Kala Venkat Rao
-
పెళ్లిలో కూడానా.. ఇదేమి ఖర్మరా బాబు..!
సాక్షి, శ్రీకాకుళం: ‘ఎన్నిసార్లు పార్టీ పరువు తీస్తారు కళా వెంకట్రావు? మీరు ఇంకా ఇన్చార్జిగా ఉండడం మా ఖర్మ! పెళ్లికి వెళ్లి పార్టీ ప్రోగ్రాం చేసే ఖర్మ తెలుగుదేశం ఇన్చార్జికి పట్టిందా? ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్నే వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా చిత్రీకరించి పార్టీలో చేర్చుకునే ఖర్మ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జికి పట్టిందా? 10 మందితో పేరుకి ప్రోగ్రామ్ చేస్తారా? కారులో నుంచి దిగి 5 నిమిషాలు స్టేజీ మీద ఉండి నాలుగు మాటలు మాట్లాడితే అదే ప్రోగ్రామా? కేశవరాయునిపాలెం గ్రామంలో మీరు ఇవాళ ఏం పని మీద వచ్చారు? ఏమి చేశారు? పెళ్లికి వచ్చిన బంధువులు, కార్యకర్తలతో కలిసి ఇదేమి ఖర్మ బ్యానర్ పెట్టి నాలుగు ఫోటోలు దిగితే ప్రోగ్రామ్ ఐపోయినట్టేనా? పార్టీ పరువు ఎన్ని విధాలుగా.. ఎన్ని సార్లు తీస్తారు?’ అంటూ సాక్షాత్తు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు చేస్తే ఆరోపణలు, విమర్శలవుతాయి. అదే సొంత పార్టీ కార్యకర్తలు.. అదీ పార్టీ కార్యక్రమంపైన ధ్వజమెత్తితే ఏమనుకోవాలో టీడీపీ మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావే చెప్పాలి. టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావును సొంత పార్టీ కార్యకర్తలే ఏకిపారేస్తున్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలతో ఏకంగా పార్టీ అప్రతిష్ట పాలవుతుందని తెలుగు తమ్ముళ్లు మండి పడుతున్నారు. ఎంతో సీనియరై ఉండి జూనియర్ కంటే దారుణమైన రీతిలో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. అక్కడా ఇక్కడా అని కాకుండా సోషల్ మీడియాలో, పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో కడిగి పారేస్తున్నారు. పెళ్లి వేడుకకు వచ్చిన నాయకులతో ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. లావేరు మండలం కేశవరాయునిపాలెంలో పార్టీ నాయకుడు నాయన శంకర్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు కళా వెంకటరావు శుక్రవారం హాజరయ్యారు. మండల పార్టీ నాయకులతో కలిసి వధూవరులను ఆశీర్వదించారు. అయితే, అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాన్ని అక్కడికక్కడే నిర్వహించారు. మరోసారి పిలుపిస్తే వచ్చే కొద్ది పాటి కార్యకర్తలు, నాయకులు హాజరవరనో.. పార్టీ కార్యక్రమాన్ని ప్రజలు విశ్వసించరనో గానీ అప్పటికప్పుడే బ్యానర్ పెట్టి కార్యక్రమాన్ని కానిచ్చేశారు. ఇప్పుడిదే టీడీపీలో చర్చనీయాంశమైంది. ప్రత్యర్థి పార్టీ విమర్శలు చేస్తే వేరు.. సాక్షాత్తు తోటి టీడీపీ కార్యకర్తలు, నాయకులు కళా వెంకటరావుపై భగ్గుమంటున్నారు. పాలఖండ్యాంలో పార్టీలో చేరికల పేరుతో టీడీపీ కార్యకర్తల్నే చేర్పించి సాధించిందేంటి? ఎచ్చెర్ల పార్టీ కార్యాలయంలో చేరికలు పేరుతో మీరు చేసిందేంటి? ఎన్నిసార్లు మీ తప్పులు మీకు ఎత్తి చూపించినా మారకపోతే ఏమనాలి? అని గట్టిగా నిలదీస్తున్నారు. మీ లాంటి వారిని మోయాల్సి రావడం నిజంగా మా ఖర్మ.. అంటూ సోషల్ మీడియా, పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో కళా తీరును కడిగిపారేస్తున్నారు. వాస్తవంగా టీడీపీకి, ఆయనకు జనాదరణ లేకపోవడంతో పెళ్లికొచ్చిన జనాలతో కార్యక్రమాన్ని చేసేద్దామనుకోవడం బూమ్రాంగైంది. -
అచ్చెన్నకు లోకేష్‌తో చెడిందా?.. చినబాబుకు కళా అందుకే దగ్గరవుతున్నారా?
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఎమ్మెల్యే టిక్కెట్ మీకే ఇస్తామంటూ ఆ పార్టీ అగ్ర నేతలు ముగ్గురికి ఆశ పెడుతున్నారు. దీంతో ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందంటూ ఊహల్లో తేలిపోతున్నారు. ఫలితంగా ఇక్కడి రాజకీయం రసకందాయంలో పడింది. వాస్తవానికి వీరి విషయంలో తమకు అలవాటైన యూజ్ అండ్ త్రో పాలసీ అమలు చేయాలని అధిష్టానం యోచిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి ఆ పార్టీ నేతలే ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రజల మద్దతు ఉందా లేదా అన్నది పక్కన పెడితే టీడీపీ క్యాడరే ఆమెను పట్టించుకోవడం లేదు. ఈసారి ఎలాగైనా ఆమెను మార్చాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ముఖ్యంగా రూరల్‌లో కాసింత పట్టు ఉన్న గొండు శంకర్.. గుండ లక్ష్మీదేవిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కృష్ణయ్యపేట సర్పంచ్‌గా ఉన్నప్పటికీ గుండ ఫ్యామిలీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈసారి ఎలాగైనా తనకే టిక్కెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. వారి నీడలో తాము ఎదగలేమని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఈ సారి యూత్‌కి అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం చెప్పడంతో తనకే టికెట్ వస్తుందనే ధీమాతో గొండు శంకర్ ముందుకు సాగుతున్నారు. కానీ గుండ ఫ్యామిలీ ఆలోచన మరోలా ఉంది. అవసరమైతే తన కొడుకుని తీసుకొచ్చి పోటీ చేయిస్తానని గుండ లక్ష్మీ దేవి తమవారి వద్ద చెబుతున్నారు. గొండు శంకర్‌కు ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ వచ్చేది లేదని, ఆయనకు అంత సీన్ లేదని, 2019 ఎన్నికల్లో పార్టీ కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను వెనకేసుకున్న ఆయనకెలా ఇస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు. మరోవైపు శంకర్ కూడా గుండ లక్ష్మీదేవి కుటుంబం వైఫల్యాలను తీవ్రంగా ఎండగడుతున్నారు. వీరిద్దరి మధ్య పోరు సాగుతుంటే తానేమీ తక్కువ కాదంటూ కొర్ను ప్రతాప్ అనే నాయకుడు మధ్యలోకి వస్తున్నారు. గతంలో పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన ప్రతాప్‌ను కూడా అగ్రనేతలు ఉసిగొల్పుతున్నారు. టీడీపీ మూడు ముక్కలాట లో తానున్నానంటూ సంకేతాలిస్తున్నారు. తగిలించి తమాషా చూస్తున్నారు టీడీపీ అగ్రనేతలు తమ బలాన్ని పెంచుకునేందుకు ఆశావహులను ఉసిగొల్పుతున్నారు. ఎన్నికల వరకు వాడుకుని ఆ తర్వాత వదిలేద్దామనే యోచనతో రాజకీయ డ్రామా కొనసాగిస్తున్నారు. గుండ ఫ్యామిలీకి చెక్ పెట్టాలనే యోచనలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు. పార్టీలో, రాజకీయంగా తన వర్గం కాని గుండ ఫ్యామిలీకి మరో ఛాన్స్ ఇవ్వకూడదనే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. వాస్తవానికైతే, మొదటి నుంచి అచ్చెన్న, గుండ ఫ్యామిలీ మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయి. ఒకరినొకరు దెబ్బకొట్టుకునే ప్రయత్నాలు నడుస్తున్నాయి. చదవండి: (ఒక్కసారి మాట్లాడతా అంటే మార్షల్స్‌ను పెట్టి బయటకు గెంటాడు: పేర్ని నాని) అందులో భాగంగా 2024లో గుండ ఫ్యామిలీకి టిక్కెట్ రాకుండా అడ్డుకోవాలని అచ్చెన్న యోచిస్తున్నట్లు పార్టీలో కూడా గట్టిగా చర్చ నడుస్తోంది. ఆ క్రమంలోనే గొండు శంకర్ ను ఉసిగొల్పుతున్నారని, ప్రత్యక్షంగా మద్దతు పలుకుతున్నారని టీడీపీ వర్గాలంటున్నాయి. అచ్చెన్న అండతోనే గొండు శంకర్ తన స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎంపీ రామ్మోహన్నాయుడు కూడా వ్యూహాత్మక వైఖరి అవలంబిస్తున్నారు. గుండ ఫ్యామిలీకి ఒకవైపు మద్దతు పలుకుతూనే, మరోవైపు ఇతర ఆశావహులకు కూడా ఆశ చూపుతున్నట్టు సమాచారం. పాము చావకుండా, కర్ర విర గకుండా రాజకీయాన్ని నెరుపుతున్నారు. కొర్ను ప్రతాప్ మాత్రం ఎంపీ అండ ఉందనే ధీమాతో పోటీలో తానున్నానంటూ సంకేతాలిస్తున్నారు. మధ్యలో కళా రాజకీయం.. తరచూ అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు, లోపాయికారీ రాజకీయాలతో లోకేష్‌తో చెడిందనే వాదన పార్టీలో ఉంది. ఈ తరుణంలో లోకేష్‌కు కళా వెంకటరావు దగ్గరై , వర్గ రాజకీయాలను చేస్తున్నారు. అచ్చెన్న వ్యతిరేక బ్యాచ్‌ను లోకేష్ దగ్గరికి తీసుకెళ్లి ఓ వర్గాన్ని తయారు చేస్తున్నారు. అందులో భాగంగా అచ్చెన్నతో విభేదాలు ఉన్న గుండ ఫ్యామిలీతో సత్సంబంధాలు నెరిపి, లోకేష్ వద్దకు తీసుకెళ్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ‘జిల్లాలో ఎవరినీ పట్టించుకోవద్దు.. నేనున్నానంటూ’ గుండ ఫ్యామిలీకి లోకేష్ భరోసా ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొత్తానికి పాతపట్నంలో ఫాలో అవుతున్న ఫార్ములానే శ్రీకాకుళంలో కూడా టీడీపీ అమలు చేస్తోంది. ఎన్నికల వరకు పార్టీకి డబ్బు ఖర్చు పెట్టించుకోవాలని చూస్తోంది. -
కత్తులు దూసుకుంటున్న టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఎచ్చెర్ల టీడీపీ నాయకులు కత్తులు దూసుకుంటున్నారు. నువ్వెంత నేనెంత అన్నట్టుగా టీడీపీ వర్గాలు ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావును నియోజకవర్గ టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదు. ఇంకోవైపు నియోజకవర్గంలో కళా వైరి వర్గాలు కూడా ఏకమవుతున్నాయి. ఆయనకు పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకటరావు ప్రస్తుతం బలహీనమైన శక్తిగా మిగిలిపోయే పరిస్థితి కనబడుతోంది. కిమిడి కళా వెంకటరావు తన కుమారుడిని ప్రమోట్ చేసుకోవడం మొదలు పెట్టిన దగ్గరి నుంచి టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. కళాయే పక్క నియోజకవర్గ నేత. ఆయన్ని భరించడమే కష్టంగా ఉంది. ఆపైన ఆయన కుమారుడ్ని కూడా తమపై రుద్దడమేంటని ఎచ్చెర్ల టీడీపీ నేతలు ఆవేదనతో ఉన్నాయి. ఎన్నాళ్లీ రాజకీయాలు అని గగ్గోలు పెడుతున్నారు. కళా వెంకటరావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడికి రాష్ట్ర కార్యదర్శి పదవితో పాటు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలను పరోక్షంగా అప్పగించడాన్ని నియోజకవర్గ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్నాళ్లీ పల్లకీ మోత అని కళా నాయకత్వాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. రామ్ మల్లిక్ నాయుడినైతే కనీసం పట్టించుకోవడం లేదు. కొత్త నియామకాలు జరిగిన దగ్గరి నుంచైతే కళా వెంకటరావుకు ఒక్కొక్కరు దూరమవుతున్నారు. ఆయన చేపట్టే కార్యక్రమాలకు హాజరు కావడం లేదు సరికదా పోటీగా కార్యక్రమాలు నిర్వహించే స్థాయికి ఆయన వ్యతిరేక వర్గీయులు ఎదిగారు. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను కూడా వేరుగా నిర్వహించారు. కళా వెంకటరావు నిర్వహించే కార్యక్రమానికి టీడీపీ నేతలు పెద్దగా హాజరు కాలేదు. రక్తదాన శిబిరానికి కూడా ఆశించినంత స్పందన రాలేదు. ఆయనకు పోటీగా స్థానిక నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు నిర్వహించే కార్యక్రమానికి మాత్రం ఎక్కువమంది హాజరయ్యారు. మొన్నటి వరకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా చేసిన చౌదరి ధనలక్ష్మి ఇతరత్రా నేతలు కలిశెట్టి అప్పలనాయుడు నిర్వహించిన కార్యక్రమానికి హాజరవ్వగా, కళా వెంకటరావు నిర్వహించే కార్యక్రమానికి చోటామోటా నేతలు పాల్గొని మమ అనిపించారు. కొందరైతే ఇరువురు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని గోడ మీద పిల్లిలా వ్యవహరించారు. మొత్తానికి ఎన్టీఆర్ వర్ధంతి వేదికగా జరిగిన కార్యక్రమంతో కళాకు ఉన్న పట్టు, వ్యతిరేకత ఏంటో స్పష్టంగా తెలిసింది. ఇంటి పోరు.. మరోవైపు కళా వెంకటరావు ఇంటి పోరు కూడా ఎదుర్కొంటున్నారు. ఆయన సోదరుడు రామకృష్ణనాయుడు బీజేపీ నేతలతో సంప్రదింపులు చేయడం కళాకు మైనస్‌గా మారింది. అధికారంలో ఉన్నంతసేపు నియోజకవర్గంలో చక్రం తిప్పిన రామకృష్ణంనాయుడు, ఆయన కుమారుడు ఇప్పుడు బీజేపీ నేతలతో చెట్టాపట్టాలేసి తిరగడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంటిలోనే అన్న, ఇతర కుటుంబ సభ్యులే తాను పోలిట్ బ్యూరోగా ఉన్న పార్టీని కాదని బీజేపీ వైపు చూపులు చూడటంతో కళా పరిస్థితి దయనీయంగా తయారైంది. చివరికి కళా వెంకటరావు కూడా బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం సాగింది. ముందు కుటుంబ సభ్యులను పంపించి, తర్వాత ఆయన కూడా బీజేపీలోకి పయనమవుతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రచారం పీక్కు వెళ్లడంతో బీజేపీలోకి వెళ్లడం లేదని చివరికి కళా వెంకటరావే నేరుగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తానికి కళా వెంకటరావు కుటుంబ రాజకీయం, ఇతర కారణాలతో ఆయన్ని ఎచ్చెర్ల నియోజకవర్గ నేతలు పెద్దగా నమ్మడం లేదు. చౌదరి బాబ్జీ, జి.సిగడాం, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల మండలాలకు చెందిన పలువురు నేతలు కళాకు వ్యతిరేకంగా అడుగులు వేస్తుండటంతో నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు చేజారిపోయేలా కనబడుతోంది. -
టీడీపీకి బిగ్‌షాక్.. బీజేపీలోకి కీలక నేత!
సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ప్రతిపక్ష టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున సీనియర్లు పార్టీని వీడగా.. మరికొంత మంది నేతలు సైతం అదేదారిలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో పాటు మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవలంభిస్తున్న తీరు ఆపార్టీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటంలేదు. అంతేకాకుండా ఒకరి తరువాత ఒకరు సీనియర్లు పార్టీని వీడటం ఇతరులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీలోనే కొనసాగితే రాజకీయ భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సైకిల్ పార్టీకి రాజీనామా చేసి అధికార వైఎస్సార్సీపీలో చేరగా.. మరికొందరు మాత్రం అటుఇటు తేల్చుకోలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. రాజకీయ భవిష్యత్‌పై చంద్రబాబు నాయుడు నుంచి ఎలాంటి భరోసా రాకపోవడంతో తమ దారి తాము చూసుకుంటామని పచ్చ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సైతం దూకుడు పెంచింది. టీడీపీ అసంతృప్తి నేతలపై గాలం వేస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ నేతల్ని చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా గుర్తింపు పొందిన కాపులను ఎక్కువగా ఆకర్శిస్తోంది. దీనిలో భాగంగా ఉత్తరాంధ్రలో టీడీపీ ముఖ్యనేతగా ఉన్న ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌తో బీజేపీ నేతలు మంతనాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. చంద్రబాబుతో పాటు జిల్లా నేతలకు కూడా అందుబాటులో ఉండటంలేదు. అంతేకాకుండా టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని తనకంటే జూనియర్ అయిన అచ్చెన్నాయుడుకి అప్పగించడం పట్ల కళా వెంకట్రావ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన వర్గీయుల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామాలను గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రానున్న రెండు మూడు రోజుల్లో ఆయన్ను కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారని చర్చసాగుతోంది. ఆయనతో పాటు పలువురు టీడీపీ అసంతృప్త నేతల్ని కూడా బీజేపీకి చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఇప్పటికే ఉత్తరాంధ్రలో చావుదెబ్బ తిన్న టీడీపీకి కళా వెంకట్రావ్ రూపంలో భారీ షాక్ ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. -
సందిగ్ధంలో టీడీపీ అధ్యక్షుడి ఎంపిక!
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై సందిగ్థత ఏర్పడింది. ఈ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై చంద్రబాబు తర్జనభర్జనలు పడుతూ ఇంతవరకూ ఒక నిర్ణయానికి రాలేకపోయినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. నిజానికి మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ కమిటీ, ఏపీ, తెలంగాణ అధ్యక్షులు, కమిటీల ఎన్నికను పూర్తిచేయాల్సి వుంది. కానీ, కరోనా పేరుతో వాటన్నింటినీ వాయిదా వేశారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక లాంఛనమే అయినా ఏపీ అధ్యక్షుడి ఎంపికపై కొంత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న కళా వెంకట్రావును తప్పించాలని గతంలోనే నిర్ణయించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ను అధ్యక్షుడిగా నియమించినా ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయన ఆ పదవికి సరిపోడనే అభిప్రాయం వచ్చింది. దీనికితోడు ఆయన ఓటమిపాలవడం, ఓడిపోయిన నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం సరికాదని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. (రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారు 63.49 శాతం) అచ్చెన్నాయుడుపై పునరాలోచన ఈ నేపథ్యంలో.. అచ్చెన్నాయుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని ఆలోచన చేశారు. అయితే, ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఈ మార్పు చేయకుండా కొద్దిరోజుల తర్వాత చేద్దామని ఆగారు. గత వారం జరిగిన మహానాడులో దీనిపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ.. అన్ని కమిటీల నియామకాన్ని వాయిదా వేశారు. బీసీలు పార్టీకి దూరమయ్యారనే ఉద్దేశంతో ఆ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడికి అవకాశమిస్తే బాగుంటుందని మొదట్లో చూసినా ఇప్పుడు దానిపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు కళా వెంకట్రావులా కాకుండా దూకుడుగా ఉంటాడని, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోననే అభిప్రాయం అగ్రనాయకత్వంలో ఏర్పడినట్లు తెలిసింది. బీసీ నాయకుడికి అధ్యక్ష పదవి ఇచ్చాక ఆయన బలపడితే భవిష్యత్తులో కొత్త సమస్యలు వస్తాయని ఆలోచిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. (డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు) -
నలుగురు ఎంపీలది ఫిరాయింపే
సాక్షి, అమరావతి: నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం ఫిరాయింపేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలపై ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో శనివారం ఆయన అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యసభలో మెజారిటీ కోసమే బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని విమర్శిం చారు. ప్రజావేదికలో చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తిగత సామగ్రిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయట పెట్టడం సరికాదన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండవల్లిలోని ప్రజావేదికను వాడుకునేందుకు తనకు కేటాయించాలని చంద్రబాబు లేఖ రాశారని, దీనిపై సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కక్ష సాధింపేనని విమర్శించారు. ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ నలుగురు ఎంపీల విలీనం అనైతికం, అప్రజాస్వామికమేనన్నారు. దీనిపై న్యాయ పోరాటానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. నీతివంతమైన పాలన అందిస్తామని చెప్పిన బీజేపీ.. టీడీపీ ఎంపీలను చేర్చుకోవడం తప్పేనని మాజీ మంత్రి దేవినేని ఉమా తప్పుబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రుణమాఫీ మిగిలిన విడతలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేయాలని యనమల పేర్కొన్నారు. ప్రభుత్వం తన ప్రాధాన్యతలు నెరవేరుస్తూనే గత ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. ఇదిలా ఉండగా బీజేపీలోకి వెళతారని ప్రచారం జరగుతుండడంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ఈ సమావేశానికి ప్రత్యేకంగా పిలిచారు. కొందరు నేతలు పార్టీ మా ర్పు గురించి అడగ్గా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. చంద్రబాబుతో మాట్లాడాలని, టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాలని చెప్పినా తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయినట్లు తెలిసింది. మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోవ డం చర్చనీయాంశమైంది. సమావేశంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు, వీవీవీ చౌదరి, బాబూ రాజేంద్రప్రసాద్, అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేశ్, శ్రావణ్‌కుమార్‌లు పాల్గొన్నారు. చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ఇదిలా ఉండగా తాజా రాజకీయ పరిణామాలపై విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరికాదని ప్రచారం చేయాలని, దీనిపై నేతలందరూ మీడియా సమావేశాలు పెట్టాలని ఆయన సూచించినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఓవర్ యాక్షన్ ఉండవల్లిలోని కృష్ణా నది కరకట్ట దిగువన ఉన్న ప్రజావేదిక వద్ద టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కాసేపు ఓవర్ యాక్షన్ చేశారు. కలెక్టర్ల సమావేశం నిమిత్తం ప్రజావేదికలో ఏర్పాట్లు చేస్తుండగా అక్కడకు వచ్చిన రాజేంద్రప్రసాద్.. చంద్రబాబు సామాన్లు, టీడీపీ కార్యాలయం నమూనాను ఎవరు బయట పెట్టారని అధికారులను ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా వస్తువులు ఎలా బయటపెడతారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాము నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని అధికారులు సమాధానం చెప్పారు. గతంలో కలెక్టర్ల సమావేశం ప్రజావేదికలో జరిగేదని, ఇప్పుడు కూడా అలానే ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం పెడితే ఇబ్బందవుతుందని తెలిపారు. ఇక్కడ రోడ్లు, స్థలం ఇరుకుగా ఉంటాయన్నారు. చంద్రబాబు కట్టిన ప్రజావేదికలోనే కలెక్టర్ల సమావేశం పెట్టలా.. వేరే చోట పెట్టుకోకూడదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు ప్రజావేదిక జర్నలిస్ట్‌లకు షెల్టర్‌గా ఉండేదని చెప్పగానే, విలేకరులు ఆయన మాటలకు అడ్డుపడుతూ.. తమని ఎన్నడూ ప్రజా వేదికలోకి రానివ్వలేదన్నారు. -
ప్రజా విజయ 'కిరణం'
సాక్షి, ఎచ్చెర్ల (శ్రీకాకుళం): ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్ట నష్టాలు చూసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై ఉన్న ఆధరాభిమానాలు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పార్టీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్‌కు ఎమ్మెల్యేగా ప్రజలు భారీ మెజార్టీతో పట్టంకట్టారు.గురువారం విడుదలైన 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో భారీ గెలుపుతో ఫ్యాన్ స్పీడ్ విజయకేతం ఎగురవేసింది. టీడీపీ అరాచక, అవినీతి పాలనను అనుభవిస్తూ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అందక, మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడ్డారు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రజలు కష్టాలు తెలుసుకున్నారు. ప్రజాసంక్షేమం కోసం పరితపించే జననేత వచ్చారని, ఐదేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు ఉండవని, జగన్మోహన్రెడ్డి సుపరిపాలనతో పాటు నవరత్నాల పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయని సార్వత్రిక ఎన్నికల కోసం ఎదురుచూశారు. టీడీపీ అరాచక పాలనతో విసుగెత్తిన ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గొర్లె కిరణ్‌కుమార్, టీడీపీ నుంచి కిమిడి కళా వెంకట్రావు ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ప్రజలతో మమైకమై ప్రజా కష్టాలు తెలుసుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరి ఓటేశారు. వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. వైఎస్సార్సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. గురువారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అనుహ్య మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ను గెలిపించారు. మండలంలోని 115 పంచాయతీల్లో అన్ని గ్రామాలు వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చి ప్రజలు వైఎస్సార్సీపీపై ఉన్న ఆదరాభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్సీపీదే ఆధిక్యత ఎచ్చెర్ల నియోజకవర్గంలో జి.సిగడాం, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో అన్ని రౌండ్‌ల్లోనూ వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఏ దశలోనూ కనీసం టీడీపీ పోటీ ఇవ్వలేకపోయింది.కళా వెంకట్రావుపై గొర్లె కిరణ్‌కుమార్ అనూహ్యంగా విజయం సాధించారు. మొత్తం 1,94,538 ఓట్లు పోలయ్యాయి. గొర్లె కిరణ్‌కుమార్ 18,813 ఓట్ల ఆధిక్యతతో టీడీపీకి చెందిన కళా వెంకట్రావుపై గెలిచారు. పనిచేయని ఈవీఎంలు ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఓట్ల కౌంటింగ్‌లో రెండు ఈవీఎంలు మొరాయించాయి. 45వ పోలింగ్ కేంద్రం నిద్దాం ప్రాంతానికి చెందిన ఈవీఎం, 172 కొవ్వాడకు చెందిన ఈవీఎంలు పనిచేయలేదు. ఓట్లు డిస్ప్లే కాకపోవడంతో ఆయా ఈవీఎంలను కౌంటింగ్ సూపర్వైజర్లు సరెండర్ చేశారు. వీటి స్థానంలో వీవీ ప్యాట్లను లెక్కించి పరిగణనలోకి తీసుకున్నారు. స్పష్టమైన మెజార్టీ ఉండడంతో రాజకీయ పార్టీ ఏజెంట్లు సైతం ఎటువంటి అభ్యంతరం తెలియజేయలేదు. మొరాయించిన 168వ నంబర్ పోలింగ్ ఈవీఎం విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ఓటింగ్ కౌంటింగ్‌కు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గంలో మెంటాడకు చెందిన 168వ పోలింగ్ కేంద్రం పనిచేయలేదు. ఈవీఎం స్థానంలో వీవీప్యాట్‌ను అధికారులు లెక్కించారు. ఈ కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీకి– 335. టీడీపీకి–229 ఓట్లు, జనసేన–4 నమోదయ్యాయి. మిగిలిన ఓట్లు ఇతరకు నమోదయ్యాయి. ఎంపీకి స్పష్టమైన ఆధిక్యత వైఎస్సార్సీపీకి ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌కు స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. 14,476 ఓట్లు ఆధిక్యత వచ్చింది. సుమారు 23 రౌండ్లో 22 ఆధిక్యం కొనసాగింది. బెల్లాన చంద్రశేఖర్ 96112 ఓట్లు, ప్రత్యర్థి టీడీపీకి చెందిన ఎంపీ అశోక్‌కు 81636 ఓట్లు, జనసేన అభ్యర్థి ముక్కా శ్రీనివాసరావుకు 4530, కాంగ్రెస్ అభ్యర్థి ఆదిరాజుకు 2134 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 1,94,538 ఓట్లు పోలయ్యాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. కౌంటింగ్‌ను పరిశీలించిన కిరణ్‌కుమార్ శివానీ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన కౌంటింగ ప్రక్రియను గొర్లె కిరణ్‌కుమార్ పరిశీలించారు. తనకు మెజార్టీ వచ్చిన రౌండ్లు, గ్రామాలు పరిశీలించారు. జనరల్ ఏజెంట్లు పిన్నింటి సాయికుమార్, ఎం.మురళీధర్ బాబా పోలింగ్ సరళిని ఆయనకు వివరించారు. మెజార్టీ పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్ల వివరాలు ఎచ్చెర్ల క్యాంపస్: విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించిన పోస్టల్ బ్యాలెట్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో సగానికి పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. నియోజకవర్గంలో 1394 ఓట్లు వినియోగించుకోగా 726 ఓట్లు చెల్లలేదు. 668 ఓట్లు నమోదయ్యాయి. మూడు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. 326 ఓట్లు వైఎస్సార్సీపీకి మెజార్టీ లభించింది. పోస్టల్ బ్యాలెట్లో నమోదైన ఓట్ల వివరాలు వైఎస్సార్సీపీ– 479, టీడీపీ– 153, జనసేన–42, కాంగ్రెస్–3, నోటా–5 తిరస్కరణ–3 మొత్తం– 685 422 సర్వీసులు ఓట్ల వినియోగం ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల జోన్లో 422 సర్వీసు ఓటర్ల నమోదయ్యాయి. ఇందులో 333 ఓట్లు చెల్లిన ఓట్లు 123,. టీడీపీకి–118, బీజీపే–34, జనసేన–51, కాంగ్రెస్–6, ఒక ఓటు తిరస్కరణకు గురైంది. -
ఎచ్చెర్లలో.. ‘కళా’విహీనం
సాక్షి, శ్రీకాకుళం: స్థానికుడు కాకపోయినా అభివృద్ధి చేస్తారని ఆశించారు. అందరికీ అందుబాటులో ఉంటారని ఓట్లేసి గెలిపించారు. గెలిచాక ప్రజలకు అందనంత దూరంగా ఉన్నారు. పేదలు, సామాన్యులను చెంతకు చేరనీయరు. వారి సమస్యలు వినడానికే చిరాకు పడిపోతుంటారు. తనకు బదులు ఇద్దరు పీఏల (ఒకరు పీఏ, మరొకరు ఓఎస్డీ)ను నియమించుకున్నారు. వారిద్దరూ షాడో ఎమ్మెల్యేలుగా చలామణి అయ్యారు. ఈ ఐదేళ్లూ నియోజకవర్గంలో వారిద్దరే చక్రం తిప్పారు. ఇప్పుడు మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మంత్రి కళా వెంకట్రావు ఎచ్చెర్ల ఎన్నికల బరిలోకి దిగారు. గత ఐదేళ్ల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజక వర్గ ప్రజలు ‘నీ సేవలు చాలు..’ అంటూ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..! కళా వెంకటరావు ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన వారు కాదు. ఆయన సొంత నియోజకవర్గం రాజాం పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వ్ కావడంతో 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో వచ్చి వాలారు. అప్పటి వైఎస్సార్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌పై 4,741 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. స్థానికేతరుడైనా కళా వెంకటరావును నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత అక్కడి ప్రజలకు ఆయన ఎమ్మెల్యేగా కాకుండా అప్పుడప్పుడూ వచ్చే అతిథి అయ్యారు. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం మానేశారు. అక్కడి వారు తమ సమస్యను చెప్పుకోవాలంటే 80 కిలోమీటర్ల దూరంలోని రాజాంలో ఏర్పాటు చేసిన క్యాంప్ ఆఫీసుకు వెళ్లాలి. వయసు మీరిన వారికి అంత దూరం వెళ్లడం ఎంతో కష్టమయ్యేది. ఇక తప్పనిసరి అయిన వారు వెళ్లినా ఎమ్మెల్యే దర్శన భాగ్యం గగనమయ్యేది. వచ్చిన వారిలో పేరున్న వారో, స్థితిమంతులో అయితేనే కలిసేందుకు అనుమతిస్తారన్న పేరు మూటగట్టుకున్నారు. దీంతో ఈ నాలుగేళ్లలో ఆ స్థాయి ఉన్న వారే రాజాం వెళ్లేవారు. అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఎచ్చెర్లకు వచ్చినప్పుడూ సామాన్యుల గోడు వినే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏ కష్టమొచ్చినా కళా వెంకటరావు పరామర్శకు కూడా రారని, ధనికుల ఇంట్లో పెళ్లి, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు మాత్రమే హాజరవుతారన్న పేరుంది. పర్సంటేజీలు, కమీషన్లు.. మరోపక్క ఆయన ఒక పీఏ (వెంకటనాయుడు)ను, మరో ఓఎస్డీ (కిమిడి కృష్ణంనాయుడు)ను ఏరికోరి నియమించుకున్నారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన పథకం (సెర్ప్)లో కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన కృష్ణంనాయుడుకు ఓఎస్డీ నియామకమే నిబంధనలకు విరుద్ధమంటూ అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. మంత్రి తన పనుల్లో బిజీగా ఉంటే వీరిద్దరూ షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తారని నియోజకవర్గ ప్రజలు కోడై కూస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే పనుల్లోను, ఉద్యోగుల బదిలీల్లోనూ పర్సంటేజీలు వసూలు చేయడం వీరి విధిగా చెబుతుంటారు. వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో రూ.లక్షల్లో వసూలు చేయడంపై పెద్ద దుమారమే రేగింది. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల రేషన్ డీలర్‌షిప్‌లను తప్పుడు ఫిర్యాదులతో రద్దు చేయించి, టీడీపీ వారికి అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంకా ప్రభుత్వ భూములకు పట్టాలు చేయించుకోవడంలోనూ వీరిది అందెవేసిన చేయిగా చెబుతారు. ‘విష్ణుమూర్తి’ మాయ..! వీరిద్దరు చాలదన్నట్టు..మంత్రి మేనల్లుడు విష్ణుమూర్తి కూడా తోడయ్యారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో చేపట్టిన నీరు–చెట్టు పథకం పనుల్లో చాలావరకు బినామీ పేర్లతో ఆయనే చేశారు. ఒక్కో చెరువు పనులకు రూ.15–30 లక్షల వరకు మంజూరవుతాయి. తూతూమంత్రంగా పనులు చేసి పూర్తయినట్టు చూపించి బిల్లులు చేయించుకుంటారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసినా బిల్లులు నిలుపుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలా మంత్రి కళా వెంకట్రావు నియోజవర్గ ప్రజలకు దూరంగా ఉంటే.. ఆయన పీఏలు, మేనల్లుడు అవినీతికి దగ్గరగా ఉంటున్నారు. వీటన్నిటినీ ఐదేళ్లూ ఎంతో సహనంతో భరిస్తూ వచ్చిన ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో కళాకు ఓటుతో బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలై ఈ సారి బరిలో ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ను గెలిపించాలన్న తపన ఆ నియోజకవర్గ ప్రజల్లో కనిపిస్తోంది. -
అవినీతి కళా పోషకులు..!
అవినీతి కళలో ఆరితేరారు.. అనుయాయుల దోపిడీకి కొమ్ముకాస్తారు.. పుత్ర ప్రేమతో విలువైన ప్రభుత్వ భూమిని కారుచౌకగా కట్టబెట్టేస్తారు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నీతి కబుర్లు తియ్యతియ్యగా చెబుతారు.. మంత్రి కళా వెంకటరావు నీడలో సాగుతున్న అవకతవకలు అన్నీ ఇన్నీ కావు. నిర్వాసితుల భూ త్యాగాలను సొంతానికి వాడుకుంటారు. నీరు– చెట్టు పథకాన్ని సైతం దోపిడీ చేయగలరు. మంత్రి కొడుకు పరిశ్రమ పెడతానంటే దగ్గరుండి మరీ భూములు ఇప్పించారు. పరిశ్రమ కనిపించలేదు గానీ భూములు మాత్రం స్వాహా అయిపోయాయి.అన్ని సంక్షేమ పథకాలనూ కార్యకర్తలకు ధారాదత్తం చేస్తారు. మంత్రివర్యుల అవినీతి కళాపోషణపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.. శ్రీకాకుళం : భావి తరాల కోసం నిర్వాసితులు భూములు త్యాగం చేస్తే వారికి రావాల్సిన ఫలాలను తినేశారు. నీరు–చెట్టు అని ప్రభుత్వం పథకం ప్రవేశపెడితే పోటీ పడి మరీ దోపిడీ చేశారు. కొవ్వాడ అణుపార్క్ పేరు చెప్పి అందిన కాడికి తినేశారు. మంత్రి కొడుకు పరిశ్రమ పెడతానంటే దగ్గరుండి మరీ భూములు ఇప్పించారు. శ్రమ మిగిలింది తప్ప పరిశ్రమ కనిపించలేదు. భూములు మాత్రం స్వాహా అయిపోయాయి. పింఛన్లు, ఇళ్లు వంటి సకల సంక్షేమ పథకాలనూ కార్యకర్తలకు విస్తరి వేసి వడ్డించారు. విద్యుత్ శాఖ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు అవినీతి జాడలివి. హోదాకు తగ్గట్టుగానే ఆయన దోపిడీ కూడా సాగుతోంది. నీరు–చెట్టులో దోపిడీ ఎచ్చెర్ల నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం మంజూరు చేసిన మట్టి పనులన్నీ సక్రమంగా జరిగి ఉంటే సాగునీటికి సమస్యే ఉండేది కాదు. కానీ పనులు మాత్రం తూతూమంత్రంగానే టీడీపీ నాయకులు చేశారు. ఎక్కడికక్కడ పనులు పంచేసుకుని జేబుల్లో ప్రజాధనం నింపుకొన్నారు. పని చేసిన వ్యక్తి పేరు: జడ్డు విష్ణుమూర్తి టీడీపీతో సంబంధం: మంత్రి కళావెంకటరావుకు మేనల్లుడు, పొగిరి మాజీ సర్పంచి, పనుల విలువ : రూ.5 కోట్లు జి.సిగడాం మండలంలో మదుపాం, నిద్దాం, ఆనందపురం, లావేరు మండలంలో బుడుమూరు, అదపాక, మురపాక, అప్పాపురం తదితర గ్రామాల్లో నీరు–చెట్టు పథకం పనులు చేశారు. కాలువల్లో పూడికతీతలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేశారు. కానీ నాణ్యతా ప్రమాణాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. బినామీ పేర్లుతో నాసిరకంగా పనులు చేసినా బిల్లులు మాత్రం మంజూరైపోయాయి. పనిచేసిన వ్యక్తి పేరు: ముప్పిడి సురేష్ టీడీపీతో సంబంధం: లావేరు మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు, లావేరు మండల పార్టీ అధ్యక్షుడు, పని విలువ : రూ.50 లక్షలు తాళ్లవలస గ్రామంలోని చెరువుల్లో పూడికతీత పనులు నిర్వహించారు. అదే చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూడా మట్టిపనులు చేయడం గమనార్హం. పనుల్లో నాణ్యత చూస్తే నామమాత్రమే. పనిచేసిన వ్యక్తి పేరు: గొర్లె విజయ్‌కుమార్ టీడీపీతో సంబంధం: రణస్థలం ఎంపీపీ పని విలువ : రూ. 70 లక్షలు మరువాడ, ఎన్జీఆర్ పురం, నారువ, చిల్లపేటరాజాం ప్రాంతాల్లో చెరువుల పూడిక తీత పనులు చేపట్టారు. నాణ్యత అంతంత మాత్రమే. మరోపక్క ఉపాధి హామీ పనులు కూడా ఈ చెరువుల్లో జరిగాయి. పనిచేసిన వ్యక్తి పేరు: లంక శ్యామ్ టీడీపీతో సంబంధం: రావాడ మాజీ సర్పంచ్ పని విలువ: రూ.40 లక్షలు రావాడ, లంకపేట, ఎర్రవరంల్లో చెరువుల్లో పూడికతీత పనులు నిర్వహించారు. కనీస నాణ్యత పాటించలేదు. తవ్విన మట్టిని రియల్ ఎస్టేట్ లేఅవుట్లలో కప్పుడు పనుల కోసం తరలించి అమ్ముకున్నారు. పని చేసిన వ్యక్తి పేరు: డీజీఎం ఆనందరావు టీడీపీతో ఉన్న అనుబంధం: మాజీ ఎంపీపీ పనివిలువ : రూ. 30 లక్షలు జేఆర్ పురం, సీతంవలస ప్రాంతాల్లోని చెరువుల్లో పూడిక తీతలు నిర్వహించారు. కనీస నాణ్యత ఈ పనుల్లో కానరావట్లేదు. పనిచేసిన వ్యక్తి పేరు: ఎం.కనకరాజు టీడీపీతోఉన్న సంబంధం: మండల జన్మభూమి కమిటీ సభ్యుడు పనివిలువ : రూ. 50 లక్షలు తెప్పలవలస, ఎరవరం, చిన్నహేయలపేట గ్రామాల్లో చెరువుల్లో పూడికల తీత, చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టారు. నాణ్యత ప్రమాణాలు కనీ సం లేవు. ఉపాధి హామీ సామాజక తనిఖీల్లో నీరు–చెట్టు పనులు చేసి బిల్లులు పొందాడు. పని చేసిన వ్యక్తి పేరు: ఎన్.ఈశ్వరరావు టీడీపీతోఉన్న సంబంధం: రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ డైరెక్టర్, రణస్థలం టీడీపీ అధ్యక్షుడు, పని విలువ : రూ.80 లక్షలు తిరుపతిపాలెం, బంటుపల్లి, కమ్మశిగడాం గ్రామాల్లో చెరువుల్లో పూడికతీత, చెక్ డ్యాం పనులు చేపట్టాడు. మట్టిని కాంట్రాక్టు పనులకు వినియోగించుకున్నాడు. పనిచేసిన వ్యక్తి పేరు: చౌదరి అవినాష్ టీడీపీతో సంబంధం: మాజీ సర్పంచ్ ఎస్ఎం పురం, జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదిరి ధనలక్ష్మి కుమారుడు పని విలువ: రూ. 30 లక్షలు ఎస్ఎంపురం పెద్దచెరువులో పూడిక తీత, మదుముల నిర్మాణ పనులు చేపట్టారు. ఉపాధి హామీ పథకం పనులు సైతం ఇదే చెరువులో నిర్వహించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. మట్టిని స్థానిక రోడ్డు నిర్మాణంలో బెర్ముగా వినియోగించారు. పని చేసిన వ్యక్తి పేరు: బల్లాడ వెంకటరమణారెడ్డి టీడీపీతో సంబంధం: ఎచ్చెర్ల ఎంపీపీ, పని విలువ: రూ. 60 లక్షలు కుప్పిలిలోని చెరువుల్లో పూడిక తీతలు, చెక్ డ్యామ్‌ల నిర్మాణ పనులు చేపట్టారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. పని చేసిన వ్యక్తి పేరు: బెండు మల్లేశ్ టీడీపీతో సంబంధం: ఎచ్చెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు పనివిలువ: రూ.32 లక్షలు ఊటగడ్డలో పూడికల తీత పని చేశారు. కానీ ప్రస్తుతం కాలువ పరిస్థితి దయనీయంగా ఉంది. కళా కుమారుడి పరిశ్రమ ఏది? మంత్రి కళా కుమారుడు రామ్మల్లిక్నాయుడికి రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ ఏర్పాటు కోసం 2015 సెప్టెంబరు నెలలో నారువ గ్రామం వద్ద 9.96 ఎకరాలు కేటా యించింది. సప్తగిరి పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ కేటాయింపులు జరిగాయి. కేవలం ఎకరాకు రూ. 4.30 లక్షల చొప్పున కారుచౌకగానే ఈ భూమి దక్కింది. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.కోట్లలో ఉంది. కానీ ఇప్పటివరకూ అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. యథేచ్ఛగా ఇసుక దోపిడీ ఎచ్చెర్ల నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో నాగావళి నది నుంచి యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతోంది. తమ్మినాయుడుపేట, పొన్నాడ, ముద్దాడ పేట ఇసుక రీచ్‌ల నుంచి రోజూ వందల లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అలాగే బుడుమూరు గెడ్డలోనూ ఇసుక తవ్వేస్తున్నారు. ఉదయం పూట ట్రాక్టర్లతో ఇసుక తెచ్చి చిలకపాలెం, అల్లినగరం సమీపంలో పెద్దపెద్ద పోగులు వేస్తున్నారు. రాత్రిపూట లారీలకు లోడు చేసి విశాఖపట్నం తరలిస్తున్నారు. అక్రమంగా ఉద్యోగ నియామకాలు కళా రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది మొదలు రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల, రాజాం, సంతకవిటి, రేగిడి అమదాలవలస మండలాల్లో ఉన్న విద్యుత్తు సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలను భారీ సంఖ్యలో భర్తీ చేశారు. ఇందుకోసం నిరుద్యోగుల వద్ద నుంచి పోస్టుకు రూ.4 లక్షల వరకూ దళారులు దండుకున్నారు. రేషన్ డీలర్లు, అంగన్వాడీ వర్కర్ల నియామకంలో సైతం ఇదే తరహా దోపిడీ కొనసాగినా ఉన్నతాధికారులు మిన్నకుండిపోయారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.... జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి కుమారుడు స్థానిక సర్పంచ్ అవినాష్ ప్రభుత్వ భూములపై కన్నేశాడు. ఎస్ఎం పురం కొండ 112 సర్వే నంబర్లో 20 ఎకరాల వరకు తుప్పలు తొలగించారు. అసలు విషయం ఏమిటంటే మరో సర్వే నంబరులో 4.35 ఎకరాలకు పట్టాదారు అడంగల్ చౌదరి సరస్వతమ్మపేరు మీద ఉంది. ఈమె భర్త స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే చౌదరి సత్యనారాయణ. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాబ్జి) తల్లికి పట్టా ఎప్పుడు ఇచ్చారన్న సమాచారం పట్టాలో లేదు. 15 ఏళ్ల కిందట పట్టా ఉన్నట్లు వీరు చెబుతున్నారు. అక్రమ పట్టాతో భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. అణు భూబకాసురులు కొవ్వాడ వద్ద అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు 2,438 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. 2016 సంవత్సరంలో చేపట్టిన సమగ్ర సర్వేలో సర్వే సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది 1,473 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రభుత్వ భూమి ఎక్కువ శాతం ఖాళీగాను, కొంత శాతం అక్రమణలోను ఉండేది. కానీ ఈ సర్వే మూలంగా రెవెన్యూ యంత్రాంగం వైఫల్యం వల్ల ప్రభుత్వ భూమి పూర్తిగా ఆక్రమణల్లోకి వెళ్లిపోయింది. ఇదే అదునుగా కొంతమంది వారి స్వార్ధానికై గెడ్డలు, వాగులు, రాస్తాలు కూడా ఆక్రమణ భూమి కింద నమోదు చేయించుకున్నారు. అందులో భాగంగానే రణస్థలం మండల తెలుగుదేశం పార్టీ ఎంపీపీ గొర్లె విజయ్‌కుమార్ తమ అనుచరులు, నమ్మకస్తుల పేరున, ఇంటిలో పనివాళ్లు, కోళ్లఫారంలో పనిచేసిన కూలీల పేరున ప్రభుత్వ భూమిని ఆక్రమణ భూమి కింద రెవెన్యూ జాబితాలో నమోదు చేయించుకున్నారు. జీరుకొవ్వాడ, గూడెం రెవెన్యూ పరిధిలో 67 సర్వే నంబర్లో రణస్థలం టీడీపీ ఎంపీపీ గొర్లె విజయకుమార్ కుటుంబసభ్యుల పేరుతో సర్వే నంబర్లు 67/4, 5, 6, 7, 8, 9, 10లో సుమారు 19.23 ఎకరాలు డీపట్టాలు కలిగియున్నారు. ఆక్రమణ భూములను భూసర్వేలో తమ ఆక్రమణగా నమోదు చేయించుకున్న వివరాలు ఇలా ఉన్నాయి. గొర్లె మౌనిక (కూతురు)కు 2 ఎకరాలు, దాసరి వెంకటరమణి (సోదరి)కి ఎకరం, గొర్లె సుధాకర్ (సోదరుడు)కు 3 ఎకరాలు, గొర్లె ధనలక్ష్మి (భార్య)కి 3 ఎకరాలు, గొర్లె వెంకటసీతారత్నం (వదిన)కు 3 ఎకరాలు, గొర్లె వెంకట దివాకర్ నాయుడు (కొడుకు)కు 3 ఎకరాలు, గొర్లె విజయకుమార్‌కు 3.50 ఎకరాలు, బోదేపు భారతి(సోదరి)కి 3.50 ఎకరాల భూమి ఉంది. అలాగే గూడెం రెవెన్యూలో సర్వే నంబర్లు 43–81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97లలో మొత్తం 32.83 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ భూములుగా నమోదు చేయించుకున్నారు. కుటుంబసభ్యులతో పాటు తమ వద్ద పనిచేసిన రైతులు, ఇతర మండలాలకు చెందిన కుటుంబ సభ్యుల పేరున కూడా అణు భూ సర్వే జాబితాలో భూమిని నమోదు చేయించుకున్నారు. మజ్జి విమల (మరదలు), మజ్జి లక్ష్మణరావు (తోడల్లుడు)లది ఎచ్చెర్ల మండలంలోని కొయ్యాం గ్రామం, అలాగే నడిమింటి రాంబాబు (తోడల్లుడి కొడుకు)ది లావేరు మండలంలోని అదపాక. అలాగే ఈ భూములే కాకుండా ఎస్సీ కులానికి చెందిన కుటుంబాల పేరున 40 ఎకరాలు అణు భూ సర్వే జాబితాలో నమోదు చేయించుకున్నారు. వీరికి ఎకరాకు రూ.10 వేలు చొప్పున ఇవ్వటానికి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అలాగే పాతర్లపల్లి రెవెన్యూ పరిధిలో తెలుగుదేశం నాయకులు చక్కపెడుతుంటే, కొవ్వాడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిపై వచ్చే పరిహారాన్ని నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా గుటుక్కు మనిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, ప్రస్తుత టీడీపీ నాయకుడు గొర్లె లక్ష్మణరావు సుమారు 32 ఎకరాల భూమికి బినామీల పేర్లుతో ఇప్పటికే పరిహారం పొందారు. అలాగే టీడీపీ నాయకులు సుంకరి ధనుంజయ, మైలపల్లి వెంకటేష్ కూడా తమ అనుచరులు, బంధువుల పేరున ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కొంతమేర పరిహారం కూడా అందుకున్నారు. వీఎన్.పురం, యర్రవరం పంచాయతీల్లో కలిశెట్టి సహదేవుడు, కలిశెట్టి అప్పలనాయుడు ప్రభుత్వ భూములను సుమారు 6 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నారు. -
ప్రతిభా భారతిపై టీడీపీ నేతల తిరుగుబాటు
సాక్షి, శ్రీకాకుళం : మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ ప్రతిభా భారతికి టీడీపీలో ఎదురుగాలి వీస్తోంది. ఆమెపై సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైంది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్గా ప్రతిభా భారతిని తొలగించాలంటూ రాజాంలోని ఓ రిసార్ట్‌లో టీడీపీ ఎంపీపీలు, జేడ్పీటీసీలు సమావేశమయ్యారు. ఇన్చార్జ్ బాధ్యతల నుంచి ప్రతిభా భారతిని తొలగించాలని, ఆమె నిర్వహించే సమావేశాలను బహిష్కరించాలని వారు ఈ భేటీలో తీర్మానం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిభా భారతికి టికెట్ ఇస్తే.. సహాయనిరాకరణ చేస్తామని టీడీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు హెచ్చరిస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావే తన వర్గాన్ని ప్రతిభా భారతికి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబును కలిసి ప్రతిభా భారతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని కళా వర్గీయులు భావిస్తున్నారు. -
కళా వెంటనే మార్వాడీలకు క్షమాపణలు చెప్పాలి
-
20న ధర్మపోరాట దీక్ష..!
సాక్షి, అమరావతి: ఈ నెల 20న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు చేయనున్న ఒకరోజు నిరసన దీక్షకు ధర్మపోరాట దీక్ష అని పేరు పెట్టారు. 20వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు సీఎం దీక్షలో పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ నెల 30న తిరుపతిలో జరిగే బహిరంగ సభను ‘నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం’అనే నినాదంతో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీక్ష ప్రధాన వేదికపై 150 మంది, వేదిక ఎదురుగా 10 వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. -
‘పవన్ కల్యాణ్ స్థిరత్వం లేని మనిషి’
సాక్షి, అమరావతి : సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందన్న విషయం మాజీ మంత్రి మాణిక్యాల రావు మాటలతో స్పష్టమైందని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. అమరావతిలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ఎవరైనా తమ పార్టీ బలంగా ఉందంటారు కానీ పవన్ కల్యాణ్ బలంగా ఉన్నారని బీజేపీ నాయకులు ఎలా చెబుతారని ఎద్దేవా చేశారు. ముద్రగడ పద్మనాభం వెనక ఎంత మంది కాపులున్నారో, పవన్ కల్యాణ్ వెనుక అంతే మంది కాపులున్నారని తెలిపారు. ఏపీలో ఉండాల్సిన పవన్ కల్యాణ్ ఏపీలో రెండు రోజుల టూర్ పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వాళ్లు అప్పుడప్పుడు పోరాడుతున్నారని, తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నామని వ్యాఖ్యానించారు. పవన్ స్థిరత్వం లేని మనిషి: కళా వెంకట్రాటావు మరో మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ స్థిరత్వం లేని మనిషని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. పేదలు, రైతులు ప్రభుత్వ పనితీరుతో సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఎంతమంది కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా టీడీపీ ఇబ్బంది ఉండదని చెప్పారు. -
పట్టు కోసం...పాకులాట!
09.04.2017 మూడేళ్ల ఎదురుచూపులు ఫలించి ఇంధన మంత్రిత్వ శాఖ దక్కించుకున్న కిమిడి కళావెంకటరావుకు స్వాగత కార్యక్రమం... తర్వాత రణస్థలంలో బహిరంగ సభ! కానీ జిల్లాకు చెందిన మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గైర్హాజరు! 10.04.2017 కార్మిక, క్రీడల శాఖల నుంచి రవాణా, బీసీ సంక్షేమం, చేనేత శాఖల మంత్రిగా ప్రమోషన్ పొందిన కింజరాపు అచ్చెన్నాయుడికి శ్రీకాకుళంలో ఆత్మీయసభ! కానీ ఆ కార్యక్రమానికి కళావెంకటరావు డుమ్మా! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: ఒక్కరోజు వ్యవధిలోనే ఆరున్నర నెలల క్రితం జరిగిన ఈ కార్యక్రమాలు కళా, కింజరాపు వర్గాల మధ్య వర్గపోరుకు అద్దం పట్టాయి! కానీ ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు మూడుసార్లు, ఇటీవల లోకేష్ జిల్లాలో పర్యటించినా ఆ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్లేదు! ఈ విషయాన్ని మంగళవారం నాటి ‘కళా’ సన్మాన కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టిన సందర్భంలో చేసిన ఈ కార్యక్రమానికి యథావిధిగా మంత్రి అచ్చెన్న సహా సొంత పార్టీ ఎమ్మెల్యేలే డుమ్మా కొట్టారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, విప్ కూన రవికుమార్ మాత్రమే హాజరుకావడంపై పార్టీలో చర్చకు దారితీసింది. జిల్లాలో కింజరాపు, కిమిడి కుటుంబాల మధ్య దీర్ఘకాల వైరం ఉంది. దివంగత నాయకుడు ఎర్రన్నాయుడి కాలం నుంచి కళాకు పొసగట్లేదు. కళా ప్రజారాజ్యం పార్టీలోకి మారిపోవడానికి ఇదే కారణమనే వాదనలు ఉన్నాయి. చంద్రబాబు రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్లు అచ్చెన్నాయుడు ఒక్కరే జిల్లాలో చక్రం తిప్పారు. ఎన్నికలకు ముందే ప్రజారాజ్యం పార్టీ నుంచి సొంత గూటికి చేరుకున్న కళాకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో కింజరాపు వర్గం షాక్‌కు గురైంది. అయితే మంత్రి పదవి కోసం కళా చేస్తున్న ప్రయత్నాలను అచ్చెన్న వర్గం ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వచ్చింది. జిల్లాలో మరో సీనియరు ఎమ్మెల్యే గౌతు శివాజీకి మంత్రి పదవి ఇప్పించాలని ప్రయత్నించినా పునర్వ్యవస్థీకరణలోనూ ఫలితం దక్కలేదు. లోకేశ్ అండదండలు పుష్కలంగా ఉన్న కళా ఇంధన మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో కింజరాపు వర్గమే కాదు మంత్రి పదవి ఆశించిన శివాజీ కూడా కంగు తిన్నారు. మీడియా ముందు ఆయన కంటతడి పెట్టినా అధిష్టానం నుంచి సరైన హామీ ఏదీ రాలేదు. పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న ఆయన కుమార్తె గౌతు శిరీషను అదే పదవిలో కొనసాగిస్తున్నారు. అంతేకాదు తొలి మూడేళ్లు జిల్లాలో ఏకైక మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు చక్రం తిప్పారు. ఆ హోదాలో ఆయన వేదికపై కూర్చుంటే తాను జడ్పీ సభ్యులతో కలిసి కూర్చోవడం ఇష్టం లేకే కళావెంకటరావు ఆ మూడేళ్లు జిల్లా పరిషత్తు సమావేశాలకు సైతం డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో కళా వెంకటరావుకు జిల్లా నుంచి రెండో మంత్రిగా చంద్రబాబు కేబినెట్లో స్థానం దక్కింది. రెండోసారి అధ్యక్ష పదవిలోకి... టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కళాకు కొనసాగింపు ఉండకపోవచ్చని ఇటీవల బాగా ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు కళా వైపే మొగ్గు చూపించారు. ఈసారి కూడా లోకేశ్‌తో సాన్నిహిత్యం కళాకు బాగా కలిసొచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అచ్చెన్నాయుడు వెనుకబడ్డారు. ఇటు పార్టీ బాధ్యతలు, అటు మంత్రి బాధ్యతలతో దూసుకుపోతున్న కళా... జిల్లాపై పట్టు కోసం పావులు కదపడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన లోకేష్‌ను కూడా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఇంటికి అల్పాహార విందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. అంతేకాదు అంతకుముందు పాలకొండ నియోజకవర్గంలోని తెట్టంగిలో ‘ఇంటింటికీ టీడీపీ’ ప్రారంభ కార్యక్రమంలోనూ కళా పైచేయి కనిపించింది. ఇవన్నీ కింజరాపు వర్గానికి ఇబ్బంది కలిగించేవే. జిల్లాపై పట్టు జారిపోకుండా కాపాడుకునేందుకు ప్రతివ్యూహంలో పడింది. అందులో భాగంగాన మంగళవారం కళా సన్మాన సభకు మంత్రి అచ్చెన్న, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు సహా ఎమ్మెల్యేలు గౌతు శివాజీ, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ డుమ్మా కొట్టారు. ప్రోటోకాల్ ప్రకారం పార్టీ జిల్లా అధ్యక్షురాలైన శివాజీ కుమార్తె శిరీష హాజరయ్యారు. ఇక ఎప్పటినుంచో కళా వర్గంలోనున్న ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో పాటు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పాత తగవుల నేపథ్యంలోనే... కళా సన్మాన కార్యక్రమానికి గుండ లక్ష్మీదేవి హాజరు వెనుక ప్రధాన కారణం ఆమె భర్త, మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణకు కళాతో ఉన్న సంబంధాలు ఒకటైతే, కింజరాపు కుటుంబంతో ఉన్న విభేదాలు మరో కారణమని బహిరంగ రహస్యమే. అయితే కూన రవికుమార్‌కు మాత్రం కింజరాపు వర్గంతో తొలి నుంచి అంత సఖ్యత లేదు. ఇసుక అక్రమ రవాణా మాఫియాకు అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు కూనపై రావడానికి, మద్యం సిండికేట్‌కు అచ్చెన్న వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తడానికి ఒకరంటే ఒకరు కారణమని ఇరువర్గాలు ఇటీవల కత్తులు దూసుకున్నాయి. ఇది అధిష్టానం వద్ద పంచాయతీకి కూడా దారితీసిందనే గుసగుసలు వినిపించాయి. ఇక ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీ సమస్య విషయంలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. దీంతో సహజంగానే కూన అటు కళా వర్గంతో చేతులు కలిపారనే వాదన ఉంది. పార్లమెంటరీ నియోజకవర్గమే కారణమా... కళా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్లతో పాటు ఆయనకు కాస్త పట్టున్న రాజాం, పాలకొండ నియోజకవర్గాలు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో లేవు. మిగతా ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో సంబంధాలు అవసరం. దీంతో కళా పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో జిల్లాకు వచ్చినప్పటికీ ఆయా ఎమ్మెల్యేలలో గుండ లక్ష్మీదేవి, కూన రవికుమార్ మినహా మిగతా వారెవ్వరూ కళా వెనుక కనిపించట్లేదనే వాదనలు ఉన్నాయి. ఇటీవల కాలంలో పాతపట్నం ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కొన్ని సమీకరణాల దృష్ట్యా కళాకు దగ్గరైనా కేవలం ఎంపీ అవసరం దృష్ట్యానే కళా సన్మాన కార్యక్రమానికి హాజరుకాలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా జిల్లాపై పట్టు కోసం ఒకవైపు కళా, మరోవైపు తమ పట్టు జారిపోకుండా చూసుకోవడానికి కింజరాపు కుటుంబం తాపత్రయం పడుతుండటంతో జిల్లా టీడీపీలో గ్రూపుల గోల కొనసాగుతోంది. -
కళా వెంకట్రావుకు షాక్ ఇచ్చిన మహిళలు
-
'టీడీపీ గంగానది లాంటిది'
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ గంగానది వంటిదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. గంగానదిలో ఎన్నో ఉప నదులు క లిసినట్లుగానే టీడీపీలోకి ఎంత మంది వచ్చి చేరినా పార్టీ గొప్పతనం తగ్గదన్నారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 171 నియోజకవర్గాల్లో జనచైతన్య యాత్రలు ప్రారంభమయ్యాయన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గురువారం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో, 7న శ్రీకాకుళం, విజయనగరం, 11న చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే జనచైతన్య యాత్రల్లో పాల్గొంటారని చెప్పారు. టీడీపీలో చేరిన ఆనం సోదరులు : మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం రాంనారాయణరెడ్డి, ఆయన సోదరుడు వివేకానందరెడ్డి బుధవారం టీడీపీలో చేరారు. వారిద్దరికీ పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడ లోని తన నివాసంలో పచ్చకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
అధ్యక్ష పదవి వద్దు, మంత్రి పదవే ముద్దు!
-
టీడీపీలో కొత్తరకం విభేదాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే జిల్లా టీడీపీలో కొత్తరకం విభేదాలు మొదలయ్యాయి. పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు సామాజికవర్గ చీలకగా రూపాంతరం చెందాయి. దీనికి కూడా కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడులే కేంద్ర బిందువులుగా నిలిచారు. జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం ఈ కుమ్ములాటలు మొదలయ్యాయి. జిల్లాలో ప్రధాన వర్గాలైన కాళింగ, కాపు, వెలమలకు పదవుల కేటాయింపులో ప్రాధాన్యమివ్వాలని ఎవరికి వారే అధిష్టానం వద్ద పట్టు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్, ఎంపీపీ, జెడ్పీ పదవుల కేటాయింపుపై చర్చించేందుకు రెండు రోజుల్లో జిల్లా టీడీపీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో జిల్లాపరిషత్తోపాటు, నాలుగు మున్సిపాలిటీలు, 38 మండల పరిషత్తుల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఎన్నికలు జరగనుండటంతో టీడీపీ నేతలు ఎవరికి వారు ఆ అభ్యర్థిత్వాల కోసం పోటీ పడుతున్నారు. త్వరలో సమావేశం! జెడ్పీ అధ్యక్ష పదవికి పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ భార్య ధనలక్ష్మి పేరును అధినేత చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు. ఈ వర్గం మంత్రి అనూయాయులన్నది తెలిసిందే. కింజరాపు వైరి వర్గంగా ఉన్న సీనియర్ నేత, ఎమ్మెల్యే కళా వెంకట్రావు వర్గానికి ఇప్పటివరకు ఎలాంటి పదవులూ దక్కలేదు. కాళింగులకు జెడ్పీ కుర్చీ, వెలమలకు మంత్రి పదవి కట్టబెడితే మరి మాకేంటి అంటూ కాపు సామాజిక వర్గం ఇప్పటికే అధిష్టానంపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో వీరఘట్టం, సంతకవిటి ప్రాంతాలకు చెందిన మహిళా జెడ్పీటీసీలు తమకు జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు ఇప్పించాలని కళా వెంకట్రావును కోరు తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సమన్వయ కార్యదర్శి పదవిలో ఉన్న మరో సీనియర్ నేత కొల్ల అప్పలనాయుడు కూడా తమ వారికే జెడ్పీ కుర్చీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే సమావేశం కీలకం కానుంది. తమ వారికి అన్యాయం జరిగితే పార్టీకి రాజీనామాకైనా సిద్ధమేనంటూ కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ సమావేశంలో ఎలాగైనా అచ్చెన్న వర్గానికి చెక్ చెప్పాలని ఆలోచిస్తున్నారు. వైస్కూ పోటీయే జెడ్పీ అధ్యక్ష పీఠం కాకపోతే కనీసం ఉపాధ్యక్ష పదవైనా తమకివ్వాలని కొంతమంది తమ్ముళ్లు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే సామాజిక వర్గాల సమీకరణల దృష్ట్యా వంగర జెడ్పీటీసీకి ఈ పదవి ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఆ జెడ్పీటీసీ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, లక్ష్మీపేట కేసులో నిందితుడిగా ఉన్న అతనికి పదవి కట్టబెడితే ఊరుకునేది లేదని ఆయన వ్యతిరేకవర్గం ఇప్పటికే సంకేతాలు పంపింది. ఇంత జరుగుతున్నా పార్టీలో లుకలుకలు లేనేలేవని టీడీపీ నేతలు కొట్టిపడేస్తున్నారు. సమావేశంలో చర్చించి మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామంటున్నారు. మొత్తం మీద కీలకంగా మారిన ఈ సమావేశం ఎలా జరుగుతుందో.. ‘స్థానిక’ పదవుల చిచ్చు పార్టీలో ఎంత అసమ్మతి రాజేస్తుందోన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది. -
‘కళా’వెళ..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా టీడీపీపై పట్టు సాధించాలన్న పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఆశలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అడియాసలు చేశారు. అధినేతే మాట తప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కళా కూరుకుపోయారు. ఎర్రన్నాయుడు హఠాన్మర ణం.. తమ్మినేని సీతారాం రాజీనామాతో జిల్లా టీడీపీకి పెద్దదిక్కు లేకుండాపోయింది. దాంతో కళా వెంకట్రావును జిల్లా పార్టీ పెద్దరికం అప్పగించాలని చంద్రబాబు భావించారు. తద్వారా పార్టీలో 15 ఏళ్లుగా ప్రాధాన్యానికి నోచుకోని కాపు సామాజికవర్గాన్ని గుర్తించినట్లవుతుందని కూడా ఆయన చెప్పకొచ్చారు. కానీ కింజరాపు కుటుంబం మోకాలడ్డింది. ఈ ప్రతిపాదనకు ససేమిరా అంది. అసలు తాము కళా వెంకట్రావును సీనియర్ నేతగానే గుర్తించమనే రీతిలో వ్యవహరించింది. అక్కడితో ఆగకుండా ఆయన పోటీ చేయనున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే ప్రతిబంధకాలు సష్టించింది. తమ సన్నిహితుడైన ఎచ్చెర్ల మండలానికి చెందిన పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీని దీనికి ఆయుధంగా వాడుకుంది. కళా ఎచ్చెర్ల దాటి వెళ్లలేని పరిస్థితి కల్పించింది. కళాకు ఏమాత్రం ప్రాధాన్యమిచ్చినా తాము సహా యనిరాకరణ చేస్తామని కింజ రాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌లు చంద్రబాబుకు తేల్చిచెప్పారు. దాంతో చంద్రబాబు పూర్తిగా వెనక్కి తగ్గారు. ఇటీవల నిర్వహించిన ప్రజాగర్జన సభలో కనీసం కళా పేరును కూడా ప్రస్తావించడానికి సాహసించలేకపోయారు. ఈ పరిణామాలతో కళా వెంకట్రావు పూర్తిగా నీరుగారిపోయారు. జెడ్పీ అభ్యర్థిత్వానికి మోకాలడ్డు జెడ్పీ చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఆ పదవిపై కళా వర్గం కన్నేసింది. ఆయన తన మరదలు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ మణాళినిని మరోసారి ఆ కీలక పదవికి పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయాలని భావించారు. కిమిడి గణపతి కూడా తన భార్య మణాళినికి అవకాశం ఇస్తే తమ కుటుంబంతోపాటు తూర్పుకాపు సామాజికవర్గాన్ని పార్టీకి అనుకూలంగా కూడగడతానని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. కానీ కింజరాపు వర్గం దీనికి ససేమిరా అంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు ఏమాత్రం లేవని తెలిసినా మణాళిని పేరును చైర్పర్సన్ పదవి కోసం పరిశీలించడానికి కూడా అంగీకరించలేదు. ఈసారి కూడా అచ్చెన్నాయుడు తమ తరపున చౌదరి బాబ్జీనే ప్రయోగించారు. బాబ్జీ కుమార్తె చైతన్యను జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఈ మేరకు అధినేత చంద్రబాబుపై తమదైన శైలిలో ఒత్తిడి తెచ్చారు. దాంతో మరోసారి చంద్రబాబు కింజరాపు కుటుంబ ఒత్తిడికి తలొగ్గారు. కళాను కనీసం సముదాయించేం దుకు కూడా ప్రయత్నించలేదు. మణాళిని అభ్యర్థిత్వానికి ఆమోదం లభించలేదు.. సరికదా చంద్రబాబు కనీసం తమను పిలిచి మాట్లాడకపోవడంతో కళా తీవ్ర నిస్పహలో కూరుకుపోయారు. దాంతో జి.సిగడాం జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మణాళిని గత్యంతరం లేని పరిస్థితుల్లో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. రగిలిపోతున్న సామాజికవర్గం చంద్రబాబు వైఖరితో జిల్లా టీడీపీలోని తూర్పుకాపు సామాజిక వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమకు పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదన్న ఆవేదన వారిలో కట్టలు తెంచుకుంటోంది. జిల్లాలో పాలకొండ, రాజాం, ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల్లో తూర్పుకాపు సామాజికవర్గం అత్యధికంగా ఉంది. కానీ రాజాం, పాలకొండ నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. దాంతో ఎచ్చెర్ల, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలే మిగిలాయి. వాటిలో కూడా పాతపట్నం నియోజకవర్గానికి క్షత్రియ వర్గానికి చెందిన శత్రుచర్ల విజయరామరాజును చంద్రబాబు అభ్యర్థిగా నిర్ణయించారు. ఈ పరిణామం తూర్పుకాపు సామాజికవర్గానికి తీవ్ర అసంతప్తి కలిగించింది. కనీసం జిల్లా పరిషత్తు చైర్పర్సన్ అభ్యర్థిత్వానికి తమ వర్గానికి చెందిన నేత పేరును పరిశీలిస్తారని భావించారు. కానీ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు ఆ ప్రతిపాదనను కూడా అడ్డుకున్నారు. దాంతో టీడీపీలోని తూర్పుకాపు వర్గీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామరావు హయంలో పార్టీపై తూర్పుకాపు వర్గమే ఆధిపత్యం చెలాయించింది. కానీ చంద్రబాబు ఆ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. 1995 నుంచి ఇంతవరకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నా కూడా చంద్రబాబు ఆదే వైఖరి కొనసాగిస్తున్నారు. దాంతో ఆ వర్గీయులు మండిపడుతున్నారు. ‘ఇక లాభంలేదు... మా తడాఖా చూపిస్తాం’అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో మరి!