
ఓడిన అభ్యర్థితో ప్రభుత్వ కార్యక్రమాలా?
ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉండగా.. తనను కాదని ఓడిపోయిన అభ్యర్థితో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడంపై శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. మండల తహసీల్దార్ రామకృష్ణ ఈ విధంగా చేస్తున్నారంటూ ఆయన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన ప్రతిభా భారతి ఓడిపోయారు. కానీ, ఆమెతోనే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రోటోకాల్కు విరుద్ధంగా తహసీల్దార్ ప్రవర్తిస్తున్నారని ఆయన జిల్లా కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.