'వెంకయ్య ఆంధ్రాకే మంత్రా?'
హైదరాబాద్: రబీలో వ్యవసాయానికి ఎన్నిగంటలు కరెంట్ ఇస్తారో రైతులకు స్పష్టం చేయాలని కేసీఆర్ సర్కార్ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఆయన శుక్రవారం విలేకర్ల సమావేశంలోమాట్లాడుతూ... కరెంటు కోతలతో ఖరీఫ్ పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కరెంట్ కోతలు లేకుండా రైతులకు కరెంట్ అందించేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు. విభజన చట్టం ప్రకారం 54 శాతం విద్యుత్ తెలంగాణకు ఇవ్వకుండా ఏపీ సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు రావలసిన విద్యుత్ కోసం కేసీఆర్ ప్రయత్నించక పోవడం సరికాదని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం చంద్రబాబు తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచుతుంటే...సీఎంకేసీఆర్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుస్తున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ఏపీ మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.