
కేసీఆర్ రాద్ధాంతం చేస్తున్నారు: చిన రాజప్ప
ప్రొద్దుటూరు : రాయలసీమ అవసరాల కోసమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చిన రాజప్ప తెలిపారు. తెలంగాణకు సరిపడా విద్యుత్ ఇస్తామన్నా కేసీఆర్ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ మండిపడ్డారు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంపై కేసీఆర్తో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాజకీయం కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అపవాదు వేస్తున్నారని చిన రాజప్ప వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనం సంరక్షణకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.