సాక్షి, అమరావతి : సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందన్న విషయం మాజీ మంత్రి మాణిక్యాల రావు మాటలతో స్పష్టమైందని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. అమరావతిలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ఎవరైనా తమ పార్టీ బలంగా ఉందంటారు కానీ పవన్ కల్యాణ్ బలంగా ఉన్నారని బీజేపీ నాయకులు ఎలా చెబుతారని ఎద్దేవా చేశారు. ముద్రగడ పద్మనాభం వెనక ఎంత మంది కాపులున్నారో, పవన్ కల్యాణ్ వెనుక అంతే మంది కాపులున్నారని తెలిపారు. ఏపీలో ఉండాల్సిన పవన్ కల్యాణ్ ఏపీలో రెండు రోజుల టూర్ పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వాళ్లు అప్పుడప్పుడు పోరాడుతున్నారని, తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నామని వ్యాఖ్యానించారు.
పవన్ స్థిరత్వం లేని మనిషి: కళా వెంకట్రాటావు
మరో మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ స్థిరత్వం లేని మనిషని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. పేదలు, రైతులు ప్రభుత్వ పనితీరుతో సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఎంతమంది కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా టీడీపీ ఇబ్బంది ఉండదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment