k balachader
-
బాలచందర్ సతీమణి కన్నుమూత
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లెజెండరీ దర్శకులు కె.బాలచందర్. 2014 డిసెంబరు 23న ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలచందర్ సతీమణి రాజమ్ (84) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం 4.30 గంటలకు తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. కవితాలయ ప్రొడక్షన్స్ పతాకంపై రాజమ్ బాలచందర్ సినిమాలను నిర్మించేవారు. ‘సింధు భైరవి, నాన్ మహాన్ అల్ల, ఎనక్కుళ్ ఒరువన్’ లాంటి సినిమాలు నిర్మించారు. రాజమ్ బాలచందర్ దంపతులకు కొడుకు ప్రసన్న, కూతురు పుష్ప ఉన్నారు. రాజమ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న సినిమా ప్రముఖులు ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజమ్ అంత్యక్రియలు నిర్వహించారు. -
కోపం.. చిరునవ్వు.. ప్రేమ అన్ని కలిస్తేనే బాలచందర్..
చెన్నై: ప్రముఖ దర్శకుడు కె బాలచందర్(84) మంగళవారం కన్నుమూశారు. ఆయన మృతిపై సినీ నటి జయసుధ తన జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నారు. కె. బాలచందర్ గా సుప్రసిద్ధుడైన కైలాసం బాలచందర్ గారి వద్ద తాను ఓనమాలు నేర్చుకున్నానని ఆమె తెలిపారు. బాలచందర్ స్కూళ్లో చదువుకునే ఇంతటి నటిని అయ్యానని.. ఆయన వద్ద భయంతో భక్తిగా ఉండేవాళ్లమన్నారు. ఆయన సినిమాను తీసే విధానంలోనే ఒక విన్నూత్నమైన స్టైల్ ఉండేదని జయసుధ తెలిపారు. సరిగా నటించకపోతే ఆయన కోపడ్డేవారన్నారు. కోపం.. చిరునవ్వు.. ప్రేమ అన్ని కలిస్తేనే బాలచందర్ అని జయసుధ అన్నారు.