రాజమ్
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లెజెండరీ దర్శకులు కె.బాలచందర్. 2014 డిసెంబరు 23న ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలచందర్ సతీమణి రాజమ్ (84) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం 4.30 గంటలకు తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. కవితాలయ ప్రొడక్షన్స్ పతాకంపై రాజమ్ బాలచందర్ సినిమాలను నిర్మించేవారు. ‘సింధు భైరవి, నాన్ మహాన్ అల్ల, ఎనక్కుళ్ ఒరువన్’ లాంటి సినిమాలు నిర్మించారు. రాజమ్ బాలచందర్ దంపతులకు కొడుకు ప్రసన్న, కూతురు పుష్ప ఉన్నారు. రాజమ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న సినిమా ప్రముఖులు ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజమ్ అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment