
ప్రముఖ నిర్మాత, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె, నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి సతీమణి వరలక్ష్మి (62) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె బుధవారం రాత్రి మరణించారు. నేడు ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
టాలీవుడ్‌లో ప్రముఖ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు పొందిన శ్యామ్‌ప్రసాద్ రెడ్డి.. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ స్థాపించి పలు సీరియల్స్‌తో పాటు టీవీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి వంటి సినిమాలను శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment