
సాక్షి, అమరావతి: ఈ నెల 20న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు చేయనున్న ఒకరోజు నిరసన దీక్షకు ధర్మపోరాట దీక్ష అని పేరు పెట్టారు. 20వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు సీఎం దీక్షలో పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
అలాగే ఈ నెల 30న తిరుపతిలో జరిగే బహిరంగ సభను ‘నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం’అనే నినాదంతో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీక్ష ప్రధాన వేదికపై 150 మంది, వేదిక ఎదురుగా 10 వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కళా వెంకట్రావు తెలిపారు.