తిరుపతిలో ఉద్రిక్తత.. టీడీపీ, జనసేన నేతల రాళ్ల దాడి | TDP And Janasena Leaders Over Action In Tirupati For Election | Sakshi
Sakshi News home page

తిరుపతిలో ఉద్రిక్తత.. టీడీపీ, జనసేన నేతల రాళ్ల దాడి

Published Mon, Feb 3 2025 10:34 AM | Last Updated on Mon, Feb 3 2025 11:18 AM

TDP And Janasena Leaders Over Action In Tirupati For Election

సాక్షి, తిరుపతి: మున్సిపల్‌ ఎన్నికల వేళ తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎ‍స్సార్‌సీపీ కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన గూండాలు దాడి చేశారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై మూకలు రాళ్లతో దాడి చేశాయి. అనంతరం, కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. 

వివరాల ప్రకారం.. తిరుపతిలో మున్సిపల్‌ ఎన్నికల సందర్బంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. వైఎ‍స్సార్‌సీపీ కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన గూండాలు దాడి చేశారు. ​కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై జనసేన, టీడీపీ కార్యకర్తల రాళ్ల రువ్వడంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో సాక్షి రిపోర్టర్‌, కెమెరామెన్‌పై పచ్చ గూండాలు దాడికి దిగారు. కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 

పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ పచ్చ మూకలు రెచ్చిపోవడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ నిల్చున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఇక, బస్సుపై దాడి చేసిన వ్యక్తిని టీడీపీకి చెందిన శంకర్‌ యాదవ్‌గా గుర్తించారు. శంకర్‌ యాదవ్‌ ఓవరాక్షన్‌ చేస్తూ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలతో అనుచితంగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో నలుగురు కార్పొరేటర్లను టీడీపీ, జనసేన గూండాలు ఎత్తుకెళ్లారు.

ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ కార్పొరేటర్లను రక్తం వచ్చేలా కొట్టారు. మేము పోలీసులకు ఫోన​ చేసినా కావాలనే ఆలస్యంగా వచ్చారు. మా కార్పొరేటర్ల కొడ్నాప్‌కు యత్నించారని తెలిపారు. 

తిరుపతి మేయర్‌ శిరీష కామెంట్స్‌..

  • కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు.
  • పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు.
  • మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?.
  • మహిళా కార్పొరేటర్‌ అని కూడా చూడకుండా దాడి చేశారు.
  • మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు.
  • మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి.
  • మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం. 

అనంతరం, వైఎస్సార్‌సీపీ నాయకులు భూమన కరుణాకర్‌ మాట్లాడుతూ.. కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు బెదిరిస్తున్నారు. బాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? అని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement