
సాక్షి, శ్రీకాకుళం : మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ ప్రతిభా భారతికి టీడీపీలో ఎదురుగాలి వీస్తోంది. ఆమెపై సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైంది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా ప్రతిభా భారతిని తొలగించాలంటూ రాజాంలోని ఓ రిసార్ట్‌లో టీడీపీ ఎంపీపీలు, జేడ్పీటీసీలు సమావేశమయ్యారు. ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి ప్రతిభా భారతిని తొలగించాలని, ఆమె నిర్వహించే సమావేశాలను బహిష్కరించాలని వారు ఈ భేటీలో తీర్మానం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిభా భారతికి టికెట్ ఇస్తే.. సహాయనిరాకరణ చేస్తామని టీడీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు హెచ్చరిస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావే తన వర్గాన్ని ప్రతిభా భారతికి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబును కలిసి ప్రతిభా భారతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని కళా వర్గీయులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment