ఆ వెబ్ సిరీస్‌ చూసి గర్ల్‌ఫ్రెండ్‌పై హృతిక్‌ రోషన్ వ్యాఖ్యలు.. | Hrithik Roshan Praises Saba Azad Acting In Rocket Boys Web Series | Sakshi
Sakshi News home page

Hrithik Roshan: రూమర్‌ గర్ల్‌ఫ్రెండ్‌పై హృతిక్‌ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Published Sat, Apr 23 2022 3:09 PM | Last Updated on Sat, Apr 23 2022 5:48 PM

Hrithik Roshan Praises Saba Azad Acting In Rocket Boys Web Series - Sakshi

Hrithik Roshan Praises Saba Azad Acting In Rocket Boys Web Series: బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ హృతిక్‌ రోషన్‌ తన రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ సబా ఆజాద్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల నెటిజన్స్‌ను అలరిస్తోన్న మరో ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్‌ 'రాకెట్‌ బాయ్స్‌'. సోనీ లివ్‌ ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌.. ప్రఖ్యాత భారతీయ సైంటిస్టులు హోమీ జె. బాబా, విక్రమ్‌ సారాబాయ్‌ జీవితాలకు సంబంధించిన కథగా తెరకెక్కించారు. ఎనిమిది ఎపిసోడ్స్‌ ఉన్న ఈ వెబ్‌ సిరీస్‌ను పొగుడ్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చాడు హృతిక్‌ రోషన్‌. 'మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాను. దీని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొత్తం టీం వర్క్‌ ఎంతో అద్భుతంగా ఉంది. ఇండియాలోని మనవాళ్లే ఇది చేశారంటే గర్వంగా ఉంది.' అని రాసుకొచ్చాడు. 



చదవండి: నా కొడుకు హృతిక్‌ రోషన్‌లా ఉండాలి.. కానీ: స్టార్‌ హీరోయిన్‌

ఈ రాకెట్‌ బాయ్స్‌ వెబ్‌ సిరీస్‌లో హృతిక్‌ రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ సబా ఆజాద్‌ నటించింది. తన నటనను మెచ్చుకుంటూ ప్రశంసించాడు హృతిక్‌. సబా ఆజాద్‌ గురించి 'నేను చూసిన అత్యుత్తమ నటులలో మీరు ఒకరు. మీరు నాకు స్ఫూర్తినిస్తున్నారు.' అంటూ కితాబిచ్చాడు ఈ బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌. అలాగే ఈ వెబ్‌ సిరీస్‌లో సౌత్‌ బ్యూటీ రెజీనా కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 4, 2022 నుంచి ప్రసారం అవుతోంది. 





చదవండి: రెండో పెళ్లికి సిద్ధమంటున్న హృతిక్‌.. ఆమెతోనే ఏడడుగులు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement