
తిరుమలలో రోహిత్
సాక్షి, తిరుమల: భారత క్రికెటర్ రోహిత్ శర్మ సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నాడు. కార్తీక సోమవారం సందర్భంగా ఆయన వేకువజామున 4 గంటలకు పుష్కరిణిలో స్నానం చేశాడు. వరాహస్వామివారిని దర్శించుకుని ఉదయం నైవేద్య విరామ సమయం తర్వాత ఆలయానికి వచ్చాడు. ఆలయాధికారులు రోహిత్‌శర్మకు లడ్డూ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు. తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజుతో ఇదివరకే రోహిత్‌కు పరిచయం ఉండటంతో ఆయన్ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రోహిత్ శర్మ వెంట ఓ యువతి కూడా వచ్చారు.