china rajappa
-
పెద్దాపురం నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
-
నిమ్మకాయల చినరాజప్ప ఇన్ సైడర్ ట్రేడింగ్
-
‘చినరాజప్పను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుంది’
సామర్లకోట, (పెద్దాపురం): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తప్పుడు అఫిడవిట్‌ను దాఖలు చేసి ఎన్నికల కమిషన్‌ను మోసం చేశారని ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన తోట వాణి ఆరోపించారు. పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అఫిడవిట్ ఫారం–26లో 5వ కాలమ్‌లో అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా, లేవా.. అనే కాలమ్‌లో ఎటువంటి కేసులు లేవన్నట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని తెలిపారు. అయితే ఓబుళాపురం మైనింగ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి దాడి చేశారని, పోలీసులు వారించినా వినకుండా ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పారు. అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి.. రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసిందని, తదుపరి ఈ కేసు విజయవాడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిందన్నారు. విజయవాడ కోర్టు కూడా 2018 డిసెంబర్ 28న కేసు నంబరు 50గా నమోదుచేసి అరెస్టు వారెంటు ఇచ్చిందని ఆమె చెప్పారు. కేసు నమోదు 2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్ పొందుతున్నారని, 2019 ఎన్నికలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొని ఎన్నికల కమిషన్‌ను మరో మోసం చేశారని ఆమె చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లో దాఖలు చేసిన నకలు ఆధారాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లపై ఈ నెల 5వ తేదీన ఏపీ హైకోర్టులో రాజప్పపై కేసు నమోదైందని.. ఆరు నెలల్లో ఆయనను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుందని.. తదుపరి వచ్చిన మెజార్టీ ఆధారంగా ఎమ్మెల్యేగా తనకు అవకాశం వస్తుందని తోట వాణి వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ తోట నరసింహం తదితరులున్నారు. -
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన చినరాజప్ప
-
‘చినరాజప్ప చేసిన అవినీతిని బయటపెడతా’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : మాజీ మంత్రి చిన రాజప్పపై పెద్దాపురం వైఎస్సార్సీపీ ఇంచార్జీ తోట వాణి ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లలో అభివృద్ధి ముసుగులో రాజప్ప అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చిన రాజప్ప హోంమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో శాంత్రి భద్రతలు కరువై 5 మర్డర్లు జరిగాయని గుర్తు చేశారు. ఐదేళ్లలో ఆయన చేసిన అవినీతిని త్వరలోనే బయటపెడతామన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే పదవులే ఉండాల్సిన అవసరం లేదన్న విషయాన్ని చినరాజప్ప గమనించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను నియోజకవర్గంలో ప్రజలకు సక్రమంగా చేరేలా కృషి చేస్తానని వాణి పేర్కొన్నారు. -
రాజప్పకు మళ్లీ చుక్కెదురు
సాక్షి, కాకినాడ: ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అవినీతి, అక్రమమైనింగ్లతో తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ఆయనకు ఎక్కడికి వెళ్లినా ఛీత్కారాలు తప్పడం లేదు. మూడు రోజుల క్రితం సామర్లకోట మండలం హుస్సేన్‌పురంలో అక్కడి ప్రజలు ఆయన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి మరో భంగపాటు ఎదురైంది. మాధవపట్నం సమీపంలోని జమునా నగర్‌కాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనను అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. ఐదేళ్లుగా తమ గ్రామ సమస్యలేవీ తీర్చారంటూ నిలదీశారు. స్మశానానికి దారిలేదంటూ ఎన్నో సార్లు సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినా పరిష్కరించలేదని మండిపడ్డారు. ఎవరైనా చనిపోతే రైలుపట్టాలు మీదుగా మృతదేహాన్ని స్మశానవాటికి తీసుకువెళ్లాల్సి వస్తోందని ఎన్నో సార్లు చెప్పినా నాడు మీరు ఎందుకు స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవపట్నం, జమునానగర్లలో స్థానిక సమస్యలు పత్రికల్లో ప్రచురితమవుతున్నా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రాజప్ప డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేయడంతో రాజప్పకు మింగుడుపడలేదు. ఎన్నికలైన తరువాత ఈ సమస్యకే తొలి ప్రాధాన్యం ఇస్తానని రాజప్ప హామీ ఇవ్వగా మూడేళ్ల కిందటి నుంచి ఇదే మాట చెబుతున్నారని ధ్వజమెత్తారు. ‘చెప్పింది విను’ అని రాజప్ప చెప్పడంతో ‘ఎన్నిసార్లు వినాలి’ అంటూ కేకలు వేశారు. ఆ గ్రామ మాజీ సర్పంచి పిల్లి కృష్ణ ప్రసాద్ ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేసినా గ్రామస్తులు వినకపోవడంతో ‘వాహనం ముందుకు పోవాలి’ అని రాజప్ప చెప్పి జారుకున్నారు. వరుస వ్యతిరేక చర్యలతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాజప్ప ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితి పెద్దాపురంలో నెలకొందంటూ ఆ పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. -
టిక్కెట్ వచ్చిన ఆనందమేదీ..?
సాక్షి, అమలాపురం: ఆయన నిన్నటి వరకు రాజకీయ జీవితాన్నిచ్చిన గురువు. ఈయన గురువు అడుగుజాడల్లో నడిచే శిష్యుడు. కానీ రాజకీయాల్లో ఇటువంటివి తాత్కాలికమే కానీ...శాశ్వతం కాదని మరోసారి రుజువయింది. దీంతో శిష్యునికి టిక్కెట్ రాకుండా గురువు ప్రయత్నిస్తే..గురువును కాదని టిక్కెట్ తెచ్చుకున్న శిష్యుడు. ఇటువంటప్పుడు సర్వసాధారణంగా జరిగేది గురువు వైపు కొందరు..శిష్యుడు వైపు మరికొందరుగా గ్రూపులుగా ఏర్పడడం. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకోవాలని చూడడం సర్వసాధారణం. ఇలా గురు, శిష్యుల పోరుతో అమలాపురం అసెంబ్లీ రాజకీయం రసవత్తరంగా మారింది. తెలుగుదేశం పార్టీని పుట్టి్టముంచనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ గురువు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అయితే.. శిష్యుడు అయితాబత్తుల ఆనందరావు. ఎమ్మెల్యే ఆనందరావుపై నియోజకవర్గంలో ఆ పార్టీలోనే అసంతృప్తి ఉంది. అల్లవరానికి చెందిన కొంతమంది కీలక నేతలు ఆనందరావుకు టిక్కెట్ ఇవ్వవద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమలాపురం అసెంబ్లీ నుంచి కొత్తవ్యక్తిని పోటీ చేయించాలని ఉప ముఖ్య మంత్రి చినరాజప్ప గట్టి ప్రయత్నాలే చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆనందరావు స్థానంలో ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్‌కు అవకాశం కల్పించాలని, లేదంటే పార్టీలోనే మరొకరికి అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. అందుకు తగినట్టుగా వూహ్యాలు రచించారు. ఎన్నికల ముందు జరిగిన కొన్ని పరిణామాలు వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచింది. మరీ ముఖ్యంగా తన తమ్ముడు జగ్గయ్యనాయుడుపై మీడియాలో వచ్చిన కథనాల వెనుక ఆనందరావు హస్తం ఉందని రాజప్ప ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. ఇదే ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచిందని అనుకుంటున్నారు. వీరిద్దరి మధ్య స్థాయిలో విభేదాలు చోటుచేసుకోవడంతో ఎట్టి పరిస్థితుల్లోను ఆనందరావుకు అవకాశం రాదని టీడీపీ క్యాడర్ భావించింది. కానీ నియోజకవర్గ సమన్వయ కమిటీ పార్టీ ఆధిష్టానంపై ఒత్తిడి చేసి ఆనందరావును తమ అభ్యర్థిగా చేసుకుంది. ముఖ్యంగా పట్టణానికి చెందిన మెట్ల రమణబాబు అతని వర్గీయులు పట్టుబట్టి ఆనందరావుకు టిక్కెట్ వచ్చేలా చేశారు. తద్వారా నియోజకవర్గంలో పట్టు సాధించారు. ఇదే సమయంలో అమలాపురంలో తనను కాదని పార్టీ ఆనందరావుకు టిక్కెట్ ఇవ్వదని భావించిన రాజప్పకు ఇది షాక్ అనే చెప్పాలి. తన మాట జవదాటని సమన్వయ కమిటీలో మెజార్టీ సభ్యులు ఆనందరావు వెనుక నిలబడడం, తీవ్ర జాప్యం తరువాత అధిష్టానం ఆనందరావును అభ్యర్థిగా ఎంపిక చేయడం రాజప్ప నియోజకవర్గంపై పట్టుకోల్పోయారనే ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలు రాజప్ప వర్గీయులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఆనందరావుకు టిక్కెట్ వచ్చినందుకు జరిగిన సంబరాల్లో రాజప్ప పేరు మచ్చుకైనా వినిపించలేదు. అతని సోదరుడు జగ్గయ్యనాయుడు, అతని వర్గీయులు ఈ సంబరాలకు దూరంగానే ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే అమలాపురం అసెంబ్లీ పరిధిలోని టీడీపీలో అసమ్మతి చాపకింద నీరులా మారింది. పరిణామాలన్నీ చూస్తుంటే ఈ ఎన్నికల్లో రాజప్ప వర్గీయులు అభ్యర్థి ఆనందరావుకు ఎన్నికల్లో సంపూర్ణ సహకారం అందిస్తారనే నమ్మకం కలగడం లేదు. దీనిని గుర్తించిన ఆనందరావు నష్ట నివారణ చర్యలకు దిగారు. రాజప్ప, అతని సోదరుడు జగ్గయ్యనాయుడుతో మంతనాలు చేపట్టారు. మంగళవారం రాత్రి పెద్దాపురం వెళ్లిన ఆనందరావు రాజప్పను కలిసి గతంలో జరిగిన పరిణామాల్లో తన ప్రమేయం లేదని వివరణ ఇవ్వడంతోపాటు తనను ఆశీర్వదించాలని కోరినా పెద్దగా ఫలితం లేదని తెలిసింది. ‘అధిష్టాన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. నిన్ను గెలిపించాలని పార్టీ నాయకులకు చెబుతాను. నేను ఇక్కడ అభ్యర్థిని కాబట్టి నీ వెంట నేను ప్రచారానికి రాలేను’ అని చినరాజప్ప తేల్చిచెప్పేశారు. అన్నయ్యతోపాటు పెద్దాపురంలో ఉంటాను, నీ వెంట ఉండలేనని జగ్గయ్యనాయుడు కూడా కుండబద్దలు కొట్టడంతో నిరాశగానే వెనుతిరగాల్సి వచ్చింది. మరోవైపు ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురంలో ఆనందరావుపై అసంతృప్తితో ఉన్న కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడే యోచనలో ఉన్నారు. ఇది పార్టీకి మరింత తలనొప్పిగా మారనుంది. జరుగుతున్న ఈ పరిణామాలతో పోరాడి టిక్కెట్ తెచ్చుకున్నాననే ఆనందం అభ్యర్థి ఆనందరావుకు లేకుండాపోయింది. పార్టీ పెద్దలు కలగజేసుకుని సర్ధిచెప్పినా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. -
చిన రాజప్పకు చంద్రబాబు హ్యాండ్..!
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు తీవ్ర అవమానం ఎదురవుతోంది. ఇప్పటికే మంత్రులు గంటా శ్రీనివాసరావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీ అధిష్టానం వ్యవహరించిన తీరు.. ఆయా నేతల అనుచరుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప సీటుకే ఎసరు పరిస్థితి కనిపిస్తోంది. చిన రాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గం సీటు విషయంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. బొడ్డు భాస్కర రామారావుకు పెద్దాపురం నుంచి టికెట్ ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భాస్కర రామారావును అమరావతికి పిలువడంతో.. ఆయనకు సీటు ఖరారైందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో డిప్యూటీ సీఎం చిన రాజప్పకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారని, ఆయనకు టీడీపీ టికెట్ లేనట్టేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తన సీటు వేరే వ్యక్తికి కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారని తెలియడంతో ఆందోళన చెందిన చిన రాజప్ప హుటాహుటిన అమరావతికి బయలుదేరారు. -
చినరాజప్పపై తోట వాణి ఆగ్రహం
-
‘చనిపోయిన నా తండ్రినీ ఆయన వదల్లేదు’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ మంత్రులు చినరాజప్ప, యనుమల రామకృష్ణుడిపై కాకినాడ ఎంపీ తోట నరసింహం సతీమణి తోట వాణి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. ‘రాజకీయంగా నా తండ్రితో పాటుగా నా కుటుంబాన్ని తొక్కెయ్యడానికి హోం మంత్రి రాజప్ప ప్రయత్నాలు చేశారు. చనిపోయిన నా తండ్రిని కూడా రాజప్ప వదల్లేదు. టీవీలలో నా తండ్రి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణను వాడు వీడు అని రాజప్ప సంభోధించారు. నా తండ్రి.. నా భర్త నేర్పిన సంస్కారం వల్ల రాజప్పను తిరిగి నేను ఒక్క మాట కూడా తప్పుగా అనలేదు. రాజప్ప మా కుటుంబాన్ని ఎంత దారుణంగా అణగదొక్కారో ప్రజలందరికి తెలుసు. ఎక్కడో కోనసీమ నుంచి తీసుకొచ్చి రాజప్పను పెద్దాపురంలో పెడతారా. ఇక్కడ నాయకులు లేరా. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పబోతున్నాను’ అని వాణి ధ్వజమెత్తారు. సంస్కారం లేని పెద్దాయన ‘నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలన్న జ్ఞానం లేని ఓ పెద్దాయన జిల్లాలో ఉన్నారు. ఆయనది బలుపో.. బద్దకమో తెలియదు’ అని పరోక్షంగా ఆర్థిక మంత్రి యనుమల రామకృష్ణుడికి వాణి చురకలు అంటించారు. అలాంటి వ్యక్తుల మధ్య మనుగడ సాధించలేమని భావించిన కారణంగా తాను, తన భర్త నరసింహం టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘రేపు వైఎస్సార్ సీపీలో చేరుతున్నాం. ఆ పార్టీ మాకు సముచిత స్ధానం ఇస్తుందని నమ్ముతున్నాం. వైఎస్ జగన్ మాకు భరోసా కూడా ఇచ్చారు’ అని ఆమె హర్షం వ్యక్తం చేశారు. -
టీడీపీలో బయటపడ్డ గ్రూపు రాజకీయాలు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. వచ్చే ఎన్నికలకు ప్రస్తుతం హోంమంత్రి చినరాజప్పకే మళ్లీ పెద్దాపురం సీటును చంద్రబాబు ఖరారు చేయడంతో పార్టీలో లుకలుకలు వెలుగుచూశాయి. పెద్దాపురం సీటు తనకే వస్తుందని చివరి నిమిషం వరకు ఆశపడ్డ మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు భంగపడ్డారు. దీంతో పెద్దాడలోని తన నివాసంలో బొడ్డు భాస్కర్, అనుచరులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ మారైనా వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచే పోటీ చేయాలని సన్నిహితులు సమావేశంలో ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అధిష్టానం నిర్ణయం మారుతుందో లేదో రెండు రోజులు వేచి చూసి టీడీపీకి బైబై చెప్పే యోచనలో బొడ్డు భాస్కర్ రామారావు ఉన్నట్లు తెలిసింది. కార్యకర్తలతో సమావేశం ముగిసిన తర్వాత బొడ్డు మాట్లాడుతూ.. పెద్దాపురం సీటు తనకు ఇవ్వకపోతే వేరే పార్టీ నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. రాజమండ్రి ఎంపీగా తాను పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కూడా తేల్చిచెప్పారు. -
డేంజర్ డెంగీ..
సాక్షాత్తూ అది రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప నియోజకవర్గంలోని పెద్దాపురం మున్సిపాలిటీ. మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రాంతాల్లో డెంగీ మహమ్మారి జడలు విప్పుతోంది. పారిశుద్ధ్య నిర్వహణను ఆ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వార్డుల కౌన్సిలర్లే చెబుతున్నారంటే అక్కడి అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధుల మాటకే విలువ ఇవ్వని అధికారులు ఇక ప్రజల మాట ఎందుకు వింటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో పలువురు డెంగీ వంటి విషజ్వరాల బారిన పడుతున్నారు. తూర్పుగోదావరి, పెద్దాపురం: డెంగీ మహమ్మారీ జడలు విప్పుతోంది. గతంలో మండలంలోని గోరింట, చదలాడ గ్రామాల్లోని పలువురితో పాటు పెద్దాపురం పట్టణంలోని ఒకటో వార్డు కౌన్సిలర్‌కు ఈ వ్యాధి సోకింది. అపారిశుద్ధ్యంపై పత్రికల్లో కథనాలు వచ్చినా స్పందించని మున్సిపల్, వైద్య శాఖాధికారుల వైఫల్యానికి తాజాగా 17వ వార్డు కౌన్సిలర్ తాళాబత్తుల కామేశ్వరి కుమార్తె సావిత్రి (22) ఈ డెంగీ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెను విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పారిశుద్ధ్య విభాగ అధికారుల పనితీరు అసంతప్తిగా ఉందనడానికి నిదర్శనం ఈ డెంగీ కేసులు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గతంలో డయేరియా మహమ్మారి పట్టణాన్ని ఓ కుదుపు కుదిపేసిన సంఘటనలు మరచిపోయి కనీసం శానిటేషన్ పనులు పూర్తిగా చేయకపోవడం పట్ల పాలనా యంత్రాంగానికి ప్రజారోగ్యంపై ఎంత బాధ్యత ఉందో అర్థమవుతూనే ఉందని పలువురు వాపోతున్నారు. రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఇళ్ల వద్ద పరిశుభ్ర వాతావరణం కల్పించాలని వైద్యాధికారులు కరపత్రాల ద్వారా బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అది కాస్తా తూతూ మంత్రంగానే చేయడంతో చాలా చోట్ల అపరిశుభ్ర వాతావరణ మధ్యనే ప్రజలు జీవిస్తున్నారు. సంబంధిత వార్డు కౌన్సిలర్ కామేశ్వరి భర్త సాయి పలుమార్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేరుకుపోయిన పూడిక తీయాలని ఐదు నెలలుగా అధికారులకు చెబుతున్నా వారు పట్టించుకోలేదు. ఫలితంగా తన కుమార్తెకు డెంగీ ప్రబలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిపినా కనీసం డ్రెయిన్‌లో పూడిక చేపట్టకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్, వైద్య శాఖల ఉన్నతాధికారులు స్పందించి డెంగీ కారణాలపై ప్రజలకు అవగాహనతో పాటు పారిశుద్ధ్య పనులు మెరుగు పర్చాలని పలువురు కోరుతున్నారు. -
తెలంగాణలో టీడీపీ బలంగా లేదు : చినరాజప్ప
సాక్షి, అమరావతి : తెలంగాణలో టీడీపీ బలంగా లేకపోవడంతోనే 13 స్థానాల్లో పోటీ చేశామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి ఆయన స్పందించారు. ప్రజలు మంచోళ్లు, తెలివైన వాళ్లు కాబట్టే అభివృద్ధికి ఓటేశారని వ్యాఖ్యానించారు. ఏపీలో కూడా ప్రజలు అదే విధంగా తీర్పును ఇస్తారని అభిప్రాయపడ్డారు. కాగా తెలంగాణ ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. -
వాల్.. వార్..
ఏలేరు ఆధునికీకరణ పనులు అధికార పక్ష ప్రజాప్రతినిధుల మధ్య వివాదానికి ఆజ్యం పోశాయి. సాక్షాత్తూ హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప అనుచరులు, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. రక్షణ గోడ పనుల విషయంలో రాద్ధాంతం మొదలైంది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వర్మ ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. తూర్పుగోదావరి, పెద్దాపురం: ఏలేరు ఆధునికీకరణ పనులు అధికార పక్ష ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వివాదానికి తెర తీశాయి. శివారు భూములకు ఏలేరు నీరు అందాల్సి ఉండగా, ఏలేరు ఆయకట్టుపై పెద్దాపురం మండలం దివిలిలో నిర్మిస్తున్న రక్షణ గోడ నిర్మాణ విషయంలో ఆదివారం మధ్యాహ్నం పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, మంత్రి రాజప్ప అనుచరుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. పిఠాపురం రోడ్డులో అప్రోచ్ నిర్మాణం జరుపుతున్న మండల సర్పంచ్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు కొత్తెం కోటి, వారి అనుచరులపై అప్రోచ్ నిర్మాణం ఆపాలంటూ ఎమ్మెల్యే వర్మ ఆందోళనకు దిగారు. అక్రమ కట్టడం కాదని, రక్షణ గోడ నిర్మాణం చేపడుతుంటే పనులు నిలపాలనడం సరికాదంటూ కోటి వర్గీయులు పనులు ఆపకుండా కాంక్రీట్ పనులు చేపట్టారు. దీంతో ఆగ్రహించిన వర్మ ప్రత్తిపాడు –సామర్లకోట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకట రామారావు ఆధ్వర్యంలో సీఐ యువకుమార్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు కల్పించారు. మంత్రి సహాయకులు నిమ్మకాయల సుబ్బారావు, ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణారావు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వర్మ ఆగలేదు. ‘‘ఆరు రోజుల నుంచి ఈ ఈఈ గాడికి చెబుతూనే ఉన్నాను.. అయినా ఈ నా కొడుకులు పట్టించుకోవట్లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన వర్గీయులు ఆందోళన తీవ్రతరం చేయడంతో విషయాన్ని ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు నిర్మాణ పనులు తాత్కాలికంగా వాయిదా వేస్తామని హామీ ఇవ్వడంతో వర్మ ఆందోళన విరమించారు. మూడు గంటల ఉద్రిక్త పరిస్థితుల అనంతరం ఆందోళన విరమించడంతో ఇటు పోలీసులు, ఇరిగేషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించం ఏలేరు రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ అన్నారు. దివిలి జంక్షన్లో రైతులు చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతు పలికారు. అప్రోచ్ నిర్మాణంలో అక్రమంగా రైతులకు నీరు విడుదల కాకుండా చేస్తే సహించేది లేదన్నారు. రైతుల పక్షాన ఆందోళనకు సిద్ధమవుతాం.. ఏలేరు నీరు శివారు భూములకు అందకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే రైతుల పక్షాన ఆందోళనకు సిద్ధమవుతామని పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ పెండెం దొరబాబు హెచ్చరించారు. ఏలేరు ఆధునికీకరణ పనుల పేరుతో దివిలిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై రైతుల ఆందోళనకు మద్దతుగా దివిలి వచ్చిన ఆయన అధికారులతో మాట్లాడారు. ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణారావు, సర్పంచ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు కొత్తెం కోటి, రైతులతో సమావేశమై రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు చేపట్టాలని నీరు ఇబ్బందులకు కారణమైతే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. అప్రోచ్ నిర్మాణం తాత్కాలిక వాయిదాకు చర్యలు దివిలిలో జరుగుతున్న అప్రోచ్ నిర్మాణాన్ని రైతుల అభిప్రాయాల మేరకు తాత్కాలిక వాయిదాకు చర్యలు చేపట్టామని ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణారావు అన్నారు. పిఠాపురం నియోజకవర్గ రైతుల ప్రధాన డిమాండ్ మేరకు జిల్లా కలెక్టర్ దృష్టిలో ఉంచామని, అప్రోచ్ నిర్మాణంపై పూర్తి విచారణ చేపట్టి రక్షణ గోడ నిర్మాణం చేపడతామన్నారు. -
చినరాజప్పకు మిత్రుడిగా ఉండడం కంటే...
తూర్పుగోదావరి, సామర్లకోట (పెద్దాపురం): ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప లాంటి సంస్కారహీనుడికి మిత్రుడిగా ఉండడం కంటే శత్రువుగా ఉండడమే సంతోషమని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు వ్యాఖ్యానించారు. రాజప్ప ఇటీవల ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై స్పందిస్తూ భాస్కర రామారావు బహిరంగ లేఖ రాశారు. దాని పూర్తి పాఠం.. గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు, హోంశాఖ మంత్రి వర్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారికి.. మీ స్థాయికి, సంస్కారానికి సంబంధం లేదని మీ మాటలు నిరూపిస్తున్నాయి. ఒక రాష్ట్ర శాంతి భద్రతలని పరిరక్షించే అత్యంత కీలకమైన హోంమంత్రి పదవిలో వుండి దాని పరువు తీస్తూ నోరు పారేసుకోవడం మీకే చెల్లింది. ఈ మధ్య కాలంలో ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ప్రోగ్రామ్‌లో నన్ను మరియు దివంగత నేత మెట్ల సత్యనారాయణరావును మీ శత్రువులుగా చెబుతూ ఏక వచనంతో హీనంగా, అణుమాత్రం సభ్యత లేకుండా మాట్లాడిన తీరు రాష్ట్ర ప్రజ లంతా అసహ్యించుకొనేలా ఉంది. జీవించినంత కాలం మంచికి మారుపేరుగా నిలిచిన మెట్ల సత్యనారాయణరావుని, మీ జీవిత కాలంలో ఏమీ చేయలేని మీరు ఆయన మరణించిన తరువాత ఇప్పుడు విమర్శిస్తుంటే ఆకాశం మీద ఉమ్మేసినట్లుంది. చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడే సంస్కారం ఏ సీమదో తెలియదుగానీ, కోనసీమది మాత్రం కాదు, తెలుగుజాతిది కాదు. ఇక నన్ను శత్రువుగా భావిస్తూ మీరు మాట్లాడడం, ఏకవచనంతో వెటకారంగా మాట్లాడడం బాధనిపించినా మీలాంటి సంస్కారహీనుడికి మిత్రుడుగా కన్నా శత్రువుగా ఉండడమే మేలు! మీ శత్రుత్వం మాకు సంతోషం. ఇకపై దానినే కొనసాగిద్దాం! మీరు టీవీ చానల్లో మాట్లాడినవి అన్నీ అబద్ధాలే. గత 25 సంవత్సరాలలో జిల్లా తెలుగుదేశం పార్టీకి, పెద్దాపురం నియోజకవర్గానికి మీరేం చేశారో, నేనేం చేశానో జిల్లా నాయకులకు మరియు పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకు, బాగా తెలుసు. ఈ విషయంలో నేను బహిరంగ చర్చకు సిద్ధం. మన పార్టీ పెద్దలు అయిన యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ వంటి పెద్దల సమక్షంలోఈ బహిరంగ చర్చకు నేను సిద్ధం. పెద్దాపురం నియోజకవర్గం నా జన్మభూమి. ఇక్కడ ప్రజలతో నాది ఎప్పుడూ రక్త సంబంధమే. ఇక్కడ నేనెప్పుడూ అతిథిని కాదు. సొంత మనిషిని. అని మళ్లీ వక్కాణిస్తూ బహిరంగ చర్చకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ.... మీరు శత్రువుగా భావించే – బొడ్డు భాస్కర రామారావు -
‘పవన్ కల్యాణ్ స్థిరత్వం లేని మనిషి’
సాక్షి, అమరావతి : సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందన్న విషయం మాజీ మంత్రి మాణిక్యాల రావు మాటలతో స్పష్టమైందని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. అమరావతిలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ఎవరైనా తమ పార్టీ బలంగా ఉందంటారు కానీ పవన్ కల్యాణ్ బలంగా ఉన్నారని బీజేపీ నాయకులు ఎలా చెబుతారని ఎద్దేవా చేశారు. ముద్రగడ పద్మనాభం వెనక ఎంత మంది కాపులున్నారో, పవన్ కల్యాణ్ వెనుక అంతే మంది కాపులున్నారని తెలిపారు. ఏపీలో ఉండాల్సిన పవన్ కల్యాణ్ ఏపీలో రెండు రోజుల టూర్ పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వాళ్లు అప్పుడప్పుడు పోరాడుతున్నారని, తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నామని వ్యాఖ్యానించారు. పవన్ స్థిరత్వం లేని మనిషి: కళా వెంకట్రాటావు మరో మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ స్థిరత్వం లేని మనిషని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. పేదలు, రైతులు ప్రభుత్వ పనితీరుతో సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఎంతమంది కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా టీడీపీ ఇబ్బంది ఉండదని చెప్పారు. -
విడ్డూరం.. హోంమంత్రికి దారివ్వలేదని
సాక్షి, ముమ్మడివరం : తూర్పు గోదావరి ముమ్మడివరం పోలీసులు అత్యుత్సాహం చూపారు. స్వామి భక్తిని నిరూపించుకొనే పని చేశారు. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా.. పోలీసుల అనుకుంటే కేసుల కొదవా అన్నట్లు ముమ్మడివరం పోలీసులు ఏకంగా ఆర్టీసీ బస్సునే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. బస్సును పోలీస్ స్టేషన్ తరలించడం ఏంటి అనుకుంటున్నారా? అవును నిజమే. ఏం జరిగిందంటే.. హోంమంత్రి చిన రాజప్ప జిల్లా పర్యటన నిమిత్తం కాన్వాయ్ కాకినాడ - అమలాపురం మార్గంలో వెళ్తోంది. అదే మార్గంలో నాన్‌స్టాప్ సర్వీస్ ఆర్టీసీ బస్ వెళ్తోంది. రోడ్డులో ఇతర వాహనాలు ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ డైవర్ హోంమంత్రి కాన్వాయ్‌కు సైడ్ ఇవ్వలేక పోయారు. అంతే హోంమంత్రి దగ్గర స్వామి భక్తి నిరూపించుకొనే అవకాశం వచ్చిందనుకున్నారో ఏమో, ఆర్టీసీ బస్సును ముమ్మడివరం పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సంఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రికి దారి ఇవ్వలేదంటూ బస్సును పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. తాము ఓట్లేసి గెలిపిస్తే అధికారంలో ఉన్న నాయకులు, ప్రజలను ఇలా ఇబ్బందుల పాలు చేయడం ఏంటని మండిపడ్డారు. -
ఏపీ హోం మంత్రికి తీవ్ర అవమానం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్పకు తీవ్ర అవమానం జరిగింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభానికి హోంమంత్రికి ఆహ్వానం లభించలేదు. వివరాల్లోకి వెళ్తే ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శంఖుస్థాపన చేశారు. అయితే ఆసమయంలో హోంమంత్రి అక్కడ లేకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభానికి హోంమంత్రి చినరాజప్పకు ఆహ్వానం అందలేదు. తూతూ మంత్రంగా ఒక కానిస్టేబుల్‌తో ఆహ్వానం పంపించి చేతులు దులుపుకున్నారు. దీంతో హోంమంత్రి చినరాజప్ప అలకపూనారు. ప్రారంభోత్సవానికి వెళ్లకుండా హుటాహుటిన తిరుమలకు వెళ్లారు. ఇప్పటికే చాలా సార్లు ఇలాంటి సంఘనలు జరిగాయని మంత్రి వాపోయినట్టు సమాచారం. ఇప్పటివరకూ తనకు ఆహ్వానం అందినా అందకపోయినా ప్రతి కార్యక్రమానికి వెళ్లానని, కానీ ఇప్పుడు సొంత శాఖలో జరిగిన అవమానాన్ని మాత్రం ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నానని అన్నారు. అయితే ఈసంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్లో హోంమంత్రిని బుజ్జగించే పనిచేశారు. దీనిపై స్పందిచడానికి హోంశాఖ అధికారులు, ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు నిరాకరించారు. సాక్షాత్తు మంత్రికే ఇలా జరగడంతో భవిశ్యత్తులో తమలాంటి చిన్న నేతల పరిస్థితి ఏంటని తెలుగుదేశం నేతలు గుసగుసలాడుతున్నారు. చినరాజప్పకు తీవ్ర అవమానం -
ఆ బాధ్యత మాపై ఉంది: చినరాజప్ప
అమరావతి: ఏపీలో శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉందని ఏపీ ఉప ముఖ్య మంత్రి చినరాజప్ప తెలిపారు. ఇందులో భాగంగానే అనుమతి లేని సభలను నియంత్రిస్తున్నామని చెప్పారు. తెలంగాణ వాళ్లు వచ్చి ఆంధ్రాలో సమస్యలు సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రాలో ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
ఏఎంసీలు ఉత్సవ విగ్రహాలు కాకూడదు
భీమవరం : వ్యవసాయ మార్కెట్ కమిటీలు (ఏఎంసీ)లు ఉత్సవ విగ్రహాలుగా కా కుండా రైతులకు ఉపయోగపడేలా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. భీమవరం వ్యవసాయ మార్కె ట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం ఏఎం సీ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. మార్కెట్ కమిటీలు పుంత రోడ్లు, గోదాముల నిర్మా ణం, పశుసంపద అభివృద్ధికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచిం చారు. ప్రస్తుత దాళ్వా సీజన్‌కు గోదావరిలో నీరు తక్కువ ఉన్నందున సీలేరు, బలిమిలేరు నుంచి నీరుతెస్తున్నామని కా లువల ఆధునికీకరణపై దృష్టిసారించామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని దీనిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రైతులకు అండగా ఉండాలి ఏఎంసీలు రైతులకు అండగా నిలవాలలని గనులు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఎమ్మె ల్యే పులపర్తి రామాంజనేయులు అధ్యక్షత వహిం చి కమిటీ అధ్యక్షుడు కోళ్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చెల్లబోయిన వెంకట సుబ్బారావు, సభ్యులు బొక్కా చంద్రమోహన్, భలే లూర్ధమ్మ, సాలా నర్సింహమూర్తి, సయ్యపరాజు భాస్కరరాజు, ఎండీ ఆలీషా (షా బు), దంపనబోయిన అప్పారావు, కడలి నెహ్రు, నాగిడి తాతాజీ, కొల్లాటి శ్రీనివాసరావు, భూపతిరాజు నాగేంద్రవర్మ, గొలగాని సత్యనారాయణ, కురిశేటి శ్రీరామమూర్తి, ముచ్చకర్ల సుబ్బారావు, కొటికలపూడి గోవిందరావు, నూకల కేశవ రమేష్ అప్పాజీతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు వేటుకూరి వెంకటశివరామరాజు, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పాకా సత్యనారాయణ, గోకరాజు రామం, మెంటే పార్థసారథి, కారుమూరి సత్యనారాయణమూర్తి, మామిడిశెట్టి ప్రసాద్, వబిలిశెట్టి కనకరాజు, గనిరెడ్డి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. కోడి పందేలకు దూరంగా ఉండాలి కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా కోడి పందేలకు ప్రజలు దూరంగా ఉండాలని చినరాజప్ప పిలుపునిచ్చారు. భీమవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సం క్రాంతిని పురస్కరించుకుని తెలుగురాష్ట్రాల్లో కోడిపందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందని, అందువల్లనే తమ ప్రభుత్వం కూడా ముందుగా పందేల నిర్వహణపై ఉదాసీనంగా ఉం దని చెప్పారు. ఇటీవల హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పుల దృష్ట్యా సంక్రాంతికి కోడిపందేలు నిర్వహించరాదని హోం మం త్రి చినరాజప్ప సూచించారు. -
అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్‌లు
- తిరుపతిలో హాఫ్ మారథాన్ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చిన రాజప్ప తిరుపతి గాంధీరోడ్డు: ఏపీ రాజధాని అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర హోం మంత్రి, డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. డిసీజ్ ఎరాడికేషన్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్(డిప్) సంస్థ తిరుపతిలో ఆదివారం నిర్వహించిన సెవెన్ హిల్స్ మారథాన్ 21కె, 10కె, 5కె, 3కె రన్ ముగింపు సభలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులందజేశారు. 5కె, 3కె పరుగులో పాల్గొన్న వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ, సుధారాణి ఫౌండేషన్, టీటీడీ సహకారంతో డిప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మారథాన్‌లో పెద్ద ఎత్తున యువత పాల్గొనడం సంతోషకరమన్నారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కలిగించేందుకే ఈ మారథాన్‌ను తిరుపతిలో నిర్వహించామని తెలిపారు. ప్రజలు ప్రతిరోజూ సైకిల్ తొక్కడానికి, వాకింగ్‌ను ప్రోత్సహించేందుకు అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదే తరహాలో తిరుపతిలో కూడా వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ వారంలో 150 నిమిషాలు ఏదో ఒక వ్యాయామం చేస్తే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చన్నారు. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ బాల్యం నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో మారథాన్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సమావేశంలో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, టీటీడీ జేఈవో పోలా భాస్కర్, తిరుపతి ఎస్పీ జయలక్ష్మి, సబ్ కలెక్టర్ హిమాంశు శుక్లా, నగర కమిషనర్ వినయ్‌చంద్, ఎస్వీయూ వీసీ దామోదరం, పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రనాయుడు, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, సంస్థ నిర్వాహకులు రాకేష్, నన్నపనేని మురళి, మధు తదితరులు పాల్గొన్నారు. మంత్రుల ఆస్తులు ప్రకటిస్తాం ముఖ్యమంత్రి ఆస్తుల వివరాలు ప్రకటించినట్టుగానే రాష్ట్ర మంత్రుల ఆస్తుల వివరాలను స్పీకర్‌కు అందజేస్తామని విలేకరుల ప్రశ్నలకు హోం మంత్రి చిన రాజప్ప సమాధానమిచ్చారు. -
దుర్గమ్మ సన్నిధిలో డెప్యూటీ సీఎం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సతీసమేతంగా తరలివచ్చారు. ఆయనకు ఈవో సూర్యకుమారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఉత్సవ ఏర్పాట్లపై డెప్యూటీ సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు. దుర్గమ్మను దర్శించుకున్న బీసీసీఐ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ దుర్గమ్మను బీసీసీఐ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ బుధవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు. -
చంద్రబాబుతో హోంమంత్రి సమావేశం
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారమిక్కడ సమావేశం అయ్యారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష, తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. మరోవైపు ముద్రగడ చేపట్టిన దీక్ష నేటికి తొమ్మిదో రోజుకు చేరింది. కాగా ముద్రగడకు సంఘీభావంగా కాపులు నిరసనలు, ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
ముద్రగడ.. సీబీఐ విచారణ వద్దంటున్నారు: చినరాజప్ప
తుని ఘటనపై సీబీఐ విచారణకు ముద్రగడ పద్మనాభం అంగీకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చిరంజీవి మాత్రం దీనిపై సీబీఐ విచారణ కోరుతున్నారన్నారు. ఈ విషయాన్ని తాము పోలీసుల ద్వారా ముద్రగడ వద్దకు పంపితే, ఆయన వద్దన్నారని చినరాజప్ప తెలిపారు. ఈ విషయంపై ప్రజలే ఆలోచించాలని ఆయన అన్నారు. ముద్రగడకు వైద్యసేవలు చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని, అయితే ఆయనే అంగీకరించడం లేదని చెప్పారు. ఆయన చేస్తున్న డిమాండ్లు ఆమోదయోగ్యం కాదని తెలిపారు. తుని ఘటనలో అరెస్టులు ఆపాలని, ఇప్పటికే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్నారని.. అయితే ఆ విషయం కోర్టు పరిధిలో ఉన్నందువల్ల తాము ఏమీ చేయలేమని హోం మంత్రి అన్నారు. సీబీఐ విచారణ జరుగుతుందో లేదో త్వరలోనే తేలుతుందని ఆయన చెప్పారు. -
చానళ్ల ప్రసారాలు కావాలనే ఆపేశాం
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని మీడియా చానళ్లను కావాలనే నియంత్రించామని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షకు ప్రజల మద్దతు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ముద్రగడ అరెస్టుకు నిరసనగా కాపులు పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా బంద్ విఫలమైందని, పోలీసులు ఆ బంద్‌ను విజయవంతం కానివ్వరని చెప్పారు. రేపటి బంద్‌ను కూడా విఫలం చేస్తామన్నారు. ఇదే సమయంలో సాక్షి టీవీ ప్రసారాలను ఎందుకు ఆపేశారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కొన్ని చానళ్లను కావాలనే నియంత్రించామని ఆయన అన్నారు. శాంతిభద్రతల సమస్యలు వస్తాయనే తాము నియంత్రించినట్లు ఆయన స్వయంగా చెప్పారు. ముద్రగడ దీక్ష కొనసాగేవరకు ఈ నియంత్రణ కొనసాగుతుందని పరోక్షంగా చెప్పారు. దీక్షకు మద్దతు ఇస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందనే వాటిని ఆపేశామన్నారు.