praises over performance
-
'ఆర్ఆర్ఆర్'పై కేండ్రా లస్ట్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ
Kendra Lust Tweet On RRR: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. అంతేకాకుండా ఈ సినిమాపై హాలీవుడ్ రచయితలు, దర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ మూవీని ఒక పోర్న్ స్టార్ పొగడ్తలతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన పోర్న్ స్టార్ కేండ్రా లస్ట్ ట్విటర్ వేదికగా కొనియాడింది. ''నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, స్టంట్స్, డైలాగ్ డెలీవరీ, పాటలు, సినిమాటోగ్రఫీ .. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది. హీరోలిద్దరూ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. వారిద్దరి నటన 'ఆర్ఆర్ఆర్'కు ఆత్మలాంటింది'' అని ట్వీటింది కేండ్రా లస్ట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'ఆర్ఆర్ఆర్'పై కేండ్రా లస్ట్ ట్వీట్ చేయడం గురించి నెటిజన్లు జోరుగా డిస్కషన్ పెట్టారు. మరిన్ని ఇండియన్ మూవీస్ చూసి తన అభిప్రాయం చెప్పమని కోరుతున్నారు. అలాగే 'డాక్టర్ స్ట్రేంజ్' రైటర్ సి రాబర్ట్ గిల్, 'స్పైడర్ మ్యాన్ వర్స్' రైటర్, నిర్మాత క్రిస్టోఫర్ మిల్లర్ తదితరులు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్ఆర్ఆర్'ను వీక్షించి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ ధనుష్ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్ దర్శకులు.. -
ఆ వెబ్ సిరీస్ చూసి గర్ల్‌ఫ్రెండ్‌పై హృతిక్ రోషన్ వ్యాఖ్యలు..
Hrithik Roshan Praises Saba Azad Acting In Rocket Boys Web Series: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల నెటిజన్స్‌ను అలరిస్తోన్న మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ 'రాకెట్ బాయ్స్'. సోనీ లివ్ ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ వెబ్ సిరీస్.. ప్రఖ్యాత భారతీయ సైంటిస్టులు హోమీ జె. బాబా, విక్రమ్ సారాబాయ్ జీవితాలకు సంబంధించిన కథగా తెరకెక్కించారు. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌ను పొగుడ్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు హృతిక్ రోషన్. 'మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాను. దీని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొత్తం టీం వర్క్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇండియాలోని మనవాళ్లే ఇది చేశారంటే గర్వంగా ఉంది.' అని రాసుకొచ్చాడు. చదవండి: నా కొడుకు హృతిక్ రోషన్‌లా ఉండాలి.. కానీ: స్టార్ హీరోయిన్ ఈ రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్‌లో హృతిక్ రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్ నటించింది. తన నటనను మెచ్చుకుంటూ ప్రశంసించాడు హృతిక్. సబా ఆజాద్ గురించి 'నేను చూసిన అత్యుత్తమ నటులలో మీరు ఒకరు. మీరు నాకు స్ఫూర్తినిస్తున్నారు.' అంటూ కితాబిచ్చాడు ఈ బాలీవుడ్ గ్రీక్ గాడ్. అలాగే ఈ వెబ్ సిరీస్‌లో సౌత్ బ్యూటీ రెజీనా కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 4, 2022 నుంచి ప్రసారం అవుతోంది. చదవండి: రెండో పెళ్లికి సిద్ధమంటున్న హృతిక్.. ఆమెతోనే ఏడడుగులు? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మీ పని తీరు బాగుంది: సీఎం జగన్ ప్రశంస
సాక్షి, ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశంసించారు. అధికారుల పనితీరు బాగుందని కితాబిచ్చారు. పత్తి సాగును ఎర్ర రేగడికి కాకుండా నల్లరేగడి నేలకే పరిమితం చేసేలా ప్రకాశం జిల్లా అధికారులు తీసుకున్న చర్యలు అభినందనీయమని, బోర్ల కింద కూడా వరికి ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేసేల రైతులను ప్రోత్సహించాలని సూచించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో సమావేశం ఆయన మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటులో ప్రకాశం యంత్రాంగం పనితీరు బాగుందన్నారు. వీటితో పాటు బియ్యం కార్డులు, పెన్షన్‌కార్డులు, ఇళ్ల పట్టాల కోసం స్థలాల గుర్తింపు విషయంలో చక్కటి పనితీరు కనపరుస్తోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, నాడు–నేడు క్రింద పాఠశాలల్లో చేపడుతున్న నిర్మాణాలు, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మన బడి నేడు–నేడు కింద పెండింగ్ బిల్లులు అక్టోబర్ మొదటి వారంలో చెల్లిస్తామన్నారు. పాఠశాలల పునః ప్రారంభాన్ని కోవిడ్ దృష్ట్యా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 2వ తేదీకి వాయిదా వేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని వెల్లడించారు. (కరోనా తగ్గుముఖం) సమావేశంలో జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్, డీఆర్ఓ వినాయకం, జడ్పీ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, పంచాయతీరాజ్ ఎస్ఈ కొండయ్య, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామమూర్తి, పట్టు పరిశ్రమ ఏడీ రాజ్యలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాద్ ఠాగూర్, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, డ్వామా పీడీ శ్రీనారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎలీషా, డీపీఓ నారాయణరెడ్డి, సీపీఓ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
'బ్రో.. 12వ స్థానంలో వచ్చినా సెంచరీ చేస్తావ్'
ఆక్లాండ్ : కేఎల్ రాహల్ ఆటతీరుపై టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కివీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాహుల్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడినా రాహుల్ ఇన్నింగ్స్ మాత్రం అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ధావన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా రాహుల్ ప్రదర్శనను కొనియాడాడు. 'కివీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించావ్ బ్రో. నీ కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది. ఇలానే నీ విధ్వంసాన్ని కొనసాగిస్తే 12వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా సెంచరీ సాధిస్తావ్' అనే క్యాప్షన్‌తో రాహుల్ సెంచరీ ఫొటోను షేర్ చేశాడు. ధావన్ చేసిన పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 'నిజమే.. రాహుల్ ఆర్డర్‌తో సంబంధం లేకుండా చెలరేగుతున్నాడంటూ' అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: కాగితం, కత్తెర, బండ?) ఇక ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా బెంగుళూరులో జరిగిన వన్డేలో ధావన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ టూర్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక ఐదు టీ20ల సిరీస్‌ను 5-0 తో క్లీన్ స్వీప్ చేసిన భారత్, వన్డే సిరీస్‌లో మాత్రం 0-3తో వైట్‌వాష్ అయింది. కాగా కేఎల్ రాహుల్ ప్రస్తుతం విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. కివీస్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లలో రాహుల్ తన కీపింగ్, బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకిదిగిన రాహుల్.. టాప్ స్కోరర్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఐదో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్ తొలి వన్డేలో 88 పరుగులు, మూడో వన్డేలో సెంచరీతో చెలరేగాడు. కాగా కివీస్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 21న వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. (చదవండి: సెంచరీతో రాహుల్ రికార్డుల మోత..!) -
'రాహుల్ కత్తి కంటే పదునుగా ఉన్నాడు'
హామిల్టన్‌లో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే జట్టుగా ఓటమి పాలైనా టీమిండియా క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు మాత్రం తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. తాజాగా కేఎల్ రాహుల్ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు.' ప్రసుత్తం కేఎల్ రాహుల్ కత్తి కంటే చాలా పదునుగా ఉన్నాడు. టీమిండియా జట్టులో రాహుల్ ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ఆకట్టుకున్నాడు. తాజాగా ఐదో స్థానంలో వచ్చి బెస్ట్ ఫినిషర్‌గా నిరూపించుకున్నాడు. ఇలా ఏ స్థానంలో ఆడినా సరే రెచ్చిపోతున్నాడు. రాహుల్ నీ ఆటతీరును ఇలాగే కొనసాగించాలని నేను కోరుకుంటున్నా' అంటూ కైఫ్ ట్వీట్ చేశాడు.(రాహుల్‌కు షాక్.. శుబ్‌మన్ గిల్ ఇన్..) కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న రాహుల్ ఆస్ట్రేలియా, విండీస్, న్యూజిలాండ్‌లతో జరిగిన సిరీస్‌లను పరిశీలిస్తే ఓపెనర్ స్థానం నుంచి ఐదో స్థానం వరకు ఆడాడు. రాహుల్ ఆడిన మ్యాచ్‌ల్లో స్థానాలు మారుతున్నాయే తప్ప తన ఆటతీరు మాత్రం విధ్వంసకరస్థాయిలోనే కొనసాగుతుంది. తాజాగా కివీస్ తో జరిగిన మొదటి వన్డేలో ఐదో స్థానంలో వచ్చి కేవలం 64 బంతుల్లోనే 88 పరుగులు నమోదు చేయగా, రాహుల్ ఇన్నింగ్స్‌ల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌కు భారత జట్టు రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ గైర్హార్జీలో మొదటి వన్డేలో పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌లు ఓపెనర్లుగా రావడంతో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో రావాల్సి వచ్చింది. ఏ స్థానంలో వచ్చినా సరే తన విధ్వంసకర ఆటతీరుతో రాహుల్ జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. (కోహ్లిని దాటేసిన రాహుల్) Opens the innings ✅ Keeps wickets ✅ Stands in as captain ✅ Now finishes big for his team ✅ KL Rahul is Team India’s very own Swiss knife! #NZvIND — Mohammad Kaif (@MohammadKaif) February 5, 2020 -
ఆనందంతో గాల్లో తేలిపోతున్న 'ధోనీ'
ఎంఎస్ ధోనీ సినిమా విడుదల అయ్యిందో లేదో.. ఒక్కసారిగా సినిమావాళ్ల దగ్గర్నుంచి క్రికెటర్లు, మాజీ క్రికెటర్ల వరకు అంతా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఫ్యాన్స్ అయిపోయారు. అందరూ అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అసలు తెరమీద తాము చూసింది సుశాంత్నా.. లేక అసలైన ధోనీనా అనేది తెలియలేదని ఎక్కువ మంది అంటున్నారు. వెనక నుంచి చూస్తే అచ్చం ధోనీని చూసినట్లే ఉందని చెబుతున్నారు. ట్విట్టర్ ద్వారా సుశాంత్‌కు ప్రతి ఒక్కరూ అభినందనలు చెబుతుండటంతో ధోనీ పాత్ర చేసిన ఈ హీరో.. ఉబ్బి తబ్బిబ్బు అయిపోతున్నాడు. గాల్లో తేలిపోతున్నాడు. ''ఇప్పుడే నేను ఎంఎస్ ధోనీ ద అన్‌టోల్డ్ స్టోరీ చూశా. నువ్వు నిజంగా సుశాంత్వా, ధో్నీవా... నీ పెర్ఫార్మెన్సుతో నోట మాట రాలేదు'' అని దక్షిణాది హీరో సూర్య ప్రశంసించాడు. ''నువ్వు అసలైన పెర్ఫార్మర్వి. ప్రతి ఫ్రేములోను నువ్వే నా ధోనీవి. ఆ కళ్లలో భావాలు పలికించడం చాలా బాగుంది'' అని బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెప్పింది. ''నీ పెర్ఫార్మెన్సు ప్రతి ఫ్రేములోనూ చాలా బాగుంది. నేను ధోనీనే చూశాను తప్ప నిన్ను కాదు. భావాలు, క్రికెట్, రొమాన్స్.. అన్నింటిలోనూ సూపర్బ్. హ్యాట్సాఫ్'' అని ప్రముఖ దర్శక నిర్మాత కునాల్ కోహ్లీ ప్రశంసలు కురిపించారు. ''సుశాంత్ అసలైన పెర్ఫక్షనిస్టు. ప్రతి ఎక్స్ప్రెషన్ నుంచి హెలికాప్టర్ షాట్ వరకు.. అద్భుతంగా ఆడావు బ్రో'' అని గాయకుడు, నటుడు ఆయుష్మాన్ ఖురానా అన్నాడు. ''నిజంగా ఆ సినిమాలో చేసింది నువ్వేనా.. ఒక నిమిషం పాటు నన్ను నేనే నమ్మలేకపోయా. అద్భుతమైన పెర్ఫార్మెన్సుకు వందనం. సినిమా చాలా బాగా నచ్చింది'' అని మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ చెప్పాడు. @itsSSR you are a true performer. U were Dhoni for me in every frame of #MSDhoni . Such expressive eyes..Killed it n how!! — Kriti Sanon (@kritisanon) 1 October 2016 Just saw #MSDhoniTheUntoldStory Sushant or Dhoni who actually are you.. @itsSSR Spellbound by your performance!! — Suriya Sivakumar (@Suriya_offl) 30 September 2016 @itsSSR your performance is so good in every frame I saw @msdhoni and not you! Emotions,cricket,romance you’ve excelled in all! Hats off — kunal kohli (@kunalkohli) 30 September 2016 @itsSSR are you for real..had me fooled for a minute.Kudos on an amazing performance.Loved the movie. #MSDhoniTheUntoldStory — Hemang Badani (@hemangkbadani) 30 September 2016 This @itsSSR is such a perfectionist. From each expression to the helicopter shot. Well played bro! Absolutely loved #DhoniUntoldStory — Ayushmann Khurrana (@ayushmannk) 30 September 2016