పాకిస్థాన్‌పై ఇషాన్‌ సూపర్ ఇన్నింగ్స్.. గర్ల్‌ ఫ్రెండ్‌ పోస్ట్ వైరల్! | Ishan Kishan rumoured girlfriend Aditi Hundia Praises Him dream innings | Sakshi
Sakshi News home page

Ishan Kishan: ఇషాన్ కిషన్‌ ఇన్నింగ్స్‌..వైరలవుతున్న గర్ల్‌ ఫ్రెండ్‌ పోస్ట్!

Published Sun, Sep 3 2023 1:26 PM | Last Updated on Sun, Sep 3 2023 2:21 PM

Ishan Kishan rumoured girlfriend Aditi Hundia Praises Him dream innings - Sakshi

టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ అంటే ఆ రేంజే వేరు. రెండు దేశాల్లోని అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌పైనే అందరిదృష్టి ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న మ్యాచ్‌ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. తాజాగా శ్రీలంకలో జరుగుతున్న ఆసియాకప్‌ మ్యాచ్‌లో ఇండియా-పాకిస్థాన్ తలపడ్డాయి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా టాపార్డర్‌ పేకమేడలా కూలిపోయింది. కానీ ఆ తర్వాతే పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు మన యువకెరటం ఇషాన్ కిషన్. స్టార్స్ ఔటైన చోటే దూకుడు ప్రదర్శించాడు. 82 పరుగులతో అద్భుతంగా రాణించి అందరినీ దృష్టిని ఆకర్షించాడు.

అయితే ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ పట్ల అభిమానం చాటుకుంది ఓ మోడల్. ఇషాన్‌ గర్ల్ ఫ్రెండ్‌గా భావిస్తున్న అదితి హుండియా అతని ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కిషన్ ఫోటో షేర్ చేస్తూ డ్రీమ్ ఇన్నింగ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

అసలు అదితి ఎవరు?

కాగా.. అదితి హుండియా వృత్తిరీత్యా మోడల్ కాగా.. ఆమె ఇషాన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లు జరిగినప్పుడు ఇషాన్‌కు మద్దతుగా నిలిచింది. అంతేకాకుండా ఇషాన్, అదితి చాలా సార్లు కలిసి బయట కనిపించారు. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే వారి రిలేషన్‌పై అదితి, ఇషాన్ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement