
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్‌బుడ్ రాజ్యాంగం అమలవుతోంది. ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు హౌస్ట్ అరెస్ట్, అరెస్ట్‌లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డిని గురువారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్బంగా అభినయ్ రెడ్డి మాట్లాడుతూ..‘ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా చంద్రబాబు ఉచిత బస్సు హామీ గాలికి వదిలేశారు. సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరితే హౌస్ అరెస్టు చేస్తారా?. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని మహిళలు అడిగితే వారిని అరెస్టు చేస్తారా?.
బడ్జెట్‌లో సూపర్ సిక్స్‌కు ఏ మాత్రం నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైఎస్సార్‌సీపీ శాంతియుతంగా వినతిపత్రం అందచేయాలని అనుకున్నాం. దానికి ఎందుకు హౌస్ అరెస్టు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రజా గొంతుకను నులిమేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు?. వినతి పత్రం ఇచ్చేందుకు సైతం అనుమతించడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని చూస్తారా? అని ప్రశ్నించారు.

Comments
Please login to add a commentAdd a comment