టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా ఆడియన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు 138 గంటల పాటు యూట్యూబ్‌లో నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అయింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది.
అయితే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత గురించి చాలామందికి తెలియదు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమాలతో పాటు ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ తబిత కనిపించారు. ఆమె వర్కవుట్స్ సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment