pratibha bharati
-
చంద్రబాబు కుట్ర రాజకీయాలతో... ‘ప్రతిభ’కు దక్కని గౌరవం!
విజయనగరం: కావలి ప్రతిభా భారతి... టీడీపీ సీనియర్ నాయకురాలు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఆమె కీలక నేత. మంత్రిగా, స్పీకర్‌గా ఆమె విశేష సేవలు అందజేశారు. చిత్తశుద్ధి, విలువలతో కూడిన రాజకీయాలకు ఆమె కేరాఫ్‌గా మారారు. అలాంటి నాయకురాలి కుటుంబానికి చంద్రబాబు నాయుడు రాజకీయ సమాధికట్టారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టే ప్రతిభా భారతి కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారని సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కేటాయించకుండా.. డబ్బులకోసం వలసనాయకుడికి టికెట్ అమ్మేశారని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు గెలిచి రాష్ట్రంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభా భారతిని చంద్రబాబు నిలువునా ముంచడంతో ఏమిచేయాలో తోచక.. చంద్రబాబు, కోండ్రుల కుట్ర రాజకీయాలను చూసి ఓర్వలేక.. సొంతగ్రామానికి కూడా రాకుండా విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఆమె గడుపుతున్నారు. గ్రీష్మకు రిక్తహస్తం.. ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ టీడీపీ కోసం చాలా కష్టపడ్డారు. తల్లికి అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 2014 నుంచి 2019 వరకూ రాజాంలోనే ఉంటూ అనేక కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సొంత సొమ్ము ఖర్చుచేశారు. 2019లో టిక్కెట్ వస్తుందని ఆశపడి భంగపాటుకు గురయ్యారు. తల్లీకూతుళ్ల వద్ద డబ్బులు లేవని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి చెందిన కోండ్రును టీడీపీలోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో 16,800 ఓట్ల తేడాతో కోండ్రు ఓడిపోయారు. అనంతరం దాదాపు మూడున్నరేళ్లు నియోజకవర్గంలో టీడీపీ కేడర్‌ను ఆయన పట్టించుకోలేదు. ఈ సమయంలో గ్రీష్మ పార్టీకి అండగా నిలిచారు. 2022లో ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడు సభలో తొడగొట్టి వైఎస్సార్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. టికెట్ తనకే వస్తుందని ఆశపడ్డారు. రాజాంలో చంద్రబాబు, లోకేశ్‌ల పర్యటనల విజయవంతానికి కృషిచేశారు. చివరకు తండ్రీకొడుకులిద్దరూ ఆమెకు టికెట్ కేటాయించకుండా పంగనామాలు పెట్టడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని తమ అనుచరుల వద్ద తరచూ ఏకరువు పెడుతూ.. కోండ్రును చిత్తుగా ఓడించేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నట్టు సమాచారం. 25 ఏళ్లుగా ఊరిస్తూ.. మరోవైపు అటు పాలకొండ ఎస్సీ నియోజకవర్గంగా, ఇటు రాజాం నియోజకవర్గం ఏర్పడిన తరువాత పాలకొండ, రాజాం ప్రాంతాల్లో నివసిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగినికి కూడా చంద్రబాబు నిరాశే చూపించారు. 1994 నుంచి ఓ ప్రభుత్వ ఉద్యోగి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తూ వస్తోంది. టీడీపీ కార్యక్రమాలకు అండగా ఉంటూ ఆర్థిక సాయంచేస్తూ వచ్చింది. పాలకొండ ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న సమయంలోనే ఆమెకు టికెట్ ఇస్తామని టీడీపీ ఆశచూపింది. అప్పట్లో పలు పత్రికల్లో కూడా ఆమె పేరు బయటకు వచ్చింది. ఆమెకు టికెట్ కేటాయిస్తామని ఆశచూపిన చంద్రబాబు.. తిరిగి నిరాశే మిగిల్చారు. డబ్బున్నవారికే టీడీపీ టిక్కెట్ ఇస్తామని చేతలతో స్పష్టంచేశారు. రాజాంలో సోమవారం నిర్వహించిన ప్రజాగళం సభకు కూడా టీడీపీ వ్యతిరేక వర్గం హాజరుకాలేదు. ప్రతిభాభారతి అభిమానులు, ఇటు సామాజిక వర్గ నేతలు తమ ప్రతాపాన్ని ఓటు రూపంలో చూపిస్తామని చెబుతున్నారు. కన్నింగ్ నాయకుడికి బుద్ధిచెబుతామని స్పష్టంచేస్తున్నారు. -
ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంతగా దిగజారాలా..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీటు కోసం నోటి దురుసు..! రాజకీయ గుర్తింపు కోసం నీచాతినీచంగా మాట్లాడాలా? బాస్ మెప్పు కోసం నోటికి పని చెప్పాలా..? అంటూ మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులే కాకుండా టీడీపీ వర్గాలు సైతం ఆమె వ్యాఖ్యల పట్ల విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. కావలి ప్రతిభాభారతి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాయకురాలిగా పేరు సంపాదించారు. ప్రస్తుతం విజయనగరంలో కలిసిపోయిన రాజాం నుంచి ఆమె ప్రాతినిథ్యం వహించారు. ప్రతిభాభారతి వారసురాలి గా గ్రీష్మ కొన్నాళ్లు ఇక్కడ హల్చల్ చేసినా ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఇన్నాళ్లూ ఉండి మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయనగా మళ్లీ జిల్లాకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఒంగోలు వేదికగా జరిగి న టీడీపీ మహానాడులో అసభ్య పదజాలంతో ప్రసంగించి అధినేత చంద్రబాబు దృష్టిలో పడడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రసంగంతో పాటు ఆమె వైఖరి కూడా సర్వత్రా విమర్శల పాలవుతోంది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెను సమర్థించలేకపోతున్నారు. ఉన్నత పద వులు అలంకరించిన కుటుంబానికి చెందిన వ్యక్తిగా.. హుందాగా వ్యవహరించాల్సిన మహిళ ఇలా నిండు సభలో నోటి కి అదుపు లేకుండా మాట్లాడడాన్ని అంతా ఖండిస్తున్నారు. టిక్కెట్ కోసమేనా ఇదంతా..? గ్రీష్మ తల్లి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నుంచి పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. రాజకీయంగా జిల్లాలో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. కాలక్రమేణా ఆమె రాజకీయంగా బలహీనమయ్యా రు. ఆ పార్టీలోని గ్రూపు తగాదాలు, నేతల మధ్య విభేదాల తో పట్టు కోల్పోయారు. ఈ క్రమంలో తల్లి స్థానాన్ని తాను భర్తీ చేయాలని గ్రీష్మ తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉన్న రాజాం నుంచి పోటీ చే యాలని అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గం ఇప్పుడు వి జయనగరం జిల్లాలో ఉంది. అక్కడ టీడీపీలో తనకు పో టీగా కోండ్రు మురళీమోహన్ ఉండటం, ఆయనకు టిక్కె ట్ వస్తుందేమోనన్న అభద్రతాభావంతో ఇలా అధినేత దృష్టిలో పడడానికి పాట్లు పడుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
మొన్న గౌతు శిరీష.. నేడు ప్రతిభా భారతి
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీలో మరో మహిళా నేతకు అవమానం జరిగింది. మొన్నటికి మొన్న గౌతు శిరీషను పదవి నుంచి తొలగించగా.. తాజాగా ఎస్సీ మహిళ, టీడీపీ సీనియర్ నేత కావలి ప్రతిభా భారతికి అన్యాయం జరిగిందంటూ ఆ పార్టీ శ్రేణుల్లోనే తీవ్రమైన చర్చ జరుగుతోంది. సుదీర్ఘ కాలం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యురాలిగా పనిచేసిన తనను తప్పించి పార్టీలు మారి వచ్చిన కిమిడి కళా వెంకటరావుకు చోటు కల్పించడమేంటని ఆమె తీవ్రంగా మధనపడుతున్నట్టు తెలిసింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించినప్పటికీ ఆమెకు రుచించడం లేదు. కీలకమైన పొలిట్ బ్యూరో నుంచి తప్పించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆమె తీవ్ర ఆవేదనతో ఉన్నారని, పార్టీ పెద్దలు ఫోన్ చేసినప్పటికీ టచ్‌లోకి రాలేదని సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌తో పాటు పలు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన కావలి ప్రతిభా భారతి టీడీపీలో సీనియర్ నేత. అయితే ఆ పార్టీలో వర్గ, కుటుంబ రాజకీయాల వల్ల ఆమె స్థాయికి తగ్గ గౌరవం ఇవ్వడం లేదు. మొ న్నటి ఎన్నికల్లో ఏకంగా అసెంబ్లీ సీటు కూడా ఇవ్వలేదు. కొద్ది నెలల పాటు ఉండే ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చి చేతులు దు లుపుకున్నారు. చివరికి పార్టీలో కూడా ప్రాధాన్యతను అధిష్టానం తగ్గించేసింది. సుదీర్ఘ కాలం పొలిట్ బ్యూరో సభ్యురాలిగా పనిచేసిన ప్రతిభా భారతికి ఈసారి ఊహించని పరిణామం ఎదురైంది. (బాబు బడాయి.. నేతల లడాయి!) రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఆ స్థానంలో ఉన్న కళా వెంకటరావుకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పించేందుకు ప్రతిభా భారతిని బలి చేశారని ఆమెతో పాటు అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని మొదటి నుంచి పని చేస్తూ, ఏ పార్టీ వైపు చూడకుండా రాజకీయం చేస్తున్న ప్రతిభా భార తికి ఉద్దేశపూర్వకంగా పొలిట్ బ్యూరోలో మొండి చేయి చూ పారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అనేక అవినీ తి ఆరోపణలు ఉన్న వ్యక్తికి కీలక పదవి, పార్టీ మారిన వ్యక్తి కోసం తనను తప్పించి చోటు కల్పించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలిసింది. (అవినీతి నేతకు అధ్యక్ష పదవా?) ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి గౌతు శ్యామ సుందర్ శివాజీ కుమార్తె గౌతు శిరీషను ఎలాగైతే మాటైనా చెప్పకుండా మార్చేశారో అదేవిధంగా ప్రతిభా భారతికి కూడా చె ప్పకుండా పొలిట్ బ్యూరో నుంచి తప్పించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాడు శిరీషకు అవమానం జరగగా, నేడు ప్రతిభా భారతికి ప్రాధాన్యత తగ్గించి అన్యాయం చేశారని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. జిల్లాలో వ్యూహాత్మకంగానే మహిళా నేతల ప్రాధాన్యత తగ్గిస్తున్నట్టు వారి అనుచర వర్గాలు భావిస్తున్నాయి. -
మాజీ ఎమ్మెల్యే పున్నయ్య కన్నుమూత
శ్రీకాకుళం: మాజీ న్యాయమూర్తి, మాజీ ఎమ్మెల్యే జస్టిస్ కె.పున్నయ్య (96) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పున్నయ్య విశాఖపట్నంలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పున్నయ్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామం. రెండు సార్లు పున్నయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పున్నయ్య కూతురే. కాగా, పున్నయ్యకు చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన కుమార్తె ప్రతిభా భారతిక గుండెపోటుకు గురయ్యారు. బైపాస్ సర్జరీ అనంతరం ఆమె తిరిగి కోలుకున్నారు. జస్టిస్ పున్నయ్య మృతి పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఒక న్యాయకోవిదుడిని కోల్పోయామని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. -
కావలికి కళా ఝలక్!
ప్రతిభాభారతి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా స్పీకరు! జిల్లా నుంచి సుదీర్ఘకాలం మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహించిన దళిత మహిళ! టీడీపీ ఆవిర్భావం నుంచీ చివరకు పార్టీ కష్టకాలంలో సైతం పక్కపార్టీల వైపు చూడకుండా వెన్నంటిఉన్న సీనియర్ నాయకురాలు! కానీ ఈ ‘ప్రతిభ’ అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన కొండ్రు మురళీమోహన్ ముందు వెలవెలబోయింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆశ చూపించిన ‘సముచిత స్థానం’ అనే బ్రహ్మపదార్థాన్ని నమ్ముకొని ప్రత్యక్ష రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసేలా ఉన్న ఆమె నిర్ణయం రాజాం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. జిల్లా టీడీపీ గ్రూపు రాజకీయాల్లో చివరకు మంత్రి అచ్చెన్న చేతులెత్తేయడం, మరో మంత్రి కళావెంకటరావుదే పైచేయి కావడం, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి పదవి కూడా చేజారిపోవడంతో కావలి రాజకీయ వారసత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: కావలి ప్రతిభాభారతి ఎస్సీ రిజర్వుర్డ్ ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి 1983–1999 మధ్యకాలంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కళావెంకటరావు ప్రజారా జ్యం పార్టీలోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వెనక్కివచ్చినా ఆమె మాత్రం టీడీపీనే నమ్ముకున్నారు. 1999 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా తలపడిన కోండ్రు మురళీమోహన్ను మట్టికరిపించారు. అయితే 2004 ఎన్నికల్లో కోండ్రు చేతిలోనే స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2009 సంవత్సరంలో ఎచ్చెర్ల జనరల్ నియోజకవర్గంగా, రాజాం ఎస్సీ రిజర్వుర్డ్గా మారడంతో ఆమె రాజాంకు మారారు. ఆమె స్వగ్రామం కావలి కూడా రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి మండలంలోనే ఉండటంతో ఇదే తనకు సుస్థిర స్థానమని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. అయితే కళా ఇలాకా రేగిడి మండలం రాజాం నియోజకవర్గంలోనే ఉండటం, ఆయన క్యాంపు కార్యాల యం కూడా రాజాంలోనే ఏర్పాటు చేసుకోవ డం, తద్వారారాజకీయ, అధికారిక కార్యకలాపాల్లో కళా జోక్యం మితిమీరడం ప్రతిభాభారతికి గిట్టేదికాదు. పార్టీ గ్రూపు రాజకీయాల్లో మంత్రి అచ్చెన్నాయుడు కొంత సపోర్టు ఇవ్వడంతో ప్రతిభాభారతి కళాను ఢీకొట్టే ప్రయత్నం చేశా రు. కానీ కళా చాపకిందనీరులా పావులు కదిపా రు. చివర్లో అచ్చెన్న చేతులెత్తేయడంతో ఆమె రాజకీయ భవితవ్యమే గందరగోళంలో పడింది. ‘డిపాజిట్’ దక్కని వలస నేతే ఆధారం... గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిభాభారతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికలలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. దాదాపు 4,600 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన వ్యక్తిగత బలమేమిటో ఆ ఎన్నికలలో తేలిపోయింది. కానీ రాజాం రాజకీయపటంపై నుంచి కావలి కుటుంబ రాజకీయ వారసత్వానికి శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టేలా కళా పావులు కదిపారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిభాభారతి వేదనను పార్టీ అధినేత కూడా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అసలు గత ఎన్నికలలో కళావెంకటరావు అనుచరులు తనకు సహకరించకపోవడం వల్లే ఓడిపోయానని ఆమె ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కళాకు మంత్రి పదవి ఇస్తే తాను ఆత్మత్యాగానికీ వెనుకాడబోనని హెచ్చరించినా అరణ్యవేదనే అయ్యింది. చివరకు ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి పితాని సత్యనారాయణకు కళావెంకటరావుపై ఫిర్యాదు ఇచ్చినా పాచికలు పారలేదు. కౌంటర్‌గా రాజాం నియోజకవర్గంలోని కళా అనుచర నాయకులు అంతా నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రతిభాభారతిని కట్టడిచేసేందుకు కాంగ్రెస్ నుంచి కోండ్రును తీసుకొచ్చి రాజాం పీఠంపై కూర్చోబెట్టారు. ప్రజలు ఎన్నుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా వాటిని టీడీపీ తమ్ముళ్లకు మళ్లించుకోవడానికి సృష్టించిన రాజాం నియోజకవర్గ ఇన్చార్జి పదవి కూడా ప్రతిభాభారతి చేతి నుంచి జారిపోయింది. ఆ స్థానాన్ని కోండ్రు మురళీమోహన్‌కు కట్టబెట్టింది. ప్రతిభ అనుచరులు ఎటు... కోండ్రు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండలానికి చెందినవారు. ఆ నియోజకవర్గంలో తన స్వలాభం కోసమే కళావెంకటరావు కోండ్రును రాజాం నియోజకవర్గానికి తీసుకొచ్చారనే ఆవేదన ప్రతిభాభారతి వర్గీయుల్లో కనిపిస్తోంది. కోండ్రు రెండుసార్లూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాబల్యం గెలిచి, గత ఎన్నికలలో సొంత బలం చూపించుకోలేక మట్టికరిచినా ఎందుకు తమపై రుద్దుతున్నారో తెలియక గందరగోళపడుతున్నారు. మరోవైపు కోండ్రు దూకుడు వైఖరిని తలచుకొని లోలోనే మదనపడుతున్నారు. అసలు ‘సముచిత స్థానం’ అంటే ఏమిటో తేల్చుకోకుండా తమ నాయకురాలు స్టీరింగ్ వదిలేయడంతో తమ గమ్యస్థానం ఏమిటనే ఆందోళనలో ఉన్నారు. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ ‘సముచిత స్థానం’ అనే బ్రహ్మాపదార్థంతోనే సంతకవిటిలో సీనియర్ నాయకుడు కోళ్ల అప్పలనాయుడికి ఝలక్ ఇచ్చిన వైనాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారంతా కోండ్రు నిర్వహిస్తున్న సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. రాజాం ఏఎంసీ చైర్మన్ పైల వెంకటరమణ, రేగిడి మండలానికి చెందిన కరణం శ్రీనివాసరావు, రాజాంకు చెందిన వంగా వెంకటరావు, టంకాల కన్నంనాయుడు వంటి సీనియర్ నాయకులు అందులో ఉండటం గమనార్హం. కళా, కోండ్రు ద్వయాన్ని ఎదుర్కోవడానికి కావలి వర్గం ఎలాంటి పావులు కదుపుతుందో చూడాలి. ఈ పోరులో చేతులెత్తేస్తే కావలి రాజకీయవారసురాలు గ్రీష్మప్రసాద్ భవితవ్యానికి భరో సా ఎలా దక్కుతుందనేదీ మిలయన్ డాలర్ల ప్రశ్న!! -
చంద్రబాబును కలిసిన ప్రతిభా భారతి.. తీవ్ర అసంతృప్తి!
సాక్షి, అమరావతి : టీడీపీ అధినాయకత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. తన ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ టీడీపీలో చేరబోతుండటాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాను టీడీపీలో ఉండగా కొండ్రు మురళీని పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరమేముందని ఆమె చంద్రబాబును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పార్టీ అవసరాల కోసమే కొండ్రు మురళీని టీడీపీలోకి తీసుకుంటున్నట్టు చంద్రబాబు ఆమెకు బదులిచ్చారు. ఆయన పార్టీలో చేరినా.. మీకు ప్రాధాన్యం తగ్గదని ప్రతిభా భారతికి నచ్చజెప్పేందుకు బాబు ప్రయత్నించినట్టు సమాచారం. కానీ, చంద్రబాబు తీరుపై ప్రతిభా భారతీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 6న కొండ్రు మురళీ టీడీపీలో చేరబోతున్నారు. -
ప్రతిభా భారతిపై టీడీపీ నేతల తిరుగుబాటు
సాక్షి, శ్రీకాకుళం : మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ ప్రతిభా భారతికి టీడీపీలో ఎదురుగాలి వీస్తోంది. ఆమెపై సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైంది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్గా ప్రతిభా భారతిని తొలగించాలంటూ రాజాంలోని ఓ రిసార్ట్‌లో టీడీపీ ఎంపీపీలు, జేడ్పీటీసీలు సమావేశమయ్యారు. ఇన్చార్జ్ బాధ్యతల నుంచి ప్రతిభా భారతిని తొలగించాలని, ఆమె నిర్వహించే సమావేశాలను బహిష్కరించాలని వారు ఈ భేటీలో తీర్మానం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిభా భారతికి టికెట్ ఇస్తే.. సహాయనిరాకరణ చేస్తామని టీడీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు హెచ్చరిస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావే తన వర్గాన్ని ప్రతిభా భారతికి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబును కలిసి ప్రతిభా భారతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని కళా వర్గీయులు భావిస్తున్నారు. -
ప్రతిభా భారతి మనవడు మృతి
శ్రీకాకుళం , రాజాం: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, రాజాం ఇన్చార్జి కావలి ప్రతిభాభారతి మనవడు గొలగాన విఖ్యాత్(5) బుధవారం మృతిచెందాడు. ప్రతిభా భారతి కుమార్తె, రాజాం సామాజిక ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గ్రీష్మాప్రసాద్ కుమారుడు విశాఖపట్నంలో ఉంటున్నారు. ఈమె కుమారుడు విఖ్యాత్ మంగళవారం రాత్రి బాత్రూమ్కు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు. వెంటనే బాలుడిని విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతుండగానే రాత్రి 2 గంటల సమయంలో మృతిచెందాడు. విఖ్యాత్ తన తల్లి దగ్గరకంటే ప్రతిభాభారతి వద్దే ఎక్కువగా ఉండేవాడు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు గ్రీష్మాప్రసాద్, రఘులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మృతదేహాన్ని బుధవారం సంతకవిటి మండలంలోని ప్రతిభాభారతి స్వగ్రామం కావలి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాలకు చెందిన టీడీపీ నేతలు అధికసంఖ్యలో కావలి చేరుకుని ప్రతిభాభారతితో పాటు ఆమె కుమార్తె గ్రీష్మాప్రసాద్‌ను పరామర్శించారు. -
‘ప్రతిభ’కు పట్టం కడితే...
శ్రీకాకుళం : జిల్లా నుంచి అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రతిభాభారతికి ఏదైనా కీలక పదవి లభిస్తే తమ పరిస్థితి ఏమిటన్నదానిపై స్వపార్టీలోనే ప్రత్యర్థి వర్గీయులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆమెకు మండలి చైర్మన్పదవిగానీ, ఏదైనా కేబినెట్ పదవిగానీ లభిస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఆమెపై వ్యతిరేకంగా ఉన్నవారిలో గుబులు మొదలైంది. వాస్తవానికి ప్రతిభకు ప్రతిపక్ష పార్టీలకంటే సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా, శాసనసభ స్పీకర్‌గా పనిచేసినప్పుడు ఆమెకు పార్టీలోని అందరూ సన్నిహితంగానే ఉండేవారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రిజర్వేషన్ మారి రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వచ్చిననాటి నుంచి కళా వెంకటరావుతో విభేదాలు తలెత్తాయి. తొలిసారి రాజాం నుంచి పోటీచేసినప్పుడు అంతంతమాత్రంగా ఉన్న విభేదాలు రెండో సారి పోటీ చేసేసరికి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తన పరాజయానికి కారణం కళావెంకటరావేనన్న వేదన ప్రతిభాభారతిలో ఉంది. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు ప్రతిభాభారతి హయాంలోనే అభివృద్ధి చెందినా వారంతా ప్రస్తుతం కళా అణుచరులుగా మారారు. పదవి లేకపోవడంతో ప్రతిభాభారతి ఇప్పటివరకు మౌనంగా ఉండాల్సి వచ్చింది. అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కడం ఆమెకు మంత్రి పదవి కానీ, శాసనమండలి చైర్మన్ పదవి కానీ దక్కేవీలుందని ప్రచారం జరుగుతుండడంతో ప్రత్యర్థుల్లో కలవరం మొదలైంది. తమపై కక్ష సాధింపునకు పాల్పడతారేమోనన్న ఆందోళనలో కళా వర్గీయులు ఉన్నారు. ఇటువంటి వాటిని తప్పించుకునేందుకు కొందరు ఇప్పటికే ప్రతిభ ప్రసన్నం కోసం యత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కింజరాపు కుటుంబంతో తొలినుంచి కళా కుటుంబానికి అభిప్రాయ భేదాలున్నాయి. అటు రాజాం నియోజకవర్గంలోనూ, ఎచ్చెర్ల నియోజకవర్గంలోనూ కళావర్గాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా చిత్తు చేసేందుకు కింజరాపు వర్గం పాటుపడింది. ఎచ్చెర్లలో కళా వెంకటరావును ఎదుర్కొనేందుకు చౌదరి ధనలక్ష్మిని జెడ్పీ చైర్మన్‌గా ఎంపికయ్యేట్టు చేశారు. రాజాం నియోజకవర్గంలో ప్రతిభా భారతిని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆమెకు పదవి లేకపోవడం వల్ల కింజరాపు కుటుంబీకులే నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చేది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం అభ్యర్థిగా ప్రకటించిన జూపూడి అనర్హుడు కావడంతో అచ్చెన్న చక్రం తిప్పారు. తన ప్రత్యర్థి అయిన కళాకు రాజాంలో చెక్ పెట్టాలంటే ప్రతిభాభారతికి పదవి అవసరమని గుర్తించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా అధినాయకుడిని ఒప్పించగలిగారు. అయితే ప్రతిభకు మంత్రి పదవి ఇస్తే కేబినెట్ హోదా కలిగిందే ఇవ్వాలి. అదే జరిగితే సహాయమంత్రిగా ఉన్న కింజరాపు ప్రాధాన్యం కోల్పోయే ప్రమాదం ఉంది. శాసనమండలి చైర్మన్ పదవి కూడా ఆ స్థాయిదే. ఈ రెండు పదవుల్లో ఏది దక్కినా ప్రత్యర్థికి చెక్పెట్టనిదే ఆమె నిద్రపోరని ఆ పార్టీ వర్గీయులే గుసగుసలాడుతున్నారు. -
ఓడిన అభ్యర్థితో ప్రభుత్వ కార్యక్రమాలా?
ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉండగా.. తనను కాదని ఓడిపోయిన అభ్యర్థితో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడంపై శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. మండల తహసీల్దార్ రామకృష్ణ ఈ విధంగా చేస్తున్నారంటూ ఆయన జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన ప్రతిభా భారతి ఓడిపోయారు. కానీ, ఆమెతోనే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా తహసీల్దార్ ప్రవర్తిస్తున్నారని ఆయన జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.