ఇండియా, పాక్ మ్యాచ్.. కేసీఆర్ ఎంజాయ్
హైదరాబాద్: దాదాపు రెండేళ్ల తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్‌ను తమ వ్యక్తిగత మ్యాచ్‌గా భావించి మరీ టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ తరుణంలో ఎప్పుడూ రాజకీయాల్లో తలమునకలై ఉండే నాయకులు అసలు క్రికెట్ చూస్తారా? విజయం సాధించినప్పుడు అందరిలాగా సంతోషపడతారా?వంటి విషయాలను పరిశీలిస్తే.. మిగితా మ్యాచ్‌ల సంగతేమోగని భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌ను మాత్రం దాదాపు అందరు నేతలు చూస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా చూస్తారంట.
పాక్‌పై విజయం సాధించగానే భళా భారత్ అన్నట్లుగా ఆయన సందడి చేస్తారని ఆయన తనయుడు కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు. ట్టిట్టర్‌లో ఖాతాదారుడైన సాయి అనే ఓ వ్యక్తి ఇండియా పాక్ మ్యాచ్ విషయాన్ని ప్రశ్నించాడు. మీరుగానీ, మన ప్రియమైన ముఖ్యమంత్రిగానీ ఎప్పుడైనా భారత్, పాక్ మ్యాచ్‌ను చూశారా? విజయం సాధించిన సమయంలో వేడుకలు చేసుకున్నారా? అని అడిగాడు. దీనికి బదులిచ్చిన కేటీఆర్..‘ముఖ్యమంత్రిగారు క్రికెట్ చూడటాన్ని ఇష్టపడతారు. మనందరిలాగే ఆయన కూడా భారత్ విజయం సాధించిన సందర్భాన్ని ఎంజాయ్ చేస్తారు’ అంటూ ట్వీట్ చేశారు.
CM garu loves watching cricket and enjoys India winning like any of us of course https://t.co/FRto77susY
— KTR (@KTRTRS) 4 June 2017