‘వంచన వ్యతిరేక దీక్ష’కు తరలిరండి | YSRCP Vanchana Inmates MLA Kambala Jogulu | Sakshi
Sakshi News home page

‘వంచన వ్యతిరేక దీక్ష’కు తరలిరండి

Published Mon, Apr 30 2018 10:40 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

YSRCP Vanchana Inmates MLA Kambala Jogulu - Sakshi

మాట్లాడుతున్న కంబాల జోగులు

రాజాం : వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సోమవారం చేపడుతున్న వంచన వ్యతిరేఖ దీక్షను విజయవంతం చేయాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. ఈ దీక్షకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, ప్రజలు, పార్టీ అభిమానులు, నాయకులు తరలిరావాలని కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ టీడీపీ నాలుగళ్లుగా ప్రత్యేకహోదాకు వ్యతిరేకంగా పని చేసిందని అన్నారు. కేంద్రానికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన సీఎం చంద్రబాబుపై ప్రజలంతా వ్యతిరేక జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

టీడీపీ విధివిధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని మోసగించిన ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంచన వ్యతిరేఖ దీక్ష జరుగుతుందని, ప్రజలంతా తరలిరావాలని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నారని స్పష్టంచేశారు. తొలి నుంచి ప్రత్యేకహోదా కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. వీటన్నింటినీ ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నించిందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement