Urvashi Rautela Charged More Than Rs 6 Crore For A 3-Minute Item Song In Pushpa 2: Report - Sakshi
Sakshi News home page

Pushpa 2: The Rule: పుష్ప-2లో ఐటం సాంగ్.. ఊర్వశి రౌతేలా రెమ్యునరేషన్ వింటే షాక్!

Published Fri, Jul 7 2023 5:31 PM | Last Updated on Fri, Jul 7 2023 6:17 PM

Urvashi Rautela Charged More Than 6 Crore Rupees For Song In Pushpa 2 - Sakshi

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐకాన్ స్టార్ మూవీ 'పుష్ప-2: ది రూల్'. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పుష్ప పార్ట్‌-2 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టగా.. ఈ చిత్రం అంతకుమించి ఉంటుందని తెలుస్తోంది. పుష్పలో సమంత చేసిన ఐటమ్ సాంగ్‌ 'ఊ అంటా మావ.. ఉఊ అంటావా మావ' క్రేజ్‌ మామూలుగా లేదు. ఆ పాటకు డ్యాన్స్‌ చేయకుండా ఉండలేని వారు ఉండరంటే అతియోశక్తి కాదేమో. అంతలా సినీ ప్రేక్షకులను ఊపేసింది. 

(ఇది చదవండి: భార్య కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్‌ చేసిన స్టార్ హీరో! )

అయితే పుష్ప-2లోనూ అదిరిపోయే ఐటమ్‌ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కనిపించనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ మీడియా కథనం ప్రకారం ఈ మూడు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం ఆమె ఏకంగా రూ.6 నుంచి రూ.7 కోట్లు వసూలు తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఊర్వశి కూడా అంతకంటే ఎక్కువే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. 

కాగా.. పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17, 2021న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు.బాలీవుడ్ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈచిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. గతంలో బన్నీ బర్త్‌ డే సందర్భంగా పుష్ప-2  ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే రిలీజైన పుష్ప-2 గ్లింప్స్ వీడియోతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. 

(ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement