మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు.

అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.
