెంజ్ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. మెర్సిడెస్ బెంజ్‌లో కొత్త మోడల్ కారును కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలు. మీ బ్యాటింగ్‌లో కవర్ డ్రైవ్స్ మేము బాగా ఎంజాయ్ చేస్తాం.. ఇప్పుడు మీరు మా కారు డ్రైవింగ్‌ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఐపీఎల్ 2022 సీజన్లో కేకేఆర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లోనూ అంతగా రాణించని శ్రేయాస్ అయ్యర్.. కెప్టెన్‌గానూ మెరవలేదు. రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన కేకేఆర్ ఐపీఎల్ 15వ సీజన్‌ను ఏడో స్థానంతో ముగించింది. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న సౌతాఫ్రికా సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు. సీనియర్ల గైర్హాజరీలో శ్రేయాస్ అయ్యర్ జట్టుకు కీలకం కానున్నాడు. ఈ సిరీస్ ద్వారా శ్రేయాస్ తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడని క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బిగ్స్క్రీన్పై చారిత్రక టెస్టు సిరీస్.. రోమాలు నిక్కబొడుచుకునేలా ట్రైలర్ Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా! -
సచిన్ సహచరుడు, టీమిండియా మాజీ ప్లేయర్ అరెస్ట్
టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పతాగి వాహనం నడపడంతో పాటు ఓ కారును ఢీకొట్టినందుకుగాను అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే లాయర్ ష్యూరిటీ ఇవ్వడంతో కొద్దిసేపటికే బెయిల్‌పై విడుదల చేశారు. కాంబ్లీపై ఐపీసీ సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్), 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం), 427 (నష్టం కలిగించే అల్లర్లు) కింద అభియోగాలు మోపామని బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో కాంబ్లీ వార్తల్లోకెక్కడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్ 11న అతను సైబర్ మోసానికి గురై పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు.సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన కాంబ్లీ.. 1.14 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. బ్యాంకు అధికారినని ఫోన్ చేసిన మోసగాడు.. కాంబ్లీని బురిడీ కొట్టించి అకౌంట్లో డబ్బులు మాయం చేశాడు. చదవండి: IND VS SL 3rd T20: కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ -
చరిత్ర సృష్టించిన ఉన్ముక్త్ చంద్.. ఆ లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు
Unmukt Becomes First Indian Male Cricketer To Sign For Big Bash League: భారత మాజీ ఆటగాడు, టీమిండియా అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)కు ప్రాతినిధ్యం వహించనున్న తొలి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వచ్చే నెల(డిసెంబర్) నుంచి ప్రారంభంకానున్న బీబీఎల్ 2021-22 సీజన్లో మెల్బోర్న్ రెనిగేడ్స్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఉన్ముక్త్.. చాలాకాలంగా టీమిండియా ఆడే అవకాశాలు రాకపోవడంతో ఇటీవలే భారత్‌ను వీడి యుఎస్ఏకు వలస వెళ్లాడు. అక్కడ మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న అతను.. సిలికాన్ వ్యాలీ స్ట్రయికర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే, 2012 అండర్-19 ప్రపంచకప్‌లో ఉన్ముక్త్ సారధ్యంలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలసిందే. ఆ టోర్నీ ఫైనల్లో ఉన్ముక్త్ (111 నాటౌట్) వీరోచిత సెంచరీతో భారత్‌కు కప్ అందించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఇండియా-ఏకు కెప్టెన్‌గా ఎంపికైన అతను 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. అయితే అతనికి భారత జట్టుకు ఆడే అవకాశం రాకపోవడంతో నిరాశ చెంది యుఎస్ఏకు వలస వెళ్లాడు. ఉన్ముక్త్ కెరీర్లో 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 120 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో దాదాపు 8000 పరుగులు సాధించాడు. 28 ఏళ్ల ఉన్ముక్త్.. ఐపీఎల్లో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ జట్ల తరఫున 21 మ్యాచ్‌లు ఆడి 300 పరుగులు స్కోర్ చేశాడు. చదవండి: Rohit Sharma: రాత్రికి రాత్రే చెత్త ఆటగాళ్లం అయిపోము కదా.. ఇప్పుడు.. -
విడాకుల ప్రకటన.. వైరలవుతోన్న శిఖర్ ధావన్ పోస్ట్
న్యూఢిల్లీ: తాము విడిపోయినట్లు ప్రకటించి.. క్రీడాభిమానులతో పాటు సామాన్యులకు షాక్ ఇచ్చారు భారత క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులు. విడాకుల అంశం గురించి శిఖర్ ధావన్ భార్య ఆయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విడాకుల అంశంపై శిఖర్ ధావన్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దాంతో చాలా మంది ఈ వార్త అవాస్తవం అయి ఉండవచ్చు.. త్వరలోనే ఇద్దరి మధ్య సఖ్యత కుదరవచ్చని భావించారు. (చదవండి: ఆయేషాతో శిఖర్ ధావన్ విడాకులు) ఈ క్రమంలో తాజాగా శిఖర్ ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో శిఖర్ ధావన్ విడాకుల అంశం గురించి ఎక్కడా సూటిగా ప్రస్తావించలేదు. క్రిప్టిక్ మెసేజ్ షేర్ చేశాడు. ‘‘మీ కలను సాకారం చేసుకోవడానికి మీరెంతో కష్టపడాలి. మనం చేసే పనిపై ప్రేమ ఉండాలి. అలా ఉంటేనే అసలు సిసలు ఎంజాయ్ అంటే ఎంటో తెలుస్తోంది. మీ కలలు సాకారం కావాలంటే.. కష్టపడండి’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు ధావన్. ఈ పోస్ట్ చూస్తే తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న తుఫాను గురించి ధావన్ పెద్దగా ఆందోళన చెందడం లేదనిపిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: శిఖర్ కంటే పదేళ్లు పెద్ద.. మొదటి భర్త నుంచి విడిపోయినప్పటికీ..) శిఖర్ ధావన్-ఆయేషా ముఖర్జీలకు 2012లో వివాహం కాగా... జొరావర్ అనే 7 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మెల్బోర్న్కు చెందిన ఆయేషాకు శిఖర్‌తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే వారిద్దరిని తన పిల్లలుగానే ప్రకటించిన ధావన్ బాధ్యతను కూడా తీసుకొని మెల్‌బోర్న్‌లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. తన కెరీర్ ఎదుగుదలలో ఆయేషా పాత్ర ఎంతో ఉందంటూ ధావన్ పలు సందర్భాల్లో ఆమెపై ప్రశంసలు కురిపించాడు. అయితే గత కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో.. చివరకు విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. జీవితంలో రెండో సారి విడాకులు తీసుకోవాల్సి రావడంపై ఆయేషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశారు ఆయేషా. చదవండి: తన స్నేహితుడితో భార్య ‘బంధం’.. భరించలేక నాడు ఆ క్రికెటర్.. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
ఆయేషాతో శిఖర్ ధావన్ విడాకులు
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోయాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆయేషా నిర్ధారించింది. వీరిద్దరికి 2012లో వివాహం కాగా... జొరావర్ అనే 7 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మెల్బోర్న్కు చెందిన ఆయేషాకు శిఖర్‌తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే వారిద్దరిని తన పిల్లలుగానే ప్రకటించిన ధావన్ బాధ్యతను కూడా తీసుకొని మెల్‌బోర్న్‌లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. (చదవండి: Actor Bala: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న నటుడు బాలా) వ్యక్తిగతంగా, తన కెరీర్ ఎదుగుదలలో ఆయేషా పాత్ర ఎంతో ఉందంటూ చాలా సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన ధావన్ తమ అన్యోన్యతను ప్రదర్శిస్తూ వచ్చాడు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగిపోయి దురదృష్టవశాత్తూ విడిపోయే పరిస్థితి వచ్చింది. జీవితంలో రెండోసారి తాను విడాకులు తీసుకోవాల్సి రావడంపై ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయేషా తన ఆవేదనను వ్యక్తం చేసింది. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు: అలా పెళ్లి.. ఇలా విడాకులు) View this post on Instagram A post shared by Aesha Mukerji (@apwithaesha) -
పాక్‌లో పుట్టాడు.. భారత్‌లో ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు
న్యూఢిల్లీ: 33 టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి తరం మేటి ఆల్‌రౌండర్ లేట్ జి.ఎస్. రాంచంద్ గురించి బహుశా నేటి తరంలో ఎవ్వరికీ తెలిసుండకపోవచ్చు. కమర్షియల్ బ్రాండ్ల ఎండార్స్మెంట్లకు ఆధ్యుడైన ఈ భారత మాజీ క్రికెటర్.. అంతర్జాతీయ వేదికపైనే కాకుండా భారత దేశవాళీ క్రికెట్లోనూ అద్భుతంగా రాణించాడు. ఇవాళ(జులై 26) ఆయన పుట్టిన రోజు సందర్భంగా అతని కెరీర్‌లోని విశేషాలపై ఓ లుక్కేద్దాం. రాంచంద్ పుట్టింది దాయాది దేశం పాక్‌లోనే అయినా భారత్ తరఫున క్రికెట్ ఆడాడు. 1927 జూలై 26న కరాచీలో జన్మించిన రాంచంద్.. ఇంగ్లండ్‌పై తన కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే తాను ఆడిన తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ 1952లో లీడ్స్ వేదికగా జరిగింది. ఇలా తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరగడంతో అతని కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే, రాంచంద్ మాత్రం ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సత్తా చాటి తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఆ తర్వాత కాలంలో వెనక్కు తిరగి చూసుకోని రాంచంద్.. 1952 నుంచి 1960 వరకు దాదాపు ఎనిమిదేళ్లపాటు భారత్ జట్టులో కొనసాగాడు. ఈ మధ్యలో అతను భారత జట్టుకు సారధ్యం వహించాడు. ఇతని నాయకత్వంలోనే భారత్.. ఆసీస్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇక రాంచంద్ కెరీర్ గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. 33 టెస్ట్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. 2 శతకాలు, 5 అర్ధశతకాల సాయంతో 1180 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 41 వికెట్లు పడగొట్టాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బాంబే జట్టుకు ప్రాతినధ్యం వహించిన రాంచంద్.. 16 శతకాలు, 28 అర్ధశతకాల సాయంతో 6026 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో రాంచంద్ 9సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసి మొత్తంగా 255 వికెట్లు పడగొట్టాడు. విజయ్ హాజారే, విజయ్ మంజ్రేకర్ లాంటి దిగ్గజ క్రికటర్ల సమాకాలీకుడైన రాంచంద్.. 50వ దశకంలో భారత మేటి ఆల్‌రౌండర్‌గా కొనసాగాడు. సెప్టెంబర్ 8 2003లో 76 ఏళ్ల వయసులో రాంచంద్ మరణించాడు. -
సెమీస్ హీరో యశపాల్ శర్మ కన్నుమూత
-
కరోనాతో వేద కృష్ణమూర్తి తల్లి మృతి
సాక్షి, బెంగళూరు: భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ బారిన పడిన వేద కృష్ణమూర్తి తల్లి చెలువాంబ్డా దేవి శనివారం తుదిశ్వాస విడిచారు. వేద సోదరి కూడా ప్రస్తుతం కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. ‘అమ్మ మరణంతో మా కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. ఇప్పుడు మా సోదరి క్షేమంగా, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను’ అని వేద వ్యాఖ్యానించింది. 28 ఏళ్ల వేద భారత మహిళల జట్టు తరఫున 48 వన్డేలు ఆడి 829 పరుగులు... 76 టి20 మ్యాచ్‌లు ఆడి 875 పరుగులు సాధించింది. -
‘పాలబుగ్గల’ పార్థివ్ రిటైర్
న్యూఢిల్లీ: సుమారు 18 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ పిచ్‌పై ఒక 17 ఏళ్ల కుర్రాడితో వికెట్ కీపర్‌గా అరంగేట్రం చేయించినప్పుడు క్రికెట్ ప్రపంచంలో చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గంటన్నర పాటు నిలబడి మ్యాచ్‌ను ‘డ్రా’వైపు మళ్లించిన అతని పట్టుదలను చూసి ప్రత్యర్థులు కూడా అభినందించకుండా ఉండలేకపోయారు. తర్వాతి రోజుల్లో భారత క్రికెట్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆ కుర్రాడే పార్థివ్ పటేల్. సుదీర్ఘ కెరీర్ తర్వాత తాను అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు పార్థివ్ బుధవారం ప్రకటించాడు. తన కెరీర్లో అండగా నిలిచిన బీసీసీఐ, గుజరాత్ క్రికెట్ సంఘానికి అతను కృతజ్ఞతలు తెలిపాడు. 2018 జనవరిలో చివరిసారిగా భారత జట్టుకు (దక్షిణాఫ్రికాపై) ప్రాతినిధ్యం వహించిన పార్థివ్... ఈ ఏడాది ఆరంభంలో సౌరాష్ట్రతో జరిగిన రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో ఆఖరిగా మైదానంలోకి దిగాడు. కీపర్‌గా ప్రతిభ, చక్కటి బ్యాటింగ్ నైపుణ్యం ఉన్నా... ధోని హవా కారణంగా ఎక్కువ కాలం జాతీయ జట్టుకు పార్థివ్ దూరం కావాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ధోని తప్పుకోవడం వల్లో, సాహా గాయాల వల్లో కొన్ని అవకాశాలు వచ్చాయి. టీనేజర్‌గా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన అతను 35 ఏళ్ల వయసులో ఆట ముగించాడు. అంతర్జాతీయ క్రికెట్లో: పార్థివ్ అరంగేట్రం చేసిన నాటి నుంచి భారత్ ఆడిన 20 టెస్టుల్లో 19 మ్యాచ్‌లలో అతనికి అవకాశం దక్కింది. అయితే కీలక సమయాల్లో కీపర్‌గా చేసిన తప్పిదాలతో జట్టులో స్థానం కోల్పో యాడు. 2002లో హెడింగ్లీ, 2003– 04లో అడిలైడ్‌లో భారత్ సాధిం చిన విజయాల్లో భాగంగా ఉన్న పార్థివ్... 2004లో రావల్పిండిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ఓపెనర్‌గా వచ్చి 69 పరుగులు చేయడం చెప్పుకోదగ్గ ప్రదర్శన. 2012 తర్వాత పార్థివ్ వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చలేదు. అతను 2 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఐపీఎల్/దేశవాళీ క్రికెట్లో: ఐపీఎల్లో పార్థివ్ ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడగా మూడుసార్లు (2010లో చెన్నై తరఫున, 2015, 2017లో ముంబై తరఫున) టైటిల్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన 2017 ఫైనల్లో చివరి బంతికి సుందర్‌ను రనౌట్ చేసిన దృశ్యం అభిమానులు మరచిపోలేనిది. 2020లో బెంగళూరు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. గుజరాత్ తరఫున అతను చిరస్మరణీయ ప్రదర్శన కనబర్చాడు. పార్థివ్ సారథ్యంలోనే గుజరాత్ మూడు ఫార్మాట్లలో (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ) విజేతగా నిలవడం విశేషం. ఆరేళ్ల వయసులోనే తలుపు సందులో ఇరుక్కుపోవడంతో ఎడమచేతి చిటికెన వేలు కోల్పోయిన పార్థివ్... తొమ్మిది వేళ్లతోనే వికెట్ కీపర్‌గా రాణించడం చెప్పుకోదగ్గ అంశం. భారత్ తరఫున పిన్న వయసులో అరంగేట్రం చేసిన వారిలో సచిన్, పీయూష్ చావ్లా, శివరామకృష్ణన్ తర్వాత పార్థివ్ది నాలుగో స్థానం. అయితే వికెట్ కీపర్‌గా మాత్రం ప్రపంచ క్రికెట్ మొత్తంలో అతనే అందరికంటే చిన్నవాడు. భారత్ తరఫున పార్థివ్ 25 టెస్టుల్లో 31.13 సగటుతో 934 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 62 క్యాచ్‌లు పట్టిన అతను 10 స్టంపింగ్‌లు చేశాడు. 38 వన్డేల్లో 23.74 సగటుతో 736 పరుగులు సాధించిన పార్థివ్ ఖాతాలో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 30 క్యాచ్‌లు పట్టిన అతను 9 స్టంపింగ్‌లు చేశాడు. -
‘చాలా బాగున్నాను’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ తాను వేగంగా కోలుకుంటున్నట్లు ప్రకటించారు. అందరి దీవెనలతో తన ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన తన ఇంటి ముందు నిలబడి రికార్డు చేసిన వీడియో ద్వారా వెల్లడించారు. గత వారం గుండెపోటుకు గురైన కపిల్‌కు యాంజియోప్లాస్టీ సర్జరీ జరిగింది. ‘నా 83 కుటుంబానికి...వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. మీ అందరినీ కలవాలని ఉత్సాహంగా ఉన్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. మీ దీవెనలకు నా కృతజ్ఞతలు. సాధ్యమైనంత త్వరలో అందరినీ కలుసుకుంటా. ఈ ఏడాది చివరి దశకు వచ్చింది. వచ్చే ఏడాది అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నా’ అని కపిల్ అన్నారు. -
ఇంతకూ ‘ఎవరీ నటరాజన్?’
ఒక పెద్దాయన చాలా హుందాగా అన్నాడు... ‘నాకు యార్కర్ అంటే తెలియకపోవడం ఏమిటయ్యా! వింత కాకపోతేనూ... యార్కర్ అంటే నువ్వు వేసే బంతులే కదా. అవును... వీటిని యార్కర్ అని ఎందుకు పిలుస్తారు? కాస్త చెబుతావా?’ అప్పుడు ప్రొఫెషనల్ ప్లేయర్ అమాయకంగా ఇలా బదులిచ్చాడు... ‘అమ్మతోడు సార్... నేను వేసే వాటిని యార్కర్ అంటారని మీరు చెప్పేవరకు నిజంగా నాకు తెలియదు’ వన్స్ అపాన్ ఏ టైమ్‌లోని ‘పంచ్’ మ్యాగజైన్లలో ఇలాంటి సరదా మాటలు బోలెడు దొరుకుతాయి. అయితే యార్కర్ అంటే సరదా కాదు. ప్రత్యర్థి కాళ్లకు బంధనాలు వేసి ఇరుకున పెట్టడం...జట్టు విజయానికి దారి పరచడం. ఆ విద్యలో తన టాలెంట్ చూపుతూ ‘కింగ్’ అనిపించుకుంటున్నాడు తంగరసు నటరాజన్. ఈ ఐపీఎల్ సీజన్లో కూడా మరోసారి తన యార్కర్లతో ఆకట్టుకున్నాడు. కడు పేదరికం నుంచి వచ్చిన నటరాజన్ ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తున్నాడు. సేలం జిల్లాలోని చిన్న ఊరు చిన్నప్పంపట్టి. చెన్నైకి 340 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ఊరు వాడే తంగరసు నటరాజన్. తండ్రి దినసరి కూలి. తల్లి రోడ్డు పక్కన చికెన్ అమ్ముతుంది. ‘జీరో సౌకర్యాలు’ తప్ప ఆ ఊళ్లో చెప్పుకోదగ్గవి పెద్దగా ఏమీలేవు. అలాంటి ఊళ్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు నటరాజన్. ‘ఆట కూడెడుతుందా? కూలీ పనిచెయ్...చికెన్ కొట్టు’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ ఆర్డర్ వేయలేదు. కొడుకు ఆడుతుంటే మురిసిపోవడం తప్ప ఎప్పుడూ అడ్డుకున్నది లేదు. క్రికెట్ సీజన్ వస్తే నటరాజన్‌కు ఒకేసారి వందపండగలు వచ్చినట్లు. పొద్దుట ఎనిమిది గంటలకల్లా ఇంట్లో నుంచి బయటపడి ఊరూరు తిరుగుతూ ఆటలు ఆడేవాడు. ‘ఇంకేముంది వాళ్లే కచ్చితంగా గెలుస్తారు’ అంటూ డీలా పడిపోయి ప్రత్యర్థి జట్టుకు గెలుపు కిరీటం తొడగడానికి రెడీ అవుతున్న అనేకానేక సందర్భాలలో సొంత జట్టును గెలిపించాడు నటరాజన్. అయిదుగురు సంతానంలో పెద్దవాడు నటరాజన్. కుటుంబమంతా కలిసి ఒక చిన్నగదిలో నివసించేది. ‘తిండి, నీళ్లు, ఆరోగ్యం అన్నీ సమస్యలే. స్కూల్లో ఉచితంగా పెట్టే భోజనంతో కడుపు నింపుకునేవాడిని’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు నటరాజన్. ‘మావాడు టైమ్‌పాస్ కోసం ఆడడం లేదు. వాడికంటూ ఒక టైమ్ వస్తుంది’ అని తల్లిదండ్రులు అనుకున్నారో లేదోగానీ....అతడికంటూ ఒక ‘టైమ్’ వచ్చింది! రంజీల్లో రాణించి, టీఎన్‌పీఎల్(తమిళనాడు ప్రీమియర్ లీగ్)లో తడాఖా చూపిన నటరాజన్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మూడు కోట్లకు ఎంపిక చేసుకుంది. ఆ డబ్బుతో తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టించాడు. ఊళ్లో ‘క్రికెట్ అకాడమీ’ మొదలు పెట్టి యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. నటరాజన్‌తో కలిసి 2009 నుంచి క్రికెట్ ఆడిన జయప్రకాష్ ‘ఆరు బంతులకు ఆరు యార్కర్లు పడేవి’ అని గతాన్ని తలుచుకుంటు మురిసిపోతుంటాడు. ‘నీకు క్రికెట్లో మంచి భవిష్యత్ ఉంది’ అని గట్టిగా చెప్పింది, ప్రోత్సహించిందే ఇతడే. వీరి అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. జయప్రకాష్‌ను మార్గ నిర్దేశకుడిగా చూస్తాడు నటరాజన్. లోకల్ విలేజ్ టోర్నమెంట్స్‌లో నటరాజన్ గెలుచుకున్న 150కి పైగా ట్రోఫీలలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆట మైకంలో అర్ధాకలితో గడిపిన రోజల నుంచి మొదలు ఓటమిని పసిగట్టి గెలుపు వ్యూహం రచించడం వరకు ఎన్నెన్నో వాటిలో ఉన్నాయి. ‘ఈ కుర్రాడికి ఎప్పుడు చూసిన ఆటలే’ అని విసుక్కున్న వారు కూడా ఇప్పుడు... ‘మన ఊరు అబ్బాయి ఎంత ఎదిగిపోయాడో చూశావా. అలా ఉండాలి పట్టుదల అంటే’ అంటుంటారు. అయితే నటరాజన్ కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోనంతగా ఏమీ దూసుకుపోలేదు. మొదట్లో ‘ఇంప్రాపర్ బౌలింగ్ యాక్షన్’ అని వెనక్కి పిలిచినప్పుడు ‘ఇక నా పని అయిపోయినట్లే’ అనుకున్నాడు. అంతమాత్రానా ఆటకు టాటా చెప్పలేదు. తనను తాను మరింత పదును పెట్టుకున్నాడు. ఆ తరువాత ‘బౌలింగ్ యాక్షన్’కు క్లీన్‌చీట్ వచ్చింది. ప్రయాణం మొదలైంది. మధ్యలో కాస్త తడబడ్డాడు. మరో ఛాన్స్ కోసం ఎక్కువ సమయమే వేచి చూడాల్సి వచ్చింది. ఎక్కడ నిరాశ పడలేదు. మళ్లీ లేచాడు. ముత్తయ్య మురళీధరన్లాంటి దిగ్గజాల దృష్టిలో పడ్డాడు. తన యార్కర్కతో మెరుపులు మెరిపించినప్పుడల్లా ‘ఎవరీ నటరాజన్?’ అనే ప్రశ్న వస్తూనే ఉంటుంది. జవాబులో ఎంత స్ఫూర్తి ఉంటుందో కదా! అది మాత్రమే చాలదు తమిళనాడు గ్రామీణ ప్రాంతాలలో క్రికెట్ చూడడం, ఆడడం గొప్ప విషయమేగానీ దాన్ని కెరీర్ ఆప్షన్‌గా మలుచుకోవాలనే ఆలోచన తక్కువ. దీన్ని టైమ్‌పాస్ ఆటగానే చూస్తున్నారు. ప్రతిభ ఉండాలేగానీ మన కుటుంబ ఆర్థికనేపథ్యం అనేది ముఖ్యం కాదు. ఆటతీరు మాత్రమే ముఖ్యమవుతుంది. – తంగరసు నటరాజన్, లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ -
లంక ప్రీమియర్ లీగ్‌లో ఇర్ఫాన్ పఠాన్!
న్యూఢిల్లీ: శ్రీలంక వేదికగా ఈ నెల 28న ఆరంభమయ్యే లంక ప్రీమియర్ లీగ్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇందుకోసం అతడు లీగ్ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. లీగ్‌లో పాల్గొనే ఐదు జట్లలో ఏదో ఒక జట్టు అతడిని ‘మార్కీ ప్లేయర్ (స్టార్ ఆటగాడు)’ జాబితాలో తీసుకునే అవకాశం ఉంది. పఠాన్ ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో... విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ నుంచి ఎటువంటి అడ్డంకులు ఎదురుకాకపోవచ్చు. భారత జట్టుకు ఆడే ఆటగాళ్లను విదేశీ టి20 లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. అయితే తాను ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించడంతో లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తనకెటువంటి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండదని పఠాన్ పేర్కొన్నాడు. 35 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ 2007 టి20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. -
వేలానికి రాహుల్ ప్రపంచకప్ బ్యాట్
న్యూఢిల్లీ: భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్ లోకేశ్ రాహుల్ ముందుకొచ్చాడు. పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. ఇందులో 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్ ఉంచనున్నట్లు రాహుల్ వీడియో మెసేజ్ ద్వారా ట్విట్టర్లో ప్రకటించాడు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న అవేర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు తెలిపాడు. ‘నేను నా క్రికెట్ వస్తువులను టీమిండియా మద్దతు బృందం ‘భారత్ ఆర్మీ’కి విరాళంగా ఇస్తాను. ఇందులో ప్రపంచకప్‌లో వాడిన బ్యాట్‌తో పాటు టెస్టు, వన్డే, టి20 జెర్సీలు, గ్లౌజులు, ప్యాడ్లు, హెల్మెట్లు ఉన్నాయి. వారు వీటిని వేలం ద్వారా విక్రయిస్తారు. వేలంలో సమకూరిన సొమ్మును వెనుకబడిన చిన్నారులను ఆదరిస్తోన్న ‘అవేర్’ ఫౌండేషన్‌కు అందజేస్తారు. సోమవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. అందరూ ఇందులో పాల్గొని చిన్నారులకు సహాయపడండి’ అని రాహుల్ పేర్కొన్నాడు. -
ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు
ముంబై: ఒకానొక దశలో భారత క్రికెట్లో కపిల్‌దేవ్ తర్వాత నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా కనిపించిన ఇర్ఫాన్ పఠాన్ అన్ని రకాల క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు శనివారం ప్రకటించాడు. 35 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ తన కెరీర్ ఆరంభంలో ఓ వెలుగు వెలిగాడు. ముఖ్యంగా గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో మేటి ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్న ఈ బరోడా క్రికెటర్ ఆ తర్వాత అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు. తొలుత బౌలింగ్‌లో గతి తప్పి... ఆ తర్వాత బ్యాటింగ్‌లో తడబడి... కొన్నాళ్లకు ఫిట్నెస్ కోల్పోయి... ఆఖరికి జట్టులోనే స్థానం కోల్పోయాడు. 2003లో ఆ్రస్టేలియాపై అడిలైడ్ టెస్టులో అరంగేట్రం చేసిన ఇర్ఫాన్ ఆ సిరీస్‌లో తన స్వింగ్ బౌలింగ్‌తో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. 2012లో తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్... గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టి20 క్రికెట్ టోర్నీలో జమ్మూ కాశ్మీర్ తరఫున చివరిసారిగా దేశవాళీ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ప్రస్తుతం ఇర్ఫాన్ క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. తన తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఇర్ఫాన్ కొన్ని చిరస్మరణీయ ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా 2006 పాకిస్తాన్ పర్యటనలో కరాచీ టెస్టులో మ్యాచ్ తొలి రోజు తొలి ఓవర్లోనే వరుసగా మూడు బంతుల్లో సల్మాన్ బట్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసుఫ్‌లను అవుట్ చేశాడు. హర్భజన్ తర్వాత టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా ఇర్ఫాన్ గుర్తింపు పొందాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 వరల్డ్ కప్‌లో భారత్ విశ్వవిజేతగా అవతరించడంలో ఇర్ఫాన్ కూడా కీలకపాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఇర్ఫాన్ 4 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు (షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిది, యాసిర్ అరాఫత్) తీశాడు. ఈ ప్రదర్శనకుగాను ఇర్ఫాన్ ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డును గెల్చుకున్నాడు. -
జనవరి వరకు అడగొద్దు
ముంబై: వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ తర్వాత భారత జట్టుకు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అతని రిటైర్మెంట్ లేదా ఆటలో కొనసాగడంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై ధోని మొదటిసారి స్వయంగా స్పందించాడు. అదీ ఏకవాక్యంలో! పునరాగమనం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...‘జనవరి వరకు నన్నేమీ అడగొద్దు’ అని తేల్చేశాడు. బుధవారం ‘పనెరై’ అనే వాచీ కంపెనీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ధోని తన కెరీర్‌కు సంబంధించిన రెండు అత్యుత్తమ క్షణాలను పంచుకున్నాడు. ‘సుదీర్ఘ కెరీర్లో రెండు సంఘటనలు నా మనసుకు అత్యంత చేరువగా నిలిచాయి. అలాంటివి మళ్లీ రావు. 2007 టి20 ప్రపంచ కప్ గెలిచి స్వదేశం తిరిగొచ్చిన తర్వాత ముంబైలో ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు జరిగింది. ఆ సమయంలో ప్రఖ్యాత మెరైన్ డ్రైవ్ ఈ మూల నుంచి ఆ మూల వరకు పూర్తిగా నిండిపోయింది. తమ పనులన్నీ వదిలేసుకొని వారంతా మా కోసం వచ్చారు. వారి కళ్లలో ఎంతో ఆనందం కనిపించింది. ఇక 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విజయానికి 1520 పరుగుల దూరంలో ఉన్నప్పుడు స్టేడియంలో ప్రేక్షకులు వందేమాతరం నినాదంతో హోరెత్తించారు’ అని ధోని గుర్తు చేసుకున్నాడు. భార్య సంతోషమే నా సంతోషం! కెప్టెన్‌గా తాను ఎన్ని విజయాలు సాధించినా ఇంట్లో మాత్రం భార్య సాక్షి మాటే చెల్లుబాటు అవుతుందని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు. వయసుతో పాటు భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత దృఢమవుతుందని అతను అభిప్రాయపడ్డాడు. ‘పెళ్లయ్యేంత వరకు అందరు మగాళ్లు సింహాల్లాగే ఉంటారు. నేను ఆదర్శవంతమైన భర్తను. ఎందుకంటే నా భార్య ఏం చేయాలనుకున్నా నేను అడ్డు చెప్పను. నా భార్య సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. అది జరగాలంటే ఆమె ఏం చెప్పినా నేను తలూపాల్సిందే. నా దృష్టిలో 50 ఏళ్ల వయసు దాటిన తర్వాతే వివాహ బంధం అసలు ఆనందం ఏమిటో తెలుస్తుంది. బాధ్యతలకు దూరంగా ఒకరినొకరు ప్రేమించుకునేందుకు అది సరైన వయసని భావిస్తున్నా’ అని కెప్టెన్ కూల్ అన్నాడు. -
రోహిత్ ఓపెనింగ్‌కు గిల్లీ మద్దతు
అనంతపురం: భారత క్రికెటర్ రోహిత్ శర్మ ప్రపంచ స్థాయి క్రీడాకారుడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ ప్రశంసించాడు. సొంతగడ్డపై టెస్టుల్లోనూ రోహిత్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకోగలడని అతను ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లాంటి చోటకు వెళ్లినప్పుడు కష్టం కావచ్చేమో కానీ భారత గడ్డపై మాత్రం టెస్టుల్లో రోహిత్ ఓపెనర్‌గా కచ్చితంగా రాణిస్తాడు. అతనో గొప్ప క్రీడాకారుడు. కానీ చూసేవారికి టెస్టుల కోసం రోహిత్ పెద్దగా శ్రమించట్లేదేమో అనిపిస్తుంది. నిజానికి అతను ప్రపంచ స్థాయి క్రీడాకారుడు. ఏ ఫార్మాట్లోనైనా అభిమానులను ఆకట్టుకోగలడు’ అని గిల్‌క్రిస్ట్ అన్నాడు. ఐపీఎల్లో దక్కన్ చార్జర్స్ జట్టు తరఫున వీరిద్దరూ ప్రాతినిధ్యం వహించారు. -
నేను తప్పులు చేశా...
విరాట్ కోహ్లి ప్రపంచ క్రికెట్‌ను శాసించే బ్యాట్స్‌మన్‌గా ఎదగక ముందు ఎలా ఉన్నాడో గుర్తుందా? మైదానంలో అనవసర దూకుడు, మాట్లాడితే బూతులు, వరుస వివాదాలు అతనికి చెడ్డ పేరు తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత ఆటతో పాటు వ్యక్తిగతంగా కోహ్లిలో పెను మార్పు వచ్చి అతడిని దిగ్గజ స్థాయిలో నిలబెట్టింది. ఈ విషయం అతనికీ బాగా తెలుసు. తాను తప్పులు చేశానని ఒప్పుకుంటూ జూనియర్లు అలాంటి పని చేయకుండా నిరోధిస్తున్నానని విరాట్ అంటున్నాడు. న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత తొలిసారి మీడియాతో సవివరంగా మాట్లాడిన భారత కెప్టెన్... వేర్వేరు అంశాలపై తన మనసులో మాటను బయటపెట్టాడు. కోహ్లి ఇంటర్వ్యూ విశేషాలు అతని మాటల్లోనే... వరల్డ్ కప్‌లో ఓటమిపై... నేను నా జీవితంలో పరాజయాల నుంచే ఎక్కువ పాఠాలు నేర్చుకున్నాను. పెద్ద ఓటములే మున్ముందు ఇంకా బాగా ఆడేలా స్ఫూర్తినిచ్చాయి. మున్ముందు ఏం చేయాలనే విషయంపై దిశానిర్దేశం చేశాయి. ఇలాంటి సమయంలోనే మనతో ఎవరు ఉంటారో, ఎవరు గోడ దూకుతారో కూడా తెలిసిపోతుంది. దురదృష్టం ఏమిటంటే అందరూ అద్భుతంగా ఆడుతున్నారు అనిపించిన సమయంలో మరో జట్టు మనకంటే బాగా ఆడిందని తెలుస్తుంది. దీనిని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఏదైనా తప్పు చేస్తే చెప్పవచ్చు గానీ తప్పు చేయకపోయినా ఓడిపోయామని తెలిస్తే ఎలా ఉంటుంది! వరల్డ్ కప్‌లో ఏం సాధించామో దానిని చూసి గర్వపడాలని మేమంతా చెప్పుకున్నాం. మన ఘనతను మనం చెప్పుకోకుండా ఉంటే ఎలా? ఓటమి ఎదురైనంత మాత్రాన మన శ్రమను తక్కువ చేసి చూపవద్దని అందరం నిర్ణయించుకున్నాం. ఈ స్థాయికి చేరడంపై... పోరాడటం వదిలేస్తే మన ప్రయాణం ముగిసిపోయినట్లే. ఉదయం లేచిన దగ్గరి నుంచి కష్టపడటం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం మినహా మరో మార్గం లేదు. వీటిని పునరావృతం చేస్తేనే నిలకడ, విజయాలు వస్తాయి. నిజానికి ఇదంతా చాలా విసుగు తెప్పిస్తుంది. అయినా సరే చేయాల్సి రావడం చాలా కష్టం. గోల్ఫ్ ఆటగాళ్లు ఒకే షాట్‌ను ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేస్తారో కదా. యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచినా సరే అది అలా చేయాల్సిందే. ఎందుకంటే అలా చేస్తేనే తర్వాత దాని ఫలితం దక్కుతుంది. క్రికెట్లో అడుగు పెట్టినప్పుడు దేవుడు నా కోసం ఏం రాసి పెట్టాడో తెలీదు. దేని గురించి కూడా ఊహించలేదు. నాలో మరీ అంత గొప్ప సామర్థ్యం లేదని నాకూ తెలుసు. అయితే నా చుట్టూ ఉన్నవారితో పోలిస్తే ఎంతైనా కష్టపడగలనని, ఎంత శ్రమకైనా ఓర్చుకోగలననే విషయం మాత్రం నాకు బాగా తెలుసు. దేవుడు బహుశా ఈ శ్రమనే చూసినట్లున్నాడు! క్రికెట్ బయట జీవితంపై... నేను నా కోసం క్రికెట్ ఆడుతున్నానే తప్ప ఎవరిని మెప్పించడానికో కాదు. నా ఉద్దేశాలు, ఆలోచనలు స్పష్టం. అయితే ఆ తర్వాత సహజంగానే క్రికెట్ తర్వాత కూడా జీవితం ఉందనే వాస్తవం అర్థమవుతుంది. అప్పటి వరకు ఆటనే సర్వస్వం అనిపించినా భార్య, కుటుంబానికి కూడా సమయం కేటాయించాలి. అప్పుడు అవి ప్రాధాన్యతలుగా మారిపోతాయి. మతపరమైన అంశాల్లో నేను భాగం కాను. మొదటి నుంచీ ఏ మతంతో నన్ను నేను ముడివేసుకోలేదు. అన్ని మతాలతో, అందరు మనుషులతో కలిసిపోతా. నాకు తెలిసి మనందరిలో ఆధ్యాత్మికత ఉంటుంది. కొత్త కుర్రాళ్లతో సాన్నిహిత్యంపై... రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లాంటి కుర్రాళ్లంతా అద్భుతమైనవారు. గతంలోనే చెప్పినట్లు నేను 19–20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆలోచనాధోరణితో పోలిస్తే వీరంతా చాలా ముందున్నారు. ఐపీఎల్‌తో ఆట మెరుగుపడితే... తప్పుల నుంచి నేర్చుకోవడం మొదలు ఇతరత్రా వాటిలో కూడా వారిలో ఆత్మవిశ్వాసంపాళ్లు చాలా ఎక్కువ. కుర్రాళ్లపై కోపం ప్రదర్శించే సంస్కృతి మా జట్టులో లేదు. వారు కూడా సీనియర్లలాగే మనసు విప్పి మాట్లాడవచ్చు. నేనైతే వారి దగ్గరకు వెళ్లి ‘నేను ఇలాంటి తప్పులు చేశాను. మీరు మాత్రం అలా చేయకండి’ అంటూ విడమర్చి చెబుతాను. ఎందుకంటే ఎదుగుతున్న సమయంలో నేను చాలా తప్పులు చేశాను. కెరీర్ ఆరంభంలో ఇతర విషయాలపై దృష్టి పెట్టి ఆటపై ఏకాగ్రత కనబర్చలేకపోయాను. అదృష్టవశాత్తూ మళ్లీ దారిలో పడ్డాను. రాబోయే టెస్టు చాంపియన్‌షిప్‌పై... నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. సరైన సమయంలో ఇది జరుగుతోంది. ఆడేది ద్వైపాక్షిక సిరీస్‌లే అయినా వాటి ప్రాధాన్యత పెరిగిపోతుంది. కాబట్టి ప్రతీ సిరీస్ కోసం ప్రత్యేక ప్రణాళికతో సిద్ధం కావాల్సి ఉంటుంది. గతంలోనే టెస్టు చాంపియన్‌షిప్ గురించి ఆలోచించా. ఇప్పడది వాస్తవ రూపం దాలుస్తోంది. -
మై సోల్‌మేట్ రిషభ్ : ఇషా
భారత క్రికెటర్ రిషభ్ పంత్ ప్రేమలో పడ్డాడు. బుధవారం ‘ఇన్స్టాగ్రామ్’లో తన ప్రేయసితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. దీనిపై ‘నేను సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వు...నిన్ను కూడా సంతోషంగా ఉంచడమే నేను చేయాల్సింది’ అని వ్యాఖ్యను కూడా జోడించాడు. ఆ అమ్మాయి పేరు ఇషా నేగి అని అతని సన్నిహితులు వెల్లడించారు. ఆమె 21 ఏళ్ల పంత్ ఇలాంటి ఫోటోతో గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేయడం ఆసక్తికర చర్చగా మారింది. ఇక ఇదే ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఇషా.. ‘ మై మ్యాన్.. మై సోల్‌మేట్.. మై బెస్ట్‌ఫ్రెండ్.. లవ్ ఆఫ్ మై లవ్ రిషభ్ పంత్’ అంటూ క్యాప్షన్ జత చేశారు. View this post on Instagram I just want to make you happy because you are the reason I am so happy ❤️ A post shared by Rishabh Pant (@rishabpant) on Jan 16, 2019 at 7:42am PST View this post on Instagram My man, my soulmate, my best friend, the love of my life. @rishabpant A post shared by Įsha Negi 👑 (@ishanegi_) on Jan 16, 2019 at 7:52am PST -
రాయుడు బౌలింగ్ సందేహాస్పదం!
దుబాయ్: భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు బౌలింగ్ శైలిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సందేహం వ్యక్తం చేసింది. శనివారం సిడ్నీలో జరిగిన తొలి వన్డే అనంతరం మ్యాచ్ అధికారులు తమ నివేదికలో రాయుడు ఆఫ్‌స్పిన్ బౌలింగ్ యాక్షన్‌ను తప్పు పట్టారు. ఈ నివేదికను ఐసీసీ భారత టీమ్ మేనేజ్మెంట్కు అందజేసింది. అతను 14 రోజుల్లోగా పరీక్షకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. అయితే తుది ఫలితం వచ్చే వరకు మాత్రం రాయుడు తన బౌలింగ్‌ను కొనసాగించవచ్చు. పార్ట్‌టైమ్ స్పిన్నర్ రాయుడు తన 46 మ్యాచ్‌ల వన్డే కెరీర్లో 20.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు దేశవాళీ వన్డేలు, టి20ల్లో అతను ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. సిడ్నీ వన్డేలో 2 ఓవర్లు వేసిన రాయుడు 13 పరుగులిచ్చాడు. -
పాండ్యా, రాహుల్‌కు బీసీసీఐ నోటీసులు
హిందీ పాపులర్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’లో మహిళలపట్ల అనుచితంగా మాట్లాడిన ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా క్షమాపణలు చెప్పాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఈ ఆల్‌రౌండర్ కొన్ని వారాల క్రితం ‘కాఫి విత్ కరణ్’లో మహిళల పట్ల అగౌరవంగా కామెంట్ చేశాడు. ‘షోలో నేను మాట్లాడిన మాటలు ఎవరినైనా కించపరిచేవిగా ఉంటే క్షమించండి. ఆ షో తీరుకు భిన్నంగా వ్యవహరించాను. అయితే, ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అలా మాట్లాడలేదు’ అని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. టీవీ షోలో హార్దిక్ ఏమన్నాడంటే.. కొన్ని వారాల క్రితం కాఫీ విత్ కరణ్‌లో పాండ్యా.. ‘మా అమ్మానాన్నలతో ప్రతి విషయం షేర్ చేసుకుంటాను. సెక్స్‌కి సంబంధించిన విషయాలు కూడా చెప్పేస్తా. అమ్మాయిలతో గడిపిన క్షణాలను సైతం వారి దగ్గర దాచను. నా వర్జినిటీ కోల్పోయిన సందర్భం కూడా వారికి చెప్పా’ అని చెప్పుకొచ్చాడు పాండ్యా. అంతేకాకుండా మహిళలను ఉద్దేశించి ఏకవచనంతో.. ఇది.. అది.. హేళనగా మాట్లాడాడు. దీంతో హార్దిక్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ టీవీ కార్యక్రమంలో హార్దిక్‌తో పాటు కేఎల్ రా్హుల్ కూడా పాల్గొన్నాడు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలి.. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన హార్దిక్ పాండ్యాకు, అతనితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న కేఎల్ రాహుల్‌కు ఇండియన్ క్రికెట్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ బుధవారం షోకాజ్ నోటీసులు పంపింది. నోటీసులపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. View this post on Instagram A post shared by Hardik Pandya (@hardikpandya93) on Jan 8, 2019 at 6:17pm PST -
రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన ఘనత
సాక్షి, స్పోర్ట్స్ (డబ్లిన్) : టీమిండియా తాము ఆడిన100వ టీ20 మ్యాచ్‌లో భారీ విజయం సాధించగా.. భారత ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన తొలి టీ20లో భాగంగా ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ (61 బంతుల్లో 97; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నా.. పదివేల పరుగుల మైలురాయి(10, 022 పరుగులు)ని అధిగమించాడు. ఐర్లాండ్‌తో నిన్నటి మ్యాచ్‌కు ముందు 9,925 పరుగులతో ఉన్న రోహిత్, ఆ మ్యాచ్‌లో 75 పరుగుల వ్యక్తిగత స్కోరుకు చేరుకోగానే భారత ఓపెనర్ ఖాతాలో ఈ ఫీట్ నమోదైంది. పదివేల పరుగుల క్లబ్లో చేరిన అతికొద్దిమంది ఓపెనర్ల జాబితాలో రోహిత్‌కు చోటు లభించింది. మొత్తం మూడు అంతర్జాతీయ ఫార్మాట్ల (టెస్టులు, వన్డేలు, టీ20లు)లో కలిపి రోహిత్ ఈ ఘనత సాధించాడు. రోహిత్ టెస్టుల్లో 1,479 పరుగులు, వన్డేల్లో 6,594 పరుగులు, టీ20ల్లో 1,949 పరుగులు సాధించాడు. వన్డేల్లో 17 శతకాలు బాదిన రోహిత్.. టెస్టుల్లో 3, టీ20ల్లో 2 సెంచరీలు బాదాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అరుదైన ఆటగాళ్లలో రోహిత్ ఒకడు కాగా.. మూడుసార్లు ఈ ఫీట్ నెలకొల్పిన ఏకైక క్రికెటర్‌గా భారత ఓపెనర్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. సచిన్ ఎవర్గ్రీన్ ఓవరాల్‌గా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పరుగుల జాబితాలో 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టులు (15,921), వన్డేల్లో (18,426) అత్యధిక పరుగుల రికార్డు సైతం సచిన్ పేరిటే ఉంది. సచిన్ తర్వాతి స్థానంలో కుమార సంగక్కర 28,016 పరుగులతో ఉన్నాడు. భారత్ నుంచి రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, మహ్మద్ అజారుద్దీన్, సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, దిలీప్ వెంగ్‌సర్కార్‌లు అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగుల క్లబ్లో ఉన్నారు. -
కోర్టు బయట పరిష్కరించుకుంటాం: షమీ
న్యూఢిల్లీ: తన భార్యతో తలెత్తిన వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ తెలిపాడు. తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గృహహింస, హత్యాయత్నం కింద షమీపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ‘ఈ సమస్యపై చర్చించి పరిష్కరించుకోవడం మినహా చేసేదేమీ లేదు. కోర్టు వెలుపల పరిష్కారం కనుగొనడమే నాకు, నా పాపకు, నా కెరీర్‌కు ప్రయోజనకరం. కోల్‌కతాకు వెళ్లి నా భార్యతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా’ అని మీడియాతో షమీ అన్నాడు. మరోవైపు అతని భార్య కూడా వివాద పరిష్కారానికే మొగ్గుచూపుతోంది. ‘నేను అతని అనుచిత స్క్రీన్ షాట్స్, వాట్సాప్ మెసేజ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాకే షమీ నిజ స్వరూపమేంటో బయటపడింది. అయితే ఇప్పటికీ అతను నిజాయతీగా తన తప్పులను సరిదిద్దుకుంటానంటే మా అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. సయోధ్యపై ఆలోచిస్తాను’ అని హసీన్ తెలిపింది. ‘అతని ఫోన్ నాకు దొరకడం, అందులో అభ్యంతరకర ఫొటోలు, చాటింగ్‌లు ఉండటం వల్లే షమీ మిన్నకుండిపోయాడు. లేదంటే ఇప్పటికే విడాకులిస్తానని కోర్టుకెక్కేవాడు’ అని ఆమె చెప్పింది. మరోవైపు ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయిన షమీకి ఐపీఎల్–11 సీజన్ కూడా చేజారే ప్రమాదముంది. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు షమీని ఆడించాలా వద్దా? అనే అంశంపై బోర్డు అనుమతి కోరింది. బీసీసీఐ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ సీఈఓ హేమంత్ దువా వెల్లడించారు. -
షమీ శివలింగా ట్వీట్.. నెటిజన్ల ఫైర్
న్యూఢిల్లీ : టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. కొత్త సంవత్సరం సందర్భంగా షమీ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగింది. ఇది గుర్తించిన షమీ వెంటనే తన ట్వీట్‌ను తొలిగించాడు. అభిమానులనుద్దేశించి ‘నూతన సంవత్సరంలో మీకు, మీ కుటుంబాలకు అన్ని శుభాలే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. అందరికీ హ్యాపీ న్యూఇయర్ అని’ పూలతో అలంకరించిన శివలింగా ఫొటోను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై ముస్లిం వర్గానికి చెందిన అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఇస్లాంకు వ్యతిరేకమని ఘాటుగా స్పందించారు. ఇక షమీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు రావడం ఇది తొలిసారేం కాదు. గతంలో తన కూతురి పుట్టిన రోజు సందర్భంగా చేసిన ట్వీట్‌పై సైతం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లాంలో పుట్టినరోజు సంబరాలు చేసుకోరని ఫైర్ అయ్యారు. తన సతీమణి, కూతురితో ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఫొటోపై కూడా విమర్శలొచ్చాయి. షమీ భార్య దుస్తులను ప్రస్తావిస్తూ.. ముస్లిమై బుర్ఖా ధరించకపోవడం ఏమిటని ట్రోల్ చేశారు. -
‘అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరించారు’
ముంబై : సిక్సర్లతో విరుచుకుపడుతూ.. డబుల్ సెంచరీలతో ప్రపంచ రికార్డులు నమోదు చేస్తున్న టీమిండియా తాత్కలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఒకప్పుడు పోలీసుల బెదిరింపులు ఎదుర్కొన్నాడట. టీవీ వ్యాఖ్యాత గౌరవ్‌కపూర్ ‘చాంపియన్స్ విత్ బ్రేక్‌ఫాస్ట్ షో’లో తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ షో సరిగ్గా ఇండోర్ మ్యాచ్‌కు ముందు ప్రసారం అయింది. ఈ చిట్‌చాట్‌లో స్కూల్‌డేస్‌లో తనని పోలీసులు అరెస్ట్ చేస్తామని బెదిరించిన ఘటనను రోహిత్ గుర్తుచేసుకున్నాడు. ‘మా కుటుంబం ఎప్పూడు క్రికెట్‌ను ఇష్టపడేది. రోజుకు 16 గంటలు క్రికెట్ మ్యాచ్‌లను చూసేవాళ్లం. మా బాబాయ్‌లు, పిన్నిలందరం కలిసి మా వీధిలో క్రికెట్ ఆడే వాళ్లం. ఓ ముగ్గురు.. నలుగురు.. స్నేహితులమైతే వీధిలో ఎప్పుడూ క్రికెట్ ఆడేవాళ్లం. మా బాబాయ్‌లు బిల్డింగ్ పై నుంచి చూస్తూ.. నా బ్యాటింగ్‌ను పరీక్షించేవారు. ఇలా ఆడుతూ భారీ షాట్లతో మా వీధిలో చాలా కిటికీ అద్దాలు పగలగొట్టాను. వారంతా నాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు నా దగ్గరకు వచ్చి ఇంకోసారి కిటికీ అద్దాలు పగలగొడితే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. నావల్ల మా చుట్టుపక్కల వాళ్లు చాలా ఇబ్బంది పడేవారు. తరువాత మా క్రికెట్‌ని మైదానాల్లోకి మార్చడంతో ఇలాంటి ఫిర్యాదులు రాలేదని’ రోహిత్ తన చిన్ననాటి సంఘటనని గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా తన సతీమణి రితికాను తొలి సారి కలుసుకున్న సందర్భం, ఎంగేజ్మెంట్ రోజు హోటల్లో రింగ్ మర్చిపోవడం, తన అభిమాని క్రికెటర్ సచిన్ టెండూల్కర్ల గురించి మరిన్ని విశేషాలు రోహిత్ ఈ షోలో చెప్పుకొచ్చాడు. -
భారత క్రికెటర్ తండ్రిపై కత్తితో దాడి!
రోహ్తక్: క్రికెటర్ జోగిందర్ శర్మ తండ్రి ఓం ప్రకాశ్‌శర్మపై రోహ్తక్లో దాడి జరిగింది. ఇద్దరు దుండుగులు ఆయనను కత్తితో పొడిచి.. దోపిడీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి68 ఏళ్ల ఓం ప్రకాశ్ రోహతక్ కాథ్‌మండి సమీపంలో తన కిరాణ దుకాణాన్ని మూసేస్తూ ఉండగా ఇద్దరు యువకులు దుకాణానికి వచ్చారు. కూల్‌డ్రింక్స్, సిగరెట్లు తీసుకొని వెళ్లిపోయినట్టే వెళ్లిపోయి.. తిరిగి వచ్చి ఓంప్రకాశ్‌పై దాడి చేశారు. 'వాళ్లు మొదట నా జేబులో నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. నేను వారిని అడ్డుకోవడంతో కత్తితో కడుపులో పొడిచారు. వారు దుకాణంలోని డబ్బునంతా తీసుకొని వెళ్లారు. రూ. 7వేల వరకు పట్టుకొని పోయారు' అని ఓంప్రకాశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. దుండగులు గాయపడిన శర్మను దుకాణంలోనే ఉంచి.. బయటనుంచి మూసేసి వెళ్లిపోయారు. అనంతరం స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా చివరి ఓవర్ వేసి.. భారత్ జట్టుకు బౌలర్ జోగిందర్ శర్మ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. -
ఈ టాప్ క్రికెటర్‌ను గుర్తుపట్టగలరా?
న్యూఢిల్లీ: ఫోటోలో ఉన్న ఇద్దరిలో ఓ ప్రముఖ క్రికెటర్(ఎడమ వైపు) ఉన్నాడు. అతని స్పిన్ మాయజాలంతో భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు. ఇంకా గుర్తు పట్టలేదా అయితే మీకో హింట్. ఫోటోలో ఉన్న మరొకరు(కుడి వైపు) ఆ క్రికెటర్ గారాల కూతురు. అదేనండి.. నటి గీతా బస్రాను పెళ్లిచేసుకొని వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన హర్భజన్ సింగ్ గత ఏడాది జూలైలో తండ్రిగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. అయితే భజ్జీ చిన్ననాటి ఫోటోతో పాటూ తన ముద్దుల కూతురు 'హినయ హీర్ ప్లహా' ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అప్పుడు నేను, ఇప్పుడు నా కూతురు ఒకేలా ఉన్నామా అంటూ కామెంట్ పెట్టాడు. మై యూనివర్స్, మై హ్యాప్పీనెస్, మై లైఫ్, హినయ హీర్ ప్లహా అంటూ ట్యాగ్స్ పెట్టి తన గారాలపట్టిపై తనకున్న ప్రేమను ఈ విధంగా చూపించాడు. -
భార్యతో జాలీగా హర్బజన్ టూర్
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫ్యామిలీ ఫొటో వైరల్ గా మారింది. గతేడాది గీతా బస్రాను పెళ్లిచేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన భజ్జీ గత జూలైలో తండ్రిగా ప్రమోషన్ పొందాడు. భార్య గీతా బస్రా, కూతురు 'హినయ హీర్ ప్లహా'తో కలిసి దిగిన ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ట్రావెల్ టైమ్ విత్ ఫ్యామిలీ అని క్యాప్షన్ పెట్టాడు భజ్జీ. ఇక అంతే శనివారం ఉదయం హర్బజన్ పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హర్బజన్ భార్య గీతా బస్రా చేతిలో ట్రావెల్ టికెట్లు ఉండటాన్ని ఫొటోలో గమనించవచ్చు. కొందరు ఫ్యాన్స్ దీనిపై కామెంట్ చేశారు. బ్యూటిఫుల్ కపుల్ అని కొందరు, స్వీట్ ఫ్యామిలీ పాజీ అని, హ్యాపీ జర్నీ భజ్జీ అని ఇలా హర్బజన్ అభిమానులు, ఫాలోయర్స్ కామెంట్ చేశారు. టీమిండియా జెర్సీలో మళ్లీ ఎప్పుడూ కనిపిస్తావు భజ్జీ అని కొందరు కామెంట్ చేశారు. -
గుండె పగిలినంతపనైంది: క్రికెటర్
బెంగళూరు: గాయంతో జట్టుకు దూరం కావడం పట్ల టీమిండియా బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్వదేశంలో సిరీస్ జరుగుతుండగా తాను ఇంటికే పరిమితం కావాల్సి రావడం దురదృష్టకరంగా పేర్కొన్నాడు. తొడ కండరాల గాయంతో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవడం బోర్ కొట్టిందని చెప్పాడు. తన మనసంతా టీమిండియాతోనే ఉందని ‘బీసీసీఐ టీవీ’తో మాట్లాడుతూ అన్నాడు. ‘చాలా కాలం తర్వాత హోం సిరీస్ లో ఆడలేకపోవడం బాధ కలిగించింది. గాయంతో జట్టుకు దూరం కావడంతో గుండె పగిలినంతపనైంది. విదేశాల్లో చాలా సిరీస్ లు ఆడాను. ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాను. హోంసిరీస్ లో బాగా ఆడాలని అనుకున్నాను. గాయంతో నా ఆశలపై నీళ్లు చల్లింద’ని వాపోయారు. విశ్రాంతి సమయంలో ఫిట్ నెస్ పై దృష్టి పెట్టానని చెప్పాడు. ‘ఖాళీగా ఇంటిదగ్గర కూర్చోవడం బోర్ కొట్టింది. ఈ ఆరు వారాలు భారంగా గడిచింది. మొదటి రెండు వారాలు అయితే ఏమీ చేయలేకపోయాను. ఉదయం నిద్ర లేవగానే ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు వెళ్లడం, తర్వాత రీహెబిలిటేషన్ సెంటర్ లో గడపడంతోనే సరిపోయింది. మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తానా అని ఆలోచిస్తూనే గడిపాను. నా మనసంతా టీమిండియాతోనే ఉండేది. టీమ్ లో ఉన్నట్టే అనుకునేవాడిని. ఫుల్ ఫిట్ నెస్ సాధించి తొందరగా జట్టులో చేరాలని తపన పడుతుండేవాడిన’ని రాహుల్ చెప్పాడు. విశాఖపట్నంలో గురువారం నుంచి ఇంగ్లండ్ తో జరగనున్న రెండో టెస్టులో రాహుల్ ఆడనున్నాడు. -
అతడే నాకు అండ: అమిత్ మిశ్రా
విశాఖపట్నం: తన కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం పట్ల టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా సంతోషం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ తో శనివారం జరిగిన ఐదో వన్డేలో 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మాట్లాడుతూ... 'నా కెరీర్ లో ఆరోజు చాలా మంచి ప్రదర్శన చేశాను. నేను వికెట్లు తీయాలని ప్రతిఒక్కరు ఆశిస్తారు. అంచనాలకు అనుగుణంగా రాణించాను. గతంలో సాధించిన వాటి గురించి ఆలోచించలేదు. ఈరోజు మ్యాచ్ పైనే పూర్తిగా దృష్టి పెట్టాను. తదనుగుణంగా బౌలింగ్ చేశాన'ని అమిత్ మిశ్రా తెలిపాడు. టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే తనకు అండగా నిలబడడం వల్లే తానేంటో నిరూపించుకున్నానని అన్నాడు. కుంబ్లే సహకారం ఎప్పటికీ మరువలేనని, తన కష్టానికి ఫలితం దక్కిందని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అమిత్ మిశ్రా గతంలోనూ సత్తా చాటాడు. రవిచంద్రన్ అశ్విన్ విశ్రాంతి తీసుకోవడంతో వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. కివీస్ తో ముగిసిన 5 వన్డేల సిరీస్ లో 15 వికెట్లు పడగొట్టి ఈ టోర్నిలో టాప్ బౌలర్ గా నిలిచాడు. -
హర్భజన్ కూతురు పేరేమిటో తెలుసా!
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్-గీతా బస్రా దంపతులు తాజాగా పండంటి బిడ్డను కన్నారు. గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ జంటకు గత జూలైలో ఆడబిడ్డ పుట్టింది. తమ ముద్దుల కూతురి పేరేమిటో తాజాగా వీరు తమ ట్విట్టర్ పేజీలో వెల్లడించారు. తమ బిడ్డకు 'హినయ హీర్ ప్లహా' అని పేరు పెట్టామని వారు తెలిపారు. పాపకు ఆశీస్సులు అందజేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. టర్బోనేటర్ భజ్జీ గత ఏడాది ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేమికురాలు అయిన బాలీవుడ్ నటి గీతా బస్రాను ఆయన పెళ్లాడారు. ఇక మహేంద్రసింగ్ ధోనీ కూతురి పేరు 'జివా' కాగా, భజ్జీ కూతురి పేరు 'హినయ' అని పెట్టడం బాగుందని భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. HINAYA HEER PLAHA would like to thank you all for your lovely wishes in welcoming her into this world .. #ourlife #ourworld @Geeta_Basra — Harbhajan Turbanator (@harbhajan_singh) September 2, 2016 -
కరుణ్ నాయర్‌కు తప్పిన ప్రమాదం
అలప్పుజ(కేరళ): భారత క్రికెటర్, కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్‌కు తృటిలో పడవ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆదివారం పంపా నదిలో స్నేక్ బోట్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆ పడవ తిరగబడింది. ఆ పడవలో ప్రయాణిస్తున్న కరుణ్ నాయర్‌తో పాటు పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడగా, ఇద్దరు ఆచూకీ గల్లంతైంది. సుమారు 100 మందితో ప్రయాణించడంతోనే ఆ పడవ తల్లక్రిందులైనట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. వీరంతా శ్రీ పార్థసారథి స్వామి ఆలయంలో జరిగే వాల్లా సద్యా ఉత్సవానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చేసుకున్నట్లు తెలిపారు. అయితే పడవ ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు ఆర్నామూలా పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఆ ఇద్దరి ఆచూకీ గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇటీవల జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టులో కరుణ్ నాయర్ కు స్థానం కల్పించగా, వెస్టిండీస్ టూర్ నుంచి ఆ క్రికెటర్‌కు విశ్రాంతినిచ్చారు. -
భారత మాజీ క్రికెటర్ దీపక్ కన్నుమూత
అహ్మదాబాద్:తన ఆరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన భారత మాజీ క్రికెటర్ దీపక్ శోధన్(87) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారజామున అహ్మదాబాద్‌లోని తన స్వగ్రహంలో తుదిశ్వాస విడిచారు. భారత పాతతరం టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు పొందిన దీపక్.. 1952లో పాకిస్తాన్‌తో ఈడెన్ గార్డెన్ లో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఆరంగేట్రం చేశారు. స్వతహాగా ఎడమచేతి వాటం బౌలర్ అయిన దీపక్.. తొలి టెస్టు మ్యాచ్‌లోనే బ్యాట్‌తో మెరిశాడు. భారత్ 179 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన శోధన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన దీపక్ 15 ఫోర్లు సాయంతో 110 పరుగులు చేశాడు. తద్వారా మొదటి టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. అయితే టెస్టు కెరీర్ ఎంతోకాలం సాగలేదు. 1953లో వెస్టిండీస్‌పై చివరి టెస్టు మ్యాచ్ ఆడిన దీపక్ కేవలం మూడు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. దేశవాళీలో బరోడా, గుజరాత్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఆయన 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. -
విరాట్.. మనసున్నమారాజు
మైదానంలో భారత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగే కాదు ప్రవర్తన కూడా దూకుడుగా ఉంటుంది. బ్యాట్‌తో బౌలర్లకు చుక్కలు చూపించే విరాట్.. ప్రత్యర్థులు నోరు జారితే అంతే దీటుగా స్పందిస్తాడు. మాటల యుద్దానికైనా, గొడవకైనా సై అంటాడు. దీంతో అతను కొన్నిసార్లు విమర్శలపాలయ్యాడు కూడా. అయితే కోహ్లీలో చాలామందికి తెలియని మరో పార్శ్యం కూడా ఉంది. విరాట్ మనసు వెన్న. వ్యక్తిగత జీవితంలో నిబ్బరంగా, సేవాభావంతో ప్రవర్తిస్తాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ ఇటీవల పుణెలో ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ పెద్దలతో ఎంతో అప్యాయంగా మాట్లాడి వారి క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నాడు. పుణెలో ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌లో తనకు వచ్చే ఫీజులో 50 శాతాన్ని ఆ సంస్థకు విరాళంగా ప్రకటించాడు. అంతేగాక విరాట్ కోహ్లీ ఫౌండేషన్ తరపున ఆ సంస్థకు మరింత సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కుటుంబ పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం మనందరి బాధ్యతని ఈ సందర్భంగా కోహ్లీ ఉద్వేగంగా చెప్పాడు. పెద్దవాళ్ల బాగోగులు చూడకుండా వదిలివేయడం తప్పని అన్నాడు. లవర్ బాయ్‌గా, యాంగ్రీ యంగ్‌మన్‌గా, దూకుడైన క్రికెటర్‌గా కనిపించే కోహ్లీ.. ఓ ఆదర్శమైన యువకుడు కూడా.. -
వచ్చే నెలలో ఇర్ఫాన్ పెళ్లి!
బరోడా: భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ త్వరలోనే పెళ్లి కొడుకు కానున్నాడు. ‘ఫిబ్రవరిలో నా పెళ్లి జరగనున్న మాట వాస్తవం. ఇతర వివరాలు తర్వాత చెబుతాను’ అని ఇర్ఫాన్ వివాహ విషయాన్ని ధ్రువీకరించాడు. ఫిబ్రవరి నెల మొదటి లేదా రెండో వారంలో అతడి పెళ్లి వేడుక ఉంటుందని, ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని కుటుంబ సన్నిహితులు చెప్పారు. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమని, అమ్మాయి పేరు సఫా అని వారు వెల్లడించారు. -
ఇక తెరపై సచిన్
నటనకు ఎవరూ అనర్హులు కాజాలరు. క్రీడారంగంలోని వారికి నటనపై ఆసక్తి కలగడం విశేషమేమీకాదు. క్రికెట్ క్రీడకే గౌరవాన్ని ఆపాదించిన సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర వెండి తెరకెక్కడానికి సిద్ధమవుతుందని సమాచారం. కవితకు కాదేదీ అనర్హం అన్నట్లు నటనకు ఎవరూ అనర్హులు కాజాలరు. కాకపోతే అవకాశాలకు కాస్త అదృష్టం కావాలి. ఇక సెలబ్రిటీలకైతే అదృష్టం వద్దన్నా వరిస్తుంది. ఇతర రంగాల్లో పేరుగాంచిన వారు ఆ తరువాత దృష్టి సారిస్తోంది సినిమా రంగమే అని చెప్పడానికి సాహసం అక్కర్లేదనుకుంటా. ఇక క్రీడారంగంలోని వారికి నటనపై ఆసక్తి కలగటం విశేషమేమీ కాదు.ఇప్పటికే క్రికెట్ క్రీడా రంగంలో సంచలనం సృష్టించిన శ్రీశాంత్ తన దృష్టిని సినిమాలపైకి మళ్లించారు. త్వరలో తమిళం,తెలుగు భాషల్లో తెరకెక్కనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. అందుకోసం ఆయన తగు శిక్షణ తీసుకుంటున్నారు కూడా. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విశేష సేవలందించిన ధోని జీవిత ఇతి వృత్తం తెరకెక్కనుంది. తాజాగా క్రికెట్ గ్రౌండ్లో చిచ్చర పిడుగులా చెలరేగి బంతిని తన ఇష్టం వచ్చినట్లు ఆటాడుకుని ఈ క్రీడకే గౌరవాన్ని ఆపాదించిన సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర వెండి తెరకెక్కడానికి సిద్ధమవుతుందని సమాచారం.ఇందులో సచిన్ పాత్రలో ఆయనే నటించనుండడం మరో విశేషం. సచిన్ బాల్యం నుంచి క్రికెట్ క్రీడా రంగంలో ఆయన సాధన ఇతి వృత్తంగా ఈ చిత్రం ఉంటుందట. దీన్ని జేమ్స్ ఏర్స్కిన్ అనే దర్శకుడు హ్యాండిల్ చేయనున్నారు. హిందీలో ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న ఈ చిత్రం ఆనక అన్ని భాషల్లోనూ అనువాదం అయ్యో అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు తెలిసింది. పిచ్‌లో సిక్సర్లు కొట్టిన సచిన్ ఇక చిత్రాల్లో ఎలాంటి హిట్లు కొడతారో వేచి చూడాల్సిందే. -
న్యూఇయర్ విహారానికి కోహ్లి-అనుష్క!
ముంబై: నూతన సంవత్సరం రానున్న సందర్భంగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ కలిసి విదేశీ విహారానికి బయలుదేరి వెళ్లారు. ఈ జంట బ్యాగు, సూట్‌కేసు సర్దుకొని ముంబై ఎయిర్‌పోర్టులో దనర్శమిచ్చింది. ప్రేమికులైన కోహ్లి, అనుష్క తీరిక దొరికినప్పుడల్లా కలిసి విహరించడం తెలిసిందే. నిన్నమొన్నటివరకు ఇటు క్రికెట్ మ్యాచులు, అటు సినిమా షుటింగ్‌లతో కోహ్లి, అనుష్క బిజీబిజీగా గడిపారు. కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా ఈ బిజీ షెడ్యూళ్ల నుంచి ఇద్దరికీ కాసింత తీరిక దొరకడంతో జంటగా విదేశాల్లో విహరించడానికి.. వీరు బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తున్నది. అయితే వారు ఏ దేశానికి వెళ్లిందనేది తెలియకపోయినా.. విదేశాల్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోబోతున్నట్లు సమాచారం. -
సచిన్, ధోని, కోహ్లి దారిలో రోహిత్!
భారత క్రికెటర్ రోహిత్ శర్మ సహచరులు సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ దారిలో నడుస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇటీవల టెస్టుల్లో పెద్దగా రాణించకపోవడంతో కెరీర్ ఊగిసలాటలో పడిన తరుణంలో ఆయన ఓ ఫ్రాంచెజీకి కో-ఓనర్‌గా సరికొత్త అవతారమెత్తారు. ప్రో రెజ్లింగ్ లీగ్ లో ఉత్తరప్రదేశ్ వారియర్స్ టీమ్‌కు సహ యజమానిగా రోహిత్ ఉండనున్నారు. ప్రో రెజ్లింగ్ లీగ్ లో ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర ఓ జట్టు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ లీగ్‌లోకి ఎంటరైన ప్రముఖుడు రోహితే. ఆరు నగరాలు కేంద్రంగా ఈ నెల 10 నుంచి అత్యంత అట్టహాసంగా ప్రో రెజ్లింగ్ లీగ్ ప్రారంభంకానుంది. ఈ నెల 25, 26 తేదీల్లో సెమిస్ మ్యాచులు, 27న ఫైనల్ మ్యాచ్ జరుగనున్నాయి. ఓ జట్టుకు సహ యజమానిగా ముందుకొచ్చిన రోహిత్ శర్మ మాట్లాడుతూ 'భారత్ రెజ్లింగ్ కు ఘనమైన చరిత్ర ఉంది. యూపీ వారియర్స్ టీమ్ కు సహ యజమానిగా ఉండటం నిజంగా గర్వకారణం. భారత్ లోనే అత్యంత ప్రముఖుడైన సుశీల్‌కుమార్ మా జట్టులో ఉండటంతో తొలి లీగ్ లో టాప్ స్థానాన్ని సాధిస్తామని విశ్వాసముంది' అని ఆయన చెప్పారు. ఇప్పటికే క్రికెటర్లు సచిన్, ధోని, కోహ్లి ఫుట్‌బాల్ సూపర్ లీగ్ లో టీమ్‌లకు సహ యజమానులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
43 డిగ్రీల వేడిలో యోగా
ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో శిక్షణ తీసుకుంటున్న భారత క్రికెటర్ సురేశ్ రైనా ప్రతి రోజూ 43 డిగ్రీల వేడిలో యోగా చేస్తున్నాడు. ‘కృత్రిమంగా వేడిని సృష్టించి అందులో ఇలాంటి యోగా చేయడం వల్ల మరింత ఫిట్‌గా తయారవ్వొచ్చు. దీనివల్ల కండరాలు బలంగా తయారవడంతో పాటు మానసికంగా కూడా బాగా దృఢంగా తయారవుతాం. ఈ కొత్త శిక్షణతో నాలో ఉత్సాహం బాగా పెరిగింది’ అని రైనా చెప్పాడు. అలాగే నెదర్లాండ్స్ జాతీయ జట్టుతో కలిసి రైనా ప్రతిరోజూ క్రికెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నాడు. -
సురేశ్ రైనా ఘనత
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టి నేటికి పదేళ్లు పూర్తయింది. 20 ఏళ్ల వయసులో తొలి వన్డే ఆడాడు. 2005, జూలై 30న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేతో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ ఘనత సాధించడం పట్ల రైనా సంతోషం వ్యక్తం చేశాడు. 'అంతర్జాతీయ క్రికెట్ లో పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఇంత గొప్ప ప్రయాణానికి సహకరించిన నా కుటుంబానికి, బీసీసీఐకి, సెలెక్టర్లకు, సహచరులకు, స్నేహితులకు, అభిమానులకు థ్యాంక్స్. నా కెరీర్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నా. మరింతగా రాణించి దేశ ప్రతిష్ఠను పెంచుతా' అని రైనా పేర్కొన్నాడు. ఇప్పటివరకు 218 వన్డేలు ఆడిన రైనా 93.80 స్టైక్ రేటుతో 5500 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు ఉన్నాయి. 18 టెస్టులు, 44 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడాడు. మూడు ఫార్మెట్లలోనూ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్ మన్ గా ఘనత సాధించిన రైనా 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లోనూ సభ్యుడుగా ఉన్నాడు. -
ఓజా బౌలింగ్‌పై నిషేధం
ముంబై: భారత క్రికెటర్, హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. అనుమానాస్పద బౌలింగ్ శైలి కారణంగా అతన్ని మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయకుండా అడ్డుకుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) విజ్ఞప్తి మేరకు చెన్నైలోని ఐసీసీ గుర్తింపు సెంటర్లో ఓజా బౌలింగ్ శైలిని పరీక్షించారు. స్పిన్నర్ తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు ఈ పరీక్షలో తేలింది. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతులు విసిరేటప్పుడు బౌలర్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచరాదు. ఓజా దీన్ని ఉల్లంఘించడంతో బోర్డు చర్యలు తీసుకుంది. యాక్షన్‌ను సరి చేసుకునేంత వరకు ఓజాతో బౌలింగ్ చేయించొద్దని శుక్రవారం ఓ లేఖ ద్వారా హెచ్‌సీఏకు తెలియజేసింది. దీంతో సర్వీసెస్‌తో ఆదివారం ప్రారంభంకానున్న రంజీ మ్యాచ్ నుంచి స్పిన్నర్‌ను తప్పించారు. దాదాపు ఏడాది కాలంగా ఓజా బౌలింగ్ శైలిపై బోర్డు కన్నేయడంతో టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు తీసిన జాబితాలో ఉన్నా... జాతీయ సెలక్టర్లు అతనిపై పెద్దగా దృష్టిపెట్టలేదు. మరోవైపు ఓజా బౌలింగ్ యాక్షన్‌ను సమీక్షించాలని హెచ్‌సీఏ కోరలేదని సంయుక్త కార్యదర్శి పురుషోత్తం అగర్వాల్ స్పష్టం చేశారు. బోర్డు నుంచి లేఖ అందిందని ధ్రువీకరించారు. ఓజాను బౌలింగ్ నుంచి తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసిందని హైదరాబాద్ రంజీ జట్టు కోచ్ అబ్దుల్ అజీమ్ అన్నారు. -
రికార్డు గురించి ఆలోచించలేదు
కోల్‌కతా: గాయం తర్వాత రెండు నెలలకే తిరిగి వచ్చినట్లు అనిపిస్తోంది గానీ... పునరాగమనంలో రాణించడం అంత సులభం కాదని భారత క్రికెటర్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఒత్తిడిలో ఉండటం వల్లే ఆరంభంలో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డానని అతను అన్నాడు. రికార్డు డబుల్ సెంచరీపై రోహిత్ శర్మ ఇంటర్వ్యూ... విరామం తర్వాత బరిలోకి దిగడం, ఈ స్థాయిలో చెలరేగడం ఎలా సాధ్యమైంది? ఈ ఇన్నింగ్స్‌తో నేను గాడిలో పడటం ఎంతో ముఖ్యమని నాకు తెలుసు. రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడం వల్ల కొంత ఒత్తిడిలోనే ఉన్నాను. అయితే మరో ఎండ్‌లో రహానే స్వేచ్ఛగా ఆడి పరుగులు చేయడం నాకు ధైర్యాన్నివ్వడంతో పాటు పిచ్ పరిస్థితీ తెలిసొచ్చింది. చూస్తే రెండు నెలలు స్వల్ప వ్యవధి అనిపించవచ్చు గానీ... పునరాగమనంలో బాగా ఆడటం అంత సులువు కాదు. ఒక్కసారి అర్ధ సెంచరీ పూర్తి కాగానే బ్యాట్ ఝళిపించాను. ఆ ఆట ఏమిటో నాకు బాగా తెలుసు. ముందుగా చిన్న మైలురాళ్లను నిర్దేశించుకొని పెంచుతూ పోయాను. 50 ఓవర్లు ఆడటం సంతృప్తినిచ్చింది. బ్యాటింగ్ పవర్ ప్లేలో ఒక్కసారిగా దూకుడు పెరిగింది. ఇన్నింగ్స్‌కు అదే కీలక మలుపుగా భావించవచ్చా? అవును కెప్టెన్ అద్భుతమైన ఎత్తుగడ అది. పవర్‌ప్లే కొన్ని సార్లు అనుకూలంగా, కొన్ని సార్లు ప్రతికూలంగా కూడా పరిణమించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఆడాలి. అయితే ఆ సమయంలో అడ్డదిడ్డంగా కాకుండా తెలివిగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. మేమిద్దరం సాంకేతికంగా చక్కటి షాట్లు ఆడాం. ఈ మైదానం గురించి నాకు బాగా తెలుసు. అవుట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుంది. ఒక్కసారి ఫీల్డర్ల మధ్యలోంచి బంతిని పంపామంటే అది ఖచ్చితంగా బౌండరీగా మారుతుంది. సెంచరీకి ముందు మరింత స్వేచ్ఛగా ఆడినట్లుంది? నేను అలవోకగా బ్యాటింగ్ చేసిన మాట వాస్తవం. కానీ నిజాయితీగా చెప్పాలంటే సెంచరీ చేయటం గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. జట్టుకు భారీ స్కోరును అందించడంలోనే నా దృష్టి ఉంది. 10-15 ఓవర్లు మేం నిలబడితే కనీసం 300 పరుగులు...25-30 ఓవర్ల వరకు ఉంటే 350 పరుగులు సాధ్యమవుతుందని నాకు తెలుసు. ఆ తర్వాత లక్ష్యం పెంచుకుంటూ పోయాము. ఇన్నింగ్స్ చివరి దశలో మరీ జాగ్రత్తగా కాకుండా ఇక ఎలా ఆడినా పర్వాలేదు, బ్యాటింగ్ కొనసాగిస్తే చాలు అనిపించలేదా? నా ఆలోచన కాస్త భిన్నంగా ఉంది. ఇన్నింగ్స్ సమయంలో చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకుంటాను. వాటి గురించి మనసులో ఆలోచిస్తూనే ఉంటాను. ఏ బౌలర్‌నైతే బాగా ఆడగలనో వారిపై గురి పెడతా. కొంత మంది యార్కర్లు బాగా వేస్తారని తెలుసు. వారి బౌలింగ్‌లో ఎలా ఆడాలనేదానిపై మరి కాస్త జాగ్రత్త పడతాను. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో ఇలాంటి ఆలోచనలన్నీ నా మస్తిష్కంలో మెదులుతూనే ఉన్నాయి. 48వ ఓవర్లో కులశేఖర బౌలింగ్‌లో ఆడిన అద్భుతమైన షాట్ ఎలా సాధ్యమైంది? ఆ సమయంలో సర్కిల్ లోపల ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉన్నారు. వారిని దాటించాలని ముందే నిర్ణయించుకున్నా. ధోని అంత బలంగా నేను బంతిని బాదలేను. కానీ ఫీల్డింగ్ ఖాళీల మధ్యలోంచే బంతిని పంపించగలగడం నా బలం. దాన్ని నమ్ముకొనే ఆ షాట్ ఆడాను. అది పని చేసింది. కెరీర్లో ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు ఏమిటి? నా చిన్నప్పుడు భారత్‌కు ఆడితే చాలనుకున్నాను. ఇలాంటిది సాధ్యమవుతుందని ఏనాడూ ఊహించలేదు. ఆటతో పాటు అన్ని రికార్డులూ వస్తాయి. ఇకపై ఇంకా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే నాపై అంచనాలు పెరిగిపోతాయి. నా బాధ్యత కూడా పెరిగింది. కాబట్టి కెరీర్లో సాధించాల్సింది చాలా ఉంది. దక్షిణాఫ్రికాలో పేస్ బౌలింగ్‌లో ఇబ్బంది పడటం ఎలా అనిపించింది? కెరీర్లో విజయాలు, వైఫల్యాలు సమంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలి. ఒకటి రెండు విదేశీ పర్యటనల్లో విఫలమైనంత మాత్రాన నా క్రికెట్‌ను ఆపేయలేను. నా ఆట, నా శ్రమలో తేడా లేదు. ఎప్పటిలాగే మరింత కష్టపడతా. క్రీజ్‌లో ఉన్నప్పుడు సెహ్వాగ్ రికార్డు గుర్తుకొచ్చిందా? గత ఏడాది నేను డబుల్ సెంచరీ చేసినప్పుడు 10 పరుగులతో రికార్డు కోల్పోయానని ఎవరో చెప్పారు. బ్యాటింగ్ చేసేటప్పుడు అంతగా ఆ అంకె గుర్తు లేదు. అయితే జట్టు సహచరులు అంతా స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. నేను ఆ రికార్డును దాటానేమో అని అప్పుడు అనిపించింది. రాబోయే ప్రపంచకప్‌లో ఎదురయ్యే సవాళ్ల గురించి ఆలోచించారా? దాని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. మా ఆటగాళ్లంతా ప్రస్తుతానికి చాలా బాగా ఆడుతున్నారు. పైగా ముక్కోణపు సిరీస్‌లో ఆడాక పరిస్థితులు అలవాటు అవుతాయి. నేను ఏ స్థానంలో ఆడాలో నిర్ణయించాల్సింది నేను కాదు. మేనేజ్మెంట్ ఎక్కడ ఆడమంటే ఆ స్థానంలో బరిలోకి దిగుతా. ఈడెన్ గార్డెన్స్ చాలా ప్రత్యేకంగా మారిపోయినట్లుంది? అవును, మీరు సహకరిస్తే కోల్‌కతాలో ఒక ఫ్లాట్ కూడా కొనేసుకుంటానేమో! ఇక్కడి ప్రజలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఎంతో ప్రత్యేకమైన మైదానం. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆడటం చాలా ఇష్టం. రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్, టెసుల్లో తొలి సెంచరీ, ఐపీఎల్లో సెంచరీ, రంజీలో డబుల్ సెంచరీ, ఇప్పుడు వన్డే డబుల్ సెంచరీ...ఇలా ఈడెన్‌తో చాలా అనుబంధం పెనవేసుకుపోయింది. -
తిరుమలలో రోహిత్
సాక్షి, తిరుమల: భారత క్రికెటర్ రోహిత్ శర్మ సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నాడు. కార్తీక సోమవారం సందర్భంగా ఆయన వేకువజామున 4 గంటలకు పుష్కరిణిలో స్నానం చేశాడు. వరాహస్వామివారిని దర్శించుకుని ఉదయం నైవేద్య విరామ సమయం తర్వాత ఆలయానికి వచ్చాడు. ఆలయాధికారులు రోహిత్‌శర్మకు లడ్డూ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు. తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజుతో ఇదివరకే రోహిత్‌కు పరిచయం ఉండటంతో ఆయన్ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రోహిత్ శర్మ వెంట ఓ యువతి కూడా వచ్చారు. -
ప్లీజ్... బాగా ఆడండి మళ్లీ ఓసారి చూస్తాం...
సాధారణంగా భారత క్రికెటర్ ఎవరు పరుగులు చేసినా ఆనందం వేసేది... ఈసారి మాత్రం పుజారా, రోహిత్ చేస్తున్న పరుగులు బాధగా అనిపించాయి... అవును... సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ మళ్లీ చూడకుండా ఈ పరుగులు ఆపాయేమో..! రోహిత్, పుజారాల శతకాలతో భారత్‌కు ఏకంగా 313 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వచ్చింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో మన బౌలర్లు చకచకా వికెట్లు తీస్తుంటే విషాదంగా అనిపించింది. వీళ్లు మళ్లీ తొందరగా ఆలౌటైతే భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుంది. కానీ... సచిన్ బ్యాటింగ్‌ను మళ్లీ చూడలేం. కాబట్టి... వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఈ ఒక్కసారికి బాగా ఆడాలి. ప్రస్తుతం వెనకబడి ఉన్న 270కి మించి పదో, ఇరవయ్యో పరుగులు చేయాలి. భారత్‌కు కనీసం ఎంతో కొంత విజయలక్ష్యం కావాలి. అప్పుడు అవసరమైతే సచిన్‌ను ఓపెనర్‌గా పంపైనా మరోసారి చూసుకుంటాం..! కరీబియన్స్ స్టార్స్... ప్లీజ్ బాగా ఆడండి. మరో 270 పరుగుల పైనే చేయండి. ఇదే ఇప్పుడు సగటు భారత క్రికెట్ అభిమాని కోరిక! మది పులకించింది ‘ఒక మనిషిని 24 ఏళ్ల పాటు ఇంతగా ప్రోత్సహించడం, మద్దతుగా నిలవడం చాలా అసాధారణం. నాకు ఆ అదృష్టం దక్కింది. ఇన్నేళ్లుగా నన్ను నడిపించిన మీకందరికీ నా హృదయాంతరం నుంచి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ‘థ్యాంక్యూ సచిన్’ అనే మీ సందేశాలతో నా మది పులకించింది. నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ఇది ఉపయోగపడింది’. - సచిన్ టెండూల్కర్