తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక | Nats invited tirumala sri venkateswara swamy for teugu sambaralu | Sakshi
Sakshi News home page

తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక

Published Tue, Mar 18 2025 5:20 PM | Last Updated on Tue, Mar 18 2025 5:20 PM

Nats invited tirumala sri venkateswara swamy for teugu sambaralu

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ శుభకార్య ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయంలా వస్తుంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది. జులై4,5,6 తేదీల్లో టంపా వేదికగా అమెరికా తెలుగు సంబరాలను జరగనున్నాయి. ఇందులో మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడుకి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.

అమెరికా తెలుగు సంబరాలకు రండి తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాట్స్ బృందం కలిసింది. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి  నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement