![False Case Against Ysrcp Leader Bhumana Abhinay Reddy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/Bhumana-Abhinay-Reddy1.jpg.webp?itok=7zyXWoYh)
సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ నేత భూమన అభినయ్‌రెడ్డి(Bhumana Abhinay Reddy)పై కేసు నమోదైంది. అలిపిరి పోలీస్ స్టేషన్(Alipiri Police Station)లో భూమన అభినయ్‌పై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు. రాజేష్ అనే వ్యక్తిని అలిపిరి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీంతో అక్రమ అరెస్ట్‌ను అభినయ్‌రెడ్డి నిలదీశారు. రాజేష్‌ను పీఎస్ నుంచి తీసుకెళ్లారంటూ సీఐ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
కాగా, సోమవారం నిర్వహించాల్సిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కూటమి గూండాల బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌లు, కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదాపడ్డ విషయం తెలిసిందే. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి డిప్యూటీ మేయర్ పదవిపై కన్నేసిన నేపథ్యంలో టీడీపీ గూండాలు మొదటి రోజు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో ఉప ఎన్నిక సమావేశ మందిరానికి వెళ్తున్న బస్సుపై రాడ్లతో దాడి చేసి నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. దీంతో కోరం లేక ఉప ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే.
నడి రోడ్డులో ఖాకీల సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పచ్చముఠాలు రెండో రోజు మరింత బరి తెగించాయి. ఉప ఎన్నిక వాయిదా పడిన వెంటనే అదే రోజు రాత్రి కిడ్నాప్‌నకు గురైన అనీష్ రాయల్ భార్య మమతను సైతం కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి.. అనీష్ రాయల్ నివాసానికి చేరుకుని ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఇదీ చదవండి: దొడ్డిదారిలో ‘డిప్యూటీ’
కూటమి గూండాలు అక్కడికి కూడా చేరుకుని ఆమె ఉన్న నివాసం తలుపులు బద్దలు కొట్టేందుకు యత్నించడంతో తొలుత 100కి ఫోన్ చేశారు. అటువైపు నుంచి స్పందన లేకపోవటంతో తిరిగి అభినయ్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన అభినయ్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తిపై కూటమి గూండాలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో కౌశిక్, వాసుయాదవ్, అభినయ్ డ్రైవర్ గాయాలపాలు కాగా, ఓ కారు ధ్వంసమైంది.
Comments
Please login to add a commentAdd a comment