ind vs pak
-
పాక్‌పై విజయం: ‘వన్ విత్ నేచర్’ అంటున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (ఫొటోలు)
-
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజే వేరు
-
పాకిస్థాన్‌పై ఇషాన్ సూపర్ ఇన్నింగ్స్.. గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ వైరల్!
టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ రేంజే వేరు. రెండు దేశాల్లోని అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌పైనే అందరిదృష్టి ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. తాజాగా శ్రీలంకలో జరుగుతున్న ఆసియాకప్ మ్యాచ్‌లో ఇండియా-పాకిస్థాన్ తలపడ్డాయి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది. కానీ ఆ తర్వాతే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు మన యువకెరటం ఇషాన్ కిషన్. స్టార్స్ ఔటైన చోటే దూకుడు ప్రదర్శించాడు. 82 పరుగులతో అద్భుతంగా రాణించి అందరినీ దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పట్ల అభిమానం చాటుకుంది ఓ మోడల్. ఇషాన్ గర్ల్ ఫ్రెండ్‌గా భావిస్తున్న అదితి హుండియా అతని ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కిషన్ ఫోటో షేర్ చేస్తూ డ్రీమ్ ఇన్నింగ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు అదితి ఎవరు? కాగా.. అదితి హుండియా వృత్తిరీత్యా మోడల్ కాగా.. ఆమె ఇషాన్‌తో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లు జరిగినప్పుడు ఇషాన్‌కు మద్దతుగా నిలిచింది. అంతేకాకుండా ఇషాన్, అదితి చాలా సార్లు కలిసి బయట కనిపించారు. వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే వారి రిలేషన్‌పై అదితి, ఇషాన్ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. -
డీకేను తిట్టుకోవాల్సి వచ్చింది: అశ్విన్
-
Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం
చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తిచ్చిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ చివరి ఓవర్లో పాక్ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన బంతిని అంపైర్లు 'నో బాల్'గా ప్రకటించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరి ఓవర్ నాలుగో బంతిని నవాజ్ ఫుల్ టాస్ వేయగా కోహ్లి దాన్ని సిక్సర్‌గా మలిచాడు. నడుము ఎత్తులో వచ్చిన ఈ బంతిని అంపైర్లు నో బాల్‌గా ప్రకటించారు. వెంటనే పాకిస్థాన్ టీం సభ్యులంతా అంపైర్లతో వాదించారు. అయినా వాళ్లు నిర్ణయాన్ని మార్చుకోలేదు. నో బాల్ తర్వాత ఫ్రీ హిట్‌గా వచ్చిన బంతికి కోహ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వికెట్లను గిరాటేసిన బంతి బౌండరీ వైపు దూసుకెళ్లడంతో కోహ్లి- దినేశ్ కార్తీక్ మూడు పరుగులు తీశారు. ఫ్రీ హిట్ అయినందున బ్యాటర్ బౌల్డ్ అయినా ఔట్ ఉండదనే నిబంధనను కోహ్లి చక్కగా వినియోగించున్నాడు. ఈ బంతితోనే మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది. చివరి రెండు బంతులకు రెండు పరుగులే అవసరమయ్యాయి. అయితే ఈ నోబాల్ వ్యవహారంపై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ట్విట్టర్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. నడుము ఎత్తులో వచ్చిన బంతిని అంపైర్లు రివ్యూ తీసుకోకుండానే నో బాల్‌గా ఎలా ప్రకటించారని అడిగాడు. ఫ్రీ హిట్ బాల్‌కు కోహ్లి బౌల్డ్ అయినప్పుడు.. దాన్ని డెడ్ బాల్‌గా ఎందుకు ప్రకటించలేదు? అని ప్రశ్నించాడు. Why was no ball not reviewed, then how can it not be a dead ball when Kohli was bowled on a free hit. #INDvPAK #T20worldcup22 pic.twitter.com/ZCti75oEbd — Brad Hogg (@Brad_Hogg) October 23, 2022 ఈ నో బాల్ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. బంతి బ్యాటర్ నడుము ఎత్తుకు పైకి వస్తేనే నో బాల్ అని కొందరు అంటున్నారు. అంతిమ నిర్ణయం అంపైర్లదే అని, దానికి ఇరు జట్లు కట్టుబడి ఉండాలని మరికొందరు అంటున్నారు. మరికొందరేమో కోహ్లి దాదాపు క్రీజు బయట ఉన్నాడు.. అలాంటప్పుడు బంతి నడుము ఎత్తుపైకి వచ్చినా నో బాల్ కాదు అని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ మ్యాచ్‌లో భారత్ చివరి బంతి వరకు అద్భుత పోరాటపటిమ ప్రదర్శించి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా కింగ్ కోహ్లి తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. ఈ మ్యాచ్ తనకు చిరకాలం గుర్తుండిపోతుందని చెప్పాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లి -
Ind Vs Pak Highlight Photos: ఉత్కంఠపోరులో పాక్‌పై టీమ్ఇండియా విజయం (ఫొటోలు)
-
ఇండియాకి వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉందా..?
-
పాక్‌తో పోరుకు భారత్ సై.. ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా (ఫొటోలు)
-
ప్రపంచకప్ సమరం.. ఒకే ఫ్రేమ్‌లో 16 జట్ల కెప్టెన్లు (ఫొటోలు)
-
అర్షదీప్ వ్యవహారం.. కేంద్రం తీవ్రస్పందన
టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్‌పై కొందరు టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆదివారం పాక్‌తో మ్యాచ్ సందర్భంగా.. మ్యాచ్‌ను మలుపు తిప్పే కీలకమైన క్యాచ్‌ను వదిలేశాడంటూ అర్షదీప్‌ను తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో పాటు పలువురు ఆటగాళ్లు, మాజీల మద్దతు అతనికి లభిస్తోంది. అయితే.. అర్షదీప్ సింగ్ వ్యవహారంలో అనుచితమైన చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు. అతనిపై దాడి చేస్తామని, చంపేస్తామని కొందరు బైకులపై తిరుగుతూ గోల చేయడం తెలిసిందే. తాజాగా అతనికి నిషేధిత సంస్థ ఖలీస్తానీతో సంబంధం ఉందంటూ తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. అతని వికీపీడియా పేజీలో భారత్ స్థానంలో ఖలిస్తాన్ అంటూ ఎడిట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. అయితే.. ఈ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. వికీపీడియా పేజీలో చోటు చేసుకున్న తప్పుడు సమాచారం వల్ల మత సామరస్యం దెబ్బతింటుందని, పైగా అర్షదీప్ కుటుంబ సభ్యులకు ముప్పు ఏర్పడుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్‌లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది. తప్పుడు సమాచారం ఎలా ప్రచురితమైందో వివరణ ఇవ్వాలని అందులో కోరింది. ఇదిలా ఉంటే.. అర్షదీప్ వికీపీడియా పేజీలో భారత్ అని ఉన్న చోట.. ఖలిస్తాన్ అని జత చేశారు. అది అన్‌రిజిస్టర్డ్ అకౌంట్ నుంచి జత అయినట్లు తెలుస్తోంది. అయితే.. 15 నిమిషాలోపే వికీపీడియా ఎడిటర్స్ ప్రొఫైల్‌ను సవరించారు. ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి పాలైన తర్వాత అర్షదీప్ సింగ్‌పై కొందరు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మ్యాచ్‌లో భాగంగా 18వ ఓవర్లో మూడో బంతికి రవి బిష్ణోయ్ వేసిన బంతిని అసిఫ్ అలీ స్వీప్ షాట్ అడగా.. సలువైన క్యాచ్‌ను అర్షదీప్ జారవిడిచాడనే విమర్శ చెలరేగింది. అయితే.. ఉత్కంఠభరితమైన చివరి ఓవర్లో అర్షదీప్ సింగ్ పరుగుల కట్టడికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్షదీప్‌కు విపరీతమైన మద్దతు లభిస్తోంది. Catch drop by arshdeep singh 😭#arshdeepsingh #INDvPAK #INDvsPAK2022 pic.twitter.com/ttxabkCArI — Girish Singh rajput (@GirishSinghraj3) September 4, 2022 Senior pro Virat Kohli backs youngster Arshdeep Singh, who had a volatile day at the field today#AsiaCup2022 #INDvsPAK #ViratKohli #ArshdeepSingh pic.twitter.com/FYPl5N4PMx — OneCricket (@OneCricketApp) September 4, 2022 He is best in death overs , we can’t blame for his one match.. I stand with #arshdeepsingh #INDvsPAK2022 pic.twitter.com/pDkbYTrBWY — Karan Sandhu (@Karanbi03633746) September 5, 2022 #NewProfilePic pic.twitter.com/ksSXCNMOgC — Aakash Chopra (@cricketaakash) September 5, 2022 ఇదీ చదవండి: చిన్న పొరపాట్లే మిస్త్రీ ప్రాణాలు తీశాయా? -
మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్
-
భారత్ ఓటమికి మహమ్మద్ షమీని టార్గెట్ చేశారు: ఒవైసీ
-
ఇండియా పాక్ మ్యాచ్.. అక్కడ కూడా ఫ్లాప్.. కానీ రూ.300 కోట్లు వెనక్కి
Hotstar Ad Revenue During Ind Vs Pak T20 Match: టీ 20 ప్రపంచకప్‌లో ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ భారత అభిమానులకు నిరాశ కలిగించినా హాట్‌స్టార్‌కు మాత్రం ఆనందాన్నే పంచింది.ఈ ఒక్క మ్యాచ్ ద్వారానే పెట్టుబడిలో మూడొంతులు ఆ సంస్థకు వచ్చేసింది. హాట్‌స్టార్ హ్యాపీయేనా ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల్లో అనధికారిక కర్ఫ్యూ వాతావరణం నెలకొంటుంది. కోట్లాది మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఈసారి టీ20 మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా జరగడంతో కర్ఫ్యూ తరహా వాతావరణం ఎక్కువ సేపు లేదు. అయినా సరే ఈ మ్యాచ్ డిజిటల్ ప్రచార హక్కులు దక్కించుకున్న హాట్‌స్టార్ బాగానే సొమ్ము చేసుకుంది. విరాట్ కోసం ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా హయ్యస్ట్ వ్యూయర్ షిప్‌గా 14 మిలియన్లుగా నమోదు అయ్యింది. మ్యాచ్ 16వ ఓవర్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన సందర్భంలో హాట్‌స్టార్‌లో 1.40 కోట్ల మంది మ్యాచ్‌ని వీక్షించారు. మొత్తం మ్యాచ్‌లో ఇదే అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన సమయంగా నిలిచింది. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ మొదలై మొదటి పది ఓవర్లు ముగిసే సరికి వ్యూయర్షిప్ సగానికి సగం పడిపోయి 7.5 మిలియన్ల దగ్గర నమోదయ్యింది. ఆడకపోయినా అండగా భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ అనగానే టాస్ వేయడం ఆలస్యం హాట్‌స్టార్‌లో వ్యూయర్ షిప్ అలా అలా పెరుగుతూ పోయింది. మొదటి బాల్ వేసే సమయానికే 4.1 మిలియన్ల మంది హాట్‌స్టార్‌కి అతుక్కుపోగా మూడో బాల్ వేసే సరికి ఆ సంఖ్య 5.9 మిలియన్లకి చేరుకుంది. ఓపెనర్లు త్వరగా అవుటైపోయినా అభిమానులు నమ్మకం కోల్పోలేదు. విరాట్ ఉన్నాడనే భరోసాతో భారత్ బ్యాటింగ్ పూర్తయ్యే వరకు 10 మిలియన్లకు పైగానే వీక్షకులు ఉన్నారు. ఆ తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. రూ. 300 కోట్లు ఇండియాపై పాకిస్తాన్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో పాటు వరల్డ్‌కప్‌లో ఆ జట్టుకి ఉన్న పాత రికార్డును చెరిపేసింది. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కానీ మ్యాచ్‌లో యాడ్స్ ప్రసారం చేయడం ద్వారా హాట్‌స్టార్‌కి ఏకంగా రూ.300 కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. ఈ హైటెన్షన్ మ్యాచ్‌కి ప్రీమియం టారిఫ్‌లు అమలు చేశారు. దీంతో రికార్డు స్థాయి ఆదాయం దక్కింది. ఈ వరల్డ్ కప్ డిజిటల్ హక్కులకు హాట్‌స్టార్ రూ. 1000 కోట్లు వెచ్చించగా ఒక్క పాక్ ఇండియా మ్యాచ్‌తోనే రూ. 300 కోట్లు వెనక్కి వచ్చేశాయి. రికార్డు పదిలం ఐపీఎల్ 13వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి ఏకంగా 18 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇదే రికార్డు. ఇండియా, పాక్ మ్యాచ్ ఈ రికార్డును బద్దుల కొడుతుందని అంతా అంచనా వేశారు. కానీ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో అభిమానులు సైతం మ్యాచ్ పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. -
భారత్‌తో మ్యాచ్.. కన్నీటి పర్యంతమైన బాబర్ ఆజమ్ తండ్రి, వైరల్ వీడియో
Babar Azam Father Gets Emotional: భారీ అంచనాలతో టీ20 వరల్డ్‌కప్ బరిలోకి దిగిన భారత్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దాయాది దేశంతో పోరులో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లి సేన 151 పరుగులు చేసినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాహిన్ అఫ్రిది (3/31) టీమిండియాను దెబ్బ కొట్టాడు. ఇక రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యంతో పరుగుల వరద పారించిన మొహమ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించారు. 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలుపొందడంతో పాకిస్తాన్ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. (చదవండి: IND Vs PAK: చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్లు.. ) ఈక్రమంలో మ్యాచ్ వీక్షిస్తున్న పాక్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ తండ్రి ఆజమ్ సిద్ధిఖీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో ఏళ్లుగా భారత్‌పై విజయం కోసం నిరీక్షిస్తున్న వేళ తన కొడుకు సారథ్యంలో ఆ కల నేరవేరడంతో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విజయంతో గ్రూప్ 2లో పాకిస్తాన్ టాప్‌లో కొనసాగుతోంది. (చదవండి: ఐఎస్ఎల్లో తొలి భారతీయ హెడ్ కోచ్‌గా ఖాలిద్ జమీల్) This is Babar Azam’s father. So happy for him. I first met him in 2012 at Adnan Akmal’s walima. Babar at that time was 3 years away from Pakistan debut. I clearly remember what his father told me “bas debut ho jane do. Agay sara maidaan babar ka hai” pic.twitter.com/ZlsvODQkSg — Mazher Arshad (@MazherArshad) October 24, 2021 -
IND Vs PAK: దారుణంగా విఫలమైన టీమిండియా టాపార్డర్
-
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న యావత్ క్రికెట్ ప్రపంచం
-
భారత్ వర్సెస్ పాకిస్తాన్ :భావోద్వేగాల సమరం
-
ఓ పక్క మన వాళ్లను చంపుతుంటే, పాక్‌తో టీ20 అవసరమా.
-
IND Vs PAK:సోషల్ మీడియా కు దూరంగా సానియా
-
మహి మ్యాజిక్ పనిచేసేనా..?
-
నేను స్లెడ్జ్ చేస్తా.. నువ్వు కేవలం నవ్వు అంతే!
‘‘ఎప్పటిలాగే షోయబ్ అక్తర్ స్లెడ్జింగ్ చేస్తున్నాడు. భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు మా దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని తిప్పికొట్టాలనుకున్నా. ఆ క్రమంలోనే అవతలి ఎండ్‌లో ఉన్న ఎంఎస్ ధోనితో చర్చించా. నేను స్లెడ్జ్ చేస్తాను. నువ్వు అతడిని చూసి కేవలం నవ్వు అని చెప్పా. అందుకు ధోని సరేనన్నాడు. అప్పుడు అక్తర్ మరింతగా దూకుడు పెంచాడు. రివర్స్ స్వింగ్ వేయకుండా తనని కట్టడి చేయడమే మా ప్లాన్. తర్వాతి బాల్ కూడా ఇంతే ఇంటెన్సిటీతో విసరగలవా అని అక్తర్‌ను రెచ్చగొట్టాను. అప్పుడు అతను.. ‘‘నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చూడు నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తా’’ అంటూ కోపం ప్రదర్శించాడు. అది నీవల్ల కాదు.. నేను కూడా నిజమైన పఠాన్‌ను. నువ్వు బౌలింగ్ చెయ్యి అంతే. ఎక్కువ మాట్లాడకు అన్నాను’’ అంటూ టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ 2006 నాటి టెస్టు క్రికెట్ మ్యాచ్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ధోనితో కలిసి 210 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. భారత్ 603 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. కాగా 2006లో ఫైసలాబాద్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 588 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఇక ఆనాటి సంగతుల గురించి స్పోర్ట్స్ టాక్‌తో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్.. అక్తర్ స్లెడ్జింగ్‌కు ధీటుగా బదులిచ్చినట్లు పేర్కొన్నాడు. ఐదు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన తాను... అక్తర్ బౌలింగ్ ఎదుర్కొన్న విధానం గురించి చెబుతూ... ‘‘నేను బ్యాటింగ్‌కు రాగానే 150-160 కి.మీ వేగంతో అక్తర్ పేస్ సంధించాడు. ఆ తర్వాత తను బౌన్సర్ విసిరాడు. నేను ఎదుర్కొన్నా. ఆ తర్వాత షార్ట్ బాల్స్ వేశాడు. ఇక అప్పుడు.. పెద్దగా భయపడాల్సిందేమీ లేదు.. నువ్వు బ్యాటింగ్ చేయమని ధోని చెప్పాడు. ఇంతలో నేను ధోని దగ్గరికి వెళ్లి అక్తర్ వినేలా.. ‘‘పాజీ.. పిచ్ తేమగా ఉంది. ఇంతకంటే షార్ట్ బంతులు సంధించు అన్నా’’. మళ్లీ అక్తర్ ఉడికిపోయాడు. స్పెల్ వేశాడు. దాంతో బ్యాటింగ్ ఈజీ అయ్యింది. అలా మ్యాచ్‌ను కాపాడుకుని డ్రా చేయగలిగాం’’ అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. -
ఇంతకీ ఆ గుర్రానికీ టికెట్ తీసుకున్నాడా?
మాంచెస్టర్: దాయాదులు భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. అందులోనూ వరల్డ్ కప్‌లో దాయాదులు తలపడుతున్నారంటే ఇంకా చెప్పాల్సిన పనిలేదు. ఇరుదేశాలు క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతాయి. ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ ఫీవర్ పెద్దస్థాయిలో కనిపించింది. ఏ ఇంట్లో చూసినా క్రికెట్ గోలే, ఎవర్ని కదిలించినా మ్యాచ్ ముచ్చట్లే.. ఇక ఓ అభిమాని ఏకంగా గుర్రంపై మైదానానికి వచ్చి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ, చేతిలో పాకిస్తాన్ జెండాతో స్టేడియానికి ఓ అభిమాని మైదానానికి విచ్చేశాడు. అతని వెనకే పాకిస్తాన్ జట్టు అభిమానులతో కూడిన బస్ కూడా వచ్చింది. ఇక పాక్ అభిమాని గుర్రంపై స్టేడియానికి విచ్చేసిన వీడియో.. ట్విట్టర్‌ను నవ్వులతో ముంచెత్తింది. 'ఇంతకీ ఆ గుర్రానికి కూడా టికెట్ తీసుకున్నాడా', 'అయినా ఆ గుర్రాన్ని ఎక్కడ పార్క్ చేశారు' అంటూ నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే ఆట ప్రారంభం కాకముందు పాక్‌కు మద్దతుగా గుర్రంపై క్రేజీగా ఓ అభిమాని ఎంట్రీ ఇచ్చాడు. ఇదే మ్యాచ్‌లో ఇండియా విజృంభించడంతో ఆట మధ్యలోనే ఇంకో అభిమాని కన్నీటి పర్యంతమవుతూ అదే జట్టును తిట్టిపోశాడు. -
ప్రపంచకప్ : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్
-
ఇండియా, పాక్ మ్యాచ్.. కేసీఆర్ ఎంజాయ్
హైదరాబాద్: దాదాపు రెండేళ్ల తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్‌ను తమ వ్యక్తిగత మ్యాచ్‌గా భావించి మరీ టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ తరుణంలో ఎప్పుడూ రాజకీయాల్లో తలమునకలై ఉండే నాయకులు అసలు క్రికెట్ చూస్తారా? విజయం సాధించినప్పుడు అందరిలాగా సంతోషపడతారా?వంటి విషయాలను పరిశీలిస్తే.. మిగితా మ్యాచ్‌ల సంగతేమోగని భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌ను మాత్రం దాదాపు అందరు నేతలు చూస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా చూస్తారంట. పాక్‌పై విజయం సాధించగానే భళా భారత్ అన్నట్లుగా ఆయన సందడి చేస్తారని ఆయన తనయుడు కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు. ట్టిట్టర్లో ఖాతాదారుడైన సాయి అనే ఓ వ్యక్తి ఇండియా పాక్ మ్యాచ్ విషయాన్ని ప్రశ్నించాడు. మీరుగానీ, మన ప్రియమైన ముఖ్యమంత్రిగానీ ఎప్పుడైనా భారత్, పాక్ మ్యాచ్‌ను చూశారా? విజయం సాధించిన సమయంలో వేడుకలు చేసుకున్నారా? అని అడిగాడు. దీనికి బదులిచ్చిన కేటీఆర్..‘ముఖ్యమంత్రిగారు క్రికెట్ చూడటాన్ని ఇష్టపడతారు. మనందరిలాగే ఆయన కూడా భారత్ విజయం సాధించిన సందర్భాన్ని ఎంజాయ్ చేస్తారు’ అంటూ ట్వీట్ చేశారు. CM garu loves watching cricket and enjoys India winning like any of us of course https://t.co/FRto77susY — KTR (@KTRTRS) 4 June 2017