తిరుపతి సెంట్రల్ : భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీలో చేరగా, వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముత్యాలరెడ్డి పల్లెలో బుధవారం ఉదయం యువనేత అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. .సాయంత్రం కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి కరుణాకరరెడ్డి ప్రాంరంభించారు.
అందులో భాగంగా 20వ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి, స్థానిక జన్మభూమి కమిటీ సభ్యుడు దామోదర ఆచారితోపాటు గురవమ్మ, నాధముని, రామారావు, భాను, ప్రభాకర్, బద్రీ తదితరులు పార్టీలో చేరారు. భూమన నాయకత్వంలో వైఎస్‌ఆర్‌సీపీని బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు ప్రకటించారు. తమపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్నారు. తిరుపతి రూరల్ మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు తిరుమలయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు భూమన అభినయ్, పాలగిరి ప్రతాప్ రెడ్డి, దుద్దేల బాబు, ఎస్ కే బాబు, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, బాలిశెట్టి కిశోర్, కట్టా గోపియాదవ్, తలారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment