
జస్టిస్ పున్నయ్య(పాత చిత్రం)
శ్రీకాకుళం: మాజీ న్యాయమూర్తి, మాజీ ఎమ్మెల్యే జస్టిస్ కె.పున్నయ్య (96) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పున్నయ్య విశాఖపట్నంలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పున్నయ్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామం. రెండు సార్లు పున్నయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పున్నయ్య కూతురే.
కాగా, పున్నయ్యకు చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన కుమార్తె ప్రతిభా భారతిక గుండెపోటుకు గురయ్యారు. బైపాస్ సర్జరీ అనంతరం ఆమె తిరిగి కోలుకున్నారు. జస్టిస్ పున్నయ్య మృతి పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఒక న్యాయకోవిదుడిని కోల్పోయామని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment