ఇంతకీ ఆ గుర్రానికీ టికెట్‌ తీసుకున్నాడా? | ICC World Cup 2019: Fan Arrives On A Horse At The India Vs Pakistan Match | Sakshi
Sakshi News home page

ఇంతకీ ఆ గుర్రానికీ టికెట్‌ తీసుకున్నాడా?

Published Mon, Jun 17 2019 3:25 PM | Last Updated on Mon, Jun 17 2019 5:45 PM

ICC World Cup 2019: Fan Arrives On A Horse At The India Vs Pakistan Match - Sakshi

మాంచెస్టర్: దాయాదులు భారత్‌-పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఆ క్రేజ్‌ వేరుగా ఉంటుంది. అందులోనూ వరల్డ్‌ కప్‌లో దాయాదులు తలపడుతున్నారంటే ఇంకా చెప్పాల్సిన పనిలేదు. ఇరుదేశాలు క్రికెట్‌ ఫీవర్‌తో ఊగిపోతాయి. ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ ఫీవర్‌ పెద్దస్థాయిలో కనిపించింది. ఏ ఇంట్లో చూసినా క్రికెట్‌ గోలే, ఎవర్ని కదిలించినా మ్యాచ్‌ ముచ్చట్లే.. ఇక ఓ అభిమాని ఏకంగా గుర్రంపై మైదానానికి వచ్చి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ, చేతిలో పాకిస్తాన్‌ జెండాతో స్టేడియానికి ఓ అభిమాని మైదానానికి విచ్చేశాడు. అతని వెనకే పాకిస్తాన్‌ జట్టు అభిమానులతో కూడిన బస్‌ కూడా వచ్చింది. 

ఇక పాక్‌ అభిమాని గుర్రంపై స్టేడియానికి విచ్చేసిన వీడియో.. ట్విట్టర్‌ను నవ్వులతో ముంచెత్తింది. 'ఇంతకీ ఆ గుర్రానికి కూడా టికెట్‌ తీసుకున్నాడా', 'అయినా ఆ గుర్రాన్ని ఎక్కడ పార్క్‌ చేశారు' అంటూ నెటిజన్లు సెటైర్స్‌ వేస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే ఆట ప్రారంభం కాకముందు పాక్‌కు మద్దతుగా గుర్రంపై క్రేజీగా ఓ అభిమాని ఎంట్రీ ఇచ్చాడు. ఇదే మ్యాచ్‌లో ఇండియా విజృంభించడంతో ఆట మధ్యలోనే ఇంకో అభిమాని కన్నీటి పర్యంతమవుతూ అదే జట్టును తిట్టిపోశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement