rajam
-
రాజాంలో సామాజిక జైత్రయాత్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సుపరిపాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధిని ప్రతిబింబిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాంలో ఆ వర్గాల జైత్రయాత్రలా ఘనంగా సాగింది. ఈ యాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువత, మహిళలు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజాం మండలం బొద్దాం గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను యాత్రలో పాల్గొన్న మంత్రులు, ఇతర నేతలు ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా ప్రారంభమైన యాత్ర రాజాం పట్టణ సమీపంలో కంచరాం తృప్తి రిసార్ట్ వరకూ సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజాం పట్టణంలోకి ప్రవేశించింది. దాదాపు మూడు వేల మంది బైక్‌ర్యాలీగా బస్సు యాత్ర ముందు సాగారు. అంబేడ్కర్ కూడలిలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన వేలాది మంది తరలివచ్చారు. వెనుకబడిన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును నేతలు వివరిస్తుంటే చప్పట్లతో స్వాగతించారు. జై జగన్.. జై జై జగన్ అంటూ నినదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మ బంధువు అని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. దేశంలో మరే సీఎంచేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని పదవుల్లో పెద్దపీట వేసి, అనేక పథకాలతో అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్నారని చెప్పారు. అందుకే ఈరోజు సామాజిక సాధికార యాత్రను ఓ జైత్రయాత్ర నిర్వహించుకోగలుగుతున్నామన్నారు. 139 బీసీ సామాజికవర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, వాటికి చైర్మన్లతో పాటు 700 డైరెక్టర్ల పదవులను ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడారని వివరించారు. కులగణన జరగాలని దేశంలోనే మొట్టమొదటగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నదీ సీఎం జగనే అని చెప్పారు. విద్య, వైద్యాన్ని బడుగు, బలహీనవర్గాలకు చేరువ చేస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, ఇదే అసలైన అభివృద్ధి అని వివరించారు. తాండ్ర పాపారాయుడు పుట్టిన గడ్డపై ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే టీడీపీ నాయకులను తిప్పికొడతామని హెచ్చరించారు. సంతృప్తకర స్థాయిలో సంక్షేమం: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నారని, అన్ని రంగాలనూ అభివృద్ధి చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి: ఎమ్మెల్యే జోగులు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఈ ప్రాంతానికి చెందిన సామాజిక వర్గానికి 70 శాతం మేర పదవులు వచ్చాయని వెల్లడించారు. నాగావళి నదిపై రుషింగి, కిమ్మి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 25 కోట్లు మంజూరుచేస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పనులు పూర్తిచేయించారని చెప్పారు. తోటపల్లి రెగ్యులేటర్ కుడికాలువ ఆధునికీకరణకు రూ.40 కోట్లు మంజూరుచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సీఎం జగన్ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శం: స్పీకర్ తమ్మినేని
సాక్షి, విజయనగరం జిల్లా: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలోని బొద్దాం గ్రామంలో అశేష జనవాహిని విశేష స్వాగతం మధ్య జైత్రయాత్రగా సాగింది. అడుగడుగునా జనం బస్సు యాత్రలో వచ్చిన నేతలకు అపూర్వంగా స్వాగతించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని నాలుగున్నరేళ్లలో సాగించిన అభివృద్ధి పనులను నేతలు పరిశీలించారు. అనంతరం రాజాం జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, శంబంగి చిన అప్పలనాయుడు, బొత్స అప్పల నర్సయ్య,ధర్మాన కృష్ణదాస్, కళావతిలు హాజరయ్యారు. జగన్ పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైంది- డిప్యూటీ సీఎం బూడి ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, దేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా జగన్ పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైందని, వెనుకబడిన అనేక వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు బాలల చదవుల బాధ్యతను జగన్ తీసుకుని తన భుజస్కందాల మీద వేసుకున్నారని, రైతాంగానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలిస్తున్నారన్నారు. వచ్చే జనవరి నుంచి అవ్వా తాతాలకు పెన్షన్ రూ. 3 వేలు అందనున్నాయని, రెండు వేళ్ళు చూపిస్తున్న టీడీపీ నేతలకు మూడు వేలు అందనున్న నేపథ్యంలో మూడు వేళ్లు చూపించాలని పిలుపునిచ్చారు. ప్రతీ కుటుంబంలో అనేక మార్పులుచోటు చేసుకున్నాయని, ఈ సామాజిక సాధికారత ఎవరి వల్ల సాధ్యమైందో, జగన్ ఏ విధంగా సాధికారత సాధించారో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ నిర్ణయంతో వెనుకబడిన వర్గాలకు మంరిత మేలు: స్పీకర్ తమ్మినేని స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ వైయస్సార్ సీపీ పాలనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు సామాజిక సాధికార జైత్రయాత్ర ద్వారా ప్రజలు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. జనప్రవాహంలా బస్సు యాత్ర సభకు ప్రజలు తరలిరావడం సీఎం జగన్ పిలుపునకు ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు నిదర్శనమన్నారు. తాండ్ర పాపా రాయుడు పుట్టిన గడ్డ కాబట్టి ఈ ప్రాంతాల్లో అన్యాయాలు చేసిన వారిపై తిరగబడి ప్రజలు వైయస్సార్ సీపీని గెలిపించారన్నారు. కుల గణన జరగాలని కేబినెట్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో బీసీలకు మరింత మేలు జరగుతుందని ప్రకటించారు. టీడీపీ హయాంలో విద్య,వైద్యం వంటి అనేక ప్రాధాన్య రంగాలను నిర్వీర్యం చేసారని, జగన్ ముఖ్యమంత్రి కాగానే అన్ని రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ సామాజిక విప్లవం తీసుకువచ్చారన్నారు. అవినీతి లేకుండా లంచగొండులకు చోటు ఇవ్వకుండా అనేక సంక్షేమ పథకాలను జగన్ బటన్ నొక్కి అర్హులైన లబ్ధిదారులకు నేరుగా అందచేస్తూ, జీవన ప్రమాణాలు పెంచుతుండటం అభివృద్ధి కాదా అని తమ్మినేని ప్రశ్నించారు. పేదలకు ఆర్థిక సాధికారత జగన్ పాలనలో కలగడంతో కొనుగోలు శక్తి పెరిగి దేశంలోని జీడీపీలో గణనీయ వృద్ధి సాధించడమే కాకుండా, అనేక రంగాల కేంద్ర సూచీల్లో కూడా మెరుగైన స్థానాల్లో రాష్ట్రం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని గుర్తించి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాయని, అయినా సరే ఆ పార్టీ శ్రేణులు కడిగిన ముత్యం అంటూ చంద్రబాబును చెప్పుకోవడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేసారు. జనం కోసం జగన్.. జగన్ కోసం జనం: ఎమ్మెల్యే కంబాల జోగులు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ, పార్టీకతీతంగా కుల మతాలకు అతీతంగా అర్హులైన పేదలకు 1970 కోట్లు రాజాం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ కేటాయింపులు చేసారని అన్నారు. చంద్రబాబు పాలనలో నియోజకవర్గంలో పేదలకు అన్యాయం చేయడమే కాకుండా ఎక్కడా ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డారు. జగన్ పాదయాత్రలో ప్రజా సమస్యలను గుర్తించి పార్టీ మ్యానిఫెస్టో రూపొందించి దానిని పవిత్ర గ్రంధంగా గుర్తించి అమలు చేస్తున్నారని వివరించారు. ఆత్మహత్యలు, ఆకలి చావులు, శాంతిభద్రతలకు విఘాతం వంటి అంశాలకు చోటు లేకుండా జగన్ పాలన చేస్తున్నారని, సామాజిక సాధికారితను ప్రజలు గుర్తించి అన్ని ప్రాంతాల్లో విశేషంగా ఆదరిస్తున్నారన్నారు. ప్రజల కోసం జగన్ ఉన్నారు.. జగన్ కోసం జనం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి బడుగుల ఆత్మాభిమానాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ బస్సు యాత్రను గాలి యాత్ర అని లోకేశ్ అంటున్నారని, ఇది బీసీల ఆత్మగౌరవ యాత్ర, టీడీపీ పై చేసే దండయాత్ర, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చేసే జైత్రయాత్ర అని తెలుసుకోవాలని మండిపడ్డారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సామాజిక అభివృద్ధి చేస్తున్న జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆ పార్టీ కనుమరుగైందని విమర్శించారు. చదవండి: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల -
డాబాపై డ్రాగన్ తోట
రాజాం: ఆయనొక సాఫ్ట్వేర్ ఉద్యోగి. వ్యవసాయమంటే మక్కువ. కోవిడ్ సమయంలో ఖాళీగా ఉన్న సమయంలో తల్లిదండ్రుల సాయంతో విదేశాల్లో బాగా కలిసివస్తున్న డ్రాగన్ పంట సాగుపై దృష్టిసారించాడు. ఆ పంటకు ఇక్కడ ఉన్న డిమాండ్ గుర్తించాడు. వేసిన పంట ద్వారా ఫలసాయం పొందాలని భావించాడు. ఏకంగా తన ఇంటి డాబానే వ్యవసాయ క్షేత్రంగా మలిచాడు. వందకు పైగా మొక్కలు నాటాడు. సస్యరక్షణ చర్యలు చేపట్టాడు. డ్రాగన్ తోట ఏపుగా పెరిగి దిగుబడి ఆరంభం కావడంతో... కష్టం ఫలించిందంటూ సంబరపడుతున్నాడు. ఆయనే రాజాం పట్టణం పరిధిలోని డోలపేట గ్రామానికి చెందిన సుదర్శనం అధికారి. ఆరు సెంట్ల విస్తీర్ణంలో... సుదర్శనం అధికారి విశాఖపట్నంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి రకరకాల పంటలు సాగుచేయడమంటే ఇష్టం. తల్లిదండ్రులు నర్సమ్మ, శాంతిమూర్తిల ప్రోత్సాహంతో కొంత పొలాన్ని కొనుగోలుచేసి మామిడితోటలు, జీడితోటలతో పాటు పొలాలు, ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలు సాగుచేస్తుంటాడు. అదే క్రమంలో కోవిడ్ సమయంలో ఇంటి డాబాపై డ్రాగన్ పంట సాగుకు పూనుకున్నాడు. 25 స్తంభాలు ఏర్పాటుచేసి ఆరుసెంట్లు విస్తీర్ణంలో ఉన్న డాబాపై వందకుపైగా డ్రాగన్ మొక్కలు 2020లో నాటాడు. గతేడాది జూలై నెలలో పూతకు వచ్చాయి. ఒక్కో మొక్కకు 12 నుంచి 15 వరకూ డ్రాగన్ పండ్లు దిగుబడి రావడంతో పాటు నాలుగు నెలలు పాటు పూత సాగింది. ఒక్కొక్కటి 800 గ్రాముల నుంచి 900 గ్రాముల బరువు ఉన్న పండ్లు దిగుబడి వస్తున్నాయి. పోషకాలు మెండుగా ఉన్న డ్రాగన్ పండ్ల కొనుగోలుకు ప్రస్తుతం అధికమంది ఆసక్తిచూపుతున్నారు. నిరంతరం ఇద్దరు.. పొలం, ఇంటి వద్ద మొక్కల సంరక్షణకు ఇద్దరు రైతు కూలీలను నియమించాడు. ప్రతీ రెండు రోజులకు డ్రాగన్ మొక్కలకు నీరు పెట్టడం, ఏపుగా పెరిగిన కొమ్మలు తొలగించడం, పేడ గత్తం, వేప ఆకులతో సేంద్రియ ఎరువు తయారుచేసి మొక్కలపై పిచికారీ చేయడం వంటి పనులను వారు చక్కబెడుతున్నారు. డ్రాగన్ తోట సాగుతో ఇల్లు కూడా చల్లగా ఉంటోందని ఆయన చెబుతున్నారు. అభిరుచితోనే... మా ఇంటిపై ఏవో మొక్కలు వేద్దామని అనుకున్నాను. కోవిడ్ సమయంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ కావడంతో ఆలోచన వచ్చింది. నెట్లో చెక్‌చేసి డ్రాగన్ తోటలుపై దృష్టిసారించారు. ఖమ్మం నర్సరీతో పాటు రేగిడి మండలం కాగితాపల్లి వద్ద దూబ రమేష్ నర్సరీ నుంచి మొక్కలు తెచ్చాం. రూ.2 లక్షలు వెచ్చించి తోట వేశాం. ఇప్పుడు ఇవి అందంగా ఉండడంతో పాటు సీజన్లో మంచి పూత వస్తోంది. గతేడాది రూ.1.50 లక్షల వరకు ఆదాయం వచ్చింది. – సుదర్శనం అధికారి, డోలపేట -
వెదురుతో ఆదరువు.. చేతిపనికి సాంకేతికత జోడింపు
రాజాం (విజయనగరం జిల్లా): వెదురుకర్రతో తయారు చేసిన బుట్టలు అందరికీ తెలిసినవే. వెదురు కర్ర తట్టల గురించి చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఇవన్నీ ఎప్పటినుంచే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్న వస్తుసామాగ్రే. అయితే వాటికి భిన్నంగా ఇదే ముడిసరుకుతో మరెన్నో వస్తువులు కూడా తయారుచేసి ఇంట్లో అందంగా అలంకరించుకోవచ్చు. స్నేహితులకు బహుమతిగా ఇవ్వొచ్చు. కాస్తా సాంకేతికత తోడైతే చాలు ఇదే వెదురుకర్ర ఎన్నో అధ్బుతాలు సృష్టిస్తుందని రాజాం పట్టణానికి చెందిన జీఎంఆర్‌ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిరూపిస్తోంది. గత ఏడాది కాలంగా రాజాం చుట్టపక్కల గ్రామాలకు చెందిన వెదురుపనివారికి వెదురుతో తయారు చేసే అందమైన వస్తుసామగ్రిపై శిక్షణ ఇస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధమే లక్ష్యంగా.. న్యూఢిల్లీకి చెందిన సైన్స్ ఫర్ ఈక్యూటీ ఎంపవర్ అండ్ డెవలప్మెంట్ డివిజన్ (సీడ్) ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు ప్రారంభించింది. ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తుసామగ్రిలో కొన్నింటిని ప్లాస్టిక్ నుంచి దూరంచేసేందుకు చేతితో తయారీచేసే వస్తుసామగ్రిపై దృష్టిసారించింది. ఓ వైపు ప్లాస్టిక్‌ను నివారించేందుకు వెదురుపుల్లలతో తయారుచేసే వస్తుసామగ్రిని ప్రోత్సహించడం, మరో వైపు వాటిని తయారీచేసే కులవృత్తుల చేతిపనివారికి సాంకేతికత అందించి వారి జీవన నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా చేసుకుంది. దేశంలోని పలు ఐటీ కళాశాలల్లో చేతి వృత్తుల వారికి సాంకేతిక నైపుణ్యాలు అందించే కార్యక్రమాలు చేపట్టగా రాజాంలోని జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏడాది క్రితం ఒక ప్రాజెక్ట్ ప్రారంభించింది. వెదురుకర్రలు, పుల్లలతో తయారయ్యే వస్తుసామగ్రిని మరింత అందంగా తయారీచేసే విధానాన్ని చేతిపనివారికి నేర్పుతోంది. శిక్షణకు విశేష ఆదరణ జీఎంఆర్‌ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంకేతిక శిక్షణకు విశేష ఆదరణ కనిపిస్తోంది. ప్రస్తుతం రాజాం, సంతకవిటి, రేగిడి, జి.సిగడాం తదితర మండలాలకు చెందిన వెదురుపనివారు ఈ శిక్షణ వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకూ 150 మంది శిక్షణ పొందారు. ఒక వ్యక్తికి 25 రోజులు శిక్షణ ఇస్తుండగా, శిక్షణ సమయంలో రోజుకు రూ. 200లు స్టైపెండ్ ఇస్తున్నారు. శిక్షణ బాగా సద్వినియోగం చేసుకున్నవారు సొంతంగా మెషీన్లు కొనుగోలుచేసేవిధంగా బ్యాంకు రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శిక్షణను పూర్తిగా వెదురుపని తెలిసిన శిక్షకుల ద్వారా ఇప్పించడంతో పాటు శిక్షణలో మెలకువలు నేర్చుకుని, బాగా వస్తుసామగ్రి తయారు చేస్తున్నవారితో కూడా కొత్తవారికి శిక్షణ ఇప్పిస్తున్నారు. సీడ్ ప్రాజెక్ట్‌లో బాగంగా తయారీచేస్తున్న వెదురు వస్తుసామగ్రి చాలా అందంగా, అపురూపంగా దర్శనమిస్తోంది. టీ, కాఫీ కప్పులు, ట్రేలు, సజ్జలు, ఫ్లవర్ బొకేలు, కూజాలు, దుస్తులు పెట్టే తొట్టెలు, చిన్నారుల ఊయల తొట్టెలు, పెన్నుల స్టాండ్లు, బట్టల స్టాండ్లు ఇలా వినూత్న వస్తుసామాగ్రి రూపొందుతోంది. ఇవన్నీ ప్లాస్టిక్ రహిత వస్తుసామగ్రి కావడంతో పాటు పర్యావరణ హితమైనవి. ఎటువంటి విద్యార్హత లేకున్నా వెదురుపనితెలిసి, 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్నవారు ఇక్కడికి శిక్షణకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. విడతల వారీగా.. జీఎంఆర్‌ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాల్లో భాగంగా చేతివృత్తుల వారికి సాంకేతికతను అందిస్తున్నాం. ఓ వైపు చేతివృత్తుల వారికి మెలకువలు నేర్పడంతో పాటు మరో వైపు ప్లాస్టిక్ వస్తుసామగ్రి వినియోగం తగ్గించడం లక్ష్యంగా ఈకార్యక్రమం జరుగుతోంది. ఒక బ్యాచ్‌కి 20 మంది వరకూ శిక్షణ ఇస్తున్నాం. విడతల వారీగా, వెదురుపనివారికి ఖాళీగా ఉన్న సమయంలో ఈ శిక్షణ ఇస్తున్నాం. – డాక్టర్ పీఎన్ఎల్ పావని, కో ప్రిన్సిపాల్ ఇన్విస్టిగేటర్, జీఎంఆర్‌ఐటీ చాలా మంచి ప్రాజెక్ట్ చేతివృత్తి చేసుకునేవారిలో నైపుణ్యం మెరుగుపరిచేందుకు, వారికి సాంకేతికత అందించేందుకు సీడ్ సాయంతో వెదురుపనిచేసే చేతివృత్తుల వారికి శిక్షణ శిబిరం ఏర్పాటుచేశాం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోని వెదురుపనివారికి అవకాశం కల్పిస్తున్నాం. ఇప్పటివరకూ 150 మంది శిక్షణ పొందారు. – డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్, ప్రాజెక్ట్ ప్రిన్సిపాల్ ఇన్విస్టిగేటర్, జీఎంఆర్‌ఐటీ, రాజాం -
Dragon Fruit: వాణిజ్య పంట సాగు చేద్దామా..!
రాజాం సిటీ: ఇప్పుడిప్పుడే రైతులకు సుపరిచితమౌతున్న వాణిజ్యపంట డ్రాగన్ ఫ్రూట్. ఎక్కడో మెక్సికో, సెంట్రల్ అమెరికాలో పుట్టిన ఈ పంట ఇప్పుడు పల్లెలకు సైతం పాకుతోంది. ఈ పంట ద్వారా రైతులను ప్రోత్సహించేందుకు తోటల పెంపకానికి ఉపాధిహామీ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాణిజ్యపంటలపై అవగాహనతోపాటు సాగుచేసేందుకు ఆసక్తి ఉన్న రైతులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. వాణిజ్యపంటగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న డ్రాగన్ తోటల పెంపకానికి సంబంధించి మూడేళ్లపాటు నిర్వహణకు నిధులు అందించనుంది. ఉపాధి పథకంలో జాబ్ కార్డు కలిగిఉండడంతో పాటు 50 సెంట్ల భూమి ఉన్న రైతులు ఈ తోలట పెంపకానికి దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. ఈ విధంగా వాణిజ్యపంటలపై రైతులను ప్రోత్సహించడంతోపాటు వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీని నిర్వహణకు మూడేళ్లపాటు ఉపాధి పనుల్లో భాగంగా ప్రభుత్వం రూ. 3 లక్షల వరకు నిధులు సమకూర్చనుంది. అర్హులైన రైతులంతా ఈ తోటల పెంపకానికి ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు. ప్రోత్సాహం ఇలా.. పొలంలో ఏర్పాటుచేసుకున్న డ్రాగన్ తోటలకు వరుసగా మూడేళ్లపాటు రూ.3,08,722 వరకు రైతుకు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. ఈ మొత్తాన్ని వేతనదారులకు రూ. 71,420లు, మెటీరియల్ ఖర్చుకు సంబంధించి రూ. 2,37,302లు అందజేయనుంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ఉపాధిహామీ ద్వారా డ్రాగన్ తోటల పెంపకానికి కల్పిస్తున్న అవకాశాన్ని అర్హులైన రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధిలో జాబ్‌కార్డు కలిగిఉండడంతో పాటు 50 సెంట్ల భూమి ఉన్న వారంతా తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తమ పొలానికి భూసార పరీక్ష చేయించుకోవాలి. మూడేళ్లపాటు తోటల నిర్వహణకు రూ.3 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నాం. దీనికి అయ్యే పెట్టుబడిని రైతులే ముందుగా పెట్టుకోవాలి. - జి.ఉమాపరమేశ్వరి, పీడీ, డ్వామా -
మంచి మార్పుతో చరిత్ర లిఖిద్దాం: కార్యకర్తలతో సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల టైంలో చేసిన వాగ్దానాల్లో 95 శాతం పూర్తి చేశామని, ఆ ధైర్యంతోనే ఆశీర్వదించమని రాష్ట్రంలోని గడప గడపకూ వెళ్లగలుగుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ముఖాముఖిలో భాగంగా.. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ నిర్వహించారు. ‘‘మనం తెచ్చిన మార్పులు అన్నీకూడా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇవన్నీ చూశాక మరో ముప్ఫై ఏళ్లపాటు మన ప్రభుత్వమే ఉండాలని ప్రజలు ఆశీర్వదిస్తారు. మీ నియోజకవర్గంలో డీబీటీ కింద రూ.775 కోట్లు ఇచ్చాం. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇలాగే మంచి చేశాం. ఈసారి మన లక్ష్యం 151 కాదు.. 175కి 175 అని ఉద్ఘాటించారు సీఎం జగన్. గతంలో ఉన్న ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకూ ఉన్న తేడాను గమనించి.. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేసిన ఈ ప్రభుత్వం చేసిన మంచిని మరింత విపులంగా చెప్పాలని ఆయన కార్యకర్తలతో చెప్పారు. మనం చేసిన మంచిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలి. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా.. ఈసారి మరింత పెరగాలి. మేనిఫెస్టో ద్వారా చేసిన వాగ్దానాల్లో దాదాపు వాగ్దానాలను నిలబెట్టుకున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ గడపగడపకూ కార్యక్రమంలో ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ వాస్తవాలు అయితేనే మళ్లీ మా ప్రభుత్వాన్ని, జగనన్నను ఆశీర్వదించండి అని ధైర్యంగా అడగగలుగుతున్నాం. మిగిలింది మీ కృషినే.. రాజాం నియోజకవర్గంలో 12,403 ఇంటి స్థలాలు ఇచ్చాం. దాదాపు రూ.240 కోట్లు విలువైన ఇంటి పట్టాలు ఇచ్చాం. వీటిలో 9,509 ఇళ్లను ఇప్పుడు కడుతున్నారు. వాటి విలువ కనీసంగా మరో రూ.171 కోట్లు ఉంటుంది. గతంలో.. నాన్నగారి హయాంలో ప్రతి ఎమ్మెల్యే, కార్యకర్త ధైర్యంగా గ్రామాలకు వెళ్లేవాళ్లు. ఇల్లు, రేషన్‌కార్డు, పెన్షన్.. ఇలా అన్నీ సమకూర్చారు. ఈరోజు అదే నిజాయితీతో, అదే అంకిత భావంతో మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ ధైర్యంగా వెళ్లగలుగుతున్నాం. చేయాల్సిన మంచి అంతా చేశాం. ఇప్పుడు మనం చేయాల్సింది.. చేసిన మంచిని ఓట్ల రూపంలో మార్చుకోవడం. దీనికి కార్యకర్తలుగా మీ కృషి ఎంతో అవసరం. పార్టీపరంగా జిల్లా, మండలస్థాయి, గ్రామ స్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు కావాలి. దాదాపు 24 అనుబంధ విభాగాలు పార్టీకి ఉన్నాయి. ఈ విభాగాలన్నింటికీ కమిటీలు ఏర్పాటు కావాలి. ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలి అని సీఎం జగన్.. కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. అన్నీ అందుతున్నాయ్ బూత్ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. వీలైనంత వరకూ ప్రతి కమిటీలో కూడా కచ్చితంగా యాభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూసుకోవాలి. మొత్తం కమిటీలో యాభైశాతం మహిళలు ఉండేలా చూడండి. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మను బాగా చూసుకుంటే కుటుంబాలు బాగుపడతాయని మనస్ఫూర్తిగా నమ్మి ప్రతి పథకం కూడా వాళ్లకు తగ్గట్లుగానే పేర్లతో పెట్టాం. అందుకే వాళ్లనూ భాగస్వామ్యం చేయాలి. సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ప్రాధాన్యతా క్రమంలో పనులకు మంజూరు కూడా చేస్తున్నాం. మళ్లీ మనం(కార్యకర్తలను కలిపి) అఖండ మెజార్టీతో గెలవాలి. ఈసారి టార్గెట్ 151 కాదు, 175. ఈ టార్గెట్ కష్టంకాదు. మీ నియోజకవర్గంలో ఏమేర లబ్ధి జరిగిందో, ప్రతి నియోజకవర్గంలోనూ జరిగింది. దాదాపు 87శాతం కుటుంబాలకు పథకాలు అందాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఘనవిజయాలు సాధించగలిగాం. మున్సిపాల్టీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ ఎన్నికల్లో ఘన విజయాలు అందుకున్నాం. ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది అంతకుముందు ప్రజలకు ఏదైనా అందాలంటే.. పది మంది చుట్టూ తిరగాలి. లంచాలు ఇచ్చుకోవాలి. ఇంతచేసినా వెయ్యి మందిలో నలుగురికో, పదిమందికో పథకాల లబ్ధి అందేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివక్ష లేకుండా, పక్షపాతం లేకుండా ప్రజలకు అన్నీ సంక్షేమాలు అందుతున్నాయి. గతంలో సచివాలయ వ్యవస్థ అనేదే లేదు. ఇప్పుడు ఉన్నాయి. నాలుగు అడుగులు వేస్తే ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్‌క్లినిక్స్ కనిపిస్తున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే.. ఇంగ్లిషు మీడియం స్కూళ్లు కనిపిస్తున్నాయి. నేడు గ్రామాల్లో ఇలాంటి వ్యవస్థ కనిపిస్తోంది. ప్రజల్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వాళ్లు అని గ్రహిస్తున్నారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాం. ఆరోగ్యశ్రీ కింద 3వేలకుపైగా చికిత్సలకు వర్తింపు చేస్తున్నాం. మన గ్రామంలోనే మన కళ్లముందే మార్పులు కనిపిస్తున్నాయి. వీటి గురించే ప్రజలకు చెప్పండి. వారి మద్దతును కూడగట్టండి. మీతోడు జగన్‌కు కావాలి. మనం అంతా ఇంకా కలిసికట్టుగా ముందుకెళ్లాలి. జీవితంకాలం మిగిలిపోయే విధంగా మనం అంతా చరిత్రను లిఖించాలి. మన తీసుకొచ్చిన మార్పులు అన్నీకూడా మన కళ్లముందే ఫలితాలను ఇస్తాయి. ఇవన్నీ చూశాక 30ఏళ్లపాటు మనమే ఉండాలని ప్రజలే ఆశీర్వదిస్తారు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: కుప్పం నుంచే తొలి అడుగు! -
రాజాం టు అమెరికా.. కష్టాలను ఈది సూపర్ సీఈవోగా
విజయనగరం (రాజాం సిటీ): ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పెడుతూ కుంగదీసినప్పటికీ వెనక్కు తగ్గకుండా చదువుపై శ్రద్ధ కనబరిచాడు. డిగ్రీ చదువుకునే రోజుల్లో కుటుంబ బాధ్యత తీసుకుని, పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ నెట్టుకొచ్చాడు. పట్టుదలే ఆయుధంగా చేసుకుని జీవితం అయిపోయిందనుకునే స్థాయి నుంచి అమెరికా దేశం గుర్తించేలా నిలిచి అందరి మన్ననలు అందుకుంటున్నారు. ట్యాక్స్ ప్లానింగ్ అండ్ సీఈఓ సేవలపై వ్యాపార యజమానులకు అందించిన వినూత్న సేవలను గుర్తించి 2022లో టాప్ 20 సీఈఓలలో ఒకరుగా సీఈఓ పబ్లికేషన్ ఆయనను గుర్తించింది. ఆయనే రాజాం పట్టణానికి చెందిన గ్రంధి అనిల్. బాల్యంలోని ఆయన చదువు నుంచి అంతర్జాతీయ గుర్తింపు పొందినంత వరకు ఆయన ప్రస్థానం ఆయన మాటల్లోనే.. రాజాంలో ప్రాథమిక విద్య చదువుతున్న నేను నాలుగో తరగతి నుంచే వ్యాపారంపై మక్కువ పెంచుకున్నాను. రాజాంలోని భారతీయ విద్యాభవన్‌లో 5వ తరగతి, 6వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో, 7 నుంచి 10వ తరగతి వరకు ఏజేసీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకున్నాను. ఇంటర్లో ఎంపీసీ చదివి ఇంజనీర్ కావాలని స్నేహితులు, కుటుంబ సభ్యులు సలహాలు ఇచ్చినప్పటికీ డాక్టర్ కావాలనే బలమైన కోరికతో బైపీసీలో జాయిన్ అయ్యాను. ఇంటర్ మొదటి సంవత్సరం గరివిడి శ్రీరామ్ జూనియర్ కళాశాలలో, ద్వితీయ సంవత్సరం దాకమర్రిలోని రఘు కళాశాలలో పూర్తిచేశాను. అంతే ఉత్సాహంతో ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించాను. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఎంబీబీఎస్ చదవలేకపోయాను. అదే సమయంలో కుటుంబాన్ని చూసుకుంటూ చదువు కొనసాగించాలనే కృతనిశ్చయంతో జీసీఎస్ఆర్ కళాశాలలో బీకాం డిగ్రీలో చేరాను. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఎదురీది డిగ్రీ పూర్తిచేసి బీకాంలో సిల్వర్ మెడల్ పొందాను. పార్ట్ టైం జాబ్‌తో ఊరట ఓ వైపు డిగ్రీ చదువుతుండగానే మరో వైపు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుండేవాడిని. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఒడిదొడుకుల మధ్య డిగ్రీ పూర్తిచేశాను. తరువాత ఎంబీఏ చేయాలనుకున్నప్పటికీ అధ్యాపకుల సలహాతో సీఏ చేశాను. ఉద్యోగం ప్రస్థానం 2008లో ఐసీఏఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్) చెన్నై క్యాంపస్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మంచి జీతంతో ఎంపికయ్యాను. అక్కడి నుంచి శివ గ్రూపులో ఫైనాన్స్ కంట్రోలర్‌గా మూడేళ్లు పనిచేశాను. తరువాత తారస్ క్వస్ట్ కంపెనీలో ఫైనాన్స్ హెడ్‌గా ఉద్యోగం, యూఎస్ఏకు చెందిన సన్ ఎడిషన్ ఫైనాన్స్ కంట్రోలర్‌గా రెండేళ్లు పనిచేశాను. అక్కడ నా ప్రతిభ ఆధారంగా యూఎస్ హెడ్ఆఫీస్ నుంచి పిలుపురావడంతో వెళ్లి ట్రెజరీ ఆపరేషన్స్ దిగి్వజయంగా పూర్తిచేయగలిగాను. ఆ తరువాత అమెజాన్‌లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం లభించింది. దీంతో నా స్కిల్స్ మరింత డెవలప్ చేసుకోగలిగాను. తరువాత స్టార్‌బక్స్ కంపెనీలో చేరి ఖాళీ సమయంలో ట్యాక్స్ బిజినెస్ డెవలప్ చేసుకోగలిగాను. కరోనా సమయంలో సహాయం కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న కంపెనీలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రుణ సౌకర్యం కలి్పంచింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని బిజినెస్ యజమానులకు హెల్ప్ చేయగలిగాను. దాంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ హెల్పింగ్ నేచరే అమెరికాలో గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తరువాత ఏజీ ఫిన్ టాక్స్ అనే ట్యాక్స్ ప్లానింగ్ సరీ్వస్ ప్రారంభించాను. ట్యాక్స్ ప్లానింగ్ అండ్ సీఈఓ సేవలపై వ్యాపార యజమానులకు అందించిన వినూత్న సేవలను గుర్తించిన సీఈఓ పబ్లికేషన్ 2022లో టాప్ 20 సీఈఓలలో ఒకరిగా గుర్తించిందని గ్రంధి అనిల్ వివరించారు. -
రాజాం అబ్బాయి.. అమెరికా అమ్మాయి
రాజాం సిటీ: వారి ప్రేమకు హద్దుల్లేవు. ఎల్లలు దాటిన వారి ప్రేమను ఇరువురి కుటుంబసభ్యుల అంగీకారంతో పండించుకున్నారు. ఈ నేపథ్యంలో రాజాంలోని ఓ ప్రైవేట్ కల్యాణమంటపంలో ఆ ప్రేమ జంటకు వివాహం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రాజాం పట్టణంలోని కూరాకులవీధికి చెందిన కందుల కిరణ్ బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చదివేందుకు అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి వెళ్లాడు. అక్కడే బీబీఏ చదువుతున్న మోర్గాన్ బ్రింక్ (మహిగా ఇక్కడ మార్చిన పేరు)తో పరిచయం ఏర్పడి ప్రేమ చిగురించింది. ఇద్దరూ చదువుల అనంతరం మిచిగాన్ రాష్ట్రంలో వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారి ప్రేమగా విషయాన్ని కుటుంబ సభ్యుల కు తెలియజేశారు. తొలుత అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపినప్పటికీ కొన్నాళ్ల తరువాత ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. ముందుగా అమెరికాలో వారి సంప్రదాయం ప్రకారం ఆ ప్రేమ జంట వివాహం జరిగింది. భారతీయ సంప్రదాయం ప్రాకారం వివాహం చేసుకోవాలనే అమ్మాయి కోరిక మేరకు రాజాం పట్టణంలో వివాహం చేసుకోవాలని నిశ్చయించినప్పటికీ కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఇన్నాళ్లకు ముహూర్తం ఖరారు చేసుకుని రాజాంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అమ్మాయిఒ తల్లిదండ్రులు టీనా బ్రింక్, ఎరిక్ బ్రింక్, అబ్బాయి తండ్రి కందుల కామరాజు, ఇతర కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. చదవండి: (Visakhapatnam: ఇన్ఫోసిస్ @ వైజాగ్!) -
అమెరికా టాప్ 20 డైనమిక్ సీఈఓల జాబితాలో అనిల్ గ్రంధి
ప్రవాస భారతీయుడు అనిల్ గ్రంధి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. అమెరికాకు చెందని డిజిటల్ సంస్థ సీఈవో పబ్లికేషన్ తాజాగా ఈ ఏడాదికి ప్రకటించిన జాబితాలో ఆయన టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. ఏజీ ఫిన్‌ట్యాక్స్ అనే సంస్థకు అనిల్ గ్రంధి ఫౌండర్, సీఈవోగా ఉన్నారు. ఈ కార్పొరేట్ సంస్థలకు పన్నులకు సంబంధించిన విషయాల్లో ఏజీ ఫిన్ ట్యాక్స్ సంస్థ సేవలు అందిస్తోంది. అనిల్ గ్రంధి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రాజాం. గ్రంది వీరభద్రరావు, ధనలక్ష్మీలు అనిల్ తల్లిదండ్రులు, డిగ్రీ వరకు రాజాంలోనే ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. చదవండి👉🏾 పాకిస్తాన్లో చదివినోళ్లకు ఉద్యోగాలు ఇవ్వం! -
పొలిటికల్ కారిడర్ 19 January 2022
-
రాజాం టీడీపీలో వర్గపోరు
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర వ్యాప్తంగా కనుమరుగైపోయిన టీడీపీకి రాజాంలో జీవం పోయడానికి ప్రయత్నిస్తున్న ఆ పార్టీ ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్ను అసమ్మతి సెగ వెంటాడుతోంది. ఇప్పటికీ పార్టీ అధిష్టానం చేస్తున్న కార్యక్రమాలు నచ్చక ప్రజలు కనీసం కన్నెత్తి చూడకపోగా, పార్టీలో వర్గ విభేదాలు రోజురోజుకూ పెరుగుతుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. బ్యానర్ల కలకలం.. నాలుగు నెలలు క్రితం జరిగిన స్థానిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ప్రజాదరణను జీర్ణించుకోలేక ఉనికి కోసం టీడీపీ ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి స్పందన కరువయ్యింది. చివరకు పార్టీలోని నియోజకవర్గ పెద్దలు కూడా సహకరించడంలేదని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి, ఆమె కుమార్తె గ్రీష్మాప్రసాద్‌లు రాజాం పట్టణంలో పలుచోట్ల భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇందులో కోండ్రు మురళీమోహన్ ఫొటో ఎక్కడా కనిపించకపోవడంతో పలువురు టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. మురళీమోహన్ రాజాంపై పెత్తనంకోసం తనకు అన్యాయం చేయడం కారణంగానే ప్రతిభాభారతి కోండ్రును పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రాజాం టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిస్తే తాను గెలిచే అవకాశాలు ఉండగా.. కోండ్రు రాకతో టికెట్ లభించలేదనే అభిప్రాయంలో ఆమె ఉన్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో రాజాం నియోజకవర్గ టీడీపీ టిక్కెట్ తన కుమార్తె గ్రీష్మాప్రసాద్‌కు తెప్పించుకునే పనిలో ఆమె ఉన్నట్లు టీడీపీ తమ్ముళ్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. చదవండి: (బీడీకట్ట.. హవాయి చెప్పులతో మీనాన్న బతుకు ప్రారంభమైంది: తోపుదుర్తి) అన్ని మండలాల్లోనూ అదే పరిస్థితి.. టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు సొంత మండలం రేగిడిలో టీడీపీని నడిపించే నాయకులు ఎవరూలేకపోవడం గమనార్హం. గతంలో క్రియాశీలకంగా ఉన్న కిమిడి రామకృష్ణంనాయుడు, ఆయన కుమారుడు వినయ్‌కుమార్‌లు ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. ►వంగర మండలంలో కోండ్రుపై వ్యతిరేక పవనాలు నడుస్తున్నాయి. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్యాడర్ చాలా వరకూ వైఎస్సార్సీపీ గూటికి వెళ్లిపోయింది. కనీసం పోటీకి అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి నెలకొంది. ►సంతకవిటి మండలంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కొల్ల అప్పలనాయుడును ఇంతవరకూ గుర్తించలేదు. గతంలో ఎమ్మెల్సీ రాకుండా పెద్దలు అడ్డుకోవడంతో ఈయన చాలా తక్కువగానే పార్టీ కార్యక్రమాలకు హాజరౌతున్నారు. ►రాజాం పట్టణం, మండలంలో ప్రతిభాభారతికి అనుకూలంగా కార్యకర్తలు ఉన్నారు. దీంతో కోండ్రు కార్యక్రమాలు గాలిబుడగను తలపిస్తున్నాయి. -
సూక్ష్మ వెండి పుస్తకంలో హనుమాన్ చాలీసా
రాజాం సిటీ: సూక్ష్మ వెండి పుస్తకంలో హనుమాన్ చాలీసాను చెక్కి ప్రతిభ నిరూపించుకున్నాడు శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాల్టీ పరిధిలోని కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్, స్వర్ణకారుడు ముగడ జగదీశ్వరరావు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా రజత పుస్తకం రూపొందించానని తెలిపారు. మొత్తం 22 పేజీలు గల 11 వెండి రేకులలో 40 హనుమాన్ చాలీసా శ్లోకాలను చేతితో చెక్కినట్లు పేర్కొన్నారు. 1.060 మిల్లీ గ్రాముల బరువుతో 3.2 సెంటీమీటర్ల పొడవు, 2.3 సెంటీమీటర్ల వెడల్పుతో ఈ పుస్తకం తయారు చేశానని తెలిపారు. ఇందుకు మూడు రోజుల సమయం పట్టిందన్నారు. పుస్తకం మొదటి పేజీలో ఆంజనేయుడు, ఆఖరి పేజీలో శ్రీరాముడు చిత్రపటాలను చెక్కినట్లు చెప్పారు. గతంలోనూ దేశనాయకులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల ఫొటోలను వెండి కాయిన్లపై చెక్కి అబ్బురపరిచారు. గిన్నిస్‌బుక్ లక్ష్యం.. గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించేందుకు ఈ మైక్రో ఆర్ట్‌ను ఎంచుకున్నాను. ప్రతి రోజు ఏదో ఒక చిత్రాన్ని వెండి కాయిన్‌పై రూపొందిస్తున్నా. భారతదేశ చిత్రపటాన్ని పెన్సిల్ ముల్లుపై 50 సెకన్లలో వేసినందుకు క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అవార్డు లభించింది. మరింతగా సూక్ష్మమైన ఆర్ట్వేసి గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదిస్తా. – ముగడ జగదీశ్వరరావు, మైక్రో ఆర్టిస్ట్, రాజాం -
అమెరికాలో చదువుకు శ్రీకాకుళం విద్యార్థులు ఎంపిక
రాజాం: అమెరికా విదేశాంగశాఖ స్పాన్సర్ చేసే కమ్యూనిటీ కాలేజ్ ఇనిషియేటివ్ ప్రొగ్రాం (సీసీఐపీ)నకు శ్రీకాకుళం విద్యార్థినులు ఇద్దరు ఎంపికయ్యారు. రాజాంలోని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ నిర్వహిస్తున్న జీసీఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బెహరా మౌనిక, సోపేటి హేమశ్రీ ఈ ప్రొగ్రామ్‌కి ఎంపికయ్యారు. వీరు అమెరికాలో తమకు నచ్చిన కోర్సులు అభ్యసించే అవకాశాన్ని పొందారు. వీరిని హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ ఎంపిక చేసింది. అమెరికా విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో సీసీఐసీ కింద వివిధ దేశాలకు చెందిన అర్హులను ఎంపిక చేసి.. ఏదైనా ఒక అమెరికన్ కమ్యూనిటీ కాలేజీలో ఏడాది చదువుకునే అవకాశం కల్పిస్తారు. వీరి చదువుకయ్యే ఖర్చులు, వసతి సదుపాయం, ఇతర ప్రయాణ ఖర్చులు అమెరికాయే భరించడంతోపాటు నెలవారీ స్టయిఫండ్ కూడా చెల్లిస్తుంది. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న వారికి జీఎంఆర్ వీఎఫ్ ఉచితంగా శిక్షణ ఇస్తుంది. ఈ విధంగానే మౌనిక, హేమశ్రీ శిక్షణ పొందారు. పేద కుటుంబానికి చెందిన విద్యార్థి మౌనిక.. మౌనిక నిరుపేద మత్స్యకార కుటుంబానికి చెందిన విద్యార్థిని. జీఎంఆర్ వీఎఫ్ గిఫ్టెడ్ చిల్ర్డన్ కోటాలో ఆమె ఉచితంగా జీసీఎస్‌ఆర్‌లో చదువుతోంది. ఎన్విరాన్మెంటల్ హార్టికల్చర్ కోర్సును ఎంపిక చేసుకున్న మౌనిక ఇల్లినాయిస్ స్టేట్‌లో ఉన్న కాలేజ్ ఆఫ్ డూపేజ్‌లో చదువుకోనుంది. విజయనగరం జిల్లాకు చెందిన హేమ తండ్రి బ్యాంకులో మెసెంజర్‌గా పనిచేస్తున్నారు. హేమశ్రీ సస్టెయినబుల్ అగ్రికల్చర్ కోర్సును ఎంచుకుంది. ఫ్లోరిడా స్టేట్ ఓర్లాండ్లో వాలెన్సియా కాలేజీలో చదవనుంది. -
బతుకు దయనీయం.. కావాలి సాయం
రాజాం సిటీ/రూరల్: ఇద్దరు పిల్లలు కళ్ల ముందే చనిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తెకేమో రక్త హీనత. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రం. చికిత్స కోసం ప్రయత్నిస్తున్న ప్రతిసారీ అప్పులు పెరిగాయి గానీ వ్యాధి తగ్గలేదు. 45 రోజులకు ఒకసారి అమ్మాయికి తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. ఈ తంతు పూర్తి చేయడమే ఆ తల్లిదండ్రులకు తలకు మించిన భారమవుతోంది. ఇక పూర్తిస్థాయి లో వైద్యం అందించాలంటే సాధ్యం కావడం లేదని వారు తడి కళ్లతో అంటున్నారు. దాతలు సాయం చేస్తే తమకు మిగిలిన కుమార్తెను కాపాడుకుంటామని ఆశపడుతున్నారు. రాజాం మండలం గురవాం గ్రామానికి చెందిన కుప్పిలి భాస్కరరావు, కుప్పిలి సరోజినిల దుస్థితి ఇది. వీరి కుమార్తె కుప్పిలి స్రవంతి డోలపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈమె ఐదో ఏట అనారోగ్యానికి గురవడంతో పచ్చకామెర్లు అనుకుని నాటు మందులు వాడారు. అయినా తగ్గుముఖం పట్టకపోవడంతో స్థానిక కేర్ ఆస్పత్రిలో చేరి్పంచారు. అక్కడి వైద్యులు చిన్నారిని పరీక్షించడంతో అసలు విషయం బయటపడింది. సికెల్‌సెల్ ఎనీమియా వ్యాధి ఉందని నిర్ధారించారు. అప్పటి నుంచి ప్రతి నెలా రక్తమారి్పడి చేసుకుంటూ కుమార్తెను కాపాడుకుంటూ వస్తున్నారు. బెంగళూ రు వద్ద నర్సాపూర్‌లో, చెన్నై సమీపంలో రాయివెల్లూరు తదితర చోట్లకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. రూ. 5 లక్షల వరకు అప్పులు చేసి వైద్యం కోసం ఖర్చు చేశారు. ఎప్పటికప్పుడు రాయివెళ్లూరు వెళ్తుండటంతో వైద్యం కూడా తలకు మించిన భా రంగా మారింది. దీంతో గ్రామస్తులు, బంధువులు సహాయ సహకారాలు అందించారు. భారీ మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులకు ఏమీ పాలుపోవడం లేదు. అప్పులు చేసే స్థితి కూడా దాటిపోయామని, కన్నపేగు ఇలా అయిపోతుంటే చూడలేకపోతున్నామని దాతలే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. సాయం చేయదలచుకున్న వారు 8985481872 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు. మేనరిక వివాహంతో.. కుప్పిలి భాస్కరరావు, సరోజిని మేనరిక వివాహం చేసుకున్నారు. వీరికి మొదటగా కుమార్తె జన్మించి మూడేళ్ల వయసులో అనారోగ్యంతో మృతిచెందింది. తర్వాత కుమారుడు, మరో కుమార్తె పుట్టడంతో ఎంతో సంబరపడ్డారు. వీరిద్దరితో సరదాగా కాలం నెట్టుకొస్తున్న తరుణంలో మరోమారు విధి కన్నెర్రజేసింది. కుమారుడు కూడా చనిపోయాడు. ఉన్న ఒక్క కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంతలో వ్యాధి సోకడంతో వారి బాధ వర్ణణాతీతంగా మారింది. ఒక్కసారి రక్తం ఎక్కించిన తర్వాత ఒక్కో సారి 45 రోజులకు, ఒక్కోసారి నెలలోపే మరలా రక్తం ఎక్కించాల్సి వస్తుందని తల్లిదండ్రులు ‘సాక్షి’ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధికి చికిత్స చేయించడం తమ వల్ల కావడం లేదని, రేపటి రోజును తలచుకుంటేనే భయం వేస్తోందని అంటున్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకుంటే తమ చిన్నారి బతుకుతుందని కోరుతున్నారు. -
కన్నా... నీ రాక కోసం!
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా చైనాలో చిక్కుకున్న భారతీయుల్లో మన జిల్లా వాసి ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేపగా, అతడి కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజాం పట్టణం కాలెపువీధికి చెందిన దొంతంశెట్టి సత్యసాయికృష్ణ టీసీఎల్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికై శిక్షణ నిమిత్తం అక్కడకు వెళ్లాడు. ఇంతలో కరోనా మహమ్మారి విజృంభించడంతో చైనా ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. వైద్య పరీక్షల్లో టెంపరేచర్ డౌన్‌గా ఉందని ఇతడితోపాటు వెళ్లిన కర్నూలు జిల్లాకు చెందిన యువతిని పంపేందుకు అనుమతి నిరాకరించింది. సత్యసాయికృష్ణ గతేడాది ఆగస్టులో తమిళనాడులోని వెల్లూరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో టీసీఎల్ కంపెనీ ఉద్యోగిగా ఎంపికయ్యాడు. వెంటనే కంపెనీ ట్రైనింగ్ నిమిత్తం ఈయనతోపాటు మరో 89 మందిని చైనాలోని వ్యూహాన్ సిటీ తీసుకెళ్లింది. వీరిలో కొంతమంది రెణ్నెల్ల క్రితం ఇండియాకు వచ్చేయగా, సత్యసాయికృష్ణతోపాటు మరో 57 మందికి శిక్షణ కాలం ఆర్నెల్లకు పొడిగించడంతో ఉండిపోయారు. ఇంతలో వ్యూహాన్లో కరోనా వైరస్ విజృంభించడంతో చైనా ప్రభుత్వం ఎవరినీ పంపకుండా నిషేధం విధించింది. వచ్చిన అవకాశం చేజారింది... కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తున్న సమయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చొరవతో 11 రోజుల క్రితం 600 మంది రెండు విమానాల్లో స్వదేశానికి చేరుకున్నారు. పది మందిని మాత్రం చైనా ప్రభుత్వం ఇండియా పంపేందుకు అనుమతించ లేదు. వీరిలో టీసీఎల్ కంపెనీ నుంచి వెళ్లిన రాజాం పట్టణానికి చెందిన సత్యసాయికృష్ణ, కర్నూలు జిల్లాకు చెందిన మరో యువతి ఉన్నారు. వీరిద్దరికి ఆ రోజు వైద్య పరీక్షల్లో టెంపరేచర్ డౌన్‌గా ఉందని చైనా ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఎదురు చూస్తున్న కుటుంబీకులు... మధ్య తరగతి కుటుంబానికి చెందిన సత్యసాయికృష్ణ విట్ ఎంట్రన్స్ టెస్టులో ర్యాంకు సాధించడంతో అక్కడ మెకానికల్ ఇంజినీరింగ్ సీటు లభించింది. ఈ కోర్సు చివరి సంవత్సరంలో ఉండగా, టీసీఎల్ కంపెనీ తిరుపతిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసింది. చైనాలో శిక్షణ ముగించుకుని ఈ నెల మొదటి వారంలో ఇండియాకు రావాల్సి ఉంది. ఇంతలోనే కరోనా వైరస్ కారణంగా వ్యూహాన్ సిటీలో ఉండిపోవాల్సి వచ్చింది. ఇతడి రాక కోసం తల్లి శ్రీదేవి, నానమ్మ భద్రమ్మ, సోదరి గాయత్రి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రయత్నాలు.. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఈ విషయం పెట్టామని, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ఓ తెలుగు మహిళ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తుందన్నారు. యోగ క్షేమాలు తెలుసుకుంటున్నాం... తన కుమారుడికి మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందుతున్నాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, టిఫిన్ వంటివి ఇవ్వడం లేదు. గతంలో వీరికి వండి పెట్టే వంటమనిషి లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రోజూ మాస్‌్కలు ధరించి దగ్గర్లో క్యాంటీన్‌కు వెళ్లి బిస్కెట్లు, పండ్లు వంటివి తీసుకుంటున్నారు. తన కుమారుని యోగక్షేమాలు రోజు ఫోన్ ద్వారా తెలుసుకుంటూ కాలం గడుపుతున్నాం. – సత్యసాయికృష్ణ తండ్రి శ్రీనివాసరావు, రాజాం -
అమ్మో..భూకంపం!
రాజాం, సంతకవిటి: మధ్యాహ్నం 12.30 గంటల సమయం.. ఇంట్లో సామాను చెల్లాచెదురై ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళ పరిస్థితి.. అందరూ బయటకు పరుగులు తీశారు. రాజాం పట్టణం, సంతకవిటి మండలం పుల్లిట, మామిడిపల్లి గ్రామాల్లో గురువారం భూమి స్వల్పంగా కంపించింది. రాజాం పట్టణ పరిధిలోని అమ్మవారి కాలనీలో ప్రకంపనలు వచ్చి ఒక్కసారిగా ఇళ్లలో స్టీలు సామగ్రి కదలి శబ్దంతో నేలపై పడ్డాయి. దీంతో ఆందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చేశామని అమ్మవారి కాలనీకి చెందిన జి.శారదమ్మ, ఎం.కళ్యాణి, బి.శకుంతల తదితరులు తెలిపారు. మంచాలు, టేబుల్‌పై సామగ్రి వంటివి కదిలాయని తెలిపారు. అందరూ ఎవరి పనుల్లో వారు ఉన్న సమయంలో ఇలా భూమి కంపించడంతో పెద్దగా విషయం బయటకురాలేదు. అమ్మవారి కాలనీలో మాత్రం ఇళ్లలోని సామాన్లు కిందపడిపోవడంతో కలకలం రేగింది. కొంతమంది ఇది భూకంప ప్రభావమని పేర్కొనగా, మరికొంతమంది ఏదో పెద్ద వాహనం వీధిలోకి రావడం కార ణంగా ఇలా జరిగి ఉంటుందని, భూకంపం కాదని కొట్టిపారేశారు. సంతకవిటి మండలం పుల్లిట, మామిడిపల్లి గ్రామాల్లో భూప్రకంపనలు కనిపించాయి. ప్రధానంగా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఇవి వచ్చినట్లు ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. చాలామంది ఈ సమయంలో ఇంటి వద్ద లేకపోవడంతో స్పష్టమైన సమాచారం లేదు. మామిడిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ కదలికలు కనిపించాయని ఆ సమయంలో అక్కడ ఉన్నానని రామారావు అనే యువకుడు తెలిపారు. పుల్లిటలో తాను ఇంట్లో ఉన్న సమయంలో డబుల్ కాట్ మంచం కంపించిందని గ్రామానికి చెందిన శ్రీనివాసరావు చెప్పారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి గదిలో గంజాయి
సాక్షి, రాజాం : నగర పంచాయతీ పరిధి డోలపేటలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఉంటున్న గదిలో బుధవారం గంజాయి లభ్యమైంది. విద్యార్థుల ప్రవర్తనలో వస్తున్న మార్పులను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పట్టణ సీఐ జి.సోమశేఖర్ తన సిబ్బందితో దాడి చేశారు. విద్యార్థి తన బ్యాగ్‌లో దాచుకున్న కిలో 25 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. డోలపేటలో నివాసం ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థి మత్తుకు బానిసై డోలపేటలో ఉంటున్న మరో వ్యక్తి మండల శ్రీనుని ఆశ్రయించాడు. దీంతో వారిరువురు కిలో 25 గ్రాముల గంజాయిని తెచ్చుకుని వారు సేవించడంతోపాటు మరికొంత విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో స్థానికులు అందించిన సమాచారం మేరకు వారి రూమ్‌ను సోదా చేశామని సీఐ తెలిపారు. గంజాయితోపాటు వారిరువురిని అదుపులోకి తీసుకుని తహశీల్దార్ ఎదుట ప్రవేశపెట్టామని చెప్పారు. తహశీల్దార్ ఆదేశాల మేరకు రిమాం డ్ పంపిస్తున్నట్లు తెలిపారు. అన్ని తరగతుల్లో మెరిట్ స్టూడెంట్‌గా ఉన్న విద్యార్థి ఇలా గంజా యి వ్యవహారంలో పట్టుబడడంతో తోటి విద్యార్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజాంకు పాకిన గంజాయి వ్యాపారం నిన్న మొన్నటి వరకు పీడించిన క్రికెట్ బెట్టింగ్‌లు, కబడ్డీ బెట్టింగ్‌లతోపాటు ప్రస్తుతం గంజాయి మత్తు కూడా యువతను ఆవరించింది. మత్తుకు అలవాటు పడిన విద్యార్థులు ఎలాగైనా గంజాయిని తెప్పించుకుని వాడుతున్నారు. గతంలో గంజాయి విక్రేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని మందలించారు. అయినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు రాకపోగా విద్యార్థులపై వారి కన్నుపడింది.దీంతో విద్యార్థులే టార్గెట్‌గా చేసుకొని గంజాయి విక్రయాలు జరుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. దీనిపై పోలీసులు నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు. నిఘా పెంచాం: సీఐ సోమశేఖర్ డోలపేటలోనే ఎక్కువగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఎప్పుటికప్పుడు సమాచారం అందుతుండడంతో నిఘా మరింత పెంచామని పట్టణ సీఐ సోమశేఖర్ తెలిపారు. మండల శ్రీను గతంలో కూడా పట్టుబడడంతో మందలించామని, అయినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని, బుధవారం జరిపిన దాడిలో విద్యార్థితో కలసి మరోసారి పట్టుబడ్డాడని చెప్పారు. -
బస్టాండ్‌లో ప్రయాణికులే వీరి టార్గెట్
సాక్షి, రాజాం : బస్టాండ్లే వారికి ఆదాయ మార్గాలు. ఒంటరిగా బస్సు ఎక్కేవారే టార్గెట్. రద్దీగా ఉండే బస్సుల్లో ఎక్కేవారి చేతుల్లో ఉండే బ్యాగులు, నగదు కాజేయడంలో సిద్ధహస్తులు. ఇలా ఈ మధ్య కాలంలో రాజాం బస్టాండ్‌లో ఓ వ్యక్తి సంచిలో నుంచి దొంగిలించి పరారైన నిందితులను పోలీసులు చాకచక్యంగా బుధవారం పట్టుకున్నారు. రాజాం ఎస్ఐ కె.రాము నిందితులను విలేకరుల ముందు హాజరు పరిచి, వివరాలను వెల్లడించారు. ఈ నెల 10న విజయవాడకు చెందిన బట్టల వ్యాపారి పడాల నాగేశ్వరరావు రాజాంలో తన సొమ్ము కలెక్షన్ చేసుకుని, తిరుగు పయనమయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో విశాఖపట్నం బస్సు ఎక్కుతుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి వ్యాపారిని తత్తరపాటుకు గురిచేసి, చేతిలో ఉన్న బ్యాగును చాకచక్యంగా కాజేసి పరారయ్యారు. తేరుకున్ను నాగేశ్వరరావు.. తన బ్యాగులోని రూ.86,250లు అపరహరణకు గురయ్యాయని రాజాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, రంగంలోకి దిగిన పోలీసులు.. కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీలను పరిశీలించి, పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం బస్టాండ్‌లో అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ కె.రాము, క్రైం సిబ్బంది సీహెచ్ కృష్ణ, చౌదరి కృష్ణ, శంకరరావు బస్టాండ్‌కు చేరుకొని, చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు విశాఖపట్నంకు చెందిన బుర్లి సురేష్‌ప్రసాద్, గోపాలపట్నంకు చెందిన అరికట్ల తారకేశ్వరరావుగా గుర్తించి, మరిన్ని వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వీరి వద్ద నుంచి రూ.84,200లు స్వాధీనం చేసుకుని, రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించామని ఎస్ఐ వివరించారు. గతంలో విశాఖపట్నంలో కూడా వీరిపై పలు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. -
బెట్టింగ్ బంగార్రాజులు
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : బెట్టింగ్ మాఫియా కన్ను పట్టణాలు, పల్లెలపై పడింది. మెట్రో నగరాల్లో వీరి కార్యకలాపాలకు అక్కడ పోలీసు యంత్రాంగం చెక్ పెడుతుండటంతో ఇటువైపు దృష్టిసారించింది. ఇటీవల శ్రీకాకుళం, రాజాంలో బయటపడిన బెట్టింగ్ బాగోతాలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇక్కడ యువతలో క్రికెట్ మోజును బలహీనతగా చేసుకున్న ఓ ముఠా ప్రత్యేక యాప్ ద్వారా బెట్టింగ్ రొంపిలోకి దించుతోంది. దీంతో ఆర్థికంగా చితికిపోయి జీవితాలను నాశనం చేసుకునే స్థితికి దిగజార్చుతోంది. రాజాంలో గుట్టుగా సాగిస్తున్న బెట్టింగ్ వ్యవహారాన్ని ఇటీవల పోలీసులు రట్టు చేశారు. ప్రపంచకప్ సెమీఫైనల్ –2 మ్యాచ్ సందర్భంగా ఐదుగురు బెట్టింగ్ రాయుళ్లను ఈ నెల 11న అదుపులోకి తీసుకోగా, పరారైన మరో ఐదుగురిని ఈనెల 17న అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 5.05 లక్షలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసిన విషయం విదితమే. యువతే టార్గెట్..... ప్రస్తుతం యువత ప్రపంచీకరణ మోజులోపడింది. డబ్బులు ఈజీగా సంపాదించే ఆలోచనలోనే బెట్టింగ్ ముఠా వలలో చిక్కుతోంది. ఇదే అదునుగా చేసుకుని వందకు వెయ్యి, వెయ్యికి పది వేలు, రూ. పది వేలకు రూ.లక్ష అంటూ పదింతలు సంపాదించవచ్చునని ఆశపెడుతోంది. మ్యాచ్ ఏదైనా బెట్టింగ్ మాత్రం ఒకటే. ముందుగానే ఇటువంటి బలహీనత యువతను గుర్తించి వారి ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడడం వంటివి చేస్తుండడం గమనార్హం. ఒక్క రాజాంలోనే కాకుండా జిల్లా అంతటా ఇదే తంతు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొంతమంది యువత విలువైన వస్తువులతోపాటు బైక్‌లను, ల్యాప్‌టాప్‌లను కుదవపెట్టి బెట్టింగ్‌లకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కడో పెద్ద పట్టణాల్లో సాగిన బెట్టింగ్ చిన్న పట్టణాలకు పాకడంతో విజ్ఞులు నిట్టూరుస్తున్నారు. కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం... బెట్టింగ్ రాయుళ్లు ఉచ్చులో చిక్కుకున్న యువత రంజీ, ఐపీఎల్, టీ20, వన్డే మ్యాచ్‌లతోపాటు టీవీల్లో వచ్చే లైవ్ మ్యాచ్‌లకు బెట్టింగ్‌కు పాల్పడుతోంది. ఈ బెట్టింగ్‌ల్లో బాల్ టూ బాల్, ఓవర్ టూ ఓవర్, బ్యాటింగ్, వికెట్లు, సిక్సర్స్, ఫోర్స్ వంటి వాటిపై కూడా ఉత్కంఠగా బెట్టింగ్ కాయడం. ఒకవేళ చేతిలో సొమ్ములు అయిపోతే వారి వద్ద ఉన్న గోల్డ్, ఇతర విలువైన వస్తువులు కూడా పద్దు రూపంలోను, అమ్మకం చేసో పోగొట్టుకున్న సొమ్మును రాబెట్టుకునేందుకు బెట్టింగ్లవైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఆర్థికంగా చితికిపోయి ఎక్కువ వడ్డీకి అప్పులు చేయడం, పరారైపోవడంతో కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్నారు. ఒకవేళ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో కేవలం సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కొద్ది మొత్తంలో సొమ్ము మాత్రమే దొరుకుతోంది. కోట్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నప్పటికీ ఎవరికీ దొరకుండా జాగ్రత్త పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతా యాప్‌లోనే.... క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి యాప్‌ల ద్వారా సాగిస్తున్నారు. యాప్ ద్వారా రేటింగ్స్ ముందుగానే లెక్కించి ఏ జట్టుకు బెట్టింగ్ కాస్తే లాభదాయకంగా ఉంటుందో తెలియజేసి, తదనుగుణంగా బెట్టింగ్‌లోకి దించుతున్నారు. దీనికి సంబంధించి లాగిన్ ఐడీ ఇచ్చి ముందుగానే డిపాజిట్ కూడా చేయిస్తున్నారనే విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదంతా విజయవాడ కేంద్రంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను బెట్టింగ్ నిర్వాహకులు భారీగానే ఆర్జిస్తున్నారు. బెట్టింగ్‌లో రెండు వైపుల నుంచి కూడా వీరికి భారీస్థాయిలో కమీషన్ అందుతున్నట్లు తెలుస్తోంది. అంతా గోప్యంగానే..... బెట్టింగ్ రాయుళ్లు ఎవరి కంటా పడకుండా అంతా గోప్యంగానే సాగిస్తున్నారు. నలుగురిలో తిరుగుతూ పక్కవాడికి కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనికోసం శివార్లలో ఇళ్లను ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే లాడ్జీల్లో రూమ్‌లు తీసుకుని బెట్టింగ్ గుట్టుగా సాగిస్తున్నారు. అంత వరకు సామాన్యుడిలా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా లైఫ్‌స్టైల్ మార్చడం, కొన్ని రోజులకే పూర్వ స్థితికిరావడం తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం, పలుచోట్ల సంభవిస్తున్నాయి. అయితే రాజాంలో కలకలం రేపిన బెట్టింగ్ వ్యవహారంలో పది మంది మాత్రమే ఇప్పటివరకు పట్టుబడ్డారు. వీరు మాత్రమేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది పట్టణంలో గుసగుసలాడుకుంటున్నారు. దీనిని మొగ్గలోనే తుంచి ఈ భూతాన్ని తరిమివేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బెట్టింగ్‌లపై నిఘా పెట్టాం పట్టణాలతోపాటు పల్లెల్లో కూడా బెట్టింగ్‌ల వ్యవహారంపై ఇప్పటికే నిఘా పెట్టాం. ఇందులో భాగంగానే ఇటీవల పది మంది బెట్టింగ్ రాయుళ్లును అదుపులోకి తీసుకున్నాం. ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారనే సమాచారం అందిస్తే, వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు బెట్టింగ్ రాయుళ్లును పట్టుకుంటాం. జి.సోమశేఖర్, సీఐ, రాజాం టౌన్ -
బెట్టింగ్ చేసినందుకు ఐదుగురు అరెస్టు
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని రాజాం పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాకు సంబంధించి మరో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు. వారం రోజుల క్రితం ఐదుగురి బెంటింగ్రాయుళ్లను రాజాం పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో మరో ఐదుగురు పరారయ్యారు. వారిని గురువారం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వాటి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు ఎస్పీ వెల్లడించారు. గతంలోనే ఐదుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం పట్టుకున్న ముఠా నుంచి రూ. 2.40 లక్షల నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజాం పోలీసులు పట్టుకున్న ముఠాలో రాజాం పట్టణానికి చెందిన గొర్లె దుర్గారావు, రాజాం మండలం దోసరి గ్రామానికి చెందిన కత్రి సింహాచలం, వంగర మండలం కొండచాకరాపల్లికి చెందిన గెంబలి అనిల్‌కుమార్, రేగిడి ఆమదాలవలస మండలం పెద్దశిర్లాం గ్రామానికి చెందిన లెంకా చిన అప్పలనాయుడు, రాజాం మండలం మొగిలివలసకు చెందిన ఆబోతుల భగవాన్ ఉన్నారన్నారు. క్రికెట్ బెట్టింగ్ యాప్‌ను ఉపయోగించుకొని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని చెప్పారు. యాప్ ద్వారా రేటింగ్స్ ముందుగానే లెక్కించి ఏ టీంకు బెట్టింగ్ కాయడం వల్ల లాభదాయకంగా ఉంటుందో తెలియజేస్తారని, దానికి అనుగుణంగా యువతను బెట్టింగ్‌లోకి దించుతున్నారని పేర్కొన్నారు. బెట్టింగ్ సమాజానికి మంచిదికాదని ఎస్పీ అన్నారు. యువత బెట్టింగ్‌లోకి దిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయన్నారు. బెట్టింగ్ వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణకు ‘ఆపరేషన్ లక్ష్య’.. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. సుదీర్ఘ జాతీయ రహదారి ఉండటంతో ప్రమాదాల నివారణకు మొబైల్ పోలీసు బృందాలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ‘ఆపరేషన్ లక్ష్య’ పేరుతో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి వాహనాలకు ముందు, వెనుక రేడియం స్టిక్కర్లను అతికించే కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. వన్ స్టిక్కర్–వన్ లైఫ్ నినాదంతో వీటిని తయారుచేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యువతను మంచి మార్గంలో నడిపే దిశగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. భామిని మండలంలో ఇటీవల వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. త్వరలో సీతంపేటలో వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తామన్నారు. కమ్యూనిటీ పోలీసులకు సమాజ పరిస్థితులపై అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. జిల్లాలో పోలీసుశాఖ తరఫున లక్ష మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఎచ్చెర్ల ఏటీఎం చోరీపై మాట్లాడుతూ ఒక బృందం రాజస్థాన్ వెళ్లిందని, ఈ నెలాఖరు నాటికి ఈ కేసు విషయంలో ప్రగతి ఉండవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ జి.గంగరాజు, రాజాం సీఐ సి.సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజాంలో దొంగల హల్చల్
సాక్షి, రాజాం : రాజాం పట్టణంలో సోమవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. దేవాలయాల్లోని హుండీలనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణంలోని సంతమార్కెట్‌లోని మల్లికార్జునస్వామి ఆలయంలో రెండు హుండీలు, కాకర్లవీధి శివాలయంలోని హుండీ, పుచ్చలవీధి శివారులో ఉన్న వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయ హుండీ, చీపురుపల్లి రోడ్డులోని అభయాంజనేయస్వామి దేవాలయంలోని హుండీని పగులుకొట్టి అందులోని నగదును దోచుకున్నారు. ఈ ఆలయాలన్నీ దగ్గర, దగ్గరగా ఉండడంతో చోరీలు వెంటవెంటనే జరిగినట్లు పోలుసీలు భావిస్తున్నారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలకు ఏదో అడ్డంపెట్టి ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. అందులోని ఒక కెమెరాలో మాత్రమే ఓ వ్యక్తి చెందిన ఫుటేజీ దొరికింది. ఉదయం యథావిధిగా ఆలయాలకు వెళ్లిన పురోహితులు, ఆలయ సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఒకేరోజు నాలుగు ఆలయాల్లో దొంగతనాలు జరిగిన వార్త పట్టణంలో వ్యాపించడంతో సంచలనంగా మారింది. దొంగతనం జరిగిన కాకర్లవీధి శివాలయం, వాసవీకన్యకాపరమేశ్వరి దేవాలయాలు రాజాం పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండడం విశేషం. దొంగతనం జరిగినట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఫుటేజీలో ఉన్నది ఎవరు? కన్యకాపరమేశ్వరి ఆలయంలో సీసీ కెమెరాకు చిక్కిన నిందితుని ఫొటో ఆధారంగా పోలీసులు కేసును ఛేదించే పనిలో ఉన్నారు. 12.45 గంటల సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు సీసీ ఫుటేజీలో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సూర్యకుమారి తెలిపారు. -
ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం
రెప్పపాటు కాలంలో మొత్తం జరిగిపోయింది. కళ్ల ముందే కష్టార్జితం బూడిదపాలైంది. ప్రమాదాన్ని నివారించేలోగానే అంతా ఆవిరై చివరకు కట్టుబట్టలే మిగిలాయి. ఈ ఎస్సీ కాలనీలో నివసిస్తున్న వారంతా ఉపాధి కూలీలు. తమ ఇళ్లు మంటలపాలయ్యాయని తెలుసుకొని పరుగు పరుగున వచ్చిన వారికి మొండిగోడలు దర్శనమివ్వడంతో కుప్పకూలిపోయారు. కొందరి ఆర్తనాదాలు మిన్నంటగా.. మరికొందరు సొమ్మసిల్లిపోయారు. సాయం చేసేందుకు ముందుకు వచ్చిన గ్రామస్తులు బాధితులను ఓదార్చడమే తప్ప జరిగిన నష్టాన్ని నివారించలేని పరిస్థితి.. ఇవీ రాజాం మండలంలోని పొగిరి గ్రామంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనిపించిన దృశ్యాలు. సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : వారంతా నిరు పేదలు.. కాయకష్టం చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి బతుకులు ఈడుస్తున్నవారు.. కూలికి వెళ్తేనే గానీ పూట గడవని దుస్థితి. వచ్చిన కాస్తో కూస్తో కూలీ డబ్బులను ఇళ్లలోనే దాచుకుని అవసరానికి వినియోగించుకునే అల్పజీవులే వీరంతా. సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో వీరంతా కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. పొగిరి గ్రామంలోని ఎస్సీ కాలనీలో జె.గౌరి ఇంటి సమీపంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దగ్గర్లోని విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి ఉంటాయని గ్రామస్తులు భావిస్తున్నారు. ఆ సమయంలో ఈ కాలనీలో నివాసముంటున్నవారంతా ఉపాధి పనులకు వెళ్లిపోయారు. దీంతో మంటలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వ్యాపించేవరకూ ప్రమాదాన్ని ఎవరూ పసిగట్టలేకపోయారు. అగ్నికి వాయువు తోడు కావడంతో మంటలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వ్యాపించాయి. గ్రామంలో ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాద విషయాన్ని ఉపాధి పనుల్లో ఉన్న బాధితులు తెలుసుకుని తమ ఇళ్లకు చేరుకునే సమయానికే మొత్తం నష్టం జరిగిపోయింది. అప్పటికే ఈ పూరిళ్లలో ఉన్న వంట గ్యాస్ బండలకు అగ్ని అంటుకొని అవి పేలడంతో మంటల వ్యాప్తి అధికమైంది. మంటలను అదుపు చేసేందుకు వెళ్లిన యువకులు, గ్రామస్తులు సైతం గ్యాస్ బండల పేలుళ్లను తట్టుకోలేక, ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయలేక భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. ఈలోగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి చొప్పున రెండు వీధుల్లో మంటలు వ్యాపించి మొత్తం 31 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా నష్టం... ఈ ప్రమాదంలో బాధితులకు భారీ నష్టమే మిగిలింది. ఇళ్లల్లోని మొత్తం వస్తు సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది. ఈ ప్రమాదంలో పూరిళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. చౌడువాడ వెంకటరమణకు చెందిన రూ.40 వేలు నగదు మొత్తం కాలిపోయింది. 11 ఇళ్లలో బీరువాలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. నాలుగు ఇళ్ల నుంచి గ్యాస్ బండలు పెద్ద శబ్దం చేస్తూ పేలాయి. పన్నెండు కుటుంబాలకు చెందిన టీవీలు పూర్తిగా కాలిపోయాయి. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికేట్లు మొత్తం బూడిదయ్యాయి. పాపారావుకు చెందిన సౌండ్ సిస్టమ్ మొత్తం కాలిపోవడంతో ముద్దముద్దలుగా దర్శనమిస్తోంది. పలువురు బాధితులకు చెందిన ఎల్ఐసీ బాండ్లు, బ్యాంకు పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులు, కరెంటు మీటర్లు, బంగారు అభరణాలు వంటివి మొత్తం బూడిదయ్యాయి. వీటిని చూసి బాధితుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి. కొంతమంది బాధితులు ఈ ప్రమాదాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపడిపోయారు. ప్రమాదం జరిగే సమయానికి వేరే ప్రాంతాల్లో ఉన్న బాధితులు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని ఇంటికి చేరుకోగానే మొండిగోడలు చూసి లబోదిబోమంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా విలపిస్తూ చెట్టుకొకరు.. పుట్టకొకరుగా రోడ్డున పడ్డారు. ఈ ప్రమాదంలో రూ.9 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈమేరకు రెవెన్యూ అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. బాధితులకు తక్షణ సాయం నిమిత్తం ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. యువత సేవా కార్యక్రమాలు ప్రమాద స్థలం వద్దకు గ్రామానికి చెందిన యువకులు చేరుకుని తొలుత మంటలను అదుపుచేసేందుకు సాహసించారు. కాలిపోతున్న ఇళ్ల నుంచి గ్యాస్ బండలు పేలడంతో ప్రమాద తీవ్రత అధికం కావడంతో ప్రజలను అప్రమత్తం చేసి ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా సేవలు అందించారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు పొగిరి లెనిన్, జడ్డు జగదీష్, కామోదులు శ్రీరంగనాయుడు, శనపతిరాము తదితరులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని బాధితులకు సాయం అందించారు. బాధితులుకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటుచేశారు. రాజాం టౌన్ సీఐ సోమశేఖర్‌తోపాటు తహశీల్దార్ పి.వేణుగోపాలరావు, ఆర్ఐ శివకృష్ణ తదితరులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని బాధితుల వద్ద వివరాలు సేకరించారు. తక్షణ నష్టపరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితులకు రెడ్‌క్రాస్ సాయం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న రాజాం రెడ్‌క్రాస్ ప్రతినిధి కొత్తా సాయిప్రశాంత్‌కుమార్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్రావుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన అక్కడి నుంచి ప్రతి కుటుంబానికి ఒక వంటసామగ్రి కిట్‌తోపాటు దోమల తెర, దుప్పట్లు తీసుకొచ్చి పొగిరిలో 31 అగ్నిప్రమాద కుటుంబాలకు అందించారు. గ్రామ పెద్ద పొగిరి లెనిన్ చేతుల మీదుగా వీటిని బాధితులకు అందజేశారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటాం అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు చెప్పారు. విజయవాడలో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఆయన అగ్ని ప్రమాద ఘటనపై స్పందించా రు. విజయవాడ నుంచి రాజాం మండలంలోని అధికారులకు ఫోన్ చేసి బాధితులకు సహాయం అందించాలని ఆదేశించారు. స్థానిక నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని బాధితులతో మాట్లాడారు. తక్షణ ప్రభుత్వం సాయం అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. -
పురోగతి లేని ట్రేడ్ బ్రోకర్ కేసు
సాక్షి, రాజాం : జిల్లాను కుదిపేసిన ట్రేడ్ బ్రోకర్ ఆన్లైన్ మోసం కేసులో పురోగతి లేకుండా పోయింది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితులు జన స్రవంతిలో దర్జాగా తిరుగుతున్నారు. వీరిని పట్టుకోకుండా 18 నెలలుగా కేసు దర్యాప్తు పేరిట సీఐడీ పోలీసులు స్తబ్దుగా ఉండిపోయారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో హడావుడి చేసిన పోలీసులను పక్కనబెట్టి, మరింత పారదర్శకంగా కేసు విచారణ చేపట్టేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించినా బాధితులకు న్యాయం చేకూరడం లేదు. సూత్రధారి దొరికితేనే.. సంతకవిటి మండలం మందరాడ గ్రామ వేదికగా బయటపడిన ట్రేడ్ బ్రోకర్ కేసు దర్యాప్తులో భాగంగా అప్పట్లో సివిల్ పోలీస్‌లు హడావుడి చేశారు. నెల రోజుల వ్యవధిలో కేసులో పలు కీలక అంశాలు సేకరించి పలువురిని అరెస్టు చేశారు. అనంతరం సీఐడీకి ఈ కేసు బదిలీ చేశారు. అప్పట్నుంచి కేసు దర్యాప్తు పేరిట నాన్చుతున్నారు. అప్పట్లో అధికార పార్టీ అండదండలతో గట్టెక్కిన ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు హాయిగా ప్రజల్లో ఉండటం గమనార్హం. రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలు.. ట్రేడ్ బ్రోకర్ వద్ద పెట్టుబడులు పెట్టిన వారిలో ఆందోళనకు గురై ఇద్దరు ఆకస్మికంగా మృతిచెందారు. వీరిలో సంతకవిటి మండలం శంకరపేట గ్రామానికి చెందిన దాసరి కన్నంనాయుడు కుటుంబ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉంది. ఈయన కష్టసుఖాలను ఓర్చి గ్రామ పెద్దగా ఎదిగారు. ఎంతోమందికి న్యాయం చేయడంతోపాటు మోసగాళ్లకు బుద్ధి చెప్పారు. అటువంటి తనే చివరికి ట్రేడ్ బ్రోకర్ చేతిలో మోసపోయానని తెలుసుకుని గుండెపోటుకు గురయ్యారు. ఈయన పెట్టిన పెట్టుబడులకు ఎంతో కొంత వస్తుందని కుటుంబానికి ఏమాత్రం భరోసా రాలేదు. ఇదే మండలం మందరాడ గ్రామానికి చెందిన యడ్ల సూరీడమ్మ కూడా పెట్టుబడులు పెట్టింది. మనుమరాళ్లు వివాహం నిమిత్తం పెట్టిన నగదు మరి రాదని తెలుసుకుని మంచం పట్టి ఆస్పత్రి పాలైంది. చివరకు మృతి చెందింది. ఇదేవిధంగా మరి కొంతమంది మంచం పట్టారు. ఇంకా ఎంతోమంది తమ డబ్బులు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. 18 నెలలుగా గుండె దిటవు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. న్యాయం చేయాలని వేడుకోలు... అప్పటివరకూ అధిక వడ్డీలను కొంతమంది బ్రోకర్లుకు ఇచ్చి, బాగా పెట్టుబడులు వచ్చిన తర్వాత ట్రేడ్ బ్రోకర్ తన కార్యాలయాన్ని 2017 నవంబర్ 17న ఎత్తివేశాడు. అంతవరకూ ఆయనతో కలసిమెలసి, చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన పెద్దమనుషులు తమకేమీ తెలియదని చేతులెత్తేశారు. తొలుత ఈ వ్యాపారం రూ. 2 నుంచి 3 కోట్ల వరకూ మాత్రమే ఉంటుందని అందరూ భావించారు. బ్రోకర్ టంకాల శ్రీరామ్ కార్యాలయానికి తాళాలు వేయడంతో ఈ షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. సంతకవిటి పోలీస్ స్టేషన్లో బ్రోకర్ హామీలు రూపంలో ఇచ్చిన చెక్‌లతో కేసులు పెట్టగా మొత్తం రూ. 36 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. అయితే అక్కడితో కథ ముగియలేదు. కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ ఆధారాలతో నష్టపోయినవారి నగదు రూ. 50 కోట్లు వరకూ ఉంటుందనేది అంచనా. ఇవి కాకుండా కొంతమంది ఉద్యోగులు భయపడి కేసులు పెట్టలేదు. మొత్తం రూ. 180 కోట్ల మేర పెట్టుబడులు ఉంటాయని అంచనాలు ఉన్నాయి. వీరంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ, టీడీపీ నేతల చుట్టూ తిరిగారు. ఫలితం కనిపించలేదు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. సీఐడీ డీఎస్పీ ఏమన్నారంటే.. ఈ విషయంపై సీఐడీ విశాఖ డీఎస్పీ ఎస్ భూషణనాయుడు వద్ద ప్రస్తావించగా ట్రేడ్ బ్రోకర్ కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడులు రికవరీ, ప్రధాన పాత్రధారులు వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
ఉలిక్కిపడ్డ బెట్టింగ్ రాయుళ్లు
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : రాజాం పట్టణ కేంద్రంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్థానిక బాబానగర్ కాలనీలో ఓ అద్దె ఇంటి నుంచి కొనసాగిస్తున్న బెట్టింగ్ ముఠాను రాజాం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. వారి నుంచి రూ. 2.65 లక్షలు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరడంతో మరో ఐదుగురు బుకీలు అక్కడ్నుంచి తప్పించుకుని పరారయ్యారు. ఈ నెల 7న వరల్డ్ కప్ సెమీఫైనల్ –2 సందర్భంగా వీరంతా మ్యాచ్ తిలకిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పట్టుకున్నారు. రాజాంలో కొంతకాలంగా సాగుతున్న బెట్టింగ్‌రాయుళ్లుపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో బుకీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి లక్షలాది రూపాయలు బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారినట్లు సమాచారం. ఇటువంటి బెట్టింగ్ రాయుళ్లుపై పోలీసుల మరింత కఠినంగా వ్యవహరించాల్సి అవసరం ఎంతైనా ఉంది. క్రికెట్ బెట్టింగ్‌పై నిఘా : ఎస్పీ ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడినా, జూదం ఆడుతున్నా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం బెట్టింగ్ ముఠా వివరాలను వెల్లడించారు. రాజాం పట్టణ సీఐ సోమశేఖర్‌కు వచ్చిన సమాచారంతో నిఘా పెట్టి అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రూ. 2.65 లక్షలు, 12 సెల్ఫోన్లు, పద్దు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టయిన వారిలో పిన్నింటి శివకుమార్, శేషపు మురళీకృష్ణ, లెంక దామోదరరావు, చింత శ్రీనివాసరావు, కరణం పురుషోత్తం ఉన్నారని వివరించారు. మరికొందరు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో డీఎస్పీ ప్రేమ్‌కాజల్, సీఐ సోమశేఖర్, ఎస్ఐ సూర్యకుమారి, హెచ్‌సీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పైసలుంటేనే పని జరిగేది..!
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): రాజాం నగర పంచాయతీ అక్రమాలకు అడ్డాగా మారింది. 2005లో ఏర్పడిన ఈ నగర పంచాయతీకి ఇప్పటివరకు ఎన్నికలు జరగకపోయినా..పట్టణంలో నివాసం ఉంటున్న ప్రజలకు మాత్రం ఇంటి పన్ను, కొళాయి పన్నుల రూపంలో అదనపు భారం పెరుగుతోంది. ఇవి చాలవు అన్నట్టు అక్రమ వసూళ్లతో నగర పంచాయతీ అధికారులు ప్రజలను పీక్కుతింటున్నారు. పని ఏదైనా పైకం చెల్లించాలి గత ఐదేళ్లుగా రాజాం నగర పంచాయతీలో అధికారుల అక్రమాలు అధికమయ్యాయి. చేయి తడపనిదే ఏ పని జరగని పరిస్థితి దాపురించింది. ఇంటి ప్లానింగ్ అప్రువల్, బీపీఎస్, టాక్స్ చెల్లింపు, బిల్డిండ్ ప్లానింగ్ వంటి పనులకు వసూళ్ల పర్వం అధికమైంది. వాస్తవంగా ప్రభుత్వానికి చెల్లించే పన్ను కంటే ఇక్కడి అధికారులకు అధికంగా చెల్లించాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజాం నగరంలో వ్యాపారాలు నిలిచిపోవడానికి, ఫ్యాక్టరీలు మూతపడడానికి ఇదొక కారణమని అంటున్నారు. బాధితుని ఫిర్యాదుతో ఏసీబీ దాడులు ఇటీవల వారం రోజుల క్రితం రాజాం నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఏసీబీ దాడులు జరిగిన విషయం పాఠకులుకు విధితమే. ఆ రోజు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుని వద్ద అతని వద్దనున్న ఇంటి స్థలం కంటే ఎక్కువ మొత్తాన్ని నగర పంచాయతీ అధికారులు డిమాండ్ చేశారు. దీంతో అతను ఏసీబీని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇలా ఆయన ఒక్కరే కాదు ఇంటి ట్యాక్స్‌లు, కొత్తగా స్థలాలు కొనుగోలు చేసినవారు, ప్లాట్లు నిర్మించుకుందామని అనుకున్నవారు నగర పంచాయతీ అధికారులకు లక్షల్లో ముట్టజెప్పాల్సిందే. ఇక్కడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి దగ్గర నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగి వరకూ అందరూ ఎంత ఇవ్వగలవు అని అనేవాళ్లే. ఒక్కొక్కరిదీ ఒక్కో రేటు రాజాం నగర పంచాయతీలో ప్రతీ అధికారి తమకు ఒక రేటు ఫిక్స్ చేసుకుని ఉంటారు. ట్యాక్స్ చెల్లించాలన్నా, కొత్త భవంతి నిర్మించాలన్నా ముందుగా నగర పంచాయతీ కార్యాలయంలోని మేనేజర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని కలవాల్సి ఉంటుంది. అక్కడ ఆయన తన రేటు చెప్పిన తరువాత బిల్లు కలెక్టర్ స్థాయి వ్యక్తిని కలవమని చెబుతారు. బిల్లు కలెక్టర్ వాస్తవ రేటును చెబుతారు. వాస్తవంగా రూ.600లు చెల్లించాల్సి ఉంటే అధికారులు ఖర్చులు నిమిత్తం రూ.2000లు అదనంగా కలిపి మొత్తం రూ.2600లు డిమాండ్ చేస్తారు. ఇవి చెల్లిస్తేనే బిల్లు కలెక్టర్ మెజర్మెంట్లు వేస్తారు. లేకుంటే ఫైలు అక్కడే ఉండిపోతుంది. అక్కడి నుంచి ఆర్ఐ స్థాయి అధికారి వద్దకు ఫైల్ వెళ్తుంది. అక్కడ ఆయన ఎంత చలానా తీయాలో నిర్ణయించి రికార్డు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే ఆయనకు రూ.500లు విలువ చేసే పనికి రూ.2 వేలు అదనంగా చెల్లించాలి. ఈ మొత్తం మొదట్లో బిల్లు కలెక్టర్‌కు చెల్లించిన మొత్తంతో సంబంధం ఉండదు. ఇక్కడ చెల్లింపు తరువాత ఈ ఫైల్ మేనేజర్ స్థాయి అధికారుల వద్దకు వెళ్తుంది. ఆయన మరోసారి ఇళ్లు, స్థలం చూడాలని కొర్రీలు వేస్తారు. ఈ సమయంలో ఆయన తరుపున అక్కడ ఉన్న దళారులు రంగ ప్రవేశం చేస్తారు. ఎంత చిన్న సంతకానికైనా కనీసం రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వీరి ముగ్గురు సంతకాలు తరువాతే ఫైల్ నగర పంచాయతీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి వద్దకు చేరుకుంటుంది. అక్కడ వేరే వేరే ధరలు ఉంటాయి. ప్రధానంగా వీరి ముగ్గురి అప్రూవల్ లేకుంటే అవతలి వ్యక్తి ఎంతటి వాడైనా ఆ ఫైల్ నిలిచిపోతుంది. ఇదే తరహాలో ఇటీవల అనేక ఫైళ్లు నిలిచిపోయాయి. ఇందులో కొంతమంది బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించి కమిషనర్ ఏసీబీ అధికారులకు చిక్కగా, మిగిలిన వారు తప్పించుకున్నారు. ఈ తంతు జరిగి వారం రోజులు గడవకముందే నగర పంచాయతీలోని అధికారులు మళ్లీ తమ వసూళ్లను ప్రారంభించేశారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమాలు అడ్డుకోవాలని పలువురు పట్టణ వాసులు కోరుతున్నారు. ఇంతవరకూ నగర పంచాయతీగా కార్యరూపం దాల్చని నగర పంచాయతీ కార్యాలయంలో ఈ అక్రమ దందాలు చేయడం తగునా అని వాపోతున్నారు. ఈ వసూళ్లపై నగర పంచాయతీ ఏఈ సురేష్ వద్ద సాక్షి ప్రస్తావించగా కార్యాలయంలో ఒకరిద్దరి అధికారుల వలన ఇబ్బందులు వస్తున్నాయని, ఎవరూ అదనంగా నగదు చెల్లించరాదని, ఏవైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. -
సంగ్రామానికి సమాయత్తం
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. కొత్తగా కొలువుదీరిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారించింది. ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం ముగిసి 11 నెలలు కావస్తుండగా గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఈ నెల 18వ తేదీ వరకూ కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా తయారీ, అభ్యంతరాల స్వీకరణ జరిగింది. ఈ తంతు ముగియకముందే జూలై 4తో మండల పరిషత్ పాలక మండళ్లు రద్దు కానున్నాయి. తాజాగా వీటికి సంబంధించి జిల్లాల వారీగా ఓటర్ల జాబితా సేకరణ, పోలింగ్ కేంద్రాల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, జూలై 3 నాటికి అందజేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జూలై 4తో ముగియనున్న గడువు ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలు 2104 మే నెలలో జరిగాయి. ఫలితాలు మాత్రం జూన్‌లో విడుదల చేయడంతోపాటు కొత్త పాలకమండళ్లు జూలై 3న కొలువుదీరాయి. ఫలితంగా ఈ ఏడాది జూలై 4తో ఈ మండళ్లు రద్దు కానున్నాయి. వీటి స్థానంలో కొత్తగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఇదివరకూ పోలింగ్ కేంద్రాలు గుర్తించడంతోపాటు ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు కూడా చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజాం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీలకు.. రాజాం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాలకు సంబంధించి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు రేగిడి మండలంలో 21 ఉండగా, అత్యల్పంగా వంగర మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లో 2,19,313 ఓట్లు ఉన్నాయి. వీటిలో 1,12,271 మంది పురుష ఓటర్లు, 1,08,011 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పోటీకి టీడీపీ సీనియర్ల అయిష్టత ఈ దఫా స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ సీనియర్ నేతల్లో ఆందోళన అధికంగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలో ఉండటంతో పలు మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు లభించాయి. ఫలితంగా మండల పరిషత్ పాలక మండలి పీఠంపై టీడీపీ నేతలు కూర్చుని ఐదేళ్లపాటు చక్రం తిప్పారు. జన్మభూమి కమిటీల పెత్తనం, ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం, ఇసుక మాఫియా, నీరు చెట్టు నిధుల దోపిడీ టీడీపీకి అపకీర్తి తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా సంతకవిటిలో ఇండిట్రేడ్ పేరుతో ఆ పార్టీ నేతల మోసాలు వెలుగుచూడటం, రేగిడి మండలంలో అక్రమ ఇసుక మైనింగ్ రాజాంలో టీడీపీకి కొరకరాని కొయ్యలుగా మారి వెంటాడుతున్నాయి. ఈ మోసాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. సార్వత్రిక ఎన్నికల్లో వీటి ఫలితం స్పష్టంగా కనిపించింది. స్థానిక ఎన్నికల్లోనూ రేగిడి, సంతకవిటి మండలాల్లో వీటి ప్రభావం కనిపించనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతలు ఈ దఫా ఎన్నికలకు ముందుపడేందుకు నిరాసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ వైపు ఫిరాయింపుదారులు 2014లో టీడీపీకి అధికారం రావడంతో రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. రాజాంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంపీపీ కావల్సి ఉండగా, ఇక్కడ టీడీపీ నేతలు తమ అధికార పెత్తనంతో చక్రం తిప్పారు. మారెడుబాక గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడికి తాయిలాలు ఎరవేసి టీడీపీలోకి చేర్చుకున్నారు. మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకుగానూ అప్పట్లో వైఎస్సార్సీపీ 8 గెలుచుకోగా, ఒక ఎంపీటీసీ స్థానం టీడీపీలోకి చేరింది. మరో ఇండిపెండెంట్ ఎంపీటీసీ టీడీపీకి మద్దతి ఇచ్చారు. రాజాం మండల పరిషత్ అధికారులు కూడా అప్పట్లో అధికార పార్టీకే సహకరించారు. అనంతరం అంతకాపల్లి గ్రామానికి చెందిన మరో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ టీడీపీలో చేరారు. ఇలా పార్టీ ఫిరాయించిన వారంతా ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు. రేగిడి మండలంలో ఇద్దరు ఎంపీటీసీలు, సంతకవిటిలో ఒక ఎంపీటీసీ ఇటు వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్మోహన్రెడ్డి పెడుతున్న సంక్షేమ పథకాలు కూడా మంచిగా ఉండటంతో అందరి దృష్టి ఇటు పడింది. పరిషత్ ఎన్నికలకు సన్నద్ధం జూలై 4తో ప్రస్తుతం ఉన్న మండల పరిషత్ పాలకమండళ్లు రద్దు కానున్నాయి. వీటి స్థానంలో కొత్త పాలకమండలిల ఏర్పాట్లు జరగాల్సి ఉంది. ఈ మేరకు అన్ని ఎంపీటీసీలకు సంబంధించి కొత్త ఓటర్లు జాబితా, పోలింగ్ కేంద్రాలు వివరాలు సేకరిస్తున్నాం. – కే రామకృష్ణరాజు, ఎంపీడీవో, రాజాం -
ఏటీఎం@ మోసం
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : ఏటీఎంలు మోసాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. జేబులో చెయ్యి పెట్టి లాఘవంగా చోరీ చేసే అవస్థ లేకుండా ఏకంగా బ్యాంకులో ఉన్న డబ్బుకే కన్నం వేసేలా కొత్త తరహా మోసాలకు వేదిక అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరు. ఇలాంటి ఏటీఎంలను చూసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు. ఎవరైనా సాయం అడిగితే ఏ మాత్రం సంకోచించకుండా కార్డు మార్చి డబ్బు కొట్టేస్తున్నారు. ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడం తెలీని వారిని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. కేవలం రాజాం సర్కిల్లోనే ఈ ఆరు నెలల వ్యవధిలో ఆరు కేసులు నమోదయ్యాయి. నమోదు కానివి ఇంకెన్నో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ప్రతి గురువారం సంత జరగడం, రైతులు ఎక్కువ మంది రావడంతో వారే ఎక్కువగా మోసపోతున్నారు. సెక్యూరిటీ ఏది? డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్యులతోపాటు రైతులు అధిక మొత్తంలో బ్యాంకు ఖాతాలను తెరిచారు. రైతుల ఖాతాల్లో ప్రభుత్వం వేసిన పంట రుణాలు, రుణ మాఫీ వం టి వాటిని ఏటీఎంల ద్వారానే లావాదేవీలు జరుపుకుంటున్నారు. అయితే కొంతమందికి ఏటీఎం వినియోగించడం రాకపోవడంతో పక్కనున్నవారిని సాయం అడుగుతున్నారు. అదే వారికి శాపమవుతోంది. బ్యాంకుల్లో విత్‌డ్రాలు అందరికీ సరిపడినంత మొత్తం ఇచ్చి ఉంటే రైతులతో పాటు సామాన్యులు కూడా మోసాలకు గురయ్యే పరిస్థితి ఉండదని పలువురు వాపోతున్నారు. సుమారు ఎనిమిది మండలాలకు కేంద్రబిందువుగా ఉన్న రాజాంలోనే ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. దినదినాభివృద్ధి చెందుతున్న రాజాం పట్టణంలో ఏటీఎంలను వినియోగించే సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డు ఉండి ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శివారు మండలమైన ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, నరసన్న పేట ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీ లేని ఏటీఎంలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అలాగే ఏటీఎం మిషన్లు కూడా కొన్ని చోట్ల నగదు తీసే సమయంలో పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సమయంలో ఫిర్యాదు చేసేందుకు సెక్యూరిటీ కూడా ఉండకపోవడంతో బ్యాంకుల చుట్టూ పలుమార్లు తిరగాల్సి వస్తుందని ఖాతాదారులు వాపోతున్నారు. సెక్యూరిటీ తప్పనిసరి దూర ప్రయాణాలు చేసే వారికి ఏటీఎంలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే ఇదే అదనుగా చేసుకొని ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడం రానివారు అక్కడ ఉన్నవారికి ఏటీఎం కార్డు ఇచ్చి మోసపోతున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డును ఏర్పాటుచేయాలి. – బూరాడ అప్పలనాయుడు, అడ్వకేట్, రాజాం దర్యాప్తు చేస్తున్నాం ఏటీఎంలో నగదు పోయిన విషయమై గతంలో కొన్ని కేసులు రాజాం స్టేషన్లో నమోదయ్యాయి. వీటిపై దర్యాప్తు జరుపుతున్నాం. ఇప్పటికే రెండు కేసులకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసి వారిపై కేసులు నమో దు చేశాం. మిగిలిన కేసులపై కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశాం. – జీవీ రమణ, సీఐ, రాజాం టౌన్ -
నగర పంచాయతీకే ఎసరు..!
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): గత టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిచింది. ఎన్నికలకు పోతే తమ ఉనికిని కోల్పోతామని భయంతో అధికారాన్ని దుర్వినియోగం చేసింది. ఏకంగా రాజాం నగర పంచాయతీ వ్యవస్థను రద్దు చేసేందుకు కుయుక్తులు పన్నింది. ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దీనికి సంబంధించి ఫైల్ రావడంతో నగర పంచాయతీ అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇది అధికారికంగా అమలులోకి వస్తే తమ అధికారాలు కోల్పోతామని తలలు పట్టుకుంటున్నారు. కేవలం మూడు పంచాయతీలే కాగా.. 2005లో రాజాం నగర పంచాయతీ ఏర్పడింది. ఇందులో కొత్తవలస, పొనుగుటివలస, కొండంపేట, సారధి, విలీనమయ్యాయి. అప్పట్లో ఐదు పంచాయతీలకు చెందిన కార్యదర్శులు, పాలకుల నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉండగా, అధికారులు అవేమీ పట్టించుకోకుండా ఎన్నికలకు సిద్ధపడ్డారు. దీన్ని సవాల్ చేస్తూ సారధి మినహా మిగిలిన మూడు పంచాయతీలకు చెందిన అప్పటి సర్పంచ్‌లు కోర్టును ఆశ్రయించారు. తమకు పంచాయతీలను పాలించే హక్కు ఐదేళ్లు పూర్తి కాకముందే విలీనం చేయొద్దని కేసు వేశారు. రెండేళ్ల క్రితం ఈ కేసు కొలిక్కి రావడంతోపాటు అబ్జెక్షన్ పెట్టిన పంచాయతీల్లో ప్రస్తుతం ప్రత్యేకాధికారులను నియమించి నో అబ్జెక్షన్ ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలోనే రాజాంకు చెందిన ఒకరిద్దరు టీడీపీ కార్యకర్తలు తమ పరపతిని ఉపయోగించి అప్పటి కలెక్టర్ ద్వారా నగర పంచాయతీగా ఉన్న ఐదు పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాలని ఒత్తిళ్లు చేశారు. రెణ్నెల్ల క్రితం ఈ ఫైల్‌ను టీడీపీ పాలకులు హడావుడిగా ఆమోదించడంతో ప్రస్తుతం రాజాం నగర పంచాయతీకి చేరుకుంది. నగర పంచాయతీలో విలీనమైన ఐదు పంచాయతీలకు ప్రస్తుతం ప్రత్యేక అధికారులు నియమించాల్సి ఉందని ఇందులో సారాంశం. అసలుకే ఎసరు.. ఐదు పంచాయతీలో రాజాం పంచాయతీ ఒకటి ఉంది. ఇప్పుడు ప్రత్యేకాధికారులను నియమిస్తే రాజాం నగర పంచాయతీ కార్యాలయ అధికారులు తమ అధికారాలను కోల్పోతారు. దీంతో కొత్త చిక్కులు రావడమే కాకుండా నగర పంచాయతీ మొత్తం ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది. అప్పట్లో ఎన్నికల నిర్వహణ ఇష్టం లేక టీడీపీ కార్యకర్తలు ఇలా చేసి ఉంటారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల నియామకానికి సంబంధించిన కొత్త చిక్కులను పరిష్కరించలేక నగరపంచాయతీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు సమీపించిన తరుణంలో.. 14 ఏళ్లుగా రాజాం నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహించలేదు. టీడీపీ హయాంలో రాజాంకు ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చినప్పటికీ రాజాంలో టీడీపీపై వ్యతిరేకత ఉండటంతో ఆ ఎన్నికలను వాయిదా వేసేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాజాం నగర పంచాయతీకి సంబంధించి ఓటర్లు, జనాభా, వార్డులు వివరాలు కూడా అధికారులు సిద్ధం చేసి ఎన్నికల అధికారులకు అందించారు. రేపో మాపో నోటిఫికేషన్ రానున్న సమయంలో కొత్తగా ప్రత్యేకాధికారులు నియామకం స్టంటు తెరపై హల్చల్ చేస్తోంది. దీంతో ఏమిచేయాలో తోచని స్థితి ఇక్కడ నెలకుంది. రాజాం గురించి ఇలా.. రాజాం నగర పంచాయతీ ఏర్పడిన సంవత్సరం : 2005 విలీనం చెందిన పంచాయతీలు : 05 అభ్యంతరం చెప్పిన పంచాయతీలు : 03 మొత్తం వార్డులు : 20 మొత్తం జనాభా : 42,127 మంది మొత్తం ఓటర్లు : 24,850 ఇబ్బందే.. రాజాం నగర పంచాయతీ ఏర్పడి 14 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకూ ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు జరుగుతాయని ఎదురు చూస్తున్నాం. ఈ సమయంలో ఇటువంటి అడ్డంకులు రావడం అనుమానాలకు తావిస్తోంది. – కోరాడ రామినాయుడు, బుచ్చింపేట, రాజాం మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం.. రాజాం నగర పంచాయతీ ఎన్నికలు అంటే ఇష్టంలేని వారు ఇలా చేసినట్లు అనిపిస్తుంది. వాస్తవంగా మూడు పంచాయతీలకు మాత్రమే ప్రత్యేకాధికారులను నియమించి తీర్మానాలు తీసుకోవాలి. అలా కాకుండా ఐదు పంచాయతీలకు ప్రత్యేకాధికారులు అంటూ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఈ పొరపాటు జరిగింది. ఈ కొత్త చిక్కులను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం. – వీ సత్యనారాయణ, కమిషనర్, రాజాం నగర పంచాయతీ -
విత్తనంపై పెత్తనం
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నాయకుల స్వలాభాపేక్ష, కొంతమంది వ్యవసాయాధికారుల పక్షపాత వైఖరి కారణంగా జిల్లాలో చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమకు కావాల్సినన్ని విత్తనాల ప్యాకెట్లు ఇళ్లకు తీసుకుపోతున్నారు. టోకెన్లు తీసుకొని మండుటెండలో రోజంతా బారులు తీరిన రైతులు మాత్రం విత్తనాలు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఉదాహరణకు పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్.ఎన్.పేట మండలంలో జరుగుతున్న చోద్యమే ఇందుకు ఒక నిదర్శనం. ఈనెల 12వ తేదీన విత్తనాల విక్రయం ప్రారంభిస్తున్నామని అధికారులు ప్రకటించారు. స్వర్ణ, 1075 రకాల విత్తనాల కోసం అన్ని గ్రామాల నుంచి వేలాదిగా రైతులు ఉదయం 8 గంటలకే ఎల్ఎన్ పేట మండల కేంద్రానికి తరలివచ్చారు. గంట తర్వాత వచ్చిన వ్యవసాయశాఖ సిబ్బంది మండల పరిషత్ కార్యాలయంలో రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. ఒక రైతుకు రెండు స్వర్ణ, రెండు 1075 రకం విత్తనాల ప్యాకెట్ల కోసం టోకెన్లు రాశారు. రెండు కంటే ఎక్కువ ఇవ్వలేమని, రెండో విడతలో విత్తనాలు వస్తే మరోసారి రెండు బస్తాల విత్తనాలు ఇస్తామని చెప్పారు. ఇలా వ్యవసాయ శాఖ సిబ్బంది ఇచ్చిన టోకెన్లు తీసుకున్న రైతులు సమీపంలోని ఒక ప్రైవేటు కళ్యాణ మండపం వద్ద బారులు తీరారు. పీఏసీఎస్ సిబ్బంది ఆయా రైతుల నుంచి వ్యవసాయశాఖ సిబ్బంది ఇచ్చిన టోకెన్‌తోపాటు డబ్బులు తీసుకుని మరో టోకెన్ ఇచ్చారు. పీఏసీఎస్ సిబ్బంది ఇచ్చిన టోకెన్ తీసుకుని విత్తనాలు నిల్వ ఉంచిన గిడ్డంగి వద్దకు వెళితే అక్కడి కళాసీలు విత్తనాల బస్తాలు ఇవ్వాల్సి ఉంది. అయితే స్థానికంగా ఉన్న హిరమండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, టీడీపీ నాయకుడు కాగాన మన్మధరావు ఆ టోకెన్లతో సంబంధం లేకుండానే గిడ్డంగి వద్దనే డబ్బులు తీసుకుని టీడీపీ నాయకులకు కావాల్సినన్ని విత్తనాలు ఇచ్చేశారు. మధ్యాహ్నం 12 గంటలకే స్వర్ణ రకం విత్తనాలు, ఒంటిగంటకే 1075 రకం విత్తనాలు అయిపోయాయి. అప్పటికే విత్తనాల కోసం డబ్బులు చెల్లించిన రైతులంతా టీడీపీ నాయకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. మరెన్నో ఉదంతాలు.. రాజాం నియోజకవర్గంలో పరిస్థితి కూడా దారుణంగా ఉంది. రాజాం, రేగిడి మండలాల్లో విత్తనాలు అడ్డదారిలో టీడీపీ కార్యకర్తల ఇళ్లకు తరలిపోతున్నాయి. వ్యవసాయశాఖ సిబ్బంది కొంతమంది ఈ తంతులో ప్రధాన పాత్ర పోíషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజాం వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద విత్తనాలు పంపిణీ చేస్తున్నా రైతులకు అందడం లేదు. రాత్రిపూట ట్రాక్టర్లలో విత్తనాలు తరలించుకుపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగిడి మండలంలో సగానికి పైగా విత్తనాలు బ్లాక్ మార్కెట్లో తరలించారని వాపోతున్నారు. ఇక టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు అడ్డగోలు గా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ, పీఏ సీఎస్, డీసీఎంఎస్ సిబ్బంది మొదటి నుంచి ఇక్కడ పనిచేస్తుండటంతో టీడీపీ కార్యకర్తలకు విత్తనాలు కట్టబెడుతున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నప్పటికీ అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. దీంతో అర్హులైన రైతులకు రాయితీ విత్తనాలు అందడం లేదు. ఇదేవిధంగా జిల్లాలో చాలాచోట్ల వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది టీడీపీ నాయకుల ప్రలోభాలకు లొంగిపోతున్నారు. సాంకేతిక లోపాల ముసుగులో బయోమెట్రిక్, టోకెన్లతో సంబంధం లేకుండా విత్తనాల పంపిణీ పక్కదారి పట్టిస్తున్నారు. అదునులోగా అందించాల్సిందే... ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 2.55 లక్షల హెక్టార్లలో సుమారు 5.50 లక్షల మంది రైతులు వరిసాగు చేస్తున్నారు. ఇందుకు 1.55 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయి. మూడో వంతు మంది రైతులు సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటున్నారు. మిగతావారికి మాత్రం ప్రైవేటు వ్యాపారులు విక్రయించే విత్తనాలు, రాయితీపై వ్యవసాయ శాఖ సరఫరా చేసే విత్తనాలే ఆధారం. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకూ 75,900 క్వింటాళ్లు జిల్లాకు చేరాయి. వాటిలో కేవలం 43 వేల క్వింటాళ్లు మాత్రమే వ్యవసాయశాఖ అధికారులు రైతులకు విక్రయించారు. అవి కూడా టీడీపీ నాయకులు చెప్పినవారికే ఎక్కువగా దక్కుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం, మంత్రి ఆదేశాలు బేఖాతర్ అర్హులైన రైతులందరికీ రాయితీ వరి విత్తనాలు సకాలంలో అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆచరణలో మాత్రం వ్యవసాయశాఖలో అధికారులు, సిబ్బంది బేఖాతరు చేస్తున్నారు. దీంతో విత్తనాలు అవసరమైన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదునులోగా చేతికందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. టీడీపీ వాళ్లకు నేరుగా ఇచ్చేశారు... రైతులకు బయోమెట్రిక్ ఆధారంగా విక్రయించాల్సిన వరి విత్తనాలు టీడీపీ నాయకుడు, హిరమండలం ఏఎంసీ చైర్మన్ విత్తన గిడ్డంగి నుంచి తమ పార్టీకి చెందినవారికి నేరుగా ఇచ్చేస్తున్నారు. నాలాంటి రైతులంతా వ్యవసాయశాఖ సిబ్బంది నుంచి టోకెన్లు తీసుకొని మండుటెండలో వరుసలో ఉంటున్నాం. టీడీపీ నాయకుల నుంచి నేరుగా డబ్బులు తీసుకొని వారికి కావాల్సినన్ని విత్తనాలు ఇచ్చేస్తున్నారు. మేమంతా రోజంతా వేచిచూసి ఒట్టి చేతులతో వెనుదిరగాల్సి వస్తోంది. – కిలారి త్రినాథరావు, యంబరాం, ఎల్ఎన్ పేట మండలం -
అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): అప్పుడే ఎన్నికల అభ్యర్థుల గుండెల్లో లబ్‌డబ్ వేగం పెరుగుతోంది. గడియారంలో సెకెన్ల ముళ్లు కంటే వేగంగా కొట్టుకుంటోంది. 24 గంటలూ ఫలితాలపైనే రకరకాల ఆలోచనలు బుర్రను తొలుస్తున్నాయి. అసలు గెలుస్తామా.. లేదా? అని ఒకటే సందిగ్ధత. భోజనం చేద్దామంటే సహించడం లేదు. కూర్చొన్నచోట నుంచి లేవాలనిపించడంలేదు. ఎవరెవరో వచ్చి చెబుతున్న మాటలు సైతం చెవికెక్కడంలేదు. మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇలా అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి 39 రోజులు గడిచింది. ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పటి నుంచి అలుపెరుగకుండా పలు పార్టీల నాయకులు కష్టపడ్డారు. ఎక్కని గడపా....తిరగని ఊరు లేదు. అన్ని పార్టీల నేతలు తమ బలాలను, బలగాలను, కుయొక్తులను ఈ ఎన్నికల్లో బాగా వినియోగించుకున్నారు. చుట్టాలు, బంధువులు, తెలిసినవాళ్లు, మన అనుకున్నవాళ్లు ఇలా ఎవరినీ వదలలేదు. ప్రధానంగా అలక పాన్పుపై ఉన్నవారిని సైతం కాళ్లూవేళ్లూ పట్టుకుని రంగంలోకి దించారు. కొంతమందిని మాటతో లొంగదీసుకుంటే మరికొంత మందిని డబ్బు, మద్యం వంటి వాటిని ఎరగా చూపి ముగ్గులోకి దించారు. ఇంత జరిగినా ఎక్కడో అనుమానపు భూతం. ఒకరిది గెలుపు తాపత్రయం కాగా, మరొకరిది మెజార్టీ తాపత్రయం. ఈ రెండింటి మధ్యనే ప్రస్తుతం రాజాం పోరు కొనసాగుతుంది. చివరకు రాజపీఠం ఎవరిని వరిస్తుందో మూడు రోజులు వరకూ ఓపిక పట్టి ఎదురుచూడాల్సి ఉంది. ఆ నమ్మకమే.. మెజార్టీ... ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కంబాల జోగులు ఇప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరపున పోటీ చేసిన ఓటమి చెందిన తర్వాత అనూహ్యంగా వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో పార్టీ గుర్తుపై గెలిచిన ఈయనకు టీడీపీ నేతలు కోట్లాది రూపాయలు ఎరగా చూపినా ఫిరాయించలేదు. ఈ విలువలే జోగులుకు శ్రీరామరక్షగా నిలిచాయి. జగన్మోహన్రెడ్డి దృష్టిలో సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టాయి. అంతేకాకుండా ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రాజాం బహిరంగ సభలో జోగులును కలుపువనంలో తులసిమొక్కగా అభివర్ణించడంతోపాటు ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపుతోపాటు జోగులు మంచితనం ఈ దఫా ఎన్నికల్లో బాగా పనిచేసినట్టు తెలుస్తోంది. గతంలో వంగర, సంతకవిటి మండలాల్లో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఈ రెండు మండలాల్లో ఈ దఫా టీడీపీ నుంచి భారీగా చేరికలు వచ్చాయి. వీటితోపాటు రాజాం పట్టణంలో ఉద్యోగులు, వ్యాపారులు వైఎస్సార్సీపీకే ఓట్లు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవే కాకుండా రేగిడి మండలంలోనూ టీడీపీకి ఎదురీత తప్పలేదు. ఇవన్నీ కంబాల జోగులు గెలుపుకు దోహదపడనున్నాయని, భారీ మెజార్టీ ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ధీమాలో ఉన్నారు. గెలిస్తే చాలన్నట్టుగా.. ఈ దఫా ఎన్నికల్లో తాము కూడా గెలుస్తామనే ధీమాలో టీడీపీ నేతలు ఉన్నారు. ప్రధానంగా పార్టీ మహిళా సీనియర్ నేత కావలి ప్రతిభాభారతిని తప్పించి ఇక్కడ కోండ్రు మురళీమోహన్‌కు పార్టీ టిక్కెట్టు కేటాయించింది. ప్రతిభాభారతి సీనియర్ నాయకురాలు కావడంతోపాటు పార్టీ కష్టకాల సమయంలో సేవలందించారు. అయితే గ్రూపు వివాదాలు రావడంతో కోండ్రు బాగా చక్కదిద్దగలరని, ఎన్నికల్లో అధికంగా డబ్బులు ఖర్చు చేస్తారని ఆశతో స్థానిక నాయకులు పార్టీ టిక్కెట్ కోసం ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఈ మేరకు కార్యకర్తల ఆలోచనను ప్రణాళికగా రూపొందించుకుని ఎన్నికల బరిలోకి కోండ్రు దిగారు. అయితే ఈయనకు పార్టీ కార్యకర్తల నుంచి కావల్సినంత సాయం అందలేదనే చెప్పాలి. ప్రధానంగా వంగర, రేగిడి మండలాల్లో భారీగా టీడీపీ ఓట్లు చీలి వైఎస్సార్సీపీకి పడ్డాయన్నది పలువురి వాదన. ఇవే కాకుండా రాజాం రూరల్, సంతకవిటి మండలంలో సీనియర్ టీడీపీ క్యాడర్ వైఎస్సార్సీపీ బాట పట్టింది. ఈ లోపాలతోపాటు రాజాం పట్టణంలో ఉద్యోగ, కార్మిక వర్గం టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయడంతో కోండ్రుకు ఆశించినంత ఓటు బ్యాంకు రాలేదు. అయినా గెలుపు తమదేనంటూ కోండ్రు ప్రెస్మీట్లో ప్రకటించడం ఉత్కంఠను రేపుతోంది. రాజాం పట్టణంలో భారీ మెజార్టీ వచ్చి మిగిలిన మండలాల్లో వైఎస్సార్సీపీ మెజార్టీ తగ్గుతుందన్న టీడీపీ కార్యకర్తలు గెలుపుపై స్పష్టమైన అంచనా వేయలేకపోతున్నారు. గురువారం ఫలితాలు ఓటరు తీర్పును బయట పెట్టనున్నాయి. దడ దడ... గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రభంజనం ప్రస్తుతం కనిపిస్తుందని వైఎస్సార్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాజాం నియోజకవర్గం ఏర్పడి రెండు పర్యాయాలు ఎన్నికలు నిర్వహించగా, ఇప్పుడు మూడో పర్యాయం జరిగింది. రెండు పర్యాయాలు వైఎస్సార్ కుటుంబానికి పట్టం గట్టారు. ఈ దఫా వైఎస్సార్సీపీకే శతశాతం మొగ్గు చూపారని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. వీటికితోడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర, వైఎస్ విజయమ్మ ఎన్నికల బహిరంగ సభలు ఇదే నియోజకవర్గంలో జరిగాయి. ఈ ప్రభావం గెలుపులో కీలకం కావచ్చని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. -
ఇక ‘పుర’ పోరే...!
సాక్షి, అరసవల్లి: మరో ఆరు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక మిగిలింది మున్సిపల్ ఎన్నికల పోరే. ఇందుకోసం ఓటర్ల జాబితాల ప్రచురణ ఇప్పటికే పూర్తికావడంతో తదుపరి చర్యల్లో పురపాలక అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కులాల వారీగా ఓటర్ల గుర్తింపు, జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల ఓటర్ల శాతాల ప్రకారం వార్డుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు తదితర చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ మళ్లీ యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. జిల్లాలో పరిస్థితి ఇది జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం మున్సిపాలిటీని 2015లో కార్పొరేషన్ హోదాను, అలాగే రాజాం మేజర్ పంచాయతీని 2005లో నగర పంచాయతీగా హోదాను కల్పించినప్పటికీ, ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. గత పుర ఎన్నికల్లో ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పాలకొండ, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీల్లో పాలక సభ్యుల పాలన కొనసాగుతోంది. వచ్చే జూలై వరకు ఈ పాలనకు గడువుంది. అయితే శ్రీకాకుళం కార్పొరేషన్లో విలీన వివాదాలకు ఫుల్స్టాప్ పడటంతో ఈసారి తొలిసారిగా ఎన్నికలకు ముస్తాబవుతోంది. వాస్తవానికి శ్రీకాకుళం పట్టణానికి 3 లక్షల మంది జనాభా ఉంటేనే కార్పొరేషన్ హోదా ఇవ్వాల్సి ఉంది. అయితే పట్టణానికి సమీపంలో కాజీపేట, కిల్లిపాలెం, చాపురం, పాత్రునివలస, పెద్దపాడు, తోటపాలం, కుశాలపురం పంచాయతీలను విలీనం చేస్తారని అంతా భావించారు. ఇవి విలీనం చేసినా.. ఇప్పుడున్న 1.25లక్షల మంది జనాభాకు మరో 80 వేల నుంచి లక్ష మంది వరకు జనాభా పెరిగే అవకాశముంది. అయితే తాజాగా పరిస్థితులు చూస్తుంటే విలీన ప్రతిపాదనలకు ఫుల్స్టాప్ పెట్టినట్లుగా కన్పిస్తోంది. పైగా ఎన్నికల సంఘం అధికారులు కూడా కేవలం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో ఓటర్ల జాబితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ప్రచురణ చేయాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే మరోవైపు ఈ నెల 20న జిల్లాలో 1143 పంచాయతీల్లోనూ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురణ చేయనున్నారు. ఇందులో విలీన ప్రతిపాదనలో ఉన్న ఈ ఏడు పంచాయతీల్లో కూడా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురణ చేయనున్నారు. దీంతో ఈసారికి విలీన ప్రతిపాదనలు లేనట్లే అన్న భావన వ్యక్తమవుతోంది. రాజాంలో నాల్గో ‘సారీ’.....! జిల్లాలో ప్రముఖ వ్యాపార, వాణిజ్య పట్టణమైన రాజాం నగర పంచాయతీకి ఈ దఫా కూడా ఎన్నికలు లేనట్లే అని తేలిపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ఆయా విభాగాల అధికారులు చర్యలకు దిగారు. ఈ మేరకు జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస–కాశీబుగ్గ, పాలకొండ మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణ పనులు పూర్తి చేసి వార్డుల రిజర్వేషన్లపై దృష్టిసారించారు. అయితే ఒక్క రాజాం నగర పంచాయతీలో మాత్రం మళ్లీ ఎన్నికల కల నెరవేరలేదు. 2005లో నగర పంచాయతీగా ఆవిర్భవించిన రాజాంలో సమీప పంచాయతీల విలీన ప్రక్రియే ఇందుకు ప్రధాన కారణమయ్యింది. రాజాం మండలంలోని రాజాం, సారధి మేజర్ పంచాయతీలు, కొత్తవలస పంచాయతీతోపాటు సంతకవిటి మండల పరిధిలోని పొనుగుటివలస, కొండంపేట పంచాయతీల విలీన ప్రక్రియపై కోర్టులో వివాదం నడుస్తోంది. దీంతో ఆవిర్భావం నుంచి అంటే 2005, 2010, 2015లలో మున్సిపల్ ఎన్నికలు ఇక్కడ నిర్వహించలేదు. తాజా పరిస్థితులు అలాగే ఉండడంతో 2019లో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. ధీటైన అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు రానున్న పురపోరులో బలాబలాలు తేల్చుకునేందుకు జిల్లాలో ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ సన్నద్ధమవుతున్నాయి. అయితే ఈసారి సాధారణ ఎన్నికల్లో సత్తా చూపనున్న వైఎస్సార్సీపీ, స్థానిక ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించాలన్న ఊపులో ఉంది. ఇందుకోసం ధీటైన అభ్యర్థులను సన్నద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలకమైన కార్యకర్తల సేవను గుర్తించాలని అధిష్టానం నిర్ణయించడంతో వారిలో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రూరల్ ప్రాంతాలతోపాటు అర్బన్ ప్రాంతాల్లోనూ హవా చూపిందన్న అంచనాలున్న నేపథ్యంలో ‘పుర’ ఎన్నికల్లోనూ ‘ఫ్యాన్’ ప్రభంజనం సృష్టించడం ఖాయమనేలా రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే గత స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపిన టీడీపీ ఈసారి మాత్రం కంగుతిననుంది. తాజాగా సాధారణ ఎన్నికల్లోనూ ఆపార్టీకి గెలిచే అవకాశాలు లేకపోవడంతో డీలా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలితోపాటు స్థానికంగా ఐదేళ్లపాటు పట్టించుకోని అధికార పార్టీ అగ్రనేతల శైలి కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తికి రగిలిస్తోంది. అయితే ఎన్నికలు రానున్న నేపథ్యంలో బరిలో నిలవాలన్న కారణంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఢీ కొట్టేందుకు బలమైన అభ్యర్థులను ఇంకా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీకి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకరనే ప్రచారం జోరందుకుంది. దీంతో రానున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ ప్రభావం నామమాత్రమే అని ఆదిలోనే స్పష్టమవుతోంది. ఓటర్ల జాబితాలిలా.... పుర కేంద్రం పుర కేంద్రం మొత్తం ఓటర్లు శ్రీకాకుళం కార్పొరేషన్ 50 డివిజన్లు 1,13,356 పాలకొండ నగర పంచాయతీ 20 వార్డులు 20,701 ఆమదాలవలస మున్సిపాలిటీ 23 వార్డులు 32,646 పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 25 వార్డులు 43,821 ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 23 వార్డులు 27,831 ఎన్నికల్లో ఘన విజయం కోసం.. స్థానిక కార్పొరేషన్ తొలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయానికి అందరం కృషి చేస్తున్నాం. ఇప్పటికే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు 50 డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారించి సమీక్షించారు. 2015లో కార్పొరేషన్ హోదా ఇచ్చి ఎన్నికలు నిర్వహించలేని దుస్థితిలో టీడీపీ ఉంది. ఆ పార్టీ స్థానిక నేతల అక్రమాలు, దందాలపై నగర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఈసారి గట్టిగా బుద్ధి చెప్పనున్నారు. జగనన్నకు మా ఈ ‘స్థానిక’ ఘన విజయాలను కానుకగా అందిస్తాం. – అంధవరపు సూరిబాబు, నగర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, శ్రీకాకుళం మరింతగా ప్రజాపాలన అందిస్తాం.. గత ఎన్నికల్లో ఘనంగా గెలిచినప్పటికీ, రాష్ట్రంలో అధికారంలో పార్టీ లేకపోవడంతో కొంత మేరకు ఇబ్బందులు తప్పలేదు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ తరపున గెలిచిన కౌన్సిలర్ల సహకారంలో నిత్యం ప్రజల్లో ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే అశోక్ వల్ల పురజనులకు ఇబ్బందులు పెట్టినప్పటికీ వారి కోసం గట్టిగా పోరాడాం. మళ్లీ పురపాలక ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాం. ఈసారి జగనన్న సీఎం కాబోతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో గెలిచి మళ్లీ ప్రజలకు మరింత దగ్గరగా ప్రజాపాలన అందించేందుకు కృషి చేస్తాం. – పిలక రాజ్యలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్, ఇచ్ఛాపురం గెలుపు గ్యారంటీ... రానున్న స్థానిక ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించాం. ఎమ్మెల్యే అ«భ్యర్థి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పార్టీ అగ్రనేతల సూచనల మేరకు అభ్యర్థుల ఎంపికను చేపడతాం. ప్రజల్లో నిత్యం ఉండే నాయకులను పార్టీ గుర్తిస్తుందని విశ్వాసం ఉంది. 25 వార్డుల్లో పరిస్థితులపై ఇప్పటికే దృష్టిపెట్టారు. స్థానికంగా టీడీపీ నేతల దందాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీంతో పట్టణ ప్రజలు వైఎస్సార్సీపీకి మద్దతు పలుకుతున్నారు. ‘పుర’ ఎన్నికలు ఎప్పుడొచ్చినా... గెలుపు గ్యారంటీగా పనిచేస్తాం. – దువ్వాడ శ్రీకాంత్, ఫ్లోర్ లీడర్, పలాస మున్సిపాలిటీ -
ఆ కన్నీటికి బదులేది..?
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): సరిగ్గా 15 నెలలు క్రితం జిల్లాను కుదిపేసిన ట్రేడ్ బ్రోకర్ ఆన్లైన్ మోసం దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్పట్లో అధిక వడ్డీలు వస్తాయని చెప్పడంతో అనేక మంది సుమారు రూ.180 కోట్లు దీనిలో పెట్టుబడులు పెట్టారు. అనంతరం ఈ సంస్థ బోర్డు తిప్పేయడంతో పెట్టుబడులు పెట్టినవారు రోడ్డున పడ్డారు. దీనిపై నెల రోజుల వ్యవధిలో సివిల్ పోలీసులు కేసులోని పలు కీలక అంశాలను పట్టుకొని పలువురుని అదుపులోకి తీసుకున్నారు. అయితే అనంతరం ఈ కేసు సీఐడీకి తరలించారు. దాంతో అప్పటినుంచి ఇప్పటివరకూ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ మోసానికి సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులు అధికార పార్టీలోనే కొనసాగుతూ..చట్టానికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వారే ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల తరుపున ప్రచారంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ అండదండలతోనే.. సంతకవిటి మండలం తాలాడ గ్రామం వద్ద ఇండీట్రేడ్ పేరుతో మందరాడకు చెందిన టంకాల శ్రీరామ్ అనే యువకుడు ట్రేడ్ కార్యాలయాన్ని నిర్వహించాడు. అతను నాలుగేళ్లు వ్యాపారం చేసి పెట్టుబడులు సాధించిన అనంతరం పెట్టుబడులకు సంబంధించిన వడ్డీలు, వసులు ఇవ్వలేనని బోర్డు తిప్పేశాడు. 2017 నవంబర్ 10వ తేదీన తాలాడ గ్రామంలో ట్రేడ్ బ్రోకర్ సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేయడంతో సంచలనం ఏర్పడింది. అప్పటివరకూ ఆ సంస్థలో తక్కువ పెట్టుబడులే ఉంటాయని అనుకుంటుండగా బాధితులంతా రోడ్డుపైకి వచ్చి కేసులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఈ సంస్థలో సుమారు రూ.180 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసి జిల్లా మొత్తం నివ్వెరపోయింది. రోడ్డున పడిన బాధిత కుటుంబాలు ఈ కంపెనీ బోర్డు తిప్పేయడంతో పెట్టుబడులు తిరిగిరావని తెలిసి బాధితుల్లో ఇద్దరు అకాల మరణం చెందారు. వీరిలో సంతకవిటి మండలం శంకరపేట గ్రామానికి చెందిన దాసరి కన్నంనాయుడు ఒకరు. ఆయనే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఎంతో కష్టపడి గ్రామంలో ఉన్నతంగా ఎదిగారు. ఎంతో మందికి న్యాయం చేయడంతో పాటు మోసగాళ్లకు బుద్ధి చెప్పేవాడు. అలాంటి అతనే చివరికి ట్రేడ్ బ్రోకర్ చేతిలో మోసపోయానని తెలుసుకుని గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా మారింది. ఇదే మండలం మందరాడ గ్రామానికి చెందిన యడ్ల సూరీడమ్మ కూడా ఇదే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టింది. మనుమరాళ్ల వివాహం నిమిత్తం పెట్టుబడి పెట్టిన నగదు తిరిగిరాదని తెలుసుకుని ఆస్పత్రిపాలై చివరకు మృతి చెందింది. అప్పటి నుంచి ఆ కుంటుంబాలలో నుంచి విషాదచాయలు తొలిగిపోలేదు. ఎంతోమంది ఎప్పటికైనా డబ్బు తిరిగి వస్తుందని గుండెల నిండా ఆశతో జీవిస్తూ ఉన్నారు. అసలు ప్లాన్ ఎవరిది..? ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు అప్పటి పాలకొండ డీఎస్పీ జి.స్వరూపరాణి శరవేగంగా కేసును దర్యాప్తు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని, ఫిర్యాదుల ఆధారంగా బ్రోకర్ శ్రీరామ్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సమయంలో నిందితులు ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనలు చేయగా కేసును ముందుకు నడిపించేందుకు సీఐడీకి అప్పగించారు. అయితే కేసు నేటికీ నడుస్తూనే ఉంది. మోసం వెనుక అసలు ఎవరు ఉన్నది తెలియడం లేదు. అయితే దీని వెనుక సంతకవిటి మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చా యి. కానీ ఇప్పటికీ వీటి వెనుక కొత్త విషయాలు వెలుగులోకి రావడం లేదు. ఈ ఉదంతం జరిగి 15 నెలలు గడుస్తున్నా కేసులో పురోగతి లేకపోవడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన కుటుంబాలు రోడ్డున పడి విలపిస్తుండగా, నిందుతులు మాత్రం బయట దర్జాగా తిరుగుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా కేసులో వేగం పెంచి నిందితుల నుంచి డబ్బును రికవరీ చేయాలని కోరుతున్నారు. -
నవ పాలనకు నాంది
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యే కంబాల జోగులును గంజాయివనంలో తులసిమొక్కగా ఊరకనే అభివర్ణించలేదు. టీడీపీ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా అమ్ముడుపోలేదు. బెదిరింపులకు దౌర్జన్యాలకు సైతం దిగినా వెన్నుచూపలేదు. అందుకే ఆయన నిష్కళంకుడిగా, నిస్వార్థపరుడిగా, అవినీతి రహితుడిగా గుర్తింపు పొందారు. ప్రజలకు సైతం నిత్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉంటూ అధికార పార్టీ అవినీతి అక్రమాలను ఎండగట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నందున ఈ దఫా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న ఈయన్ను మరోమారు గెలిపిస్తే రాజాం నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కంబాల జోగులు సాక్షితో కాసేపు ముచ్చటించారు. నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు.? జవాబు: వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచే పార్టీలో ఉన్నాను. మాటమీద నిలబడే నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. 2014 ఎన్నికల్లో త్రుటిలో అధికారాన్ని పార్టీ కోల్పోయింది. రాజాం నియోజకవర్గ ప్రజలు మాత్రం నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అనంతరం ఈ ఐదేళ్లు ప్రజల్లో ఉండేలా జగన్మోహన్రెడ్డి పలు కార్యక్రమాలను రూపొందించారు. ప్రజల తరపున పోరాడుతూ రచ్చబండ, పల్లెనిద్ర, గడపగడపకు వైఎస్సార్, నిన్ను నమ్మం బాబు వంటి కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోయాం. గ్రామాల్లో ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆప్యాయతగా పలకరిస్తున్నారు. కలివిడిగా వెన్నంటి నడుస్తున్నారు. నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రత్యేక సమస్యలేమిటి ? జవాబు: రాజాం నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన రాజాం రోడ్డు విస్తరణను, హైటెక్ సిటీ నిర్మాణాన్ని, పార్కుల ఏర్పాటును పక్కన పెట్టేశారు. 777 రోజులుగా సంతకవిటి మండలం వాల్తేరు వద్ద వంతెన కోసం దీక్ష చేస్తున్నా పట్టించుకోలేదు. వంగర మండలం కిమ్మి, రుషింగి వంతెనను అర్ధాంతరంగా వదిలేశారు. వంగర, సంతకవిటి, రేగిడి మండలాల్లోని మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సుల్లేవు. మడ్డువలస, తోటపల్లి సాగునీరు పొలాలకు అందడం లేదు. రూ. 49 కోట్లతో నిర్మించిన పథకం నీరుగారి ప్రజలకు తాగునీటి కష్టాలు తెచ్చి పెడుతోంది. రేగిడిలో జూనియర్ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రాజాంలో మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాల లేక చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. పత్తి, మొక్క జొన్న పంటలకు కొనుగోలు కేంద్రాలు లేవు. ఈ సమస్యలన్నింటినీ తెలుసుకున్నాం. సమస్యలు పరిష్కారానికి ఎలా కృషిచేస్తారు? జవాబు: ఒకప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాజాంలో జ్యూట్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మా పార్టీ అధికారంలోకి రాగానే జగన్మోహన్రెడ్డి సహకారంతో పరిశ్రమల యాజమాన్యానికి ఆర్థికసాయం అందించే ఆలోచనలో ఉన్నాం. తద్వారా ఫ్యాక్టరీలను తెరిపించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం. రాజాం రోడ్డు విస్తరణతోపాటు హైటెక్ సిటీ నిర్మాణం, పార్కుల ఏర్పాటు వేగవంతం చేస్తాం. అన్ని మండల కేంద్రాలకు డబుల్ రోడ్డు నిర్మాణంతోపాటు ఆర్టీసీ షటిల్ సర్వీసులను పునరుద్ధరిస్తాం. రేగిడిలో జూనియర్ కళాశాల ఏర్పాటుతోపాటు రాజాంలో రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభిస్తాం. మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడంతోపాటు కార్పొరేట్ ఫీజులకు కళ్లెం వేస్తాం. కిమ్మి, రుషింగి వంతెన నిర్మాణంతోపాటు బలసలరేవు వంతెన నిర్మాణం పూర్తి చేస్తాం. టీడీపీ పాలనలో నష్టపోయిన బాధితులకు మీరెలా న్యాయం చేస్తారు? జవాబు: టీడీపీ పాలనలో అరాచకాలు అధికమయ్యాయి. ప్రధానంగా రాజాం నియోజకవర్గంలో సంతకవిటి మండలంలో ఇండీట్రేడ్ పేరుతో టీడీపీ నేతలు రూ. 200 కోట్లు దోచేశారు. బాధితుల తరపున పోరాడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం. కేసును వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటాం. జన్మభూమి కమిటీలతోపాటు టీడీపీ కార్యకర్తల కారణంగా సంక్షేమ పథకాలకు నోచుకోని బాధితులందరికీ పార్టీలకతీతంగా అందిస్తాం. అడిగిన వారికి ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, కొత్త గ్యాస్ కనెక్షన్లు, ప్రతీ ఇంటికి తాగునీటి సదుపాయం, ప్రతీ రైతుకు ఉచిత విద్యుత్, ప్రతీ నిరుద్యోగికి ఉపాధి అవకాశం, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం, ఉపాధి వేతనదారులకు 150 పని దినాలను కల్పిస్తాం. ఇందులో ఎటువంటి కమిటీలు రాజకీయ ప్రలోభాలు లేకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతీ పంచాయతీలో పది మంది యువకులకు ఉద్యోగ కల్పన ద్వారా నిరుద్యోగ సమస్యను అధిగమిస్తాం. -
కోండ్రు.. అవినీతి బ్రాండ్
సాక్షి, శ్రీకాకుళం: అవినీతి చక్రవర్తి కోండ్రు మురళీమోహన్ మరోమారు రాజాం నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి ముసుగులో కోట్లాది రూపాయలు దండుకున్న ఈయనకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెప్పడంతో పత్తాలేకుండా పోయారు. అప్పట్నుంచి నియోజకవర్గ ప్రజలపై కన్నెత్తి చూడలేదు. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల క్రితం టీడీపీలో చేరగా, మంత్రిగా తన హయాంలో చేపట్టి అసంపూర్తిగా నిలిచిన అభివృద్ధి పనులు కొనసాగించడంలో చొరవ చూపలేదు. అయితే అప్పట్లో కాంట్రాక్టురు అవతారమెత్తిన తన సోదరుడు జగదీష్‌తో కలసి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసం ఒత్తిళ్లు, నిధుల నిలుపుదల, ఇసుక అవినీతి బాగోతం కార్యకర్తలపై నెట్టేయడం వంటి అరాచకాలు సృష్టించారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న ఈయన్ను ఓడించేందుకు ఆ పార్టీలో అసమ్మతి వర్గం చాపకింద నీరులా తమ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఫొటోలోని రహదారి సంతకవిటి మండలం మల్లయ్యపేట–హొంజరాం గ్రామాల మధ్య నిర్మించారు. కోండ్రు మురళీమోహన్ మంత్రిగా ఉన్న సమయంలో రూ.86 లక్షలు మంజూరు చేశారు. అప్పట్లో రాజాం వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంట్రాక్టరు వద్ద భారీగా ముడుపులు అందుకోవడంతో రోడ్డు నిర్మాణం నాసిరకంగా మారింది. మరోవైపు ఇదే రహదారి మీదుగా మేడమిర్తి, తమరాం, కేఆర్‌పురం గ్రామాల నుంచి కోండ్రు మురళీ రాత్రిళ్లు ఇసుకను తరలించేవారు. ఈ క్రమంలో మందరాడ వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో పోతురాజుపేట గ్రామానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. అప్పట్లో ఈ ఉదంతం రాష్ట్రస్థాయిలో సంచలనం రేపగా, ఇసుక అక్రమ రవాణాను కోండ్రు పార్టీ కార్యకర్తలపై నెట్టేసి తప్పుకున్నారు. అవినీతి, అరాచకాలే... ఐదేళ్ల కిందట కొండ్రు మురళీమోహన్ మంత్రి హోదాలో రాజాం నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికీ చాలా పనులు ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. కోట్ల ఖర్చుతో అరకొరగా పనులు చేయగా, మరికొన్ని అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈయనకు టిక్కెటిచ్చి జీవితాన్ని ప్రసాదించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపైనే మంత్రి పదవి కోసం బురద జల్లే ప్రయత్నం చేశారు. వర్గవిభేదాలను ప్రోత్సహించేందుకు అంతర్గత ముఠా రాజకీయాలు చేశారు. రోడ్లు, భవనాల నిర్మాణాల పనులు కట్టబెట్టేందుకు తన సోదరుడు కోండ్రు జగదీష్‌ను కాంట్రాక్టురుగా అవతారమెత్తించారు. మరోవైపు కాంట్రాక్టులు దక్కించుకున్న వారి నుంచి కమీషన్ల కోసం ఒత్తిళ్లు చేయడం, ఇవ్వకుంటే నిధుల నిలుపుదల చేయడం, అర్ధంతరంగా పనులు ఆపివేయడం చేసేవారు. అంతేకాదు విశాఖపట్నంలో ఇసుక వ్యాపారం నిమిత్తం తన అనుచురలతో సంతకవిటి, రేగిడి మండలాల నుంచి అక్రమంగా ఇసుక తరలించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో చేపట్టిన ఈ బాగోతాలతో అప్పటి మంత్రి కోండ్రు మురళీమోహన్‌పై తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాజాం నియోజకవర్గ ఓటర్లు ఈయనకు డిపాజిట్ దక్కకుండా చిత్తుచిత్తుగా ఓడించారు. అప్పట్నుంచి రాజాం నియోజకవర్గానికి ముఖం చాటేసిన ఈయన ఆర్నెల్ల క్రితం టీడీపీలో చేరారు. అయినప్పటికీ ఈ పనులు పూర్తి చేయకపోవడం సంగతి అటుంచితే కనీసం వాటి గురించి పట్టించుకున్న పాపానపోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకత రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కెట్ వస్తుందని మొదటి నుంచి ఆశపెట్టుకుని భంగపడిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి రగలిపోతున్నారు. ఈమెను కాదని స్థానికేతరుడైన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారు. దీంతోపాటు మంత్రి కళా వెంకటరావు సొంత మండలం రేగిడి నుంచి ఆ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అప్పట్లో ఈయన అరాచకాలు, దౌర్జన్యాలతో ఆర్థికంగా మానసికంగా దెబ్బతిని కుదేలై ఇప్పటికీ కోలుకోలేకపోతున్నామని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరలా అవినీతి అక్రమాలకు తెగబడతారని బెంబేలెత్తుతున్నారు. రాజాం నుంచి రణస్థలానికి బీటీరోడ్డు నిర్మించారు. ఈ రహదారిలో శ్యాంపురం వద్ద కోండ్రు గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. అంతేకాకుండా రాజాం నుంచి తన స్వగ్రామమైన లావేరు మండలం చేరుకునేందుకు ఈ రహదారి నిర్మాణానికి రూ.40 కోట్లు కేటాయించారు. కాంట్రాక్టరుతో కుమ్మక్కై నాసిరకంగా రహదారి నిర్మించినా పలు చోట్ల అర్ధంతరంగా పనులు నిలిచిపోయాయి. అంతే కాకుండా రాజాంలో ఎస్సీ బాలుర వసతి గృహాల భవనాల్లోనూ, ఎస్టీ బాలికల కళాశాల వసతి గృహాల నిర్మాణంలోనూ దండిగా కమీషన్లు లాగారు. అవినీతికి కాంట్రాక్టర్లు సహకరించకపోవడంతో ఈ రెండింటికి బిల్లులు నిలుపుదల చేయడంతో ఇప్పటికీ ఇవి ప్రారంభానికి నోచుకోలేదు. ఈ ఫొటోలో వాటర్ ట్యాంకు సంతకవిటి మండలం జావాం వద్ద రూ.49 కోట్లతో నిర్మించారు. దీనిద్వారా సంతకవిటి, రేగిడి, రాజాం మండలాల్లోని 136 గ్రామాలకు తాగునీటిని అందించాల్సి ఉంది. కాంట్రాక్టరు వద్ద కమీషన్ కోసం కోండ్రు డిమాండ్ చేయడంతో పనుల్లో నాణ్యత లోపిం చింది. ఫలితంగా గత కలెక్టర్ లక్ష్మీనరసింహం ఈ రక్షిత పథకం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ధ్రువీకరించి పథకం ప్రారంభాన్ని నిలుపుదల చేశారు. ఈయన బదిలీపై వెళ్లిన వెంటనే తూతూమంత్రంగా పనులు చేసి మమ అనిపించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికి పది గ్రామాలకు కూడా పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కాలేదు. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న వంతెన నిర్మాణం వంగర మండలం రుషింగి – వీరఘట్టం మండలం కిమ్మి గ్రామాల మధ్య నాగావళిపై చేపట్టారు. రూ.27 కోట్లతో 2012లో అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. ప్రజలకు సేవచేసే నాయకుడినంటూ చెప్పుకొంటున్న కోండ్రు ఏ ఒక్క రోజైనా ఈ వంతెన నిర్మాణంపై సమీక్షించిన పాపాన పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. -
‘ఆధార్’లో వయస్సు మార్చి.. అడ్డంగా దోచేస్తున్నారు!
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నేతల అక్రమాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. తమ పార్టీ అధికారంలో ఉండటంతో ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని పచ్చనేతలు దోచేస్తున్నారు. ఆఖరికీ వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను కూడా వదిలిపెట్టడం లేదు. ఏకంగా ఆధార్ కార్డుల్లో వయస్సు పెంచేసి వారి పేరిట వచ్చే పెన్షన్‌ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ వ్యవహారం తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం ‘మీ సేవ’లో వెలుగుచూసింది. ఇక్కడి మీ సేవను అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు ఆధార్ కార్డుల్లో వయస్సును మారుస్తున్నారు. తక్కువ వయస్సు ఉన్నా కూడా ఆధార్ కార్డుల్లో వయస్సు పెంచి.. వృద్ధుల పేరిట వచ్చే పెన్షన్‌తో తమ జేబులు నింపుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. -
సీఎం చంద్రబాబు సభలో మహిళల నిరసన
-
సీఎం చంద్రబాబు ఎదుటే మహిళల నిరసన
సాక్షి, శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేపడుతున్న జన్మభూమి కార్యక్రమాలకు అడుగడుగునా నిరసన సెగలుస తగులుతున్నాయి. తాజాగా జిల్లాలోని రాజాం మండలం పొగిరిలో సీఎం చంద్రబాబు శనివారంజన్మభూమి సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతుండగానే.. మహిళలు ఆందోళనకు దిగారు. సభలో లేచినిలబడిన మహిళలు తమకు ఇళ్లు ఇవ్వలేదని, చంద్రబాబు ప్రభుత్వం వల్ల తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసనను తెలియజేస్తూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంతకవిటి మండలం తాలాడకు చెందిన గిరిజన మహిళలు ఈ మేరకు సీఎం సభలో నిరసన గళం ఎత్తారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని ఎల్ఎన్ పేట మండలం దనుకువాడలో జరిగిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎళ్ల తరడబి అర్జీలు ఇస్తున్నా.. సమస్యలు పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గ్రామసభను అడ్డుకొని.. అధికారులను గ్రామస్తులు వెనక్కిపంపారు. నాతో పెట్టుకుంటే ఫినిష్.. కాగా ‘‘నాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు జాగ్రత్త’’ అని తనను అడ్డుకున్న మహిళలను సీఎం చంద్రబాబు కాకినాడలో హెచ్చరించడంపై దుమారం రేగుతోంది. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం కాన్వాయ్‌ను కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో పలువురు అడ్డుకున్నారు. ‘సీఎం గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బస్సులో ఉన్న చంద్రబాబు బయటకు వచ్చి మండిపడ్డారు. మీకు ఏం కావాలంటూ రుసరుసలాడారు. తనను అడ్డుకున్న వారికి రాష్ట్రంలో ఉండే అర్హతలేదంటూ ఆగ్రహంవ్యక్తం చేశారు. ‘లేనిపోని ప్రాబ్లమ్స్ పెట్టుకోవద్దు ఇక్కడ..పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు మర్యాదగా ఉండు..చాలా సమస్యలు వస్తాయి..ఢిల్లీలో నిన్న కూడా లాఠీ చార్జీ చేశారు.ఈ నీళ్లు తాగుతున్నారు.. ఈ గడ్డ మీద ఉన్నారు... ఏయ్ ఉండండీ.. నేను అడిగింది చెప్పు.. ఏం చేశారు మీ మోదీ.. ముంచాడు అందరినీ.. రాష్ట్రాన్నీ, దేశాన్ని...బయటకు వస్తే వదలరు.. మిమ్మల్ని పబ్లిక్...ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా..?’ అంటూ తనను అడ్డుకున్న మహిళలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రాజాం బహిరంగ సభలో వైఎస్ జగన్
-
బాలచందర్ సతీమణి కన్నుమూత
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లెజెండరీ దర్శకులు కె.బాలచందర్. 2014 డిసెంబరు 23న ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలచందర్ సతీమణి రాజమ్ (84) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం 4.30 గంటలకు తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. కవితాలయ ప్రొడక్షన్స్ పతాకంపై రాజమ్ బాలచందర్ సినిమాలను నిర్మించేవారు. ‘సింధు భైరవి, నాన్ మహాన్ అల్ల, ఎనక్కుళ్ ఒరువన్’ లాంటి సినిమాలు నిర్మించారు. రాజమ్ బాలచందర్ దంపతులకు కొడుకు ప్రసన్న, కూతురు పుష్ప ఉన్నారు. రాజమ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న సినిమా ప్రముఖులు ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజమ్ అంత్యక్రియలు నిర్వహించారు. -
అసమ్మతి సెగలు
రాజాం శ్రీకాకుళం : రాజాం టీడీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరుతోంది. ఒక వర్గం అక్రమాల చిట్టాను మరొక వర్గం బయటపెడుతోంది. మొన్న టీడీపీ ఇన్చార్జి ప్రతిభాభారతి అక్రమాలను కళా వర్గీయులు, పార్టీ సీనియర్ నేతలు బట్టబయలు చేయగా.. నిన్న కళా వర్గీయులు, టీడీపీ సీనియర్ నేతల బండారాన్ని ప్రతిభాభారతి అనుచరులు బయటపెట్టారు. ఇటు గ్రామస్థాయి నుంచి అటు రాష్ట్ర స్థాయి వరకూ, ఇటు పింఛన్ల నుంచి అటు స్వీపర్ పోస్టుల వరకూ ఎంతెంత వసూలు చేస్తున్నారో బట్టబయలు చేస్తున్నారు. గంటసేపు మంతనాలు ఈ నెల 28న టీడీపీ ఇన్చార్జ్ ప్రతిభాభారతికి వ్యతిరేకంగా రాజాం, రేగిడి, వంగర మండలాలకు చెందిన పలువురు టీడీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు అసమ్మతి సమావేశం పెట్టి మీడియా ముందుకు వచ్చి ఆమె అవినీతిని బయటపెట్టారు. ఈ అనూహ్య పరిణామంతో టీడీపీలోని మరో వర్గం తీవ్రంగా ప్రతిఘటించింది. ప్రతిభాభారతి క్యాంపు కార్యాలయం వద్ద రాజాం నగర పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గంట సేపు మంతనాలు జరిపి.. కార్యాలయం నుంచి బయటకు వచ్చి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిభా భారతిపై గిట్టని నేతలు బురద జల్లుతున్నారని ఆరోపిస్తూ నిప్పుల వర్షం కురిపించారు. ఆరోపణలు రుజువుచేస్తే రాజకీయ సన్యాసం రాజాం ఏఎంసీ వైస్ చైర్మన్ టంకాల కన్నంనాయుడు, జన్మభూమి కమిటీ మెంబర్లు అంపోలు శ్రీను, వాకముల్ల ప్రసాద్, ఉంగటి సత్యం తదితరులు మాట్లాడుతూ టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ప్రతిభాభారతి ఎంతో కృషిచేశారని తెలిపారు. ఒక్క పైసా కూడా స్వలాభం చూసుకోలేదని అన్నారు. నాలుగేళ్లుగా రాజాంలో ఉంటూ టీడీపీకి సేవచేస్తున్నారని వివరించారు. ఆమె పేరు చెప్పి ఎంతో మంది టీడీపీ నేతలు డబ్బులు సంపాదించుకుని జేబులు నింపుకొన్నారని పేర్కొన్నారు. ఆమెకు తెలియకుండా డబ్బులు దండుకుని ఇప్పుడు నిందలు మోపడం సమంజసం కాదని అన్నారు. ప్రతిభాభారతి అక్రమ వసూళ్లుకు పాల్పడ్డారని నిరూపిస్తే తామంతా రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాలు విసిరారు. ప్రతిభాభారతి పేరుతో డబ్బులు వసూలు చేసిన వారి పేర్లు నిర్బయంగా తెలపాలని, వాటిని అక్రమార్కులు నుంచి రికవరీ చేయిస్తామని అన్నారు. ఆ నేతలు ఎటువైపు ఈ నెల 28న జరిగిన సమావేశానికి గైర్హాజరైన టీడీపీ సీనియర్ నేతలు ప్రతిభాభారతి అనుచరుల సమావేశానికి కూడా రాలేదు. రాజాం ఏఎంసీ చైర్మన్ పైల వెంకటరమణతో పాటు పార్టీ నేతలు గురవాన నారాయణరావు, సంతకవిటి మండల మాజీ ఎంపీపీ కొల్ల అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ గండ్రేటి కేసరి తదితర నేతలు ఈ సమావేశంలో కనిపించలేదు. -
14 అడుగుల రక్తపింజరి హతం
రాజాం/సంతకవిటి: సంతకవిటి మండలం గరికిపాడు పంచాయతీలోని బూరాడవాని చెరువులో మంగళవారం రక్తపింజరి పాము అలజడి సృష్టించింది. ఉపాధి పనుల్లో భాగంగా వేతనదారులు రెల్లపొదలను తొలగిస్తుండగా సుమారు 14 అడుగుల భారీ సర్పం బుసలు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా వారంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. కొంతమంది ధైర్యంతో ముందుకెళ్లి పామును గునపాలు, కర్రలతో హతమార్చారు. అదే ప్రాంతంలో ఏడు గుడ్లు, రెండు పాము పిల్లలు లభ్యమయ్యాయి. వీటిని కూడా వేతనదారులు ధ్వంసం చేశారు. ఈ భారీ సర్పాన్ని చూసేందుకు చాలా మంది తరలివచ్చారు. -
‘వంచన వ్యతిరేక దీక్ష’కు తరలిరండి
రాజాం : వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సోమవారం చేపడుతున్న వంచన వ్యతిరేఖ దీక్షను విజయవంతం చేయాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. ఈ దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, పార్టీ అభిమానులు, నాయకులు తరలిరావాలని కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ టీడీపీ నాలుగళ్లుగా ప్రత్యేకహోదాకు వ్యతిరేకంగా పని చేసిందని అన్నారు. కేంద్రానికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన సీఎం చంద్రబాబుపై ప్రజలంతా వ్యతిరేక జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ విధివిధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని మోసగించిన ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంచన వ్యతిరేఖ దీక్ష జరుగుతుందని, ప్రజలంతా తరలిరావాలని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నారని స్పష్టంచేశారు. తొలి నుంచి ప్రత్యేకహోదా కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. వీటన్నింటినీ ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నించిందన్నారు. -
వైభవంగా పైడితల్లి జాతర ప్రారంభం
రాజాం సిటీ/రూరల్: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ మేనేజర్ కే సర్వేశ్వరరావు తెల్లవారుజామున మొదటి పూజ చేసి యాత్రను ప్రారంభించారు. ఏటా మాదిరిగానే హుండీని ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్టా విశాలగుప్తా కుమారుడు కల్యాణ్‌చక్రవర్తి, టిక్కెట్ కౌంటర్‌ను రాజాం మాజీ సర్పంచ్ చెలికాని రామారావు భార్య వేదలక్ష్మి ప్రారంభించారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన జాతర సాయంత్రానికి ఊపందుకుంది. ఆలయం నుంచి ప్రధాన రహదారిపై కిలోమీటరు పొడువునా భక్తుల రద్దీ నెలకొంది. వీరు అధికంగా ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జెయింట్‌వీల్, సర్కస్‌లు, రంగులరాట్నాలు ఆకట్టుకున్నాయి. వీటితోపాటు వివిధ ఆటవస్తువుల షాపులు, గృహోపకరణ అలంకరణ సామగ్రి, తదితర షాపులు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా రాజాం సీఐ ఎన్ వేణుగోపాలరావు, పోలీసులు, కమ్యూనిటీ పోలీసులు, భారత్ స్క్వౌట్స్ అండ్ గైడ్స్ భద్రత ఏర్పాట్లు నడుమ తొలిరోజు జాతర ప్రశాంతంగా సాగింది. ఆలయ ఆవరణలో వినోద కార్యక్రమాలు ఎల్లమ్మ జాతర పోటెత్తిన భక్తులు పలాస/మందస: పలాస జామియాత్రకు భక్తులు పోటెత్తారు. కాశీబుగ్గ శ్రీనివాస కూడలి నుంచి పలాస ఇందిరమ్మ విగ్రహం వరకు రద్దీగా మారింది. మందస మండలంలో గోపాలపురం–శ్రీనివాసపురంలో ఎల్లమ్మతల్లి జాతరకు సోంపేట–మందస మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కేటీ రోడ్డులో భక్తుల రద్దీ ఆకట్టుకున్న సైకత శిల్పం కవిటి: స్థానిక ఎల్లమ్మ ఆలయంలో కవిటికి చెందిన యువకుడు గిరీష్ బెహరా జామి ఎల్లమ్మ అమ్మవారి సైకత శిల్పాన్ని వేశాడు. దీన్ని చూసిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగారు. గిరీష్ కుమార్ బెహరా వేసిన ఎల్లమ్మ అమ్మవారి సైకత శిల్పం -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ...
శ్రీకాకుళం: రాజాంలోని శ్రీకాకుళం రోడ్డులో కరూర్‌వైశ్యాబ్యాంకులో అప్రజైర్ (బంగారు ఆభరణాల పరిశీలకుడు) గా విధులు నిర్వహిస్తున్న ఘరానామోసగాడు బ్యాంకుకే కన్నం పెట్టాడు. నకిలీ బంగారు ఆభరణాలను ఒరిజినల్ బంగారు ఆభరణాలుగా ధ్రువీకరించి రూ. 1,33,55,000 లను కొల్లగొట్టాడు. 40మంది ఖాతాదారులతో ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. చివరికి అనూహ్యంగా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.... రాజాంలోని కరూర్ వైశ్యాబ్యాంకులో గత ఏడాదిన్నర నుంచి బంగారు ఆభరణాలపై రుణాలు ముమ్మరంగా అందించారు. ఇటీవల బ్రాంచి మేనేజర్ చంద్రమౌళిరెడ్డి బంగారు ఆభరణాలపై రుణాలు పొంది గడువు ముగిసిన లబ్దిదారులకు నోటీసులు పంపించాడు. ఎటువంటి స్పందన రాకపోవడంతో బ్రాంచి మేనేజర్ ఆరా తీయడం ప్రారంభించారు. మరోవైపు ఈ ఆభరణాలు వేలం వేసేందుకు గడువు రావడంతో బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారులు రెండు రోజులు క్రితం బ్యాంకుకు చేరుకొని వేలంవేసే ఆభరణాలపై ఆరా తీశారు. వాటిని పరిశీలించగా నకిలీ ఆభరణాలుగా గుర్తించడంతో మొత్తం ఆభరణాలపై ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయపడింది. సమాచారం తెలుసుకున్న సీఐ శంకరరావు బ్యాంకుకు చేరుకొని ఆరా తీశారు. మేనేజర్ వద్ద ఫిర్యాదులు సేకరించిన అనంతరం అప్రైజర్‌ను విచారించారు. అప్రైజర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రుణాలకు సంబంధించి అప్రైజర్ పాత్రతోపాటు బ్యాంకు మేనేజర్ ఇచ్చిన వివరాలు ప్రకారం ఖాతాదారులను వివరించనున్నట్లు తెలిపారు. -
ప్రపంచంలోనే అత్యంత పొడగరి తెలుగోడే!
-
ప్రపంచంలోనే అత్యంత పొడగరి తెలుగోడే!
⇒ శ్రీకాకుళం జిల్లావాసి షణ్ముఖరావు ⇒ కామెర్లకు మందు వాడటంతో ఎత్తు పెరిగిపోయిన వైనం రాజాం: ఎవరైనా పొడవుగా కనిపిస్తే ఆసక్తిగా చూస్తాం. ఏడడుగులు ఉంటే ఔరా అని ఆశ్చర్య పోతాం. ఇక్కడ ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాలు ఉన్నాడు. పేరు ఇజ్జాడ షణ్ముఖరావు. వయసు 24 ఏళ్లు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిళ్లాని అతని స్వగ్రామం. సాధారణంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చే జీన్స్ ప్రభావంతో కొంత మంది పొడవుగా పెరుగుతారు. షణ్ముఖరావు తల్లిదండ్రులు రామలక్ష్మి, సూర్యనారాయణ.. ఇద్దరు సోదరులు ఐదున్నర అడుగుల పొడవు ఉన్నారు. షన్ముఖరావు ఆరేళ్ల క్రితం వరకు ఐదున్నర అడుగులే ఉండేవాడు. ఆ తర్వాత పచ్చ కామెర్ల వ్యాధి రావడంతో మందులు వాడాడు. అప్పటి నుంచి పెరగడం ప్రారంభమైంది. ఆరు.. ఏడు.. ఎనిమిది.. ఇపుడు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉన్నాడు. అమాంతంగా పొడవు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నానని షణ్ముఖరావు ఆవేదన చెందుతున్నాడు. పదో తరగతి వరకు చదివిన తాను ఉపాధి పనులకెళ్తున్నానని చెప్పాడు. పొడవుగా ఉన్నందున ఇతర పనులకు పిలవడం లేదని, ఆటో.. కారులో ప్రయాణించాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయాడు. పాదాలకు సరిపడా చెప్పులు కూడా లభ్యం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. రోడ్లో వెళ్తుంటే వింతగా చూస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యానని ‘సాక్షి’తో తన గోడు వెల్లబోసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉన్నా.. పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్లలో అత్యంత పొడగరిగా టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్(34) 8 అడుగుల 2.8 అంగుళాలతో ఉన్నాడు. షణ్ముఖరావు ఇటీవలే సుల్తాన్‌ను అధిగమించి 8 అడుగుల 3 అంగుళాలకు చేరుకున్నాడు. అయితే ఈ విషయం ఇంకా రికార్డుల్లోకి ఎక్కలేదు. మృతి చెందిన వారిలో యూఎస్ఏకు చెందిన రాబర్ట్ పర్షింగ్ వాడ్లో 8 అడుగుల 11.1 అంగుళాలు ఉండేవాడు. -
కదం తొక్కిన విద్యార్థులు
రాజాం : రాజాం పట్టణంలో రోడ్ల విస్తరణను చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీలను తొలగించేసి టీడీపీ నేతలు వదిలేశారు. దీంతో ప్రజలకు విసుగొచ్చింది. విద్యార్థులు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉత్తిత్తి హామీలు ఇస్తే తాటతీస్తామంటూ హెచ్చరించాయి. వివరాల్లోకి వెళితే.. రాజాం ప్రధాన రహదారి విస్తరణకు అధికార టీడీపీ నేతలు హడావుడి చేశారు. అంతటితో ఆగని ఎమ్మెల్సీ ప్రతిభాభారతి నిధులు వచ్చేశాయంటూ ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీలను డిసెంబర్ నెలలో తొలగించేసి వదిలేశారు. దీంతో ఉన్న రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే జనవరి ఆరో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజాం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించేశారు. ఇది జరిగి నెలరోజులు గడుస్తున్నా ఇంత వరకు రోడ్డు విస్తరణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీనికితోడు అస్తవ్యస్తంగా తయారైన రోడ్డు కారణంగా ట్రాఫిక్ అధికమై ప్రమాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో డోలపేటకు చెందిన డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని వి.దేవి రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన అందరినీ కలచి వేసింది. దీంతో సోమవారం వందలాది మంది విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు రాజాం చేరుకొని ధర్నాకు దిగారు. 4 గంటల పాటు బైఠాయింపు రాజాం ప్రధాన రహదారి విస్తరణ జాప్యాన్ని నిరసిస్తూ ఫోరం ఫర్బెటర్ రాజాం సభ్యులు, వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ విభాగం నేతలు, పలువురు సామాజిక కార్యకర్తలు ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరాగా మరోవైపు రాజాంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు వీరికి మద్దతు పలికారు. తొలుత అంబేడ్కర్ కూడలి వద్దకు పది గంటలకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రోడ్డు విస్తరణ చేస్తారా? చేయరా అంటూ నినదించారు. జనమంతా రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న రాజాం సీఐలు శంకరరావు, శేఖర్‌బాబులు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. మరోవైపు రాజాం తహసీల్దార్ వై.శ్రీనివాసరావు, నగరపంచాయతీ ఏఈ సురేష్‌కుమార్‌లు రాగా.. వీరిపై విద్యార్థులు విరుచుకుపడడంతో వెనుదిరిగారు. అనంతరం పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ సంఘటన స్థలానికి చేరుకొని ఆరా తీశారు. అంతకుముందు రాజాం సీఐ శంకరరావుతోపాటు సిబ్బంది ధర్నా చేస్తున్న విద్యార్థులను రెక్క పట్టుకొని బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి గురైన విద్యార్థులు అక్కడే ఉన్న టీడీపీ నాయకుల బ్యానర్లను దహనం చేశారు. ముఖ్యమంత్రి చంద్ర బ్యానర్ సైతం చించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్, పోలీసులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మృతిచెందిన విద్యార్థి ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలరా అంటూ పోలీసులను నిలదీశారు. రాజకీయం చేయకుండా సమస్యలు పరిష్కరించాలని, ఉత్తిత్తి హామీలు ఇస్తే తమ సత్తా చూపుతామని హెచ్చరించారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఇదిలా ఉండగా ప్రధాన కూడలి వద్ద విద్యార్థులు, ప్రజాసంఘాలు బైఠాయించడంతో రాజాం మీదుగా బొబ్బిలి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాలకొండ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. ఓ వైపు జీఎంఆర్ ఐటీ వరకు, మరోవైపు అంతకాపల్లి వరకు, ఇంకోవైపు ఫైర్‌స్టేషన్, గాయత్రి కాలనీల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనదారులు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పనులు ప్రారంభిస్తాం..శాంతించండి:కలెక్టర్ విద్యార్థుల ఆందోళన ఉధృతం అవుతున్నట్టు గమనించిన పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహంతో విద్యార్థులను ఫోన్లో మాట్లాడించారు. ఈ సందర్భంగా వాగ్దేవి అనే విద్యార్థిని కలెక్టర్‌తో మాట్లాడి సమస్యలను వివరించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఒక్క రోజు వ్యవధిలో రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఏడో తేదీ నుంచి పనులను ప్రారంభిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా విద్యార్థిని వాగ్దేవి ‘సాక్షి’తో మాట్లాడుతూ మంగళవారం నుంచి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించకపోతే అదే రోజు మధ్యాహ్నం నుంచి విద్యార్థులంతా ధర్నాకు దిగుతామని హెచ్చించారు. -
దళిత వాడల అభివృద్ధికి నిధులు
రాజాం/రూరల్: జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని దళితవాడల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఎస్సీ, ఎస్పీసీ నిధులు మంజూరయ్యాయని విశాఖ రీజియన్ మున్సిపల్ శాఖ ఆర్డీ ఆశాజ్యోతి తెలిపారు. శుక్రవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు రూ. 617 లక్షలు, ఆమదాలవలసకు రూ. 194.61 లక్షలు, ఇచ్ఛాపురానికి రూ.15.67 లక్షలు, రాజాంనకు రూ.49.15 లక్షలు, పాలకొండకు రూ. 16.87 లక్షలు, పలాసకు రూ. 25.09 లక్షలు వంతున నిధులు మంజూరయ్యాయ ఆమె వివరించారు. ఈ నిధులతో దళితవాడల్లోని మురుగు కాలువలు, రహదారులు, సామాజిక భవనాలు నిర్మించుకోవచ్చునన్నారు. ఇందుకు సంబంధించి త్వరలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించామన్నారు. అలాగే, 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి శ్రీకాకుళంకు రూ. 310.93 లక్షలు, ఆమదావలసకు రూ.105.05 లక్షలు, ఇచ్ఛాపురానికి రూ.102.26 లక్షలు, పలాసకు రూ. 155.35 లక్షలు, రాజాంనకు రూ.121.42 లక్షలు, పాలకొండకు రూ.85.29 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో పనులు చేపట్టేందుకు ఏడీపీలో ఆమోదం లభించగా ఆమదావలస, రాజాం, పాలకొండ, పలాసలలో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభించారని తెలిపారు. శ్రీకాకుళంలో అమృత పథకంతో ఈ నిధులను జోడించి అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళిక తయారు చేయగా, ఇచ్ఛాపురంలో కౌన్సిల్లో ఏర్పడ్డ గొడవలవల్ల ప్రతిపాదనలు కూడా తయారు చేయలేదన్నారు. శతశాతం కుళాయి పాయింట్లు వేయించేందుకు ప్రణాళిక సిద్ధమరుు్యందన్నారు. అలాగే, పెద్ద భవనాలు నిర్మించుకున్నవారు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు ఆమె పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు డంపింగ్ యార్డు, వాటర్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పనులు పరిశీలించారు. ఆమె వెంట కమిషనర్ పి.సింహాచలం తదితరులు ఉన్నారు. -
మంత్రాల నెపంతో దారుణ హత్య
మేడిపల్లి: ఓ వైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమాజం అభివృద్ధిపథాన దూసుకెళ్తుంటే.. మరో వైపు మంత్రాలు, చేతబడులు, బాణమతులను కొందరు ఇంకా నమ్ముతున్నారు. మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన సంఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం విలాయతాబాద్‌లో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పూదరి రాజం(50) రాళ్లు కొట్టుకుం ఉంటాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో నిద్రిస్తున్న రాజంపై అదే గ్రామానికి చెందిన బత్తుల రాజు, గంగాధర్ అనే అన్నదమ్ములు గొడ్డలితో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన రాజంను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాజు, గంగాధర్‌ల బావ అనారోగ్యంతో మృతి చెందాడు. రాజం మంత్రాలు చేయడం ద్వారానే తమ బావ మృతి చెందాడని ఆగ్రహించిన అన్నదమ్ములు అతడిపై గొడ్డలితో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
సమస్యలు తీర్చకుంటే ఉద్యమం
రాజాం రూరల్:సమాజంలో అణగారిపోతున్న రజకుల సమస్యలను తక్షణమే ప్రభుత్వం తీర్చకుంటే ఉద్యమం తప్పదని రజక హక్కుల ఐక్యసాధన సమితి అధ్యక్షులు పాతపాటి అంజిబాబు హెచ్చరించారు. రజక హక్కుల ఐక్యసాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షులు యండమూరి కష్ణారావు ఆధ్వర్యంలో రాజాంలో రజకుల అత్మగౌరవ యాత్ర గురువారం నిర్వహించారు. మెయిన్‌రోడ్డులో భారీ ర్యాలీ జరిపారు. అనంతరం పాలకొండ జంక్షన్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంజిబాబు రజకులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న రజకులకు రాజకీయాల్లో ప్రాధాన్యం లేదని ఆవేదన చెందారు. దీనికోసం గత 60 సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నా, రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు కల్లబొల్లి కబుర్లుతో వాగ్దానాలు ఇచ్చి రజకుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. బడ్జెట్లో రజక ఫెడరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయించాలని, సొసైటీలకు బ్యాంక్ గ్యారంటీ లేకుండా రుణాలు మంజూరు చేయాలని, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఇస్తున్న విధంగా 50 సంవత్సరాలు దాటిన రజకులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొమరిపురి గణపతిరావు, చల్లపల్లి శివ, వై.గణేష్, వై.అప్పలస్వామి, ఎస్.వెంకయ్య, సింహాచలం, రాజాం టౌన్ కొమరిపురి రాములు, వై.రాములు, కె.ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘మునిగిపోయే నావలోకి ఎక్కేదెవరు’
రాజాం: అస్తవ్యస్త పాలన సాగిస్తూ ప్రజావ్యతిరేకతను మూటగట్టుకొని మునిగిపోయే దిశలో ఉన్న టీడీపీ నావలోకి ఎవరెక్కుతారని వైఎస్సా ర్ సీపీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఎద్దే వా చేశారు. రాజాంలోని ఆయన నివాస గృ హంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు, గద్దెనెక్కిన తర్వాత ఒక్క హామీని నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవంటూనే పుష్కరాలు, చంద్రన్నకానుకులు తదితర వాటికి దుబారా ఖర్చులు చేసి కోట్లాది రూపాయలు వెనుకేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయిన చంద్రబా బు వారి దృష్టిని మరల్చడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ వారి పార్టీలో చేర్చుకునే దిగజారుడు రాజకీయాలకు తెరలేపారన్నారు. దమ్ముంటే ఇప్పటివరకూ చేర్చుకు న్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి, ఎన్నికల్లో గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజ లు కోరుకుంటున్నారని, భవిష్యత్తు వైఎస్సార్ సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశం లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, కరణం సుదర్శనరావు, లావేటి రాజగోపాలనాయుడు, పారంకోటి సుధ, వంజరాపు విజయకుమార్, బండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎంబీయే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
రాజాం : శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొత్తవలస గ్రామం సమీపంలో ఎంబీయే విద్యార్థిని సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. బాడంగి మండలానికి చెందిన ఓ యువతి విశాఖపట్నంలో ఎంబీయే చదువుతోంది. ఆమెకు కొత్తవలసకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రియుడిని కలిసేందుకు సోమవారం కొత్తవలసకు చేరుకున్న ఆమె... పురుగుల ముందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ విఫలమే కారణంగా తెలుస్తోంది. -
బకాయిల షాక్
సామాన్యుడు బిల్లు కట్టలేదంటే గడువు ముగిసిన వెంటనే కనెక్షన్ కట్‌చేసి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న అధికారులు పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర చోట్ల మాత్రం మిన్నకుండిపోతున్నారు. ఫలితం బకాయిలు కోట్ల రూపాయలకు చేరిపోతున్నాయి. ఎప్పటికప్పుడు విద్యుత్ బిల్లులను వసూలు చేయాల్సి ఉన్నా ఆ నిబంధనను కొందరు అధికారులు తుంగలోకి తొక్కుతున్నారు. కర్మాగార యాజమాన్యాల వద్ద మొహమాటానికి పోవడం, రాజకీయ ఒత్తిళ్లు వెరసి బకాయిలను కొండలా పెంచేస్తున్నారు. రాజాం : విద్యుత్ బిల్లుల వసూలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా బకాయిలు కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ ప్రభా వం ఉచిత విద్యుత్‌పై తీవ్రంగా పడే అవకాశముంది. జిల్లాలో సుమారు 7 లక్షల సింగిల్ ఫేజ్, 17 వేల త్రీ ఫేజ్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు గృహ, వాణిజ్య, వ్యాపార రంగాలకు చెందిన లోకల్‌బాడీస్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీస్ తదితర విభాగాలకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇందులో విద్యుత్ బిల్లుల బకాయిలు సుమారు రూ.100 కోట్లకు చేరుకున్నాయి. వసూళ్లలో అధికారుల అలసత్వమే ఇందుకు కారణమని సమాచారం. జిల్లాలో 10 సబ్ డివిజన్ కేంద్రాలున్నాయి. వీటిలో లోకల్ బాడీలకు సంబంధించి రూ.50 కోట్లు బకాయిలు ఉండగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి 5.5 కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంది. మొండి బకాయిలు సుమారు రూ. 4 కోట్లు కాగా, కోర్టు కేసుల్లో సుమారు రూ. 80 లక్షలు వరకూ ఉన్నాయి. వీటితో పాటు కర్మాగారాల నుంచి సుమారు రూ. 2 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. రాజాం సబ్‌డివిజన్ పరిధిలో... రాజాం సబ్ డివిజన్ పరిధిలో రాజాం నగర పంచాయతీ, రాజాం రూరల్, సంతకవిటి, రేగిడి, జిసిగడాం, పొందూరు మండలాలకు చెందిన వినియోగదారులు ఉన్నారు. ఈ ప్రాంతాల నుంచి లోకల్‌బాడీస్‌కు సంబంధించి సుమారు రూ. 36.14 కోట్ల బకాయిలు ఉండగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి సుమారు రూ.14.5 లక్షలు ఉన్నాయి. కర్మాగారాలకు సంబంధించి సుమారు. రూ.1.13 కోట్ల బకాయి ఉంది. వైద్య ఆరోగ్యశాఖ సుమారు రూ.7.86 లక్షలు, రెవెన్యూ శాఖ రూ. 2.20 లక్షలు, పంచాయతీరాజ్ శాఖ సుమారు రూ.2.13 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉంది.ఈ లెక్కన మిగిలిన సబ్ డివిజన్ల పరిధిలో బకాయిల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చర్యలేవీ..? విద్యుత్ బకాయిలపై తక్షణమే కొరడా ఝుళిపించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. కేటగిరీ-1కు సంబంధించి రెండు నెలలకు ఒకసారి, కేటగిరీ 2-7 వరకూ ప్రతి నెలా బిల్లు అందిస్తున్నా వాటిని పూర్తిస్థాయిలో వసూలు చేయడంలో స్థానిక అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు కానరావడం లేదు. మరోవైపు ఈ నెల నుంచి కేటగిరీ-1 నుంచి 7 వరకూ విద్యుత్ బిల్లులు ప్రతి నెలా వినియోగదారులకు అందించాలని, తద్వారా టారిఫ్ విలువ తగ్గి బిల్లు మొత్తం తగ్గుతుందని, దీంతో వినియోగదారునికి బిల్లు చెల్లించడం సులభతరమవుతుందని ప్రభుత్వం కొత్తగా జీఓ జారీ చేసింది. -
చెరువులో పడి వ్యక్తి మృతి
రాజాం: ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా రాజాంలో శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. సాలూరుకు చెందిన బోనెల రామస్వామి(55) రాజాం మారుతీనగర్‌లో ఉంటున్న తన కొడుకు వద్దకు వచ్చాడు. ఈ రోజు తెల్లవారుజామున మారుతీ నగర్ కాలనీకి సమీపంలో ఉన్న కొత్త చెరువు వద్దకు వెళ్లిన రామస్వామి ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతి చెందాడు. ఇది గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. -
జూట్ మిల్లు లాకౌట్ : కార్మికుల ఆందోళన
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌లో మరో జూట్ మిల్లు లాకౌట్ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని శ్రీలక్ష్మీశ్రీనివాస జూట్మిల్లుని మూసివేస్తున్నట్లు ఆ మిల్లు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. దీంతో మిల్లులో పని చేస్తున్నకార్మికులంతా ఉదయమే జూట్‌మిల్లు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. లాకౌట్‌పై ముందస్తు సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం మిల్లును అర్థాంతరంగా మూసివేసిందని కార్మికులు ఆరోపించారు. యాజమాన్యం వైఖరిని కార్మికులు తప్పుపట్టారు. యాజమాన్యం చర్యలతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మికులను శాంతింప చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ క్రమంలో పోలీసులు... కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే గుంటూరు నగరంలోని భజరంగ్ జూట్ మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్
రాజాం (శ్రీకాకుళం) : ఓ వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటూ శ్రీకాకుళం జిల్లా రాజాం సబ్‌రిజిస్ట్రార్ పట్టుబడ్డారు. వివరాల ప్రకారం... రాజాం పట్టణానికి చెందిన వైకుంఠం రాంబాబు బ్యాంకులో గృహ రుణం తీసుకున్నారు. ఆ రుణ వాయిదాలు చెల్లింపు నాలుగు నెలల క్రితం పూర్తయింది. దీంతో ఆయన గృహ తనఖా రద్దు కోసం సబ్ రిజిస్ట్రార్ సతివాడ తవిటయ్యను ఆశ్రయించారు. అయితే ఆయన రూ.10 వేలు ఇస్తేనే పని అవుతుందంటూ మూడు నెలలుగా తిప్పుకుంటున్నారు. చివరికి రూ.4 వేలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులకు ఉప్పందించారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ సహాయకుడు వెంకటరమణకు రూ.4 వేలు అందిస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌తోపాటు సహాయకుడిని విచారిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ రంగరాజు వెల్లడించారు. -
ఉద్రిక్త వాతావరణంలో ‘తోటపల్లి’ తవ్వకాలు
రాజాం: ఆగూరు పంచాయతీ పరిధిలో తోటపల్లి కాలువ తవ్వకాల పనుల్లో ఆయా భూములకు చెందిన కంచరాం రైతులు వారం రోజులుగా పనులను అడ్డుకొని ఆందోళన చేపడుతున్నారు. భూముల్లో తవ్వకాలు చేపడుతున్నారే తప్ప ఆ భూములకు సంబంధించిన పరిహారం మాత్రం రైతులకు అందించడంలేదని అధికారులపై దుయ్యబడుతున్నారు. పరిహారం అందించే వరకూ పనులు జరపనివ్వమని ఖరాఖండీగా తెలిపి పనులను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా శనివారం పనులు చేపట్టాలనే ఉద్దేశంతో సంబంధిత అధికారులు ముందస్తుగానే రైతులను అడ్డుకోవడానికి పోలీస్ బందోబస్తును కోరారు. ఈ మేరకు ఎస్సై ప్రభాకర్ సిబ్బందితో సంఘటన స్థలానికి ఉదయం ఆరు గంటలకే చేరుకున్నారు. రైతులను సంయమనం పాటించాలని సూచించారు. అయినా పనులను అడ్డుకోవడంతో పాలకొండ ఆర్డీవో సాల్మన్‌రాజ్, తోటపల్లి ఈఈ రామచంద్రరావు, తహశీల్దార్ సూపరింటెండెంట్ కృష్ణారావు వచ్చి రైతులతో చర్చించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రైతుల ప్రతినిధి గెడ్డాపు అప్పలనాయుడు మాట్లాడుతూ కంచరాం గ్రామానికి చెందిన సుమారు 25 మంది రైతులకు ఆగూరు పరిధిలో భూములున్నాయని, పరిహారం ఇవ్వకుండా వాటిలో తోటపల్లి కాలువ పనులు చేపట్టడం దారుణమని వాపోయాడు. దీనికి ఆర్డీఓ సాల్మన్‌రాజ్ స్పందిస్తూ ఇంతవరకూ పరిహారం ఎందుకు చెల్లించలేదో దర్యాప్తు జరిపిస్తామన్నారు. వారంలోగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం రైతుల ప్రతినిధి అప్పలనాయుడతో సహా అధికారులంతా రాజాంలోని నగరపంచాయతీ కార్యాలయంలో సమావేశమై దర్యాప్తు ప్రారంభించారు. భూములకు సంబంధించిన వివరాలు రైతులు ఇవ్వకపోవడంతోనే ఎన్ఓసీ ఇవ్వలేకపోయామని స్థానిక రెవెన్యూకార్యాలయ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి తెలిపారు. నాలుగు రోజుల్లోగా రైతుల నుంచి వివరాలు సేకరించి ఎన్ఓసీ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. -
ముంచెత్తనున్న రోగాలు
శ్రీకాకుళంసిటీ/ఆమదాలవలస/రాజాం/ఇచ్ఛాపురం: జిల్లాలోని మునిసిపాలిటీలు చెత్తమయం అవుతున్నాయి. కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు గడచిన 13రోజులుగా చేపడుతున్న సమ్మె విరమణపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోతోంది. గడచిన రెండు, మూడు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు అదికాస్తా వీధుల్లోకి చెల్లాచెదురుగా విస్తరించి దుర్వాసన వెదజల్లుతోంది. కాలువల్లోకి చెత్త చేరుతుండటంతో మురుగు ప్రవాహానికి అవరోధంగా మారుతోంది. ఫలితంగా కాలువల్లో నీరు కొన్ని చోట్ల ఇళ్లల్లోకి వచ్చేస్తోంది. జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస మునిసిపాలిటీలతోపాటు రాజాం, పాలకొండ నగర పంచాయతీల్లో ప్రజలు ఇప్పుడు రోగాలభయంతో ఆందోళన చెందుతున్నారు. చిక్కోలు చెత్తమయం శ్రీకాకుళం పట్టణం 36వార్డులుగా విస్తరించింది. ఇక్కడ 325 మంది కాంట్రాక్టు సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. వీరికి 109 మంది వరకు పర్మినెంట్ సిబ్బంది కూడా మద్దతు తెలపడంతో సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. పలు వార్డుల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రధాన కూడళ్లు, పలు వార్డుల్లో చెత్త పేరుకుపోతున్నా పట్టించుకోని ప్రభుత్వాన్ని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. స్వచ్చభారత్‌ను దేశ ప్రధాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ స్థానికంగా ఉండే పార్లమెంట్ సభ్యుల్లో చిత్తశుద్ధి కరువవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధ్వానంగా ఆమదాలవలస ఇక్కడ రెగ్యులర్ ఏడుగురు, చివరిస్థాయి కార్మికులు ఐదుగురు ఉద్యోగులుండగా, కాంట్రాక్టు కార్మికులు 60మంది ఉన్నారు. ఉన్న 12మంది కార్మికులు పట్టణంలోపారిశుద్ధ్యం మెరుగుపర్చలేకపోతున్నారు. సమ్మెప్రభావంతో పట్టణమంతా అధ్వానంగా మారింది. ఎక్కడికక్కడే చెత్త గుట్టలుగుట్టలుగా పెరుగుతున్నాయి. వర్షాలవల్ల దోమలు కూడా విజృంభిస్తున్నాయి. ప్రధానంగా 16వ వార్డు డాబాలవారి వీధి గబ్బు కంపు కొడుతోంది. ఈ వీధిలో గేదెల పెంపకందారులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి కాలువలన్నీ పేడతో పూడుకుపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. కాస్త లోతట్టుగా ఉన్న ఇళ్లలోకి పేడనీరు పోటెత్తుతుండటంతో ఇళ్లు ఖాళీ చేసి, వేరే ప్రాంతానికి వెళ్లాల్సివస్తోందని చెబుతున్నారు. పలాసలో అపారిశుద్ధ్యం పలాస మునిసిపాలిటీలో 25వార్డులు విస్తరించగా ఇక్క డ 88మంది కాంట్రాక్టు పారిశుద్ద్య కార్మికులు, 11మం ది రెగ్యులర్ కార్మికులు ఉన్నారు. కాంట్రాక్టు సిబ్బంది చేస్తు న్న సమ్మె పుణ్యమాని పట్టణంలో ఏ మూల చూసినా అపారిశుద్ద్యం తాండవిస్తోంది. ఇక ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో 77మంది కాంట్రాక్టు కార్మికులు 14మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. కాంట్రాక్టు కార్మికులంతా సమ్మె చేపడుతుండటంతో చెత్తకుప్పలు ఎక్కువవుతున్నాయి. ఇంకా రాజాం, పాలకొండ నగరపంచాయతీ ల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. రాజాంలో మొత్తం 79మంది సమ్మెలో పాల్గొన డంతో పట్టణంతోపాటు ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీల్లోనూ చెత్త పెరిగిపోయింది. ఇప్పటికైనా పాలకులు వీటిపై దృష్టిసారించి సమ్మె విరమింపజేసేందుకు చర్య లు తీసుకోకుంటే రాబోయే కొద్దిరోజుల్లో రోగాలు విస్తరించడం ఖాయమని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
గాలింపు ముమ్మరం
రేగిడి : మండల పరిధిలోని సంకిలి నాగావళి నదిలో రాజాం మండలం బుచ్చెంపేటకు చెందిన కోరాడ తిరుపతిరావు ఆచూకీ కోసం అధికారుల పర్యవేక్షణలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతిరావు ఈ నెల 24న గల్లంతైన విషయం విదితమే. గురువారం తెల్లవారు నుంచే ఎస్సై ఎన్.కామేశ్వరరావు, సిబ్బందితోపాటు సంఘటన స్థలం వద్దే ఉండి గాలింపు చర్యలను చేపట్టారు. ఏ ప్రాంతంలో సంఘటన జరిగిందో తెలుసుకునేందుకు మంగళవాపురానికి చెందిన వడ్డాది వినేద్, పొనుగుటివలసకు చెందిన పూతిక సింహాచలంలను కూడా ఆ ప్రాంతానికి తీసుకువెళ్లారు. గ్రామానికి చెందిన సుమారు 300 మంది వరకు నదివద్దకు వచ్చి తిరుపతిరావు ఆచూకీ లభ్యంకాకపోవడంతో ఆందోళన చెందారు. ఒక వ్యక్తి నదిలో గల్లంతైనప్పటికీ ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. ఫైర్ సిబ్బంది, 108 సిబ్బంది సంఘటన స్థలం వద్దకు రాలేదని వాపోయారు. తహశీల్దార్ బి.సూరమ్మ కూడా నది వద్దకు వెళ్లి ఎస్సైతో మాట్లాడి గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. నది దిగువ భాగంలోనూ గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటీవల హుద్‌హుద్ తుపాను ప్రభావంతో వచ్చిన వరదకు పాతవంతెన వద్ద పూర్తిగా కోతకు గురికావడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఇక్కడ జీఎంఆర్ ఐటీ విద్యార్థి స్నానానికి వెళ్లి మృతిచెందిన విషయం తెలిసిందే. గజ ఈతగాళ్లను రప్పించండి రేగిడి: సంకిలి నాగావళి నదిలో తిరుపతిరావు గల్లంతయిన విషయాన్ని తెలుసుకున్న ఎంఎల్ఎ కంబాల జోగులు గురువారం సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. సంఘటన ఎలా జరిగిందీ స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఎస్ఐ కామేశ్వరరావు, తహశీల్దార్ బి.సూరమ్మ తదితర అధికారులను ఆదేశించారు. సంకిలి బ్రిడ్జి నుంచి బొడ్డవలస వరకూ తీరం వెంబడి ఎంఎల్ఎ నడుచుకుంటూ వెళ్ళి నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. ఆయనవెంట సంకిలి సర్పంచ్ రాయపురెడ్డి కృష్ణారావు తదితరులు ఉన్నారు. -
పెళ్లింట చావు మేళం
రాజాం: పెళ్లికోసం చుట్టరికానికి వచ్చిన ఆ తండ్రీకొడుకులు మృత్యువాతపడి ఈ లోకాన్నే వీడారు. మంగళవారం సెంటిమెంటు ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. పచ్చని పెళ్లి పందిరి కాస్తా రోదనలు.. ఆర్తనాదాలతో నిండిపోయింది. మండలపరిధిలోని పెనుబాక గ్రామంలో ఈ నెల మూడో తేదీన జరిగిన వివాహానికి సంతకవిటి మండలం మందరాడకు చెందిన ఆకాశపు వీరభద్రుడు(45), ఆకాశపు శంకర్(21), వీరభద్రుడి భార్య లక్ష్మి, రెండో కుమారుడు భానుప్రసాద్ హాజరయ్యారు. ఈ పెళ్ళిల్లు కాస్తా విద్యుత్‌దీపాలతో అలంకరించి ఉంది. పెళ్లి తరువాత సంప్రదాయంగా దగ్గరి బంధువులతో ఏనాలు పండగ సైతం మంగళవారం జరుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణానికి మంగళవారం మంచిరోజు కాదని కొంతమంది చెప్పగా బుధవారం వెళ్ళిపోవచ్చని పెళ్ళింట్లో ఉండిపోయారు. దురదృష్టవశాత్తూ ఇంటికి అలంకరించిన సీరియల్ సెట్ నుంచి విద్యుత్ సరఫరా కావడంతో తండ్రి విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. ఆయన్ను రక్షించాలన్న శంకర్‌కూడా మృత్యువాతపడ్డాడు. స్థానికులు గుర్తించి 108 వాహనం ద్వారా రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించగా వారిద్దరూ మృతి చెందినట్టు వైద్యుడు గార రవిప్రసాద్ ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హతాశులైన గ్రామస్తులు పెళ్ళి బాజా మోగి వారం తిరగలేదు. అదే ఇంట్లో చావుమేళం మోగడం గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. పెళ్ళికి బంధువులుగా వచ్చిన వారు శవాలుగా తిరిగివెళ్ళడం వారిని తీరని విషాదం నింపింది. వారం రోజుల నుంచి పెళ్ళిలో అందరితో కలివిడిగా ఉన్నవారు విగతజీవులు కావడం ఎవరూ తట్టుకోలేకపోయారు. మందరాడలో విషాదం మృతుల స్వగ్రామమైన సంతకవిటి మండలం మందరాడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బావమరిది పెళ్ళికి ఎంతో హుషారుగా వెళ్ళిన వీరభద్రుడు కుటుంబంలో ఇద్దరు మృత్యువు పాలవ్వడం జీర్ణించుకోలేకపోయారు. శంకర్ ఇటీవల రాజాంలో ఐటీఐ చదివి వైజాగ్‌లో ఓ ఉద్యోగంలో చేరాడు. నెల రోజులు కాకముందే మామయ్య పెళ్ళి తాతగారింటి వద్ద జరుగుతుందన్న ఆనందంలో పరుగున వచ్చాడని, ఇంతలోనే మృత్యువాత పడ్డారని వారంతా ఆవేదన చెందారు. చేతికందివచ్చిన కుమారుడుతో పాటు భర్త మృతితో లక్ష్మి రోదన అందరినీ కంటతడి పెట్టించింది. -
అనారోగ్యమే తోడు.. బస్సు షెల్టరే నీడ
జీవిత చరమాంకంలో వృద్ధురాలి దయనీయ స్థితి భర్త, కొడుకు అర్ధంతరంగా దూరమయ్యారు రెక్కల కష్టంతో కూతురిని అత్తారింటింకి పంపింది వయసుడిగింది.. ఆరోగ్యం క్షీణించింది ఇంటి ఓనరు గెంటేయడంతో రోడ్డున పడింది ఐదురోజులుగా దయనీయ స్థితిలో వరలక్ష్మి రాజాం: జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త.. చరమాంకంలో సంరక్షించాల్సిన కొడుకును పోగొట్టుకుంది. కూతుర్ని పెంచి, పెళ్లి చేసి అత్తారింటికి పంపేసింది. ఇప్పుడు వయసుడిగింది. ఆరోగ్యం పడకేసింది. ఇన్నేళ్లూ సహకరించిన రెక్కలు ఇక తమ వల్ల కాదన్నాయి. ఫలితంగా ఆ పండుటాకు మంచానికి పరిమితమైంది. ఇంటి ఓనరు గెంటివేయడంతో బస్సు షెల్టరే ఆమెకు ఆవాసంగా ఎవరో నాలుగు మెతుకులు పెడితే ఆ పూటకు గడి చిందనుకోవడం. లేని నాడు నీళ్లతో కడుపు నింపుకొంటూ క్షణమొక యుగంలా గడుపుతున్న ఆ అభాగ్యురాలు అయినంపూడి వరలక్ష్మి. సుమారు 60 ఏళ్ల వయసున్న ఈ వృద్ధురాలు స్థానిక చీపురుపల్లి రోడ్డులోని పోలీసు స్టేషన్ మలుపు వద్ద ఉన్న బస్సు షెల్టరే ఆవాసంగా నాలుగైదు రోజులుగా కాలం వెళ్లదీస్తోంది. భర్త చినబాబు, ఇద్దరు పిల్లలతో 18 ఏళ్ల క్రితం రాజాం పట్టణానికి వచ్చిన ఈమె కుటుంబం మల్లికార్జున కాలనీలో ఓ ఇంట్లో అద్దెకుంటోంది. కాలక్రమంలో భర్త, కొడుకు చనిపోవడంతో ఉన్న ఆడపిల్లను తన రెక్కల కష్టంతోనే పెంచి పెద్ద చేసింది. పెళ్లి కూడా చేసి పంపించింది. ఏళ్ల తరబడి శారీరక శ్రమ, వయసు మీద పడటంతో ఆరోగ్యం క్షీణించి మంచం పట్టింది. సరైన భోజనం లేక, చూసే దక్షత లేక శుష్కించిపోయింది. దీంతో ఎక్కడ తమ ఇంట్లో మరణిస్తుందోనన్న భయంతో ఇంటి ఓనరు ఆమెను ఐదు రోజులు క్రితం ఖాళీ చేయించేశాడు. విధిలేని స్థితిలో స్థానికుల సాయంతో ఉన్న కొద్దిపాటి సామాన్లతో వరలక్ష్మి బస్ షెల్టర్‌లోకి చేరింది. చుట్టుపక్కల వారు దయతలచి ఏదైనా పెడితే తింటోంది. లేనిరోజు ఆకలితో అలమటిస్తోంది. ఈమె దుస్థితిని ఆమె కుమార్తెకు తెలియజేద్దామన్నా ఆమె అత్తవారి అడ్రస్ చెప్పే స్థితిలో వరలక్ష్మి లేదు. కాగా ఈమె కుటుంబానికి ఇంతవరకు రేషన్, ఆధార్ కార్డు వంటివేవీ మంజూరు కాలేదు. దాంతో పింఛను కూడా అందే పరిస్థితి లేదు. అధికారులను కలిసినా, కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ కనికరించలేదని.. ఈ పరిస్థితుల్లో తనను త్వరగా తీసుకుపోవాలని వరలక్ష్మి వేదనతో దేవుడిని ప్రార్థిస్తోంది. ఇప్పటికైనా అధికారులు, మానవతావాదులు స్పందించి ఆమెకు ఆసరా కల్పించాల్సిన అవసరం ఉంది. -
చిన్నారి గీతిక.. విషాద వీచిక
లేతప్రాయం.. స్కూలు, ఇల్లు తప్ప ఇంకో లోకం తెలియని అమాయకత్వం. చెంగు చెంగున లేడిపిల్లలా గెంతుతూ.. ఈ లోకమంతా తనదే అన్నట్లు ఆటపాటలతో తల్లిదండ్రులకు మురిపాలు పంచింది ఆ బాలిక.. ఇది నాలుగు నెలల క్రితంనాటి ముచ్చట. మరి ఇప్పుడు.. ఆ ఇల్లే ఒక శోకనిలయంగా మారింది. నాటి కేరింతలు, తుళ్లింతలు లేవు. ఆటపాటలతో ఇల్లంతా సందడి చేయాల్సిన వారి పుత్రిక జీవచ్ఛవంలా మారి.. మంచానికి పరిమితమైంది. చిన్నపాటి జ్వరం కొద్దిరోజుల వ్యవధిలోనే పెను ఉపద్రవంగా మారి. ఆ పేద కుటుంబంలో కల్లోలం రేపింది. విధితోపాటు వైద్యనారాయణులు తమ ముద్దుల పాప గీతిక తలరాతను మార్చేశారని ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. డబ్బు నీళ్లలా ఖర్చయినా జబ్బు నయంకాకపోగా మరింత విషమించి పాప జీవితాన్ని డోలాయమానంలో పడేసింది. రాజాం రూరల్: కులవృత్తిపైనే ఆధారపడిన పేదవర్గానికి చెందినవారు సుగంధం సతీష్, కల్యాణి దంపతులు. రాజాం మధవబజార్ వీధిలో నివసిస్తున్న వీరికి ఒక్కగానొక్క కుమార్తె గీతిక. స్థానిక కాన్వెంట్లో 4వ తరగతి చదువుతోంది. పేద కుటుంబమైనా ఉన్నంతలో సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో విధి విషం చిమ్మింది. సుమారు నాలుగు నెలల క్రితం చిన్నారి గీతికకు జ్వరం చేసింది. తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడికి చూపించారు. రెండురోజులు మందులు వాడినా ఫలితం కనిపించలేదు. దాంతో రాజాంలోనే స్పెషలిస్ట్ వైద్యుడికి చూపించారు. అతనిచ్చిన మందులు మరో రెండుమూడు రోజులు వాడారు. జ్వరం తగ్గకపోగా ప్లేట్లెట్స్ పడిపోతున్నట్లు గుర్తించిన వైద్యుడి సూచన మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీన విశాఖలోని కళా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ జరిపిన పరీక్షల్లో గీతిక డెంగ్యూ బారిన పడినట్లు నిర్థారించారు. అయితే అక్కడ చిన్నపిల్లల వైద్య నిపుణులు లేకపోవడంతో విశాఖలోని మరో పెద్ద ఆస్పత్రికి సెప్టెంబర్ 3వ తేదీ రాత్రి తరలించారు. వైద్యం వికటించిందా? ఆ ఆస్పత్రిలో జరిపిన పరీక్షల్లోనూ డెంగ్యూగా తేలడంతో ప్లేట్లెట్స్ ఎక్కించారు. ఏమైందో తెలియదు గానీ.. ప్లేట్లెట్స్ ఎక్కించినప్పటి నుంచి గీతిక పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అప్పటివరకు కొద్దిపాటి ఓపికతో మాట్లాడుతూ, మెల్లగా తిరుగాడిన గీతిక శరీరం రంగు ఒక్కసారిగా మారిపోయింది. గొంతు మూగబోయింది. పక్షవాతం సోకినట్లు కాళ్లూచేతులు వంకర్లుపోయి జీవచ్ఛవంలా తయారైంది. కూర్చోలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితమైంది. దాంతో వైద్యులు ఆమెను ఐసీయూ నుంచి ఎంఐసీలోకి తరలించారు. ఊపిరి పీల్చడం, ఆహారం తీసుకోవడం కూడా సమస్యగా మారడంతో గొంతుకు అడ్డంగా ఒక పరికరం, ముక్కుకు గొట్టం అమర్చారు. ఇలా రకరకాల చికిత్సలతో సెప్టెంబర్ 19వ తేదీ వరకూ సుమారు రూ.10 లక్షలు ఖర్చు పెట్టించారు. చివరికి పాప పరిస్థితి విషమించిందని చేతులెత్తేసి డిశ్చార్జి చేసేశారు. అయినా ఆశ చావక.. దీంతో పూర్తిగా కుంగిపోయిన తల్లిదండ్రులు.. చేతిలో డబ్బులన్నీ అయిపోయి దిక్కుతోచని స్థితిలో పాపను తీసుకొని సొంత ఊరికి తిరిగొచ్చారు. పాపను ఎలాగైనా బతికించుకోవాలన్న ఆశతో రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. వారిచ్చిన మందులు వాడుతూనే విశాఖ కేజీహెచ్‌ను ఆశ్రయించారు. అక్కడ పాపను పరీక్షించిన వైద్యులు ఆమెకు అమర్చిన పైపులు, పరికరాలు తీయాలంటే శస్త్రచికిత్స చేయాలని, దాన్ని తట్టుకునే శక్తి పాపకు ప్రస్తుతం లేదని చెప్పారు. కొన్నాళ్లు మందులు వాడాలని, ఆరోగ్యం కొంత మెరుగుపడితే ఆపరేషన్ చేసి తొలగిస్తామన్నారు. అప్పటినుంచి పాపను ఇంటిదగ్గరే 24 గంటలూ కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లిదండ్రులకు మళ్లీ శస్త్ర చికిత్స చేయించడానికి అవసరమైన ఆర్థిక స్తోమత లేకపోవడం కుంగదీస్తోంది. ఇప్పటికే శక్తికి మంచి అప్పులు చేసి సుమారు రూ.13 లక్షలు ఖర్చు చేశామని.. ఇంక చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో ఏం చేయాలో పాలుపోవడంలేదని వాపోతున్నారు. కాగా విశాఖ ఓమ్ని ఆస్పత్రిలో చికిత్స వికటించడం వల్లే తమ కుమార్తె పరిస్థితి ఇలా తయారైందని ఆరోపిస్తున్నారు. ఇక భగవంతుడు, దాతలే తమపై దయ చూపాలని వారు అంటున్నారు. -
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
రాజాం: చాలా చోట్ల అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లు రద్దయిపోయాయన్న ఫిర్యాదులు వస్తున్నాయని, తమ పరిశీలనలో సైతం ఇది వాస్తవమని తేలిందని, ఇలాంటి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు వ్యాఖ్యానించారు. అవసరమైతే బాధితుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని భరోసా ఇచ్చారు. ఆయన సోమవారం రాజాం మండలం బొద్దాంలో పర్యటించినప్పుడు ఆ గ్రామానికి చెందిన కొందరు పింఛన్ల విషయంలో అర్హత ఉన్నా తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. నియోజకవర్గంలో గాని, ఇతర ప్రాంతాలలో గాని పర్యటించినప్పుడు వైఎస్సార్‌కాంగ్రెస్ అనుకూలురకు అర్హతలున్నా పింఛన్లు రద్దుచేయడం అధికార పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తొలుత కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి కూడా సరైన స్పందన లేకపోతే బాధితులకు న్యాయం చేసేందుకు ఎంతవరకైనా వెళ్తామని చెప్పారు. -
విహారయాత్రలో విషాదం
డుంబ్రిగుడ/రాజాం రూరల్: విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. అరకు అందాలను వీక్షించేందుకు వచ్చిన కళాశాల విద్యార్థుల్లో ఒకరు గెడ్డలో స్నానానికి దిగి గల్లంతై విగతజీవిగా మారాడు. పోలీసులు, మృతుని స్నేహితులు అందించిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాలకు చెందిన తొమ్మిది మంది బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు శనివారం విహార యాత్రలో భాగంగా మండలంలోని చాపరాయి జలపాతాన్ని తిలకించేందుకు వచ్చారు. సరదాగా జలపాతంలో జారుతూ స్నానాలు చేశారు. ఇందులో జె.సాకేత్ అనే విద్యార్థి గెడ్డలో దిగి గల్లంతయ్యాడు. ఆందోళన చెందిన స్నేహితులు స్థానికులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు తెలిపారు. ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. విద్యార్థి హైదారాబాద్‌కు చెందిన వాడు కాగా, తండ్రి ఓ బ్యాంక్ ఉద్యోగి అని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన తెలిసి కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పీడీఓ అరుణ్‌కుమార్, ఏఓ ఆకిరి రామారావు తదితరులు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. -
ఎయిడ్స్‌తో అతలాకుతలమైన సిక్కోలు జిల్లా
రాజాం : కొద్ది సంవత్సరాల క్రితం హెచ్ఐవీ, ఎయిడ్స్‌తో అతలాకుతలమైన సిక్కోలు జిల్లా ప్రస్తుతం నియంత్రణ దిశలో సాగుతోంది. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ యంత్రాంగం చైతన్య కార్యక్రమాలు, ప్రజల్లో కూడా వ్యాధి తీవ్రతపై అవగాహన పెంపొందించడం వంటి వాటి వల్ల క్రమేపీ హెచ్ఐవీ రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం మం చి పరిణామంగా వైద్య యంత్రాంగం పరిగణి స్తోంది. అయితే ఈ వ్యాధి తమకు సోకిందని తెలియని వారు, తెలిసీ బయటకు చెప్పుకోలేని వారు, మానసికంగా కుంగిపోతున్నవారి లెక్కలు లేకపోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో తాజా స్థితిగతులు ఇలా... జిల్లాలో 2014-15 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకూ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఇతర సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరాలు ద్వారా సేకరించిన రక్తం యూనిట్లు 6480 కాగా వీరిలో 25 మందికి హెచ్ఐవీ పాజి టివ్‌గా నిర్ధారించారు. ఇది 0.39 శాతం. అలాగే గ ర్భిణులను 20,268 మందిని పరీక్షించగా వీరిలో 29 మంది హెచ్ఐవీ(0.14 శాతం)తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఇక సాధారణ పరీక్షలు 29,628 మందికి జరపగా 667 మంది (2.25 శాతం)కి హెచ్ఐవీ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే గతేడాది(2013-14)తో పోల్చుకుంటే తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఏడాది రక్తదాతలకు 0.71 శాతం, గర్భిణులకు 0.16 శాతం, సాధారణ పరీక్షల్లో 2.52 శాతం కాగా ఈ ఏడాది కాస్త తగ్గుముఖం పట్టింది. రోగ నిర్ధారణ...రోగులకు చికిత్స ఇలా... జిల్లా వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ కేంద్రాలు(ఐసీటీసీలు) 15 చోట్ల ఉన్నాయి. అలాగే గ ర్భిణులను ప్రత్యేకంగా పరీక్షించేందుకు శ్రీకాకుళం రిమ్స్‌తో పాటు పాలకొండ, టెక్కలి ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో పీపీటీసీ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. హెచ్ఐవీ సోకిన వారికి సేవలందించేందుకు శ్రీకాకుళం రిమ్స్‌లో యాంటీ రిట్రో వైరల్(ఏఆర్టీ) కేంద్రం ఏర్పాటు కాగా దీనికి అనుబంధంగా ఏఆర్టీలను రాజాం, టెక్కలి, పాలకొండ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఉచితంగా మందుల పంపిణీ, కౌన్సిలింగ్ తదితర కార్యకలాపాలు చేపడుతున్నారు. అలాగే వ్యాధి సోకిన గర్భిణులకు చికిత్స ప్రారంభించేప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా రాగోలులో కేర్ అండ్ సపోర్టు సెంట ర్ను ఏర్పా టు చేశారు. జిల్లా వ్యాప్తం గా శ్రీకాకుళం, పలాసలలో రెండేసి, సోంపేట, పాతపట్నం, పూండిలలో ఒక్కొక్కటి చొప్పున ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు పార్టనర్ల పేరిట పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే జిల్లాలోని మొత్తం 76 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెస్టింగ్ కిట్లను పంపిణీ చేయడంతో పీహెచ్సీ స్థాయిలోనూ పరీక్షలు ఆరంభం కానున్నాయి. అవగాహన పెంపొందించుకుంటే నియంత్రణ... ఇదే విషయమై జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నోడల్ అధికారి, జిల్లా అదనపు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ డి.రత్నకుమారి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఉమా మహేశ్వరరావు ఆదివారం రాత్రి ‘సాక్షి’తో మాట్లాడుతూ అవగాహన పెంచుకుంటే హెచ్ఐవీని అదుపులో ఉంచవచ్చునన్నారు. సందేహం ఉంటే పరీక్ష చేయించుకోవాలని, సరైన చికిత్స పొందితే దాదాపు 20 ఏళ్లు ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉందని అన్నారు. కాగా హెచ్ఐవీ సోకిన రోగులకు రూ.వెయ్యి పింఛను, ఆర్టీసీలో ప్రయాణానికి 50 శాతం రాయితీ, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా 50 శాతం రాయితీతో రుణాలు అందజేస్తున్నారు. కొద్ది నిమిషాలు చర్చిస్తే చాలు... హెచ్ఐవీ, ఎయిడ్స్ తీవ్రతను ప్రజలకు తెలియజేందుకు ప్రభుత్వ యంత్రాంగం బహుముఖ ప్రయత్నం చేస్తోంది. స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకుంటోంది. అలాగే జిల్లాలో ఏ స్థాయి అధికారిక సమావేశం జరిగినా ప్రారంభంలో కొద్ది నిముషాలు ఎయిడ్స్‌పై చర్చించాలని నిర్దిష్టమైన ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఆరంభంలో అధికారులు ఈ నిబంధన పాటించి తర్వాత వదిలేశారు. మరో పక్క హెచ్ఐవీ, ఎయిడ్స్ జిల్లాలో చాపకింద నీరులా ప్రవేశిస్తోంది. రాజాం ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సమావేశాల ముందు ఎయిడ్స్‌పై చర్చించే ప్రక్రియ దాదాపు నిలిచిపోవడంతో గ్రామస్థాయి ప్రజలకు వ్యాధి తీవ్రతపై అవగాహన కలగడం లేదు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్యామల వివరణ ఇస్తూ ఇకపై అన్ని అధికారిక సమావేశాల్లో హెచ్ఐవీపై రెండు నిమిషాలైనా చర్చించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యర్థ్దాలతో ఎయిడ్స చిహ్నం సీతంపేట : స్థానిక మం డల సహిత ఉపాధ్యాయుడు కందికప్ప చక్రధర్ నేడు ఎయిడ్స్ దినోత్స వం సందర్భంగా వ్యర్థపదార్థాలతో ఎయిడ్స్ చిహ్నమైన రెడ్‌రిబ్బన్‌ను వ్యర్థ పదార్థాలతో తయారు చేశారు. దీనికి మధ్యలో గ్లోబు ఉంచారు. దీన్ని తయారు చేయడానికి స్పైరల్ బైండింగ్ ఎరుపు పేపరు, ఎలక్ట్రానిక్ ప్లాస్టిక్ పైపు, పాత బంతి, రక్త పరీక్షల బీడలు, ఫెవికిక్ ఉపయోగించారు. రెండు గంటల సమయంలో దీన్ని తయారు చేసినట్టు చక్రధర్ తెలిపారు. -
డ్వాక్రా రుణాల వసూలుకు ప్రత్యేక బృందాలు
రాజాంరూరల్ : జిల్లాలో డ్వాక్రా రుణాల వసూళ్లకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నామని జిల్లా సమాఖ్య ఆర్థిక శాఖ డీపీఎం జి.ఎస్.తారాదేవి స్పష్టం చేశారు. బుధవారం ఆమె రాజాంలోని ఐకేపీ కార్యాలయంలో మండల సమాఖ్య రికార్డులను సామాజిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు సామాజిక పెట్టుబడి నిధి, స్వర్ణ జయంతి సామాజిక పెట్టుబడి నిధి, సమగ్ర సహకార అభివృద్ధి పథకం, ఆరోగ్యం-పోషణ తదితర విభాగాల పేరుతో జిల్లాలోని సుమారు 32 వేల మంది డ్వాక్రా మహిళలకు సుమారు రూ.31.49 కోట్ల రుణాలు అందించినట్టు చెప్పారు. సెప్టెంబర్ నాటికి వీటిలో 53 శాతం రుణాలు వసూలైనట్టు తెలిపారు. రాజాంలో సుమారు రూ.12 కోట్ల రుణాలు ఇవ్వగా ఇప్పటివరకు 31 శాతం మాత్రమే రికవరీ అయ్యాయన్నారు. నూరుశాతం రుణాల వసూళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు సీఆర్పీలతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. మొండి బకాయిల వసూళ్లే బృందాల ప్రధాన లక్ష్యమన్నారు. బ్యాంకు లింకేజీలకు మినహా ప్రభుత్వం అమలు చేయబోయే రుణాల మాఫీ ఇంక దేనికీ వర్తించదని, సభ్యులు ఈ విషయాన్ని గమినించాలని కోరారు. జిల్లాలో 31 మండలాలకు సంబంధించి రాజాం, ఎచ్చెర్ల, నరసన్నపేట, టెక్కలి, సోంపేట, పాలకొండ ప్రాంతాల్లో క్లస్టర్లు ఉన్నాయని, పాతపట్నం, సీతంపేట క్లస్టర్లు ఐటీడీఏ పరిధిలోకి వెళతాయని అన్నారు. ఆర్థిక శాఖ ఏపీఎం పి.శ్రీనివాసరావు, రాజాం క్లస్టర్ ఏసీ జి.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
104 సేవలకు డీజిల్ బ్రేక్
రాజాం రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో సంచార వైద్యసేవలు అందిస్తున్న 104 వాహనాలు సర్కారు నిర్లక్ష్యం వల్ల ఒక్కొక్కటి గా మూలన చేరుతున్నాయి. ఇప్పటికే ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా జీతాల్లేవు. తాజాగా డీజిల్ బిల్లులూ భారీగా పెండింగులో పడిపోవడంతో ఈ వాహనాలు నిలిచిపోతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన 104 సేవలను జిల్లాలో 20 వాహనాలతో గ్రామీణ ప్రాంతాలకు అందిస్తున్నారు. కాగా డీజిల్ కొరతతో రాజాం నియోజకవర్గానికి చెందిన 2, శ్రీకాకుళానికి చెందిన 2, పాతపట్నం, సీతంపేటల్లో ఒక్కో వాహనం నిలిచిపోయాయి. రాజాం వాహనాలకు సంబంధించి గతంలో డీజిల్ బిల్లు రూ.20 వేలకు చేరగానే ప్రభుత్వం మంజూరు చేసేసేది. ప్రస్తుతం ఈ బకాయి రూ.70 వేలు దాటడంతో బంక్ యజమాని డీజిల్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో వాహనాలు ఆగిపోయింది. ఇదే తరహాలో శ్రీకాకుళం వాహనాలు 15 రోజులుగానూ, సీతంపేట, పాతపట్నం వాహనాలు వారం రోజులుగానూ క్లస్టర్ ఆస్పత్రుల వద్ద నిలిచిపోయాయి. దీంతో ఈ వాహనాల ద్వారా సేవలు పొందుతున్న దీర్ఘకాలిక రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా 104 వాహనాల్లో పని చేస్తున్న సిబ్బందికి 3నెలలుగా జీతాల్లేవు. జిల్లాలో 120 మంది వరకు పని చేస్తుండగా ఆగస్టు నుంచి ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇక్కట్లుకు గురవుతున్నారు. దీనిపై 104 ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జె.సింహాచలం మాట్లాడుతూ ప్రభుత్వం 104 వాహన సేవలు పట్ల, ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో తక్షణం స్పందించి డీజిల్, జీతాల బకాయిలు చెల్లించాలని ఆయన కోరారు. -
రియల్ రాజ్యం!
రాజాం: రాజాం పట్టణం ఆర్థికంగా ఎదుగుతోంది.. అంతకుమించిన స్థాయిలో రియల్ వ్యాపారం రెక్కలు విచ్చుకుంటోంది.. రెచ్చిపోతోంది. అడ్డూఅదుపూ లేకుండా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. వీటి వల్ల అధికారులు, రియల్టర్లు లక్షలు కళ్లజూస్తుండగా.. కొనుగోలుదారులు మాత్రం కళ్లు తేలేయాల్సి వస్తోంది. పారిశ్రామికంగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందిన రాజాం పట్టణంలో వాణిజ్య, విద్యా రంగాల అభివృద్ధీ జోరందుకుంది. ఫలితంగా జనాభా, దానికి అనుగుణంగా ఇళ్ల స్థలాలకు డిమాండ్ పెరుగుతున్నాయి.దీన్నే రియల్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, పన్నులు చెల్లించకుండా వ్యవసాయ భూముల్లో లే అవుట్లు వేసి అమ్మేస్తున్నారు. ఈ విధంగా రాజాం నగర పంచాయతీ పరిధిలో 17 చోట్ల సుమారు 60 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వెలసినట్లు తెలిసింది. నిబంధనలకు సమాధి రియల్టర్ల ధన దాహానికి వ్యవసాయ భూములు కరిగిపోతున్నాయి. నిబంధనలకు సమాధి కట్టి వాటి పునాదులపై అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చాలన్నా, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించాలన్నా నాలా పన్ను చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చేస్తున్నారు. కాగా లేఅవుట్లు వేసిన ప్పుడు వాటిలో రహదారులు, కాలువలు, విద్యుత్ లైన్లు వేయడంతోపాటు కమ్యూనిటీ హాలు వంటి వాటిని స్థలం కేటాయించి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టరేట్ నుంచి అనుమతి పొందిన తర్వాతే విక్రయాలు జరపాలి. కానీ రియల్టర్లు వీటిని పట్టించుకోకుండా హద్దులుగా రాళ్లు పాతి, స్థలాలు చూపించి అమ్మేస్తున్నారు. నిబంధనలపై అవగాహన లేని ప్రజలు వీటిని కొనుగోలు చేసి, ఆ తర్వాత ఇబ్బందులపాలవుతున్నారు. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన నగర పంచాయతీ అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు. ఇవే అక్రమ లేఅవుట్లు విశ్వసనీయ సమాచారం ప్రకారం అనుమతుల్లేని లేఅవుట్ల వివరాలు ఇలా ఉన్నాయి.. వాసవీనగర్ సర్వే నెం. 31, 40లలో ఎకరా విస్తీర్ణంలో 18 ప్లాట్లు. ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక పాపయ్యపేట వద్ద సర్వే నెం. 107లో రెండు ఎకరాల్లో 40 ప్లాట్లు. పొనుగుటివలసలో సర్వే నెం.33లో 4 ఎకరాల్లో 90 ప్లాట్లు. పొనుగుటివలస గౌరీపరమేశ్వర ఆలయం వద్ద సర్వే నెం. 20, 21, 13, 14లలో 102 ప్లాట్లు. ఇదే గ్రామంలో జీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా సర్వే నెం. 76, 78లలో 8 ఎకరాల్లో 170 ప్లాట్లు. జీఎంఆర్ కేర్ ఆస్పత్రి ఎదురుగా బుచ్చింపేట రహదారిలో సర్వే నెం. 84, 86,88లలో 10 ఎకరాల్లో 230 ప్లాట్లు. పొనుగుటివలస రోడ్డులో ఒక ఎకరాలో 18 ప్లాట్లు. ఇదే ప్రాంతంలో సర్వే నెం. 170, 173, 176లలో 3 ఎకరాల్లో 40 ప్లాట్లు. సారధి గ్రామంలో చీపురుపల్లి రోడ్డులో సర్వే నెం.119లో 2 ఎకరాల్లో 30 ప్లాట్లు. ఇదే రోడ్డులో నర్సింగ్ పాఠశాల ఎదురుగా సర్వే నెం. 181లో 2 ఎకరాల్లో 30 ప్లాట్లు. బొబ్బిలి రోడ్డులో అగ్నిమాపక కేంద్రం పక్కన సర్వే నెం. 70లో 2 ఎకరాల్లో 30 ప్లాట్లు. ఇదే రోడ్డులో ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా సర్వే నెం.84లో ఎకరా విస్తీర్ణంలో 18 ప్లాట్లు. కొత్తవలస సర్వే నెం. 37లో 5 ఎకరాల్లో 60 ప్లాట్లు. ఇదే గ్రామంలో సర్వే నెం. 66లో హెచ్‌పీ పెట్రోల్ బంకు వెనుక 2 ఎకరాల్లో 30 ప్లాట్లు. కొండంపేట సర్వే నెం. 113, 117లలో ఇటుకల ఫ్యాక్టరీ ఎదురుగా 4 ఎకరాల్లో 124 ప్లాట్లు. బొబ్బిలి రోడ్డులో సర్వే నెం. 70, 73లలో 3 ఎకరాల్లో 40 ప్లాట్లు. ఇదే రోడ్డులో సర్వే నెం.132, 138, 140, 145లలో 3 ఎకరాల్లో 40 ప్లాట్లు చర్యలు తీసుకుంటాం అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి స్థలాలు విక్రయిస్తున్న విషయాన్ని నగర పంచాయతీ కమిషనర్ వి.అచ్చెన్నాయుడు వద్ద ప్రస్తావించగా వాస్తవమేనన్నారు. వీటిని గుర్తించామని, ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. నిర్మాణాలు చేపట్టేటప్పుడు నిబంధనలు పాటించి, అవసరమైన అనుమతులు పొందితే ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. -
హుదూద్ బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
రాజాం: హుదూద్ బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు చెప్పారు. పార్టీ శ్రేణులంతా తుపాను బాధితులకు సహాయ సహకారాలు అందించాలని సూచిం చారు. రాజాంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. పార్టీ నేతలంతా గ్రామాల్లో పర్యటించి, బాధితులను ఓదార్చి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పత్తి, జీడి, వరి, మామిడి, అరటి తోటలకు పెనునష్టం వాటిల్లిందని పలువురు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీరందరికీ సముచిత రీతిలో నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వంతో చర్చిస్తామని ఎమ్మెల్యే బదులిచ్చారు. అధికారులు సక్రమం గా స్పందించకుంటే..చర్యలు తప్పవన్నారు. రాజాం జెడ్పీటీసీ సభ్యుడు టంకాల పాపినాయుడు, కరణం సుదర్శనరావు, శాసపు కేశవరావు, ముద్దాన బాబు, కెంబూరు సూర్యారావు, వంజరాపు విజయ్‌కుమార్, పాలవలస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మగతనం తగ్గుతుందన్న అపోహ
రాజాం:కుటుంబ రథానికి భార్యాభర్తలిద్దరూ రెండు చక్రాల్లాంటివారు. రెండూ సమానంగా నడిస్తేనే రథం సజావుగా సాగుతుంది. కష్టసుఖాలు, బాధ్యతల బరువుల్లోనూ సమాన వాటా పొందాల్సి ఉంది. కానీ కుటుంబ పెద్దలుగా ఉంటున్న మగరాయుళ్లు కుటుంబ నియంత్రణలో మాత్రం తమ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారు. కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దాన్ని పూర్తిగా మహిళల నెత్తిన రుద్దుతున్నారు. మహిళలు కూడా ఈ విషయంలో మగాళ్లను వెనకేసుకు వస్తుండటం మరీ విడ్డూరం. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను మహిళలు(ట్యూబెక్టమీ), పురుషులు(వేసక్టమీ) కూడా చేసుకోవచ్చు. అయితే ఈ విషయంలో పురుషులు పూర్తిగా వెనుకబడ్డారు. గత ఏడాది జిల్లాలోని 75 పీహెచ్‌సీల పరిధిలో 18,600 కు.ని. ఆపరేషన్లు నిర్వహించగా వీటిలో వేసక్టమీ ఆపరేషన్లు 304 మాత్రమే. అలాగే ఈ ఏడాది లక్ష్యం 19 వేలు ఆపరేషన్లు కాగా ఇప్పటివరకు 6 వేల ఆపరేషన్లు జరిగాయి. వీటిలో 106 మాత్రమే వేసక్టమీ ఆపరేషన్లని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. పరిస్థితి దారుణంగా ఉందో ఈ లెక్కలే చెబుతున్నాయి. మగతనం తగ్గుతుందన్న అపోహ వేసక్టమి ఆపరేషన్ చేయించుకుంటే మగతనం తగ్గుతుందన్న అపోహ చాలా మందిని వేధిస్తోంది. గ్రామాల్లో నిరక్షరాస్యత కారణంగా వేసక్టమీ అంటేనే జనం భయపడుతున్నారు. ఈ ఆపరేషన్ వల్ల మగతనానికి ఎలాంటి ఇబ్బందీ లేదని వైద్యులు ఎంతగా చెబుతున్నా పురుషులు ముందుకు రావడంలేదు. మహిళలు కూడా ఒప్పుకోవడం లేదు...! మగవారు కు.ని. ఆపరేషన్ చే యించుకునేందుకు వారి భార్యలు కూడా ఒప్పుకోవడం లేదని ఆరోగ్య కార్యకర్తలు చెబుతున్నారు. తాము వంద కేసులను వైద్య శిబిరానికి తీసుకొస్తే చివరకు ఆపరేషన్ చేయించుకునే మగవారు వారు కేవలం ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ మిగలడం లేదంటున్నారు. పురుషులు చేయించుకుంటేనే మంచిది ఇదే విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి గీతాంజలి మాట్లాడుతూ కు.ని. ఆపరేషన్లు మహిళలు క ంటే పురుషులు చేయించుకోవడమే మంచిదన్నారు. వేసక్టమీ చేయించుకుంటే మగతనానికి ఇబ్బంది, పని చేసుకోవడం ఇబ్బంది అన్నది అపోహేనన్నారు. ఎంత చైతన్యపరిచినా ముందుకు రాకపోవడం సరికాదన్నారు. ఆపరేషన్ చేయించుకున్న గంట తర్వాత యథావిధిగా ఇంటికి వెళ్లిపోవచ్చన్నారు. మరుసటి రోజు నుంచి తేలికపాటి పనులు, వారం తర్వాత యథావిధిగా పనులు చేసుకోవచ్చని సూచించారు. -
కంపించిన రాజాం
రాజాం రూరల్, రేగిడి, సంతకవిటి: దడదడమంటూ చిన్నపాటి శబ్దాలు.. కాళ్ల కింద ఏదో కదిలిన భావన.. ఆ వెంటనే చిన్న ప్రకంపనలు.. రాత్రివేళ సంభవించిన ఈ పరిణామాలతో రాజాం నియోజకవర్గ ప్రజలు తుళ్లిపడ్డారు. కొద్ది క్షణాల్లోనే అవి భూప్రకంపనలని అర్థమైంది. అంతే భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అరగంట వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నియోజకవర్గ పరిధిలోని రాజాం, రేగిడి, సంతకవిటి మండలాల్లో శనివారం రాత్రి 8.53 గంటలకు ఒకసారి, 9.21 గంటలకు మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. మొదటిసారి 3 సెకెన్లపాటు, రెండోసారి 2 సెకన్లపాటు కంపించింది. రాజాం పట్టణంతో పాటు వస్త్రపురి కాలనీ, కొండంపేట, చీకటిపేట, ఒమ్మి, గడిముడిదాం, జీఎంఆర్‌ఐటీ, బుచ్చెంపేట, రేగిడి మండలంలో బాలకవివలస, మునకలవలస, పనసలవలస, కొర్లవలస, పారంపేట, కాగితాపల్లి, బూరాడ, చినశిర్లాం, పెద్దశిర్లాం తదితర ప్రాంతాల్లోనూ, సంతకవిటి మండలం మోదుగుల పేట, బొద్దూరు, గుళ్లసీతారాంపురం, పొనుగుటివలస, బిళ్లాని, తలతంపర, ఇజ్జిపేట, తదితర గ్రామాల్లో ప్రకంపనలు సంభవించాయి. శబ్దాలు, కదలికలతో నిద్రపోతున్న చిన్నారులు ఏడుస్తూ లేచిపోగా అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న వృద్ధులతోపాటు ఇళ్లలో ఉన్న మహిళలు, పురుషులు పిల్లలను పట్టుకొని బయటకు పరుగులు తీశారు. మొదటిసారి ప్రకంపనలు సంభవించినప్పుడు బయటకు వచ్చేసిన వారు కొద్దిసేపటికి తేరుకొని ఇళ్లలోకి వెళుతుండగానే మళ్లీ 9.21 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించడంతో మరోసారి బయటకు పరుగులు తీశారు. రాత్రి పదిన్నర, పదకొండు గంటల వరకు భయంతో ఆరుబయలు ప్రాంతాల్లోనే కాలక్షేపం చేశారు. అయితే ఎక్కడా ఎటువంటి ప్రమాదాలు జరిగినట్లు సమాచారం లేదు. -
నాటి పరాభవానికి..నేడు ప్రతీకారం!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్:సార్వత్రిక ఎన్నికల్లో రాజాం అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడం ద్వారా వైఎస్ఆర్సీపీ నేత కంబాల జోగులు గతంలో తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకీ గతంలో జోగులుపై ఎవరు దాడి చేశారు?.. ఆ దాడికి ఇప్పటి ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవడం ఏమిటని అనుకుంటున్నారా??.. అయితే ఒక్కసారి గతంలోకి వెళ్లాల్సిందే.. 2004 ఎన్నికల్లో కంబాల జోగులు పాలకొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఎన్నికల్లో తాజా మాజీమంత్రి కోండ్రు మురళీమోహన్ ఎచ్చెర్ల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006 ప్రాంతంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఒక సమావేశంలో జోగులుపై కోండ్రు దాడికి పాల్పడ్డారు. అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన ఆ శాఖ సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణాలకు సంబంధించి జోగులు పలు ప్రశ్నలు సంధించారు. దాంతో రెచ్చిపోయిన కోండ్రు.. మంత్రినే ప్రశ్నించేంత వాడివయ్యావా? అంటూ జోగులుపైకి దూసుకెళ్లి ఆయన మెడలోని కండువా పట్టుకొని దాడి చేశారు. ఈ సంఘటనలో జోగులు చొక్కా కూడా చిరిగిపోయింది. సౌమ్యునిగా పేరున్న జోగులుపై దాడి చేయడం పట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. తోటి దళిత శాసనసభ్యుడిని కోండ్రు దాడి చేసి, అవమానించడం పట్ల ఆ వర్గంలోనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. తనపై జరిగిన దాడితో మనస్తాపానికి గురైన జోగులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినా.. తర్వాత ఎందుకులే.. అనుకొని వదిలేశారు. అక్కడి నుంచి ప్రస్తుతానికి వస్తే.. ఈ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి కోండ్రు, జోగులు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారు. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన జోగులుకు 69,192 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ మంత్రి హోదాలో పోటీ చేసిన కోండ్రు మురళీకి 4790 ఓట్లు మాత్రమే వచ్చాయి. జోగులు విజయం సాధించగా.. కోండ్రు డిపాజిట్ కూడా గల్లంతై తీవ్ర పరాభవానికి గురయ్యారు. ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటన్న పలువురు గతంలో తనపై జరిగిన దాడికి జోగులు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. -
రాజాంలో కంబాల జోగులు విజయం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా రాజాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు విజయం సాధించారు. అలాగే పాతపట్నంలో పలమటి వెంకటరమణ, పాలకొండలో కళావతి గెలుపొందారు. టీడీపీ నుంచి గెలుపొందిన అభ్యర్థుల వివరాలు : *శ్రీకాకుళంలో- గుండా లక్ష్మీదేవి *ఎచ్చెర్లలో కళా వెంకట్రావు *ఆముదాలవలసలో కె.రవికుమార్ *నర్సన్నపేటలో రమణమూర్తి *టెక్కలిలో అచ్చెన్నాయుడు *పలాసలో జి.శ్యాంసుందర్ *ఇచ్చాపురంలో అశోక్ -
నీచరాజకీయాలపై అస్త్రం ‘రాజ్యాధికారం’
రాజాం రూరల్: అటు రాష్ట్రం.. ఇటు కేంద్రంలో అక్రమ పొత్తులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న నాయకుల నీచరాజకీయాలను ప్రజలను వివరించడానికే ‘రాజ్యాధికారం’ సినిమా తీస్తున్నామని సినీ దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి చెప్పారు. సినిమా షూటింగ్ కోసం శ్రీకాకుళం జిల్లా రాజాం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ సంస్కృతికి పట్టుకొమ్మలైన పల్లె సీమల్లో నేతలు వైషమ్యాలు రేపుతున్నారని, ఎన్నికల అనంతరం తమ దారి తాము చూసుకుని ఓటర్లను ఘోరంగా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పి ప్రజాస్వామ్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియజేయడానికి రాజ్యాధికారం సినిమా దోహదపడుతుందన్నారు. సీమాంధ్రకు రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంపిక చేస్తే అన్ని ప్రాంతాల వారికి మేలు చేకూరుతుందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఇక్కడ సముద్ర తీరప్రాంతంతోపాటు అధికంగా మైదాన ప్రాంతం ఉందని, దీనివల్ల త్వరితగతిన అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. సినీరంగానికి కూడా విశాఖపట్నం అనువైన ప్రాంతమని అన్నారు. -
మంత్రి కార్యాలయం ముట్టడి
రాజాం రూరల్, న్యూస్‌లైన్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో కొందరు అంగన్వాడీ కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు. రాజాం, రేగిడి, సంతకవిటి మండలాల్లో పని చేస్తున్న కార్యకర్తలు, ఆయాలు బుధవారం ఉదయం రాజాంలోని సామాజిక ఆస్పత్రి ఆవరణలో సమావేశమయ్యారు. అనంతరం సీఐటీయూ డివిజన్ కార్యదర్శి సీహెచ్ రామ్మూర్తినాయుడు ఆధ్వర్యంలో అంగన్వాడీలంతా ర్యాలీగా వెళ్లి పాలకొండ రోడ్డులోని మంత్రి కోండ్రు మురళీమోహన్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అప్పటికే సీఐ అంబేద్కర్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు. కార్యాల యంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా మహిళా పోలీసులు అడ్డుకున్నారు. మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో ఆ సంఘ అధ్యక్షురాలు పి.ఉమ సొమ్మసిల్లి పడిపోయారు. స్థానికుల ఉపచారాలతో ఆమె ఉపశమనం పొందారు. దీంతో మంత్రి, పోలీసులకు వ్యతిరేకంగా ఆం దోళనకారులు నినాదాలు చేశారు. స్థానిక నాయకుల మాటలు నమ్మి కోండ్రుకు ఓట్లు వేసి తప్పు చేశామని, సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో తరి మికొడతామని హెచ్చరించారు. పోలీసు ల తీరును నిరసిస్తూ రాజాం-పాలకొం డ ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ దేవానంద్‌శాంతో సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులను వారించారు. ట్రాఫిక్ స్తంభించిపోవడం తో శాంతియుతంగా ఆందోళన చేసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ స్టీవెన్సన్ హామీ మేరకు ఆందోళన విరమిం చారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వరలక్ష్మి, పుణ్యవతి, మంగమాంబ, ఉమాకుమారి, వేణుకుమారి పాల్గొన్నారు. -
చిరంజీవిపై రాళ్లువిసిరిన సమైక్యవాదులు
శ్రీకాకుళం: కేంద్ర మంత్రి చిరంజీవి ఏమంటా వరద ముంపు ప్రాంతాలలో పర్యటన మొదలు పెట్టారో అడుగడుగునా ఆందోళనలు, అటంకాలే ఎదురవుతున్నాయి. విశాఖ జిల్లా యలమంచిలిలో నిన్న వరద బాధితులు చిరంజీవి తమ వద్దకు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురంలో నాటుపడవ ఎక్కబోతూ కాలుజారి నీటిలో పడ్డారు. ఈరోజు రాజాంలో సమైక్యవాదులు అతనిపై రాళ్లు విసిరారు. వరద ముంపు ప్రాంతాలలో పర్యటనకు వచ్చిన చిరంజీవి కాన్వాయ్‌పై విద్యార్థులు రాళ్లు రువ్వారు. వారితోపాటు సమైక్యవాదులు కూడా రాళ్లు విసిరారు. పదవి వదులుకున్న తరువాతే పర్యటనకు రావాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. నిన్న ఉదయం చిరంజీవి విశాఖపట్నం జిల్లా యలమంచిలి మీదగా వెళ్లారు. ఇక్కడ వరదకు గురైన ప్రాంతాలను చూడలేదు. బాధితులనూ పలకరించలేదు. కేంద్ర మంత్రి చిరంజీవి యలమంచిలి వస్తున్నట్లు చెప్పడంతో బాధితులు ఆయన కోసం ఎదురు చూశారు. దాదాపు మూడు గంటలపాటు ఆయన కోసం వేచి ఉన్నారు. కానీ ఆయన యలమంచిలి పట్టణంలోకి రాకుండా, బైపాస్ రోడ్డున వెళ్లిపోయారు. దాంతో స్థానిక వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కష్టాలు పడుతున్న తమను పట్టించుకోవడంలేదని వాపోయారు. ఆ తరువాత కాకినాడ సమీపంలోని తిమ్మాపురంలో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించే సమయంలో పడవ ఎక్కబోయి కాలుజారి నీటిలో పడ్డారు. అయితే సిబ్బంది వెంటనే ఆయనను పట్టుకొని లేపారు. ఈ విధంగా ఆయన వెళ్లిన ప్రతిచోట ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతోంది. -
రాజాంలో ఓ పాప కథ
రాజాం రూరల్, న్యూస్‌లైన్: స్వార్థ చింతన తప్ప సేవాభావం లేని సమాజమిది. అబలలను.. అభం శుభం తెలియని చిన్నారులను చిదిమేసే దుర్మదాంధులతో నిండిపోయిన ఈ సమాజంలో సేవాభావం.. ఆదుకునే మనసున్న మారాజులు ఇంకా అక్కడక్కడా ఉన్నారు. రాజాంలో తప్పిపోయి రోడ్డున పడిన ఓ చిన్నారి 5 గంటల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చేరిన ఉదంతమే దీనికి నిదర్శనం. ఆ చిన్నారి సృష్టించిన కలకలం మీరూ చూడండి.. చదవండి.. మంగళవారం ఉదయం.. సమయం 8 గంటలు.. రెండుమూడేళ్లు కూడా నిండని పసితనం.. కళ్లలో బేలతనం.. మాటలు కూడా రాని లేలేతప్రాయం.. చిట్టి చేతుల్లో చిన్ని పలక.. బుడిబుడి అడుగులతో రోడ్డుపైకి వచ్చిందో చిన్నారి. అప్పటికే రద్దీగా మారిన సారధి రోడ్డు, శ్రీనివాస థియేటర్ రోడ్డు, బస్టాండ్ రోడ్డు మీదుగా మాధవ బజార్ జంక్షన్ సమీపంలోకి వెళ్లింది. రోడ్డున పోయేవారు ఆ చిట్టితల్లిని చూసి ఎవరీ పాప.. ఇలా ఒంటరిగా వెళుతోంది.. అని విస్తుపోతూ చూశారు. కొందరు వాహనాల బారి నుంచి ఆ చిన్నారిని రక్షించి రోడ్డు దాటించారే తప్ప.. ఆమెను పోలీసులకు అప్పగించే ప్ర యత్నం చేయలేదు. అలా ఆ పాప మాధవ బజార్ ఫుట్‌పాత్ షాపుల వద్దకు చేరుకుం ది. నడిచినడిచి అలసిపోయిందేమో..ఓ దుకాణం వద్ద కూర్చుండిపోయింది. అప్పటికిగాని అక్కడి దుకాణదారులకు అనుమానం రాలేదు. వెంటనే విలేకరులకు సమాచారం అందించారు. వారు ఇద్దరు సామాజికవేత్తల సాయంతో ఆ చిట్టితల్లిని స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అలసి సొలసిన ఆ పాప ఆస్పత్రి బెంచిపైనే నిద్రలోకి జారుకుంది. ఇలా 5 గంటలు గడిచాయి. ఈ వార్త పట్టణమంతా వ్యాపించి కలకలం రేపింది. అప్పటికే తమ కుమార్తె కనిపించక వెతుకులాట ప్రారంభించిన చిన్నారి తల్లిదండ్రులు రమాశంకర్, రచనాకుమారిలు పాప ఆస్పత్రిలో ఉన్న విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకుని.. పరుగున వచ్చి అక్కున చేర్చుకున్నారు. ఆనందభాష్పాలు రాల్చారు. కథ సుఖాంతమైనందుకు స్థానికులూ సంతోషించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, 16 మంది గాయాల పాలయ్యారు. మృతులిద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. రాజాం రూరల్, న్యూస్‌లైన్: స్థానిక పాలకొండ రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వాహనం ఢీకొని ఒక వ్యక్తి (35) మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలియలేదు. రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని వాహనం ఢీకొనడంతో పడిపోయాడని, వాహన చోదకులు బాధితుడిని పరిశీలించి కొనఊపిరితో ఉండడం గమనించి భయంతో రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారని అక్కడ ఉన్న ఆనవాళ్లను బట్టి పోలీసులు భావిస్తున్నారు. తర్వాత ఆ మార్గంలో వచ్చిన వారు చూసి 100 నంబరుకు ఫోన్ చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారని సంతకవిటి ఎస్సై ఎ.నాగేశ్వరరావు తెలిపారు. బాధితుడిని 108 వాహనంలో రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ గార రవిప్రసాద్ పరిశీలించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. శుక్రవారం ఉదయం పోలీసులు మృతుడి ఫోటోలు తీసి గుర్తింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. మృతుడి వంటిపై నీలం రంగు జీన్ ఫ్యాంట్, పసుపు రంగుపై అడ్డంగా తెలుపు గీతలు ఉన్న టీషర్టు ఉన్నాయి. కుడి చేయి మణికట్టుపైన గౌరమ్మ, తవిటియ్య అనే పేర్లతో పచ్చబొట్టు ఉందని, మెడలో నల్లపూసల దండ, ఎడమ చెవికి బంగారం పోగు ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. రైలు కిందపడి వ్యక్తి మృతి పలాస : బారువా-సోంపేట రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (30) గుర్తు తెలియని రైలు కింద పడి మృతి చెందినట్లు కాశీబుగ్గ రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ సీహెచ్ సత్యనారాయణ తెలిపారు. మృతుడి వంటిపై ఎరుపు, తెలుపు, నలుపు రంగు గీతలు గల ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ఉన్నాయన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ సత్యనారాయణ తెలిపారు. జీపు బోల్తా - 13 మందికి తీవ్ర గాయాలు మందస : హరిపురం సమీపంలో గల పాత జాతీయ రహదారిపై శుక్రవారం జీపు బోల్తా పడిన సంఘటనలో 14 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, క్షతగాత్రులు తెలిపిన సమాచారం ప్రకారం... సోంపేట వైపు నుంచి హరిపురం మీదుగా పలాస వైపు వెళుతున్న ఓ దినపత్రికకు సంబందించిన మహేంద్ర జీపును డ్రైవర్ అతి వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని తెలిసింది. హరిపురం వద్ద జీపు అకస్మాత్తుగా రోడ్డుపై తిరగబడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొల్లి వరలక్ష్మి(మామిడిపల్లి) అప్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. మామిడిపల్లి గ్రామానికి చెందిన భార్యా భర్తలు మజ్జి చిరంజీవులు, మజ్జి కృష్ణవేణి, పి.లక్ష్మీనారాయణ (ఎర్రముక్కాం), బుడతా చంద్రావతి (కొర్లాం), కె.పద్మావతి (రాణిగాం), కర్రి సుజాత (బారువ), నాగవరపు శ్రీరాములు (రణస్థలం), బూరగాన శ్రీదేవి (తాళ్ళబద్ర), శ్యామల, సుహాసిని, పద్మతో పాటు జీపు డ్రైవర్ షేక్ సర్దార్(చీపురుపల్లి)కి తీవ్రగాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారులు ప్రాథమిక చికిత్స అనంతరం పలాస సీహెచ్‌సీకి తరలించారు. బాధితుల్లో వరలక్ష్మి, చంద్రావతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ ఎల్.చంధ్రశేఖర్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ఇద్దరికి.... మందస : చాపరాయి సమీపంలో ద్విచక్రవాహనం గెడ్డలో పడిపోవడంతో మఖరజోల గ్రామానికి చెం దిన ఇద్దరు గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్రవాహనంపై బమ్మిడి కృష్ణారావు, తమ్మినాన అప్పారావు పట్టులోగాం వెళ్ళి వస్తండగా అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులన హరిపురం ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. వైద్యాధికారులు ప్రధానో, టి.పాపినాయుడు వైద్యసేవలందించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్టణం కేజీహెచ్‌కు తరలించారు.