Abhinay Reddy
-
పంచకట్టులో భూమా అభినయ్ రెడ్డి నామినేషన్
-
మాస్టర్ ప్లాన్ రోడ్లతో కళకళలాడుతున్న తిరుపతి
-
నా తిరుపతి మహిళలకు మాటిస్తున్న..మైండ్ బ్లోయింగ్ స్పీచ్
-
తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డి ప్రచారం
-
భూమన అభినయ్ ఫస్ట్ ఇంటర్వ్యూ..తిరుపతి ఇంచార్జ్ గా ప్రకటించిన తరువాత
-
ఏపీని సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్‌దే: అభినయ్ రెడ్డి
-
విదేశీ యువతులు.. తెలుగింటి కోడళ్లు..
ఆదిలాబాద్: పెళ్లంటే ఒకప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాల చరిత్రను చూసి సంబంధాలు కుదుర్చుకునే వారు. క్రమంగా ఆ సంప్రదాయానికి కాలం చెల్లుతోంది. ఉన్నత చదువుల కోసం, వృత్తిరీత్యా స్థిరపడేందుకు విదేశాల బాట పడుతున్న యువత అక్కడే తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రేమించి.. ఇరువైపులా పెద్దలను ఒప్పించి ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకొస్తున్నారు. ఇక్కడి అబ్బాయిలను ఇష్టపడుతున్న విదేశీ యువతులు భారతీయ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకొని మెట్టినింట్లో అడుగు పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలుగింటి కోడళ్లుగా అడుగు పెట్టిన విదేశీ అమ్మాయిలపై ప్రత్యేక కథనం. ►అమెరికా అమ్మాయి.. ఆదిలాబాద్ అబ్బాయి.. (టేలర్ డయానా – అభినయ్‌రెడ్డి) ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాకు చెందిన యువతిని ప్రేమించి గత అక్టోబర్‌లో పెద్దల అంగీకారంతో మనువాడాడు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా బంధుమిత్రుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఏడడుగులు కలిసి నడిచారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దేవీదాస్– కళావతి దంపతుల పెద్ద కుమారుడు అభినయ్‌రెడ్డి, అమెరికాకు చెందిన టేలర్ డయానా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేశారు. వారి అంగీకారంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఆదిలాబాద్ అబ్బాయి, అమెరికా అమ్మాయికి చెందిన ఇరుకుటుంబాల పెద్దలు, కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. వధువు తల్లిదండ్రులు, బంధువులు కూడా హాజరై ఆశీర్వదించారు. హిందూ సంప్రదాయాలు, సంస్కృతితో పాటు భారతీయ వంటకాలు చాలా ఇష్టమని వారు చెప్పడం గమనార్హం. వధూవరులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ►ఆస్ట్రేలియా అమ్మాయి.. నిర్మల్ అబ్బాయి.. (హనా,ఆస్ట్రేలియా – నామని కార్తీక్) ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయి నిర్మల్ అబ్బాయితో ప్రేమలో పడింది. అక్కడితో ఆగిపోలేదు.. చక్కగా ఆ అబ్బాయిని భారత సంప్రదాయం ప్రకారం పెళ్లాడి, నిర్మల్‌లో తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది. నిర్మల్ శాస్త్రినగర్ కాలనీకి చెందిన నామని పద్మ– సదానందం దంపతుల కుమారుడు కార్తీక్ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ హనా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కార్తీక్ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తుండగా, అమ్మాయి హనా అక్కడే మెడ్ల్యాబ్లో సైంటిస్టుగా పనిచేస్తోంది. వీరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించారు. ఆగస్టు 22న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ మహోత్సవానికి వధువు తల్లిదండ్రులు వెరోనికా–డార్రెన్ దంపతులు సైతం హాజరై హిందూ సంప్రదాయరీతిలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని టౌన్స్ ప్రిన్సిల్యాండ్స్లోకొత్తకాపురం మొదలుపెట్టారు. ►మయన్మార్ అమ్మాయి.. గుడిహత్నూర్ అబ్బాయి.. (కేథరీన్ – గొల్లపల్లి రవికుమార్) మయన్మార్ అమ్మాయి, గుడిహత్నూర్ అబ్బాయి ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు. గుడిహత్నూర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన గొల్లపల్లి రవికుమార్‌కు, మయన్మార్‌కు చెందిన కేథరీన్ ప్రేమించుకున్నారు. రవికుమార్ ఆరేళ్ల క్రితం ఖాతర్ దేశానికి వెళ్లాడు.. మయన్మార్‌లోని జిన్న్వేథేన్ నగరంలో ఓ హోటల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఆమోదం తెలిపారు. చింతగూడలో సెయింట్ థామస్ చర్చిలో గత ఫిబ్రవరి 6న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఈ పెళ్లికి అమ్మాయి సోదరుడు క్యాహు థియేన్ హాజరుకాగా, వరుడి తరఫున కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరై ఆశీస్సులు అందజేశారు. -
శభాష్ అభి!
తిరుపతి మంగళం: తిరుపతి చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా మాస్టర్‌ప్లాన్ రోడ్ల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారు.. ‘శభాష్ అభి’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయ ర్ భూమన అభినయ్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసిన సీఎంను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి కలిసి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూమన అభినయ్‌రెడ్డిని.. శభాష్ అభి అంటూ భుజం తట్టి ప్రోత్సహించారు. ‘అన్నా నిత్యం ప్రజల్లోనే ఉంటూ.. వారితో మమేకమై చేస్తున్న తిరుపతి అభివృద్ధి భేష్ అన్న’ అని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి కితాభిచ్చారు. -
కథ కొత్తగా ఉంటే ఆదరిస్తారు
‘‘నాది విజయవాడ. బీటెక్ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాను. అసిస్టెంట్ రైటర్‌గా, ఘోస్ట్ రైటర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా చేశా. కొన్ని యాడ్ ఫిల్మ్స్, 5 షార్ట్స్ ఫిల్మ్స్ చేశాను. ఆ తర్వాత ‘మేకసూరి’ చిత్రానికి దర్శకత్వం వహించాను... ఇదే నా తొలి సినిమా’’ అని డైరెక్టర్ త్రినా«ద్ వెలిశిల అన్నారు. అభినయ్ రెడ్డి, సమయ జంటగా నరేష్ బైరెడ్డి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మేకసూరి’. కార్తీక్ కంచెర్ల నిర్మించిన ఈ చిత్రం జీ 5లో శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా త్రినా«ద్ వెలిశిల మాట్లాడుతూ –‘‘మోసగాళ్లకు మోసగాడు, ఒక్కక్షణం’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. ఆ తర్వాత ‘మేకసూరి’ కథను రెడీ చేసుకున్నా. ఈ చిత్రానికి నేను, కెమెరామెన్ పార్ధు సైనా కూడా నిర్మాణంలో భాగస్వాములయ్యాం. విడుదల తర్వాత చాలా మంచి స్పందన వస్తోంది. నార్త్ వారు కూడా సబ్ టైటిల్స్‌తో చూస్తున్నారు. కథ వైవిధ్యంగా ఉంటే ఎక్కడైనా ఆదరిస్తారు. మా సినిమా విడుదలైన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలా మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఫోన్ చేసి నన్ను అభినందించడం మరచిపోలేను. కొన్ని పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి నాకు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి’’ అన్నారు. -
వైఎస్సార్ సీపీలో టీడీపీ నేతల చేరిక
తిరుపతి సెంట్రల్ : భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరగా, వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముత్యాలరెడ్డి పల్లెలో బుధవారం ఉదయం యువనేత అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. .సాయంత్రం కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి కరుణాకరరెడ్డి ప్రాంరంభించారు. అందులో భాగంగా 20వ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి, స్థానిక జన్మభూమి కమిటీ సభ్యుడు దామోదర ఆచారితోపాటు గురవమ్మ, నాధముని, రామారావు, భాను, ప్రభాకర్, బద్రీ తదితరులు పార్టీలో చేరారు. భూమన నాయకత్వంలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు ప్రకటించారు. తమపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్నారు. తిరుపతి రూరల్ మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు తిరుమలయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భూమన అభినయ్, పాలగిరి ప్రతాప్ రెడ్డి, దుద్దేల బాబు, ఎస్ కే బాబు, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, బాలిశెట్టి కిశోర్, కట్టా గోపియాదవ్, తలారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా వివాహ రిసెప్షన్