MLA Kambala Jogulu
-
‘వంచన వ్యతిరేక దీక్ష’కు తరలిరండి
రాజాం : వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సోమవారం చేపడుతున్న వంచన వ్యతిరేఖ దీక్షను విజయవంతం చేయాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. ఈ దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, పార్టీ అభిమానులు, నాయకులు తరలిరావాలని కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ టీడీపీ నాలుగళ్లుగా ప్రత్యేకహోదాకు వ్యతిరేకంగా పని చేసిందని అన్నారు. కేంద్రానికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన సీఎం చంద్రబాబుపై ప్రజలంతా వ్యతిరేక జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ విధివిధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని మోసగించిన ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంచన వ్యతిరేఖ దీక్ష జరుగుతుందని, ప్రజలంతా తరలిరావాలని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నారని స్పష్టంచేశారు. తొలి నుంచి ప్రత్యేకహోదా కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. వీటన్నింటినీ ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నించిందన్నారు. -
ఓడిన అభ్యర్థితో ప్రభుత్వ కార్యక్రమాలా?
ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉండగా.. తనను కాదని ఓడిపోయిన అభ్యర్థితో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడంపై శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. మండల తహసీల్దార్ రామకృష్ణ ఈ విధంగా చేస్తున్నారంటూ ఆయన జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన ప్రతిభా భారతి ఓడిపోయారు. కానీ, ఆమెతోనే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా తహసీల్దార్ ప్రవర్తిస్తున్నారని ఆయన జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సరుకుల పంపిణీలో ప్రోటోకాల్ ఉల్లంఘన
రాజాం రూరల్: రాజాం నగర పంచాయతీ పరిధిలో రేషన్ డిపోల ద్వారా ఆదివారం చేపట్టిన ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించిన తహశీల్దార్ రామకృష్ణపై రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మండి పడ్డారు. జేసీ వివేక్‌యాదవ్ ఈ నెల 10న రాజాం వచ్చి పంపిణీ ప్రారంభోత్సవానికి విధిగా ఎమ్మెల్యేను పిలవాలని సూచించారు. స్థానిక తహశీల్దార్ ప్రభుత్వాధికారిగా కాకుండా అధికార పార్టీగా తొత్తుగా వ్యవహరించి అధికార పార్టీ ఇన్చార్జ్ కావలి ప్రతిభాభారతితో కార్యక్రమం చేపట్టారు. ఆదివారం ఉదయం కూడా ఎమ్మెల్యేను పిలవలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో మొక్కుబడిగా పిలవడంతో ఎమ్మెల్యే జోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
హామీల పేరుతో చంద్రబాబు మోసం
వంగర : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరోపించారు. మండలంలోని ఎం.సీతారాంపురం, వంగర, సంగాం గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఇటీవల మృతిచెందిన పలువురు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వంగరలో విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ పేరు తో రైతులు, డ్వాక్రాసంఘాల మహిళలతో టీడీపీ ఆట లాడుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పక్షపాతినని నిరూపించుకునేందుకు చంద్రబాబు చేసిన తొలి సంతకానికి విలువేలేకుండా పోయిందన్నారు. రైతులకిచ్చిన హామీలకు ఒక్క దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే కట్టుబడి ఎటువంటి పరిమితులు లేకుండా అప్పట్లో రుణ మాఫీ చేశారని గుర్తు చేశారు. రైతులకు 20 శాతం రుణమాఫీ మొత్తాన్ని తొలిదశలో చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికే రూపొందిం చిన జాబితా తప్పుల తడకగా ఉందని, అర్హులైన రైతుల పేర్లు గల్లంతయ్యాయని ఆవేదన చెందారు. మాఫీ పేరుతో మహిళలు నుంచి నెలనెలా వడ్డీని బ్యాంకులు రాబట్టుకుంటున్నాయని, దీని వల్ల వారంతా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నా రు. అలాగే ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల పింఛన్లు తొల గించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల రుణా ల మంజూరులో టీడీపీ పాలకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్త లు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ, మజ్జి వెంకటనాయుడు, ఉదయాన మురళీకృష్ణ, కర్రి గోవిందరావు, కాంబోతుల సింహా చలం, కాంబోతుల భగవతి, పార్టీ రేగిడి కన్వీనర్ రెడ్డి నర్సింగరావు, కనగల సత్యంనాయు డు, పి.పార్వతి, కె.పారినాయుడు, ఏనుగుతల వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
హుదూద్ బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
రాజాం: హుదూద్ బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు చెప్పారు. పార్టీ శ్రేణులంతా తుపాను బాధితులకు సహాయ సహకారాలు అందించాలని సూచిం చారు. రాజాంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. పార్టీ నేతలంతా గ్రామాల్లో పర్యటించి, బాధితులను ఓదార్చి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పత్తి, జీడి, వరి, మామిడి, అరటి తోటలకు పెనునష్టం వాటిల్లిందని పలువురు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీరందరికీ సముచిత రీతిలో నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వంతో చర్చిస్తామని ఎమ్మెల్యే బదులిచ్చారు. అధికారులు సక్రమం గా స్పందించకుంటే..చర్యలు తప్పవన్నారు. రాజాం జెడ్పీటీసీ సభ్యుడు టంకాల పాపినాయుడు, కరణం సుదర్శనరావు, శాసపు కేశవరావు, ముద్దాన బాబు, కెంబూరు సూర్యారావు, వంజరాపు విజయ్‌కుమార్, పాలవలస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.