
ఆదివారం ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ఫీవర్ నడిచింది. దుబాయిలో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు తెలుగు సెలబ్రిటీలు కూడా వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, ఫ్యామిలీతో కలిసి దర్శకుడు సుకుమార్ కూడా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)
ఇదే మ్యాచ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా సందడి చేసింది. తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు సుకుమార్ ని కూడా గట్టిగానే కాక పట్టేందుకు ప్రయత్నించినట్లు అనిపించింది. ఎందుకంటే సుకుమార్ ని కలిసిన ఆనందంలో ఆయన చేయి పట్టుకున్న ఊర్వశి.. కాసేపటి వరకు అస్సలు వదల్లేదు. ఆ వీడియోనే తన ఇన్ స్టాలోనూ పోస్ట్ చేసింది.
సుకుమార్ ని కలిసిన వీడియోని పోస్ట్ చేసిన ఊర్వశి.. ఈయన్ని తెగ పొగిడేసింది. 'సుకుమార్ గారు మీరు సాధించిన విజయాలకు శుభాకాంక్షలు. మీ మేధస్సు, డెడికేషన్ మమ్మల్ని ఎంతగానో స్పూర్తి కలిగిస్తున్నాయి. మేమంతా మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం' అని రాసుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)
ఈ మధ్యే సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్'లో దబిడి దిబిడి అంటూ ఐటమ్ పాటకు స్టెప్పులేసిన ఊర్వశి.. బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు పనిలో పనిగా సుకుమార్ ని కూడా కాకా పట్టేసి తెలుగు ఇండస్ట్రీలో సెటిలైపోయే ప్లాన్ ఏమైనా వేస్తుందా అనిపిస్తుంది.
మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 241 పరుగులు చేసింది. ఛేదనలో కొన్ని ఓవర్లు మిగిలుండగానే భారత్ గెలిచేసింది. కోహ్లీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
(ఇదీ చదవండి: 'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!)
Comments
Please login to add a commentAdd a comment